భానోదయం: ఇది మనదేశంలోనే ఉందా! అనిపించేలా సిద్దిపేట కూరగాయల మార్కెట్.

Saturday, 9 February 2019

ఇది మనదేశంలోనే ఉందా! అనిపించేలా సిద్దిపేట కూరగాయల మార్కెట్.


         
          మనదేశంలో కాళ్ళకు తొడుక్కునే చెప్పులని ఏసి రూముల్లో అమ్ముతారు. మనం తినే కూరగాయలను మాత్రం రోడ్డు పక్కన అమ్ముతారని అంటారు. నిజమే! ఇప్పటికి మా ఊరిలో ఇలాగే ఉంది. జనాలకు నడవడానికే రోడ్డు సరిపోదు ఇక కూరగాయలు అమ్ముకునే వారు అదే రోడ్డులో కూర్చుని కూరగాయలు అమ్ముతుంటారు. ఇరుకైన దారులు కాబట్టి కూరగాయల్ని తొక్కుకుంటూనే వెళ్తారు జనాలు. సరైన మార్కెట్ సదుపాయాలు ఉండవు కాబట్టి ఇలా రోడ్డుపైనే కూరగాయలు అమ్ముతున్నారు. ఇది అందరు రోజు చూసేదే. వీళ్ళ కష్టాలు ఎవ్వరికి పట్టవు వీళ్ళుకూడా ఎవరితోను చెప్పరు మాకు ఒక మార్కెట్ కావాలని.
వానకాలంలో వీళ్ళు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు పైనుండి వర్షం పడుతుంటే గొడుగు కింద అలా నిల్చుండి పోతారు. వర్షం నీటితో రోడ్డు మీద చెత్తచెదారం వచ్చి కూరగాయలపై చేరుతుంది.
కూరగాయలను కోనేందుకు వెళ్ళెవారికి కూడా బాధలు తప్పవు మార్కెట్ లో అలా కూరగాయలని వెతుక్కుంటు వెళ్తుంటే వెనకాల ప్యాంటు షర్టు మొత్తం బురదమయం అవుతాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే గగనమే మరీ ఆ బురదలో. అసలు ఎందుకొచ్చాం ఇక్కడికి అనిపిస్తుంది.
కూరగాయలతో పాటు చికెన్, మటన్ కూడా
కొనాలి కదా మటన్ షాపుల దగ్గరకెళ్తే రోగాల దగ్గరకెళ్ళి డబ్బులిచ్చి అనారోగ్యన్ని తెచ్చుకుంటున్నట్టు ఉంటుంది అక్కడి వాతావరణం.అసలు ఎలా తింటున్నారు ఇలాంటి ఆహారం అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మటన్ కంటే ఎక్కవగా ఈగలే కనిపిస్తాయి. పరిసరాలు మొత్తం ఈగలతో నిండిపోయి ఉంటుంది తేనే తెట్టె చుట్టూ తేనేటీగల మాదిరి.
ఇక్కడ మటన్ కొనేవారికి అధనంగా ఈగల మాంసంకూడా మటన్తో పాటు వస్తుంటుంది. అలాగే రెండుమూడు రోగాలు బోనస్ గా వస్తూఉంటాయి.

               అంతట ఈ విధంగా ఉంటే సిద్దిపేట వాసులు మాత్రం అదృష్టవంతులు. అక్కడి కూరగాయల మార్కెట్ చూస్తే అసలు ఇది మనదేశమేనా అనిపిస్తుంది. అంత అత్యాధునికంగా అన్ని సౌకర్యాలతో నిర్మించి ఇచ్చారు హరీష్ రావు గారు.
ఈ మార్కెట్ అన్ని సౌకర్యాలతో చాలా విశాలంగా చాలా పరిశుభ్రంగా ఉంది.ఇటు కూరగాయలు అమ్మేవారు అటు వినియోగదారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
ఇలాంటి మార్కెట్ ను నిర్మించినందుకు హరీష్ రావుగారికి  చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏
         
17 comments:

Jai Gottimukkala said...

నాకు తెల్వక అడుగుత: ఇయి నిజ్జంగ ఫోటోలేనా, రాజమౌళి ఇస్టయిల్ గ్రాఫిక్స్ కాదా? ఒక్క టీవీలో కూడ రాలే అందుకని అడుగుతున్న ఏమి అనుకోవొద్దు.

నీహారిక said...

నా వంతు సాయంగా నా అభిప్రాయాలు తెలియజేయడం నా ఉద్ద్యేషం ...

ఉద్దేశ్యం !

భానోదయం said...

ఇది గ్రాఫిక్స్ కాదండీ నిజం. మీకు అంత డౌట్ ఉంటే ఒకసారి సిద్దిపేట వెళ్ళి చూడండి.

భానోదయం said...

మీరు అన్నది అర్థం కాలేదు.

sistla said...

@ భానోదయం: నిజంగా. చివరకు T news లో కూడా నేను చూడలేదు.

భానోదయం said...

నిజం చెబితే ఎవ్వరూ నమ్మరే!?ఇది నిజం అండి బాబు
మీరు ఈ దేశంలో ఇలాంటివి అసాధ్యం అనుకుంటున్నారు. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాలనే ఆలోచన రావడం హరీష్ రావు గారి గొప్పతనం.

నీహారిక said...

మీ ప్రొపైల్ లో ఉద్దేషం అని వ్రాసారు. ఉద్దేశ్యం అని వ్రాయాలి.

నీహారిక said...

నిన్న సిద్దిపేటలో అగ్నిప్రమాదం జరిగి 11 దుకాణాలు అగ్నిలో కాలిపోయాయి. అది ఇక్కడేనా ?

భానోదయం said...

వెటకారమా!
ఇక్కడ చూడండి..
https://youtu.be/nvPedl2qHpw

భానోదయం said...

ధన్యవాదములు నిహారిక గారు. మీ సూచనలు తెలియజేసినందుకు ఆ పదాన్ని సరిచేస్తాను.

వెంకట రాజారావు . లక్కాకుల said...

శేఖర్ గారూ ,
తమరు ఏమీ అనుకోకపోతే ,

భానోదయాన్ని భానూదయంగా మార్చండి .

భాను , ఉదయం కలిపితే భానూదయం ఔతుంది , సూర్యుడు ఉదయించడం అనే అర్థం వస్తుంది .

భాన , ఉదయం కలిపితే భానోదయం ఔతుంది , మీరనుకున్న అర్థం రాదు మరి .ధన్యవాదాలు .

భానోదయం said...
This comment has been removed by the author.
భానోదయం said...

వెంకట రాజా రావు మీ సూచనలు తెలిజేసినందుకు ధన్యవాదములు.

నీహారిక said...

https://youtu.be/Y5JnQ_ncQZY

భానోదయం said...

అగ్నిప్రమాదం జరిగింది వాస్తవమే.

Jai Gottimukkala said...

నీహారిక గారూ, అగ్ని ప్రమాదం జరిగింది పాత రైతు బజారులో. భానోదయం గారు టపాలో రాసిన కొత్త ఇంటిగ్రేటెడ్ మార్కెట్టుకు ఇది రెండు మూడు కిమీ దూరం.

వాస్తవాలు ఎవరికి కావాలండీ? చారాణా చికెన్ బారాణా మసాలా రోజులు పోయాయి ఇప్పుడు అను"కుల" మీడియాలో చూపించే గ్రాఫిక్స్ మాత్రమే నిజం!

On a more serious note: 118,699 ఓట్ల మెజారిటీ వట్టిగనే వస్తదా? రికార్డు మీద రికార్డులతో డబల్ హాట్రిక్ కొట్టిన హరీష్ రావు ధన్యుడు. అందరు పుడుతరు చస్తరు నడిమిట్ల సాధించింది మందికి గుర్తుండెటట్లు నిలిచేది కొందరే.

నీహారిక said...

చంద్రబాబు నాయుడు గారు 20 సం ల క్రితమే ఇటువంటి రైతుబజార్ లు ఏర్పాటు చేసారు. ఆయన సాధించింది మాకు గుర్తు ఉంది.