భానోదయం: జపాన్ దోశ ఒకోనమి యకి

Tuesday, 12 March 2019

జపాన్ దోశ ఒకోనమి యకి

           
         
           తెలుగు వారికి దోశలంటే చాలా ఇష్టం.  ఒకప్పుడు ఉల్లిదోళ ,మసాలా దోశ మాత్రమే నాకు తెలిసిన దోశలు మరి ఇప్పుడు కేవలం దోశ అనే వంటకం లోనే 100 రకాలకు పైగా దోశలు లభిస్తున్నాయి.
ఇన్ని దోశలు నేనెప్పుడు తినలేదు కాని నాకు ఇష్టమైన దోశ అంటే ఉల్లి దోశ.
     
              మన దేశంలో అది కూడా దక్షిణ భారతదేశంలో మాత్రమే దోశ అనే వంటకం చేస్తారని తెలుసు కాని దోశను జపాన్ లో కూడా చేస్తారని తెలిసింది. అది కూడా మామూలు దోశ కాదు మన దోశలాగే వీరు కూడా తయారు చేస్తారు కాని అందులో వాడే పదార్థాలే అనేకం. ఇందులో దోశపిండి ముందుగా వేసి దాని పైనా బన్ను మాదిరి సైజులో క్యాబేజి తురుము వేసి మద్యలో పచ్చి గుడ్డు పోసి దాని పైనా మాంసం వేసి మళ్ళీ దానిపైనా ఇంకా రెండు మూడు రకాల కూరగాయలు వేసి అటూ ఇటూ తిప్పేసి పెనం పై బాగా కాలుస్తారు. తయారైనాక ఎలా ఉంటుందో కాని దానిలో క్యాబేజి తురుమే ఎక్కవగా ఉంటుంది. మొత్తంగా క్యాబేజి రుచి మాత్రమే ఉండేలా ఉంది. అయిన మన దోశ రుచి మనది జపాన్ దోశ రుచి జపాన్ ది. ఎవరి వంటకం వాళ్ళకు నచ్చుతుంది అనుకోండి. కాని జపాన్ దోశ మనం తినలేం అలా ఉంది దాని సైజు అయిన మనం అక్కడి దాకా వెళ్ళి తింటేగా. ఈ వంటకం దోశనో కాదో  నాకు తెలియదు కాని జపాన్ లో మాత్రం ఈ వంటకం పేరు "ఒకోనమి యకి" అని అంటారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి2 comments:

సూర్య said...

ఒకొనమియకి దోశలా ఉండదు. మన పల్లెటూళ్లలో అమ్మే మినప అట్టులా మందంగా ఉంటుంది. జపాన్ ఒసాకా నగర స్పెషాలిటీ.

భానోదయం said...

ఒకొనమియకి చేసే విధానాన్ని బట్టి దోశల అనిపించింది సూర్యగారు.