భానోదయం: కల్తీలేని ఆహారపదార్థాలు

7, మార్చి 2019, గురువారం

కల్తీలేని ఆహారపదార్థాలు

     

       మనం రోజు ఉపయోగించే నిత్యవసరాల పదార్థలలో కల్తీలేని ఆహారపదార్థం అంటూ ఏది లేదు. పాలు, పప్పు, ఉప్పు ,కారం,కూరగాయలు, పండ్లు ఇలా ఎలాంటి ఆహార పదార్థాలైనా అన్నీ కల్తీయె.
వీటిని తినడం వలన రోగాల పాలవడం గ్యారంటీ. కల్తీ ఆహార పదార్థాలను గుర్తించి వాటిని వాడకపోవడం వంటివి చేస్తున్న అదంతా సమయం డబ్బు వృదా. అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రుల చుట్టూ తిరగడం కంటే సహజసిద్దంగా పండించే ఆహారపదార్థాలను తినడం ఉత్తమం.
          సహజసిద్దంగా పండించే ఆహారపదార్థాలు ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కడ దొరకవు దొరికిన చాలా తక్కువ కాబట్టి మనమే పండించుకోవాలి.
అదెలాగంటే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తున్న కిచెన్ గార్డెనింగ్ తో. మనకు కావలసిన కూరగాయలు పండ్లు మన ఇంటి పెరట్లో ఉన్న కాస్త స్థలంలో చక్కగా పండించుకోవచ్చు. వీటికి మనం రసాయనాలు వాడము  కేవలం పశువుల పేడ, వర్మీకంపోస్ట్  మాత్రమే వాడుతాం కాబట్టి సహజసిద్దంగా ఉంటాయి. పశువుల పేడ బయట ఎక్కడనుండైనా రైతుల వద్ద నుండి తెచ్చుకోవచ్చు.
వర్మీ కంపోస్ట్ కూడా మార్కెట్లో లభిస్తుంది. లేదా వీలుంటే వంటింటి వ్యర్ధాలతో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మనం సొంతంగా పండించుకున్న కూరగాయలు పండ్ల రుచి చాలా బాగుంటుంది. రసాయనాలు వేసి పండించిన వాటికి అంతగా రుచి ఉండదు ఈ విషయం మీరు సొంతంగా పండించుకున్న కూరగాయలు పండ్లు తిన్నప్పుడు గమనిస్తారు. ఇంటి చుట్టు పక్కల మొక్కలు ఉండటం వలన స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుంది.
కూరగాయలు, పండ్ల మొక్కలతో పాటు కొన్ని రకాల ఔషదమొక్కలు పెంచుకుంటే మంచిది అందులో దోమలు రాకుండా చేసే మొక్కలను పెంచుకుంటే ఇంట్లోకి దోమలు దరిచేరవు.

          ఇక పాల విషయానికి వస్తే వీలుంటే ఒక ఆవును పెంచుకోవడం ఉత్తమం. దీనివలన మంచి పాలతో పాటు  పెరటి తోటకు సరిపోయే పేడ లభిస్తుంది.

     వంటనూనెల విషయానికి వస్తే నేరుగా రైతుల వద్ద నుండి వేరుశనగ, నల్లకుసుమలు, నువ్వులు వంటి వాటిని కొనుగోలు చేసి గానుగ పట్టించి వాడితే మంచిది. అలాగే పప్పులు వంటి వాటిని నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేయాలి.
ఇలా సాద్యమైనంత వరకు కల్తీ లేకుండా ఆహారపదార్థాలను తీసుకోవడం ఉత్తమం.

అనారోగ్యాల పాలయ్యి ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆస్తులు గుల్ల చేసుకోవడం కంటే ముందు జాగ్రత్తగా  కొద్దిగా కష్టపడి పైన చెప్పిన విధంగా సహజ ఆహారపదార్థాలను వాడితే ఆరోగ్యంగా ఉండవచ్చు.

               ఆరోగ్యమే మహాభాగ్యం

కామెంట్‌లు లేవు: