భానోదయం: అలనాటి రాజులను గుర్తుచేస్తున్న మహారాజు కేసీఆర్.

Saturday, 7 September 2019

అలనాటి రాజులను గుర్తుచేస్తున్న మహారాజు కేసీఆర్.

      రాజుల కాలంలో  తమ గొప్పతనం  గురించి భావి తరాల ప్రజలకు తెలియడం కోసం అప్పట్లో శిలలపై శిల్పాలు చెక్కించుకునేవారు. అలాగే శాసనాలు కూడా శిలలపై చెక్కేవారు వాటీ ద్వారనే కదా మనం ఇప్పుడు ఏ రాజు ఏరాజ్యాన్ని ఎప్పటి వరకు పాలించాడు, ఎలా పరిపాలన సాగించాడు అనే విషయాలు తెలిసాయి. రాజుల కాలంలో ముఖ్యంగా రాజుల గొప్పతనాన్ని ఎప్పటికి చెరిగిపోకుండా చరిత్రలో నిలిచిపోయేవి అంటే కట్టడాలు. ఆ రాజుల భక్తి, అభిరుచి మేరకు గుళ్ళు గోపురాలు నిర్మించేవారు ఆ కాలంలో నిర్మించిన గుళ్ళను దర్శించినప్పుడు ఆ గుడి నిర్మాణ నైపుణ్యాన్ని, గుడి ప్రాకారాలపై చెక్కిన శిల్పాలను చూసి ఆశ్ఛర్యంతో పాటు తన్మయత్వంలో మునిగిపోతాం. ఎంతో కళానైపుణ్యంతో చాలా అందంగా నిర్మించిన ఆ ఆలయాలను చూసి ఆ ఆలయాలను నిర్మింపచేసిన రాజును గురించి గొప్పగా చెప్పుకుంటాం. ఆలయాలను దర్శించిన వారందరూ అప్పటి రాజుల యొక్క కళా అభిరుచిని కొనియాడుతుంటారు. రాజులు పోయిన రాజ్యాలు పోయిన వారు నిర్మించిన కళాత్మకమైన కట్టడాలు మాత్రం ఎప్పటికి చరిత్రలో నిలిచి ఆ రాజుల యొక్క గొప్పతనాన్ని,కళాభిరుచిని, భక్తిని తెలిజెస్తుంటాయి.
     
     రాజుల కాలంలో తమ కీర్తి ఎప్పటికి చెదిరిపోకుండా ఉండాలని రాజులు కొన్ని కట్టడాలను కళాత్మకంగా నిర్మించారు. వాటిని మనం చూసినపుడు వాటిని నిర్మించిన రాజులు గుర్తొస్తుంటారు. ఉదాహరణకు "శ్రీకాళహస్తి దేవస్థానం" దర్శించినప్పుడు ఆ ఆలయ నిర్మాణ శైలి  శిల్పసౌదర్యాన్ని చూసి ముగ్ధులైపోతాం. శ్రీకాళహస్తి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు "శ్రీకృష్ణదేవరాయల" గొప్పతనం గురించి తెలుసుకుంటాం.
అలాగే "తంజావురులోని బృహదీశ్వరాలయాన్ని" నిర్మించింది  "రాజ రాజ చోళుడు" గురించి గొప్పగా చెప్పుకుంటాం. ఆ కాలంలో ఇంత అద్భుతంగా నిర్మించిన ఆలయాలను చూసి గొప్పగా చెప్పుకుంటాం. అలాగే ఆ ఆలయాలను నిర్మించిన రాజులు చేసిన మంచిపనులు, వారి గొప్పతనం తెలుస్తుంది. మరి వారి గురించి మనకు తెలిసింది ఎలాగంటే శిలాశాసనాల వల్లే కదా ఈ శిలా శాసనాలే లేకుంటే ఆ రాజుల గురించి ఆ కట్టడాల గురించి మనకు తెలిసేది కాదు కదా అలాగే అప్పటి రాజుల కళా అభిరుచి, దైవభక్తి ఇప్పటి తరాలకు, ముందుతరాలకు తెలిసుండేది కాదు. కాబట్టి ఒక మంచి పని చేసినప్పుడు శిలాశాసనం చెక్కడం అనేది అత్యంత అవసరం ఎందుకంటే రాజులు పోవచ్చు, రాజ్యాలు పోవచ్చు కాని ఆ రాజుల కీర్తి మాత్రం ఎప్పటికి చరిత్రలో నిలిచిపోతుంది వారు నిర్మించిన కళాత్మకమైన ఆలయాల ద్వారా. కాబట్టి వారు చేసిన మంచిపని గురించి భావి తరాలకు తెలియజేయడం కోసం శిలాశాసనాలు చెక్కించడం, ఆ రాజుల శిల్పాలను చెక్కించడం పెద్ద తప్పు కాదు.

             దేవాలయాలను దైవచింతన, మానసిక ప్రశాంత కోసం దర్శిస్తుంటాం అక్కడి శిల్పసౌందర్యాన్ని చూసి ముగ్ధులైపోతాం. అలాంటి ఆలయాలను నిర్మించి ప్రజలకు దైవభక్తి, మానసిక ప్రశాంతతను కలుగజేస్తున్న ఆ రాజులు గొప్పవారు. వారి కీర్తి చరిత్రలో  సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది. వారికీర్తి  చరిత్రలో ఎప్పటికి  నిలిచిపోతుంది.


నిర్మాణంలో ఉన్న యాదాద్రి ఆలయంం.
  కేసీఆర్ గారే లేకుంటే యాదాద్రి క్షేత్రం ఇంత బ్రహ్మాండంగా నిర్మింపబడేదా?
ఏ పాలకుడు పట్టించుకునేవాడు కాదు. తెలంగాణలో సుప్రసిద్ధమైన క్షేత్రం యాదాద్రి ఒకప్పుడు ఎలా ఉండేది భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారు కాని భక్తులకు సౌకర్యాలు ఉండేవి కావు. పరిశుభ్రత కూడా అంతంత మాత్రంగానే ఉండేది. కేసిఆర్ గారు యాదాద్రి ఆలయాన్ని  చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతంగా పునర్నిర్మిస్తున్నాడు. అలాగే చుట్టు కొండలను అభివృద్ది చేస్తున్నారు.
ఆలయాన్ని ప్రత్యేకంగా రాజులకాలంలో నిర్మించినట్టు రాతి శిలలపై శిల్పాలు చెక్కించి అద్భుతంగా నిర్మిస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి కీర్తి సువర్ణాక్షరాలతో లిఖించాలి.  అతని దైవభక్తి, గొప్పతనం భావితరాలకు తెలియాలి. తెలియపరచాలి.

     తాము అధికారంలో ఉన్నప్పుడు దొరికిందే అధనుగా  ప్రజా ధనాన్ని దోచుకుని వారి పిల్లలకు, మనవళ్ళకు, మునిమనవళ్ళకు ఏ లోటు రాకుండా తరగని ఆస్తులను సంపాందించి పెట్టే నాయకులను ఈ రోజుల్లో చూస్తున్నాం. కాని కేసీఆర్ లాంటి నాయకుడు అలనాటి రాజుల వలె ఆలయాలను నిర్మించి ప్రజలందరికి మేలు చేస్తున్నాడు. అలనాటి గొప్ప మహారాజులను గుర్తుచేస్తున్నాడు.

No comments: