భానోదయం: అమెరికా ఎలా ఉంటుంది

15, ఏప్రిల్ 2019, సోమవారం

అమెరికా ఎలా ఉంటుంది


   అమెరికా ఎలా ఉంటుంది అక్కడి విశేేషాలు తెెలుసుకోవాలని అందరికి ఉంటుంది.

      తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే దేశం ఎదంటే అది  అమెరికా అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒక్కసారైననా అమెరికా వెళ్ళాలని ఉంటుంది. ఐ.టి రంగంలో ఉద్యోగాలు చేసేవారు అమెరికాలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న తెలుగు వారు చాలా మందే ఉన్నారనుకోండి. మరియు ఉన్నత చదువులకోసం వెళ్ళిన తెలుగు విద్యార్థులు ఉన్నారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న  వారు తమ కుటుంబ సభ్యులను కూడా ఎప్పుడో ఒకసారి అమెరికా తీసుకెళ్తుంటారు. ఇంకా కొంతమంది డబ్బున్న వాళ్ళు అమెరికా పర్యటనకు వెళ్ళి చూసొస్తుంటారు. వీళ్ళ సంగతి పక్కన పెడితే నాలాంటి వారు అమెరికా వెళ్ళడం ఒక కల. అమెరికా ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం, ప్రజలు , సంస్కృతి, అభివృద్ది ఇంకా అమెరికా ప్రజల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్ళాలని ఉంటుంది.

       అమెరికాను ప్రత్యక్షంగా చూడటం కుదరదు కాని
ఇంటర్నెట్ ద్వారా నా కల సాకారం అయ్యింది.  అక్కడ పరిస్థితులను అక్కడి విషయాలను మనకు తెలియజేస్తున్నారు  మన తెలుగువాడైనా వాసు గారు. వాస్ వ్లాగ్స్ (vaas vlogs) యూట్యూభ్ చానెల్ ద్వారా అమెరికా ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.

vaas vlogs

అలాగే మరొకరు కూడా అమెరికా విశేషాలను చాలా చక్కగా వివరిస్తున్నారు ఆవిడే మహాలక్ష్మీ గారు. Us lo mahalaxmi అనే యూట్యూభ్ ఛానెల్ ద్వారా అమెరికా గురించి వివరిస్తున్నారు.

US lo Mahalaxmi


 ఇతర దేశాల గురించి తెలుసుకోవడం అంటే నాకు చాలా ఆసక్తి అందులో అమెరికా గురించి అయితే ఇంకా ఆసక్తి ఎక్కువ.

అమెరికా ఎలా ఉంటుంది మరియు
అమెరికా దేశం విశేషాలు తెలియజేస్తున్న  మన తెలుగు వారికి ధన్యవాదములు.

26 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// "..... నాలాంటి వారు అమెరికా వెళ్ళడం ఒక కల." //
-------------------------
ఏం, ఎందుకా నిరుత్సాహం "భానోదయం" గారు? గతంలో కన్నా ఇప్పుడు అమెరికా వెళ్ళిరావడం సులభమైంది. బోలెడన్ని ట్రావెల్ పాకేజ్ లు దొరుకుతున్నాయి. థామస్ కుక్, కాక్స్ & కింగ్స్ లాంటి మంచి పెద్ద ట్రావెల్ ఆపరేటర్ వారి ఆఫర్లు చూడండి.

అసలు మీ పిల్లల్ని పైచదువుల కోసం అమెరికా పంపించండి. ఆ తరువాత మీరు మీ శ్రీమతి గారు మన దేశానికి అమెరికాకి మధ్య తిరుగుతూనే ఉంటారు 🙂👍.

భానోదయం చెప్పారు...

అలాగేనండి నరసింహా రావు గారు నా పెళ్ళి అయ్యి పిల్లలు పెద్దవారైనా తర్వాత వెళ్తాను.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Oh I see. Lucky man 😀😀.
మరింకేం, ఏదన్నా మంచి టూరిజం పాకేజ్ చూసుకుని మీరొక్కరూ వెళ్ళిరావడానికి ఇదే అద్భుతమైన అవకాశం, వయసూనూ 🙂. Go ahead 👍.

భానోదయం చెప్పారు...

ఒక్కరు ఎలా వెళ్తారండి కంపెనీ ఇవ్వడానికి ఒకరుండాలి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...


🙂🙂
సంవత్సరంలో కొంత భాగం అమెరికాలో చాలా చోట్ల ఇలా ఉంటుందిట 👇.

"మంచు కురిసే వేళలో"

http://vinipinchani-raagale.blogspot.com/2017/02/blog-post.html

భానోదయం చెప్పారు...

మంచు కురిసేవేళలో అమెరికా చాలా బాగుంది రావు గారు.

నీహారిక చెప్పారు...

మీరెపుడైనా కశ్మీర్,గాంగ్ టాక్, మసూరీ వెళ్ళారా ? చాలా బాగుంటాయి. జంటగా ఎపుడైనా వెళ్ళొచ్చు కానీ మీ ఫ్రెండ్స్ తో వెళ్ళే చాన్స్ మళ్ళీ రాదు. పెళ్ళాం పిల్లల లగేజ్ మోసుకుంటూ వారికి సౌకర్యాలు చూసుకుంటూ బాధ్యతల బరువు మోసేకన్నా ఇపుడే వెళ్ళి రావడం మంచిది.
శని,ఆదివారాలు మావాడే ఫ్రెండ్స్ అందరినీ పోగేసుకుని అలెప్పీ, కూర్గ్ లాంటి ప్లేస్ లకు వెళ్ళొస్తూ ఉంటాడు.

నీహారిక చెప్పారు...

https://youtu.be/1TAwBr26J7U

భానోదయం చెప్పారు...

అమెరికా కంటే కాశ్మీర్ బాగుందనిపిస్తుంది. ఈ వీడియో చూసాక.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Well said నీహారిక గారు 👌. “భానోదయం” గారికి నేనూ అదే నచ్చజెప్పే ప్రయత్నం చేశాను 🙂.

పెళ్ళయిన తరువాత ... ఇంకా వయసులో ఉన్నప్పుడే ... అంటే శరీరధారుఢ్యం, ఆరోగ్యం బాగున్నప్పుడే ... తీర్థయాత్రలు కూడా చేసెయ్యండని తెలిసిన వారికి నేను ఇస్తుండే మరొక సీరియస్ సలహా. ఎందుకంటే ముసలితనం వచ్చాక తీర్థయాత్రల యావ ఎలాగైనా పెరుగుతుంది ... ముఖ్యంగా ఇంటి ఆడవారికి. కానీ ఆ వయసులో వెడితే ముక్తి కన్నా ఎక్కువ ఆయాసం, కీళ్ళనొప్పులే దక్కుతాయి 😀.

భానోదయం చెప్పారు...

ప్రేమ యాత్రలకు అంతదూరం వెళ్ళాలా రావు గారు ఒకసారి ఇలా చూడండి.
https://youtu.be/ARmYzdIdrmM

నీహారిక చెప్పారు...

మన స్టామినా ఎంతుందో తెలుసుకోవాలంటే గుళ్ళకి వెళ్ళాలి. శ్రీవారి మెట్లు నేను రెండున్నర గంటల్లో కాళ్ళీడ్చుకుంటూ ఎక్కాను. రాహుల్ గాంధీ గంటన్నరలోనే ఎక్కేసారంటే ఆశ్చర్యపోయాను. వయసయిపోయాక తీర్ధయాత్రలు ఇలా పనికివస్తున్నాయి.

భానోదయం చెప్పారు...


మన స్టామినా ఎంతుందో తెలుసుకోవాలంటే గుళ్ళకు వెళ్ళాలా.. ?నిహారిక గారు

నేను శ్రీవారి మెట్లు ఎక్కుతాను రికార్డుల కోసం కాదండి భక్తితో ఎక్కుతాను ఒక రోజైనా పరవాలేదు.

నీహారిక చెప్పారు...

అన్నవరం,తిరుపతి ప్రసాదం కోసం వెళతాను. కనకదుర్గ అమ్మవారికి పెట్టే పులిహోర కూడా ఇష్టం ! ఆడవాళ్ళు వెళ్ళకూడదని వెళ్ళలేదు కానీ అయ్యప్ప ప్రసాదం కూడా ఇష్టం. శ్రావణ శుక్రవారం చేస్తాను. అది కూడా భక్తితో కాదు చుట్టుప్రక్కల ఆడవాళ్ళని పిలిచి గిప్టులు ఇవ్వడానికి. ఊరికే రమ్మంటే ఎవరొస్తారండీ ? పండగలు కూడా అందరూ చేస్తారని నేను కూడా చేస్తాను ! ఆలయాలు శుభ్రంగా లేకపోతే అటువైపుకూడా పోనే పోను.కొబ్బరికాయ కొట్టనే కొట్టను.
ఆలయాలకి వెళ్ళడం ఒక ఆటవిడుపు కోసమే కానీ ఎవరినో ఉద్ధరించాలని కాదు నేనో పెద్ద భక్తురాలిని కానే కాదండీ !

భానోదయం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భానోదయం చెప్పారు...

మీరు RGV ని ఫాలో అవుతారా..??

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

# నీహారిక గారు
తెలియక అడుగుతున్నాను గానీ శ్రావణ శుక్రవారం పేరంటంలో కూడా గిఫ్టులిచ్చుకుంటారాండీ (శనగలు కాక)? కాదేదీ రిటర్న్ గిఫ్టులకతీతం అంటారా?

సూర్య చెప్పారు...

ప్రసాదం కావాలంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మా ఊళ్ళో మాత్రం ఊరికే కబుర్లు చెప్పడానికి బోలెడు మంది ఆడవారు వస్తుంటారు. గిఫ్ట్స్ అక్కర్లేదు. కుదిరితే ఓ కప్పు టీ చాలట! "పండగ చేస్కో"అని ఎంకరేజ్ చేస్తారేగాని బలవంతం ఎవ్వరూ చెయ్యరు, కాబట్టి అందరూ చేస్తున్నారని కాకుండా స్వీయ ఇష్టంతో చేసుకుంటే సంబరంగా ఉంటుంది.
ఆలయాలకు వెళ్లాలంటే దేవుడికి పే..ద్ద ఫాన్ అవ్వాలని నియమం లేదు!

నీహారిక చెప్పారు...

గిఫ్ట్స్ అంటే జయలలితగారు ఇచ్చినట్లు వెండికుంకుమభరిణెలు ఇచ్చుకుంటామనుకున్నారా ? ఏవో చిన్న చిన్న పర్సులు,స్టీల్ లేదా ప్లాస్టిక్ డబ్బాలు, శనగలతో కలిపి ఇస్తాంలెండి. మీరన్నట్లు కాదేదీ గిఫ్టులకనర్హం అన్నట్లు టీ వీ సీరియళ్ళ నుంచి దృష్టి మరల్చి మనింటిదాకా లాక్కు రావాలంటే తప్పదు సుమీ !

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీహారిక చెప్పారు...

మా ఊర్లో ఆడవాళ్ళు కాసేపు కూర్చోండి అంటే "మనసు మమత" సీరియల్ టైమయింది తరువాత వస్తాం అక్కా అని చక్కాపోతారు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Hm, gift-o-mania 🤣?

సూర్య చెప్పారు...

ఆ దిక్కుమాలిన సీరియల్ ఏదో మీ ఇంట్లోనే చూపిస్తే సరిపోతుందిగా?పైగా 24గంటలు విద్వత్తు.. సారీ విద్యుత్తు ఉంటుందన్నారు?!

సూర్య చెప్పారు...

అసలు మొగుడిని పొద్దున్నుంచీ ప్రసాదాల వంటయ్యేదాకా ఉపవాసం ఉంచితే,ఆ ఆకలికి ప్రసాదాలు ఎలా ఉన్నా వంకలు పెట్టకుండా తింటారు.
మూలవిరాట్టుని ఉపవాసం ఉంచగలిగే వారికి మొగుడిని ఉపవాసం ఉంచడం ఒక లెఖ్ఖా?

నీహారిక చెప్పారు...

ఒకరు చూసే సీరియళ్ళు ఇంకొకరు చూడరు.
మా బంధువుల ఇంటికి చుట్టపుచూపుగా ఒకావిడ వెళ్ళింది. ఆవిడని టీ వీ పెట్టమని అడిగితే నేను ఇంకో సీరియల్ చూస్తున్నాను..మీరు చూసే సీరియల్ నేను చూడను అని నిర్మొహమాటం లేకుండా చెప్పేసింది. ఆ వచ్చిన బంధువు బాధపడి అలిగి వెంటనే సర్దేసుకుని వాళ్ళింటికి వెళ్ళిపోయింది.

సీరియళ్ళ సిత్రాలూ....ఎన్నని చెప్పాలి ?

మూలవిరాట్టు మాత్రం శ్రద్ధగా మనుషులని తయారు చేస్తున్నారా ? మెదడు తీసుకెళ్ళి మోకాలులో పెట్టి మర్చిపోవడం లేదూ ?

వంట కూడా ఒక కళాత్మకమైన సృష్టి !