భానోదయం: హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేస్తే ఎం జరుగుతుంది.

11, సెప్టెంబర్ 2019, బుధవారం

హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేస్తే ఎం జరుగుతుంది.




   
హైదరాబాద్ ను  ఈ దేశానికి రెండో రాజధానిగా చేస‌్తే ఏం జరుగుతుంది.

డిల్లీ తరహాలో మరో రాష్ట్రంగా ఏర్పడుతుందా?

అలాగే గవర్నర్,ముఖ్యమంత్రులతో కూడిన అసెంబ్లీ ఏర్పడనుందా?

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగిస్తారా? లేదా వేరే ఇతర నగరాన్ని రాజధానిగా చేస్తారా?



   




హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస‌్తే ఇక్కడ పార్లమెంటు ను ఏర్పాటు చేసి పరిపాలన చేస్తారా?
సంవత్సరం లో ఆరు నెలలు డిల్లీ నుండి ఆరునెలలు హైదరాబాద్ నుండి పరిపాలన చేస్తారా?

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేస‌్తే ప్రయోజనం ఏమిటి?

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఏమవుతుంది?

అసలు ఎందుకు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా లేదా కేంద్రపాలిత ప్రాంతం చేయాలనుకుంటున్నారు.







2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

భవిష్యత్తులో వచ్చే అవసరాలను, అవి ప్రస్తుతం ఊహాజనితం అనిపించినా సరే, తగినంయగా దృష్టిలో ఉంచుకొని ఈ దెశానికి రెండవ రాజధాని నగరాన్ని కూడా సంసిధ్ధంగా ఉంచుకోవాలి. అవును యుధ్ధం అంటూ వస్తే ప్రస్తుత రాజధాని ఢిల్లీ శత్రువులకు సులభమైన టార్గెట్ అన్నది మర్చిపోరాదు. రెండవరాజధానిగా హైదరాబాదును ఎన్నుకొంటే దానికి పూర్తిస్థాయి రాష్ట్రప్రతిపత్తి ఇవ్వకపోవచ్చు - అది కేంద్రం చేతిలో 100% ఉండవలసిన ప్రాంతం కదా! తెలంగాణాకు అప్పుడు ఏదో ఒక చోట నూతన రాజధానిని కట్టుకోమంటారు. ఈ విషయంలో ఏ రాష్ట్రప్రయోజనం కన్నా కూడా జాతీయప్రయోజనం ఎక్కువ అన్న సిధ్ధాంతాన్ని తురుపుముక్కలాగా ప్రస్తుత కేంద్రప్రభుత్వం వాడుతుంది.

హైదరాబాదులేని తెలంగాణాను ఊహించుకోలేం. అది తెలంగాణాకు గుండెకాయ వగైరా భావోద్వేగాలను పట్టించుకోకపోవచ్చును - కేంద్రం బలంగా ఉంది కాబట్టి. మహా ఐతే కేసీఆర్‍ మరొక సారి నిరాహారదీక్షానాటకం ఆడవచ్చును కాని కేంద్రం అంత దద్దమ్మ కాదు ఆయన బుట్టలో పడటానికి.

ఐనా హైదరాబాదుకు సంబంధించిన వార్త ఎంతవరకూ నిజమో తెలియదు.

భానోదయం చెప్పారు...

దేశ ప్రయోజనాలు దృష్ట్యా హైదరాబాదును రెండో రాజధానిగా చేస‌్తే అందరు స్వాగతిస్తారు.