భానోదయం: భారతదేశంలోనే స్వచ్ఛమైన నది ఉంగోట్ నది

Saturday, 13 April 2019

భారతదేశంలోనే స్వచ్ఛమైన నది ఉంగోట్ నది

          ఉంగోట్ నది మేఘాలయ

      భారతదేశంలో నదుల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. కొన్ని నదులల్లో నీళ్ళను కూడా తాకలేం అంత దుర్గంధమైన నిళ్ళు ఉంటాయి. అన్ని నదులు కూడా కాలుష్యం అవుతున్నాయి. కాని ఒక్క నది మాత్రం చాలా పరిశుభ్రంగా,
స్వచ్ఛంగా ఉంటుంది దాని పేరు ఉంగోట్ నది(umngot river). ఈ నది  మనదేశంలోని మేఘాలయా రాష్ట్రంలోని   డావ్కి (dawki) అనే గ్రామం వద్ద కలదు. ఇది బంగ్లాదేశ్ మరియు భారత్ సరిహద్దుల్లో ఉంది. డావ్కి టూరిస్ట్ ప్లేస్.      ఉంగోట్ నది యొక్క ప్రత్యేకత నదిలోని నీళ్ళు. ఈ నదిలోని నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే నది అడుగు బాగంలో ఉండే రాళ్ళు , చేపలు చాలా స్పష్టంగా పైకి కనిపిస్తాయి. నది మొత్తం క్లిస్టర్ క్లీన్ గా కనిపిస్తుంది. నదిలో ఎక్కడా కూడా చిన్న దుమ్ము కూడా కనిపించదు.  ఈ నదిని చూడటానికి వచ్చే టూరిస్టులు నదిలో టూరిస్ట్ పడవల్లో వెళ్తుంటారు.  కాస్త దూరం నుండి ఈ పడవలను చూస్తే అవి గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తాయి. నది చుట్టు  పచ్చని చెట్లతో  ఎత్తైన కొండలు ఉంటాయి.  ఇంత స్వచ్ఛమైన నది ఈ కాలంలో ఉండటం అది మన దేశంలో అంటే నమ్మకం కుదరదు కాని ఉంగోట్ నది చూస్తే ఇంకా పర్యావరణం అక్కడక్కడ దాని సహజసిద్దమైన రూపు కొల్పోలేదనిపిస్తుంది.
ఇలాంటి నదులు మపదేశంలో ఉండటం మన అదృష్టం. అన్ని నదులు ఇలా అయితే ఎంత బాగుంటుందో కదా. అన్ని నదులు ఉంగోట్ నదిలా ఉంటే మనదేశం భుతలస్వర్గం అవుతుంది.


     ఉంగోట్ నదిని ఒక్కసారైన చూడాలని అందులో దిగాలని  ఎవ్వరికైనా ఉంటుంది. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వాళ్ళు అక్కడకు వెళ్ళి హాయిగా ఆ నీటిని చూస్తు తన్మయత్వంతో తమను తామే మర్చిపోయి ఆనందంతో గంతులేస్తారనిపిస్తుంది.
ఆ దేవున్ని ఒకటి కోరుకుంటాను "ఇంత అందమైన నదిని సృష్టించిన దేవుడా"... "ఎప్పటికి ఈ నది ఇలాగే స్వచ్ఛమైనదిగా ఉండాలని కోరుకుంటాను".5 comments:

Rajeswari said...

చూస్తే చాలా సంతోషంగా ఉంది, thanks for sharing.

భానోదయం said...

Thanks andi

Anonymous said...

నేను మేఘాలయ లో రెండేళ్లు ఉన్నాను. చాలా సార్లు Dawki వెళ్ళాను. నవంబరు నుంచి మార్చి దాకా వర్షాలు ఉండవు కనుక నీళ్ళు ప్రవాహంలేక స్వచ్ఛంగా ఉంటుంది. తరువాత అంత గొప్పగా ఉండదు.

భానోదయం said...

అవునా!! వేరే ఇతర నదులు ఇంత అందంగా ఉండవు కదండీ .

నీహారిక said...

నా చిన్నతనంలో ఆంధ్రాలో మేడూరు దగ్గర గులకరాళ్ళ నది ఒకటి చూసాను. నేచురల్ గా గులకరాళ్ళు వేస్తే స్వచ్చమైన నీరు పైకి వస్తుంది. ఇంకుడుగుంతలో కూడా గులకరాళ్ళు వేస్తారు. ఇదివరకు మా ఊరిలో కృష్ణానది నీళ్ళు ఇలాగే స్వచ్చంగా ఉండేవి. ఇపుడు నీళ్ళే లేక నదిపై ఆటోలు కూడా వెళుతున్నాయి.