భానోదయం: రోగుల పట్ల వైద్యుల నిర్లక్ష్యం.

8, మార్చి 2019, శుక్రవారం

రోగుల పట్ల వైద్యుల నిర్లక్ష్యం.

           
         ఏదైనా జబ్బు చేస్తే జబ్బు తగ్గిపోతుందనే ధీమాతో డాక్టర్ వద్దకు వెళ్తాం. అనారోగ్యంగా వెళ్ళి ఆరోగ్యంగా ఇంటికి వస్తాం ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే డాక్టర్లంటేనే భయం వేస్తుంది. ఒక జబ్బు నయం అయ్యింది అనుకొని ఇంటికి వచ్చాక ఇంకో సమస్య మొదలవుతుంది.
ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తరచు నొప్పి వస్తుంటే మళ్ళీ ఆసుపత్రికి వెళ్తే అప్పుడు వెలుగు చూస్తున్నాయి దారుణాలు. ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులో కత్తెర మర్చిపోవడం, దూది మర్చిపోవడం వంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇవేవో చిన్న ఆసుపత్రిలో జరిగాయి అనుకుంటే పొరపాటే అవి చాలా పెద్ద ఆసుపత్రులే.
            ఒక మహిళకు   ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేసారు. ఇంటికి వెళ్ళిన మహిళ తరచూ కడుపులో నొప్పి వస్తుంటే మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడ డాక్టర్లు పరీక్షలు జరిపి కడుపులో కత్తెర ఉన్నదని గుర్తించారు. అదికూడా రెండు మూడు నెలల తర్వాత గుర్తించారు. ఎంత దారుణం ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియదా ఇంత నిర్లక్ష్యమా! మనిషి ప్రాణాలంటే అంత చులకన.
       అలాగే మెడిసిన్ ఇచ్చే క్రమంలో కూడా నిర్లక్షమే ఒకదానికి బదులు మరో మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇద్దరు చిన్నారుల  ప్రాణాలు  పోయాయి. ఇంకా చాలా మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
   
   డాక్టర్లంటే దేవుళ్ళతో సమానం మీ మీద భరోసాతోనే జనాలు ఆసుపత్రులకు వస్తున్నారు. మీ నిర్లక్ష్య ధోరణితో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. డాక్టర్లంటేనే భయం కలిగించేలా ప్రవర్తించకండి. కొందరు చేసిన ఈ నిర్లక్ష్యం కారణంగా మొత్తం వైద్య వృత్తికే చెడ్డపేరు వస్తుంది.
దయచేసి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకండి.


ఏదైనా జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేరడం కంటే ముందు జాగ్రత్తగా సరైన ఆరోగ్య నియమాలు పాటించి ఆరోగ్యంగా ఉండటం అన్ని విధాల శ్రేయస్కరం..


కామెంట్‌లు లేవు: