భానోదయం: బహుభాష కోవిదుడు బాలయ్య

Tuesday, 4 December 2018

బహుభాష కోవిదుడు బాలయ్య    తెలుగులో అనర్గళంగా మాట్లాడేవారిలో బాలయ్య బాబు ముందువరుసలో ఉంటారు. అబ దబబ ఆఆఒ బబబ అబ అంటు అనర్గళంగా మాట్లాడగలరు.ఇప్పుడు ఎన్నికల పప్రచారంలో తనదైన శైలిలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తన మాటల తూటాలతో ఎండగడుతున్నారు.మరోవైపు మోది సర్కార్ పైన కూడా తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు మనందరికి తెలుసు బాలయ్య బాబు తెలుగు ఎంత చక్కగా ఉఛ్ఛరిస్తారో కొందరు భాష పండితులకు మాత్రమే అది అర్థం అవుతుంది. ఇప్పుడు బాలయ్య హిందీలో కూడా అధరగోడుతున్నారు బాలయ్యకు తొడలు కొట్టడమే వచ్చు అనుకున్నాం కాని ఇలా హిందీలో అధరగొడుతాడని ఊహించలేం.
           ఈ మధ్య ఒక సభలో ఆయన హిందీలో చేసిన ప్రసంగం హిందీ భాషా పండితులకు సైతం అర్థం కాలేదు అది బాలయ్య వాక్ఛ్యాతుర్యం అంటే. బాలయ్య కొడితేనే కోమాలోకి వెళ్తారు అనుకున్నాం కాని బాలయ్య మాట్లాడితే కూడా కోమాలోకి వెళ్తారని ఆయన హిందీ ప్రసంగంతో ఋజువయ్యింది. ఆయన హిందీలో ఏం మాట్లాడారో అర్థం కాక హిందీ భాషా పండితులు నాలుగైదుగురు కోమాలోకి వెళ్ళిపోయారు. అది బాలయ్య దెబ్బ అంటే.
           ఆయన ఏం మాట్లాడారో  ఆ పదాలు అర్థం అవ్వడానికి  ఈ ప్రపంచంలో ని ఏ డిక్షనరీలో వెతికిన దొరకదు. అది బాలయ్య భాష చతురత.
       
 బాలయ్య బాబు సినిమాల్లో మరియు బయట ఒకేలా ఉంటారు అక్కడ రౌడీలను కొడతారు ఇక్కడ అభిమానులను కొడుతారు ఆయనతో కొట్టించుకోవడానికి ఆయన అభిమానులు ఎగబడుతుంటారు. ఒకప్పుడు తొడలు కొట్టేవాడు ఇప్పుడు జనాలని కొడుతున్నాడు. ఒకప్పుడు కత్తులతో కాదు కంటి చూపుతో చంపేసేవాడు ఇప్పుడు మాటలతో చంపేస్తున్నాడు.
  ఇంకో అడుగు ముందుకేసి వార్నింగ్ లు కూడా ఇస్తున్నాడు తెలంగాణ మంత్రి కెటీఆర్ కు ఇచ్చిన వార్నింగ్  ఇలా ఉంది  "బిడ్డా కెటిఆల్ హైటెక్ సిటీ కట్టాలా చెంచాబాద్ ఎయిల్ పోల్ట్ కట్టాలా లింగ్ లోడ్ కట్టాలా  ఏం కట్టాలు మీలు ఇవన్ని కట్టింది మా బావ బాబు గాలు హైదలాబాద్ అభిలుద్ది చేచింది మా బావ బాబు గాలు ఆయన్ను తిడితే ఊలుకోనూ ఆంధ్లా ఎన్నికల్లో వేలు పెడుతావా ధమ్ముందా  లా చూచుకుందాం ఆంధ్లాలో " అంటు భీకరమైన లెలుగు సారీ తెలుగు భాషలో హెచ్చలించాలు.
చూసారా బాలయ్య భాష వింటే నాకు కూడా ఆయన భాష వచ్చేలా ఉంది. ఎంతకైనా మంచిది కెటీఆర్ సార్ బాలయ్య జోలికి వెళ్ళకు ఆయన భాష మీకు వచ్చేయగలదు.
 ఈ జోరు చూస్తుంటే బాలయ్య టీడిపీని తెలంగాణలో ఒంటి చేత్తో గెలిపించేలా ఉన్నాడు ఈ విషయం బాబు గారు గుర్తించలేక పోయినట్టున్నారు ముందే తెలిస్తే 119 సీట్లు టీడీపీకె వచ్చేవి బాలయ్య అంటే మజాకా మరి సమర సింహం. పాపం బాబు గారు కేవలం 13సీట్లకే పరిమితమయ్యారు. బాబు గారు ఇంకో సింహాన్ని తెలంగాణలో వదలలేదు ఎవరో అనుకుంటున్నారా అదేనండి ఈయన బాలయ్య కంటే ఘనుడు ఈయనకు కూడా తెలుగు భాషను నేర్పింది బాలకిట్టీ గారే. ఈయన  తెలుగు మాట్లాడటంలో గురువును మించిన శిష్యుడు ఆయనేనండి మన పండితపుత్ర పరమ ........ నారా లోకేష్ పప్పు  గారు ఈయనను కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దించి ఉంటే వార్ వన్ సైడ్ అయిపోతుండే. ఎందుకు ఈ సింహాన్ని వదలలేదో అర్థం కాలేదు బహుషా సమరసింహం అదేనండి గడ్డాలు మీసాలు గీసుకున్న మగ సింహం బాలయ్య ఒక్కడు చాలు అనుకున్నాడేమో బాబు గారు.

నాకొకటి అర్థం కావటంలేదు అసలు బాలయ్య భాషలు ఎక్కడ నేర్చుకుంటున్నారు ఆయన భాషలు ప్రపంచంలో ఎవరీకి అర్థం అవ్వటంలేదు బాబు గారు వేరే గ్రహం నుండి  గ్రహాంతరవాసులను రప్పించి ఈ భాషను నేర్పించినట్టున్నాడు అభివృద్దిలో బాబును మించినోడే లేడుపో
 నీ కీర్తీ ఖండాంతరాలు సారీ గ్రహాంతరాలు దాటింది
పో.
    ఏది ఏమైనా బాలయ్య గారు భాషలు మాట్లాడటంలో  తెలుగు జాతికి దొరికిన ఆలిముత్యం సారీ ఆణిముత్యం.
                       
                        జై లాలయ్య అబ్బా... సారీ....
                                   జై బాలయ్య

     

 
         

No comments: