భానోదయం: జనవరి 2019

29, జనవరి 2019, మంగళవారం

పావురాల హారం

హైదరాబాద్ లో చూడదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో చార్మీనార్, గోల్కొండ, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, కె. బి. ఆర్ పార్క్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇవే కాకుండా ఇంకో అధ్భు తమైన, ఆహ్లదకరమైన చోటు ఒకటుంది ఈ ప్రదేశాన్ని టూరిస్ట్ లీస్ట్ లో చేర్చాలి అని అనుకుంటున్నాను. అదే నెక్లెస్ రోడ్ ఎం ఎం టీ ఎస్ రైల్వే స్టేషన్. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? ఉంది ఈ స్టేషన్ చాలా చిన్నది పెద్దగా రైల్లు కూడా ఎక్కువగా తిరగవు. దీని ప్రత్యేకత ఏమిటంటే పావురాలు ఎక్కువగా ఈ ప్రదేశంలో ఉంటాయి. స్టేషన్ పైకప్పు పై కరెంట్ తీగలపై చాలా పావురాలు ఎంతో అందంగా వాలుతాయి. కేవలం ఈ స్టేషన్ పరిదిలో మాత్రమే సందడి చేస్తాయి. చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. మరియు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
నాలాంటి ప్రకృతి ప్రేమికులు, ముఖ్యంగా పక్షి ప్రేమికులు ఇక్కడకు వస్తే ఈ పక్షుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. కానీ ఈ బిజీ నగరంలో ఈ ప్రకృతి సోయగాన్ని ఆస్వాదించే సమయం గాని అభిరుచి గాని ఎవ్వరికి ఉండవు. ఎందుకంటే నేడు మనిషి జీవితం యాంత్రికమైపోయింది.
ఒక పావురం చూడడానికి చాలా బావుంటుంది. అలాంటిది వేల పావురాలు ఒక దగ్గర చేరి సందడి చేస్తే కనువిందుగా ఉంటుంది.ఆ రైల్వే తీగలపై పావురాల హారంలా చూడముచ్చటగా ఉంటాయి.

27, జనవరి 2019, ఆదివారం

హై ఓల్టేజ్ విద్యుత్

మన నిత్య జీవితంలో కరెంట్ ఒక బాగం కరెంట్ లేనిదే నిమిషం కూడా ఉండలేని పరిస్తితి ఇప్పుడు ఉంది. ఈ రోజుల్లో 24 గంటలు కరెంట్ ఉండాల్సిందే. కరెంట్ ఎలా తయారవుతుందో ఎన్ని విధాలుగా తయారవుతుందో మనకు తెలుసు. హైడల్ కరెంట్, థర్మల్ కరెంట్, సోలార్ కరెంట్, వైండ్ కరెంట్ ఇలా వివిధ రకాలుగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. అక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ వోల్టేజ్ నేరుగా మనం వాడుకోలేం కాబట్టి స్టెప్ అప్ స్టేప్ డౌన్ ట్రాన్స్ ఫార్మర్స్ ఉపయోగించి మన ఇంటి వరకు కరెంట్ సప్లై చేయడం జరుగుతుంది. మనకు తెలిసి వోల్టేజ్ 230 లేదా 440 ఉంటుంది ఆ తర్వాత 11kv తర్వాత 33 kv 66kv ఆ పైన 120 kv ఆ పైన 400kv ht లైన్లను చూసే ఉంటారు. 230 v కరెంట్ షాకే ప్రమాదం. 33kv లాంటి విద్యుత్ స్థాంభాలంటే దాని శక్తి మామూలుగా ఉండదు. ఇక ట్రైన్ నడిచే ఓల్టేజ్ 25000v. దానిని ముట్టుకుంటే బూడిదే.దీనిని మించిన ఓల్టేజ్ అంటే ఎంత శక్తి వంతమైనదో ఆలోచించండి. దీనిని మించిన ఓల్టేజ్ కూడా ఉందండోయ్ అదే 765000v. అక్షరాల ఏడు లక్షల అరవై ఐదు వేల ఓల్టులు.!!
ఈ లైన్ ల స్తంభాలు చాలా ఎత్తులో ఉంటాయి. వీటిని స్తంభాలు అనే కంటే టవర్ లు అనడం సమంజసం. సెల్ టవర్ల కంటే ఎత్తులో ఉంటాయి. రెడియోషన్ కూడా సెల్ టవర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ స్తంభాల వైర్ల కింద మొక్కలను తాకితే షాక్ కొడుతుంది. ఈ వైర్ల కింద రెండు ఇనుప రాడ్లను రాపిడి చేస్తే నిప్పు రవ్వలు వస్తుంటాయి. మరియు శబ్ధం కూడా మామూలుగా ఉండదు ఒక ప్లాస్టిక్ పేపర్ తో తయారు చేసిన గాలిపటం గాల్లో ఎగిరితే ఎలా శబ్ధం వస్తుందో అలా ఉంటుంది. ఈ టవర్ అర ఎకరం స్థలం విస్తీర్ణంలో ఉంటుంది. ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండే ప్రదేశంలో ఇప్పుడు ht లైన్ కరెంట్ శబ్ధంతో ప్రశాంతత కరువయ్యింది. పవర్ గ్రిడ్ నుండి వెళ్ళే ఈ లైన్ వెెళ్ళిన మార్గంలో రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో రేడియేషన్, శబ్ధకాలుష్యం, కరెంట్ షాక్ మొదలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయిన ఎం చేస్తాం అభివృద్ది కావాలంటే కొన్ని కోల్పోవాలిగా.

24, జనవరి 2019, గురువారం

టిక్ టాక్ పిల్లలు


                  ఒకరోజు సాయంత్రం స్కూలు పిల్లల బస్ లో ఎక్కాను. వెళ్ళి వెనుక సీట్లో కూర్చున్న. బస్ లో పిల్లలందరు 5వ తరగతి లోపు వారే ఉన్నారు. స్కూల్లోనే వీళ్ళ అల్లరి భరించలేం  బస్ లో ఊరుకుంటారా స్కూల్లో కంటే  రెట్టింపుతో అల్లరి చేస్తున్నారు. వీళ్ళను బస్సులో ఎక్కించే వ్యక్తి ఎంత అరుస్తున్నా అల్లరి మాత్రం తగ్గడం లేదు.
  పిల్లలంటే  అంతేగా మరీ అల్లరే అల్లరి ఒకరిద్దరు ఉంటేనే వాళ్ళ అల్లరి భరించలేం బస్ నిండా ఉంటే తేనే తెట్టును కదిలించినట్టే ఉంటది.

    వీళ్ళతో మనకెందుకులే అని నా మానాన నేను మొబైల్ లో వార్తలు చదువుకుంటున్నా. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి అంకుల్ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. వార్తలు చదువుతున్నా అని చెప్పా ఎప్పుడు వార్తలేనా కొంచెం సేపు టిక్ టాక్ పెట్టు అంకుల్ అంటు రిక్వెస్ట్ చేసాడు. టిక్ టాకా ఎంటిదిరా అది అన్నాను. టిక్ టాక్ అంటే తెల్వదా అంకుల్ మస్తు జోకుంటది పెట్టంకుల్ అంటు మళ్ళి రిక్వెస్ట్ చేసేసరికి నాకు కొంచెం దాని గురించి తెలుకోవాలనిపించింది. యూట్యూభ్ లో టిక్ టాక్ అని టైప్ చేసా లేటెస్ట్ టిక్ టాక్ వీడియోస్ అంటు కొన్ని వీడియోస్ వచ్చాయి. ఓపెన్ చేసా ఆ వీడియోకు అందులోని  మాటలకు ఏ సంబంధం లేకుండా ఉన్నాయి ఇక పంచులకు కొదవే లేదు పటాస్ పంచులు, పోరగాళ్ళ ఒయలు కలగలిపితే టిక్ టాక్ అని అప్పుడు అర్థమయ్యింది. వాడితో పాటు బస్ లో ఉన్న ఇంకొంత మంది పిల్లలు చుట్టు చేరారు. అంకుల్ టిక్ టాక్ అంటే ఇది కాదంకుల్ అది యాప్ ప్లే స్టోర్ నుండి  డౌన్లోడ్ చేయ్యు అన్నాడు. అది యాప్ కూడా ఉందా అని అడిగాను ఆ.. ఉంది నేను రోజు చూస్తా అన్నాడు. అరే  వీడు  వేలెడంతా లేడు ఇప్పుడే వీడికి ఈ యాప్ లు ఇవన్ని ఏలా తెలుసబ్బా అనుకుంటు వాడిని అడిగా బాబు ఏం చదువుతున్నావ్ రా అని 3rd క్లాస్ అంకుల్ అని చెప్పాడు. మూడో తరగతి అంటే ఎడెనిమిది సంవత్సరాలు ఈ వయస్సులోనే ఈ పిల్లలకి స్మార్ట్ ఫోన్ దాని లోని యాప్స్ మొత్తం తెలుసు వాళ్ళ తల్లిదండ్రులకంటే ఎక్కవగా మొబైల్ గురించి తెలుసు.
      ఇంకా నీకు ఎం తెలుసురా మొబైల్ లో అడిగాను యూట్యూభ్ తెలుసు ఫేస్బుక్ తెలుసు వాట్సాప్ తెలుసు అంటు మొబైల్ లో ఉన్న అరడజను యాప్ ల గురించి గడ గడ చెప్పేసాడు. ఇవన్ని నీకు ఎలా తెల్సురా అని అడిగా మా డాడి ఫోన్ లో నేను రోజు చూస్తాను అని చెప్పాడు. ఓ అలాగా మరీ ఎప్పుడు చదువుకుంటావురా అంటే హోంవర్క్ అయిపోయిన తర్వాత చూస్తాను అన్నాడు. అబ్బా ఈ పిల్లలు ఎంత స్పీడో కదా నా చిన్న తనంలో అయితే హోం వర్క్ అయిపోయిన తర్వాత అందరం కలిసి బయట గ్రౌండ్ కి వెళ్ళి ఆటలాడుకునే వాళ్ళం. ఇప్పటి పిల్లలకి ఆటలాడే సమయం లేదు, ఆటలమీద ఆసక్తి లేదు మొబైల్ ఫొన్ ఉంటె చాలు టిక్ టాక్ అంటారు అది బోర్ కొడితె PUBG గేమ్ అంటారు. ఇక వాడు బయటికి వెళ్ళి ఏం ఆటలాడుతారు.
   
    టిక్ టాక్ లో కేవలం కామెడీ మాత్రమే ఉండదు పంచులే పంచులు అందులో నాన్ వెజ్ పంచులు కూడా ఉంటాయి.
 ఈ వయసులోనే వీళ్ళకి నాన్ వెజ్ పంచులకి అలవాటుపడితే తొమ్మిది పది తరగతి వచ్చేలోపు
తల్లిదండ్రుల మాటలు వింటారా అసలు చదువుకుంటారా ప్రేమలు అంటారు తర్వాత తాగుడు సిగరేటు మందు అన్ని అలవాట్లు హైస్కూల్ ఏజ్ లోనె అలవాటుపడి అడ్డదిడ్డంగా తయారువుతారు. తల్లిదండ్రులు మావాడు ఇప్పుడే మొబైల్ మొత్తం తెలుసు అన్నీ యాప్ లు తెలుసు అంటు మురిసిపోతున్నారు. కాని వాళ్ళు ముందు ముందు ఎలా తయారవుతారోనని ఆలోచించడం లేదు. ప్రతీ తల్లిదండ్రులు  ఇలా పిల్లలకి మొబైల్ ఫోన్ ఇచ్చి వారికి  చెడుమార్గంలోకి దారి చూపిస్తున్నారు. ఈ టిక్ టాక్ లు వీడియో గేమ్ లు అవసరమా చెప్పండి. పిల్లలను ఆరు బయట ఆటలాడేందుకు ప్రోత్సహించండి క్రికెట్ ,వాలిబాల్, బాస్కెట్ బాల్, కబాడ్డీ లాంటి వ్యాయామం కలిగించే ఆటలు ఆడేలా ప్రోత్సహించండి దాని వలన ఆరోగ్యానికి మంచిది. అలాకాకుండా మొబైల్ ఫోన్ ఇచ్చి వీడియో గేమ్ ఆడిపిస్తే వాడు ఆ గేమ్ లో లీనమై బయట కూడా అలాగె ప్రవర్తిస్తాడు. మొత్తంగా సైకోల్లాగా తయారవుతారు పిల్లలు.

దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకు స్మార్ట్  ఫోన్ ఇవ్వకండి. ముందు చదువుకోమనండి ఆ తర్వాత ఆటలు ఆడించండి.. మంచి భవిష్యత్ ను అందించండి. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్టు ఇప్పటి నుండె సరైన క్రమశిక్షణతో పెంచితే పెద్దవాళ్ళయ్యాక ప్రయోజకులు అవుతారు.

22, జనవరి 2019, మంగళవారం

ఐదేళ్ళకోసారి వచ్చే మందు పండుగ...!

మందు పండుగలా ఎన్నికలు
     
        పల్లెల్లో ఇంకా పంచాయితి ఎన్నికలు జరగకముందే అభివృద్ది ఎలా ఉంటుందో చూపిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. పోటిపడి మరీ క్వాటర్ సీసా, నోట్లతో అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తున్నారు. ప్రతీ ఇంట్లో అరడజను పైగా మందుసీసాలతో కళకళలాడుతున్నాయి. మొత్తంగా మూడు నోట్లు,ఆరు క్వార్టర్
సీసాలతో వాళ్ళు చేసే అభివృద్ది ఏంటో చూపిస్తున్నారు.  జనాలను మత్తులో ముంచుతున్నారు. నేను గెలిస్తే ఊళ్ళో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాను అని ఏ ఒక్క అభ్యర్థి చెప్పిన పాపాన పోలేదు.
   
         సర్పంచ్ పదవికి పోటీచేసే అభ్యర్థుల దృష్టిలో ఓటర్లను గొర్రెల్లాంటి వారుగా భావిస్తారో ఏమోగాని ఇప్పటికి కూడాను మందు,నోట్లు ఆశచూపితే గెలుస్తామనే ధీమాలో ఉంటున్నారు.  ఇచ్చేవాడిది తప్పు అయితే తీసుకునేవాడిది కూడా తప్పే కదా!
కాని ఓటర్లెవరు కూడా మాకు మందు డబ్బులు వద్దు ఊరిని అభివృద్ది చేయండి అని ఎవరు చెప్పరు. ఎవడిచ్చిన తీసుకోవడమే. డబ్బులు ఎవరికి ఊరికే రావు!! అన్నట్టు ఇచ్చింది పుచ్చుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు.

      చదువుకోని నిరక్ష్యరాస్యులైన ఓటర్లు డబ్బుకు,మందుకు ఆశపడితే ఇక చదువుకున్న యువ ఓటర్లు వీళ్ళన్న అభివృద్ది గురించి అడుగుతారననుకుంటే అదీ లేదు  ఎంత ఖర్చు అయిన పరవాలేదు పక్కోడు ఓడిపోవాలి మనం గెలవాలి అనే దానిపైనే వీళ్ళ దృష్టంతా.  పంతం నీదా నాదా సై! అంటున్నారే తప్ప అభివృద్ది ఊసే ఎత్తట్లేదు. ఇక ఊరి అభివృద్ది సంగతి దేవుడెరుగు.

 అసలు సర్పంచ్ ఎన్నికలు అంటే ఐదేళ్ళకోసారి వచ్చే వారం రోజుల మందు పండుగలా తయారయింది.

ఇలా అయితే ఊళ్ళు ఎప్పుడు బాగు పడుతాయి..

1, జనవరి 2019, మంగళవారం

తాగుబోతుల దినోత్సవం


        తేది మారిపోతే ఏం ఉంది ప్రత్యేకత నిన్న నేడు రేపు తేడా ఏముంది? సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. పడమరనే అస్తమిస్తాడు. ప్రతీ రోజు అందమైన రోజే కదా.
మరీ ఏంటీ ఈ 31 డిసెంబర్ అర్దరాత్రి సంబరాలు.
ఎందుకు ఈ సంబరాలు అసలు ఇవి సంబరాల?
తాగి తందనాలు ఆడడం.
 ఏం సాదించారని ఇంత హడావిడి.

 ఓ ...పేద్ద పేద్ద శబ్ధాలతో బాణాసంచా పేలుళ్ళు. అది కూడా అర్దరాత్రి.

తాగడానికేగా హ్యాపీ న్యూఇయర్.

రోజు తాగతూనే ఉంటారుగా మళ్ళీ ఈ రోజు కూడానా! ఇంకో విషయం ఏంటంటే తాగనోడు కూడా ఈ రోజు తాగుతాడు.!!
ప్రతిరోజు తాగుతూనే ఉంటారు కాని తాగడానికి కూడా ఓ రోజు ఉండాలిగా! అందుకే 31 డిసెంబర్ తాగుడు దినోత్సవం.
హ్యపీ న్యూఇయర్ కాదు "డ్రింకర్స్ న్యూసెన్స్ ఇయర్".
 ఈ రోజుని మధ్యపాన దినోత్సవంగా గుర్తించాలి.
   
                     "తాగుబోతుల దినోత్సవం"
                              శుభాకాంక్షలు