భానోదయం: లాజిక్ క్వశ్చన్స్ సమాధానాలు చెప్పండి

Tuesday, 11 June 2019

లాజిక్ క్వశ్చన్స్ సమాధానాలు చెప్పండి


    
      కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి కంప్యూటర్ ఇన్సిట్యూట్ కి వెళ్ళాను. అప్పటి వరకు కంప్యూటర్ చూడటమే తప్ప ఎప్పడు కూడా కంప్యూటర్ ను టచ్ చేయలేదు. మొదటి సారి కంప్యూటర్ కీ బోర్డుపై టైపు చేయడం మొదలు పెట్టాను. అప్పుడు నాకు   సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయినంత ఆనందంగా ఉంది. మొదటి రోజు కంప్యూటర్ గురించి ఇంట్రడాక్షన్ అయిపోయాక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో A to Z టైపు చేయమన్నారు. LKG పిల్లాడికి ABCD లు నేర్పించునట్టు నాకు ఇప్పుడు కంప్యూటర్ లో నేర్పిస్తున్నట్టు ఉంది. ABCD లు టైపు చేయడం ఎంత చిటికెలో చేసేస్తాను ఒక్కనిమిషంలో అంతే అంటూ కీ బోర్డ్ పై టైపు చేయడం మొదలెట్టాను. ఒక్క నిమిషంలో అయిపోతుందనుకుంటే 15 నిమిషాలు పట్టింది  ABCD లు వెతకడానికి. కీ బోర్డుపై ABCD లు వరుసక్రమంలో ఉంటాయనుకున్న కాని అక్కడ ఏ అక్షరం ఎక్కడ ఉందో వెతకడానికి అరనిమిషం పట్టింది.   కీబోర్డులో అక్షరాలు QWERTY క్రమంలో ఉంటాయని మనకు తెలియదు కదా.. అప్పుడు అర్థమైంది కీ బోర్డ్ పై టైపు చేయడం అంత సులువు కాదు. నేర్చుకుంటే ఎంతో కష్టం కూడా కాదని.

    అలా వారం రోజులు టైపింగ్ ప్రాక్టీస్ చేసాను. తరువాత ఒకరోజు సార్ అందరిని కూర్చోబెట్టి కంప్యూటర్ గురించే చెప్పడం కాకుండా కొన్ని లాజిక్ క్వశ్చన్స్ అడిగాడు. అందులో కొన్ని సామాజిక స్పృహ ఉన్న ప్రశ్నలు అడిగాడు. 

అందులో కొన్ని ఇక్కడ నేను అడుగుతాను తెలిసిన వారు కామెంట్ బాక్సులో రాయండి.

1. మీ దగ్గర ఒక బ్లూ ఇంక్ పెన్ ఉంది దానితో రెడ్ గా రాయగలరా? ఎలా రాస్తారు ?

2. ఒక పెద్ద చెట్టు మొద్దును నలుగురు వ్యక్తులు దానిలో ఒక ముక్క కోయడానికి 5 నిమిషాల సమయం పట్టింది. మరీ మూడు ముక్కలుగా కోయడానికి ఎంత సమయం పడుతుంది?

3. నేటి సమాజంలో మనిషి అంటే అర్థం ఏమిటి? లాజిక్ ఆన్సర్ చెప్పండి.

పై మూడు ప్రశ్నలకు సమాధానం తెలిసిన వారు కామెంట్ బాక్సులో రాయండి. నా సమాధానాలను ఆదివారం మరో పోస్టులో తెలియజేస్తాను.. ఇలాంటి ప్రశ్నలపై ఆసక్తి ఉన్నవారు సమాధానం చెప్పగలరు...

4 comments:

సూర్య said...

1) మామూలుగా అయితే ఇంక్ లేదా రీఫిల్ మార్చి రాయొచ్చు. "చేస్ అది కుదరదేస్" అనిపిస్తే పెన్ తో చేతిమీద గట్టిగా రాసుకోండి. ఎర్రగా రాసేవరకు ఒత్తిడి పెంచుకుంటూ పొండి! సేఫ్టీగా ఆయింట్మెంట్ అందుబాటులో ఉంచుకోండి.
2) ఒకసారి కోయడానికి నలుగురూ అవసరమా అన్నది చెప్పలేదు. ఒక కోతకు ఇద్దరు సరిపోతేగనక 5నిముషాల్లో మూడు ముక్కలు చెయ్యొచ్చు. ఒక కోతకు నలుగురూ అవసరమైతే 10నిముషాలు పడుతుంది. అల్సొ డిపెండ్స్ ఆన్ ఎవాలిబిలిటీ ఆఫ్ కటింగ్ మెటీరియల్ అండ్ ఓపిక.
3) అద్దంలో చూసుకోండి. సమాధానం దొరక్కపోతే నా తప్పు కాదు!

భానోదయం said...

మీరు చెప్పిన దాంట్లో రెండో ఆన్సర్ కరెక్ట్.
1,3 కరెక్ట్ కాదు.

సూర్య said...

బాగా ఆలోచించుకోండి. మూడోది కరెక్ట్ కాదంటే అది మీ తప్పే అవుతుంది.

భానోదయం said...

నా సమాధానం త్వరలో చెబుతాను