భానోదయం: శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వారి రథోత్సవం

21, మార్చి 2019, గురువారం

శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వారి రథోత్సవం

       ప్రతి సంవత్సరం మా ఊరిలో శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. శివరాత్రి తర్వాత వచ్చె నవమి రోజు కల్యాణం జరుగుతుంది. ఆ తర్వాత రెండో రోజు శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల రథోత్సవం జరుగుతుంది.  ఈ బ్రహ్మోత్సవాలను జాతర అని పిలుస్తుంటారు. ఈ ఉత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు  చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
     


            కొండపైన ఉన్న ఆలయంలో శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల కల్యాణం జరుగుతుంది. ఆ తర్వాత రెండో రోజు ఊరి మద్యలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి  ఆలయం వద్ద నుండి రథోత్సవం ప్రారంభమవుతుంది. రథోత్సవం రోజు తెల్లవారు జామున నాలుగు గంటలకల్ల  స్వామి వార్ల రథాన్ని పూలతో అందంగా ముస్తాబు చేసి శ్రీ పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి ఊరేగిస్తారు. ఇక నాలుగు గంటల నుండి రథోత్సవం ప్రారంభమవుతుంది. భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని భజనలు చేసుకుంటు రథాన్ని ఊరేగిస్తారు. ఉదయం నాలుగు గంటలకు శ్రీ ఆంజనేయ స్వామ వారి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన రథోత్సవం ఉదయం తొమ్మిది గంటలకు  శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల ఆలయం యొక్క కొండ దిగువకు  చేరుకోవడంతో ముగుస్తుంది. ఈ రథోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రథాన్ని లాగడానికి తాడు లాంటివి కట్టి లాగరు. కేవలం చెతులతో  నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. స్వామి వారి ఆశీస్సులతో ఇంత పెద్ధ రథాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయసనంగా ముందుకు తీసుకెళ్తున్నాం.




     ఒకప్పుడు జాతరకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చే వారు ఇప్పుడు మాత్రం జనాలు రావడం కొంచెం తగ్గిపోయింది.
        

కామెంట్‌లు లేవు: