భానోదయం: మన దేశంలో అత్యాచారాలు చేసి హత్యలు చేసేవారిని కాపాడుతున్నది పోలీసులు, న్యాయస్థానాలు, చట్టాలు. అందుకే నేరాలు పెరిగిపోతున్నాయి.

Sunday, 1 December 2019

మన దేశంలో అత్యాచారాలు చేసి హత్యలు చేసేవారిని కాపాడుతున్నది పోలీసులు, న్యాయస్థానాలు, చట్టాలు. అందుకే నేరాలు పెరిగిపోతున్నాయి.

       
               భారతదేశంలో చట్టాలు ఎలా ఉన్నాయంటే బాధితులకు న్యాయం చేయవు. అదే నేరస్తులకు మాత్రం సత్వర న్యాయం చేస్తాయి. ఈ దేశంలో చట్టాలు నేరస్తులకు చుట్టాలు. ఎంతటి ఘోరమైన నేరాలు చేసిన మన న్యాయస్థానాలు నేరస్తులను కాపాడుతూనే ఉంటాయి. ఇలా నేరగాళ్ళను కాపాడుకుంటూ పోతే నేరాలు, ఘోరాలు ఎలా తగ్గుతాయి. ఇలా న్యాయస్థానాలు నేరస్తులను కాపాడుతున్నంత కాలం నేరగాళ్ళు ఇంకా రెచ్చిపోయి అఘాయిత్యాలు రోజురోజుకి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇక మన పోలీసు వ్యవస్థ కూడా నేరగాళ్ళకు కల్పించే భద్రత చూస్తే వాళ్ళేదో పెద్ద విఐపీ ల తరహాలో  బందోబస్తు కల్పిస్తారు. బాధితులకు హెల్ప్ చేయకపోక వారి పట్ల హీనతి హీనంగా వ్యవహరిస్తున్నారు. నేరగాళ్ళకు మాత్రం  రాచ మర్యాదలు చేస్తున్నారు.

   ఆడపిల్లలను క్రూరాతి క్రూరంగా అత్యాచారాలు చేసి చంపేసే మృగాలకు ఈ దేశంలో పోలీసులు భారి బందోబస్తు కల్పిస్తారు. అదే అమాయక ఆడపిల్లలకు కనీసం రక్షణ  మాత్రం కల్పించరు.
నేరాలను ఆపరు కాని నేరస్తులకు కాపాడుతారు.

ఈ దేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలు చేసి హత్య చేయడం అంటే మృగాలకు సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఎన్ని ఘోరాలు చేసిన వీళ్ళను రక్షించడానికి పోలీసులున్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి. అందుకే దర్జాగా ఆడపిల్లలను రేప్ చేసి చంపేస్తున్నారు. సామాన్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్తే దురుసుగా ప్రవర్తిస్తారు. అదే నేరగాళ్ళకు సకల మర్యాదలు చేస్తారు. నేరస్తులని రుజువు అయిన తర్వాత వాళ్ళ మీద ఈగ కూడా వాళనివ్వరు పోలీసులు.
ఇక న్యాయస్థానాలు వాయిదాల మీద వాయిదాలు వెసుకుంటు నేరస్తులను కాపాడుతూ ఉంటారు. మహా అయితే కొన్ని సంవత్సరాల జైల్లో పెట్టి ఎంచక్కా మేపుతారు. నేరస్థులకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఫ్రీగా ఫుడ్డు పెట్టి అంబోతుల్లా మేపుతున్నారు తర్వాత బెయిల్ మీద బయటికి పంపిస్తారు. వారు బయటికి వచ్చి     మళ్ళీ దర్జాగ నేరాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే పోలీసులు, న్యాయవస్థలు నేరస్తులకు చుట్టాలు వీరిపై ఈగ కూడా వాలనీవ్వరు. అందుకే ఈ దేశంలో చట్టాలు నేరస్తులకు చుట్టాలు..

        నేరస్థులు గంటల వ్యవదిలో అత్యాచారాలు చేసి హత్యలు చేస్తున్నారు. మన పోలీసు వ్యవస్థ లు, న్యాయస్థానాలు, చట్టాలు వారిని   ఏళ్ల తరబడి శిక్షించకుండా కాపాడుతున్నాయి. పైగా మూడు పూటలు భోజనం పెట్టించి రాచమర్యాదలు చేస్తున్నారు. ఈ మృగాలు అత్యంత క్రూరంగా నేరాలు చేస్తే వీళ్ళను కాపాడే మన న్యాయవ్యవస్థ ను చూస్తే ఈ దేశంలో ఆడపిల్లలు బ్రతకడం చాలా కష్టం.
       
      ఎందుకు ఈ మృగాలను మన న్యాయస్థానాలు వెంటనే శిక్షించడం లేదు. ఒక రోజులో క్రూరంగా అత్యాచారాలు చేసి హత్యలు చేసే వారికి నేరం రుజువైతే వెంటనే ఎందుకు శిక్షించడం లేదు. 14 రోజులు రిమాండ్ అంటారు. ఆతర్వాత ఓ నాలుగైదు ఏళ్ళు శిక్ష వెస్తారు. ఇంతలో బెయిల్ వస్తుంది మళ్ళీ దర్జాగా బయటికి వచ్చి నేరాలు చేస్తూనే ఉంటారు.
      మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో అత్యాచారాలు చేసి అత్యంత క్రూరంగా హింసించి చంపేసిన వారికి ఎప్పుడైనా తొందరగా కఠినమైన శిక్షలు వేశారా?  గతంలో 2012  డిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతంలో నేరస్థులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదు. దాదాపు 7  సంవత్సరాలైనా నేరస్తులకు ఇప్పటికి  శిక్షించలేదు. పైగా వారిని జైల్లో మేపుతున్నారు. వరంగల్లో జరిగిన సంఘటనలో, హైదరాబాద్ లో చిన్నారిని అత్యాచారం చేసి చంపేసిన సంఘటనలో నిందితులకు శిక్ష పడిందా??  ఇలా చెప్పుకుంటూ  పోతే రోజు ఏదో చోట ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రియాంక రెడ్డి ఉదంతం ఇప్పుడు కూడా ఈ మృగాలకు శిక్ష పడుతుందని నమ్మకం ఉందా??
లేదు ఎందుకంటే వారిని కాపాడడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు.
ఈ మృగాలను కొన్ని నెలలు జైలులో ఉంచి బెయిల్ పై వదిలేస్తారు. ఇలాంటప్పుడు నేరాలు చేయకుండా ఎలా ఉంటారు.

     ఆడపిల్లలను క్రూరాతి క్రూరంగా అత్యాచారాలు చేసి హత్యలు చేసే వారిని అంతే క్రూరంగా నడీ రోడ్డులో  ప్రజలందరి ముందు హింసించి చంపేయాలి. అప్పుడే ఏ మృగాడు ఆడపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడడు.


ఇప్పుడున్న చట్టాలు నేరస్తులకు చుట్టాలుగా ఉన్నాయి.
 ఇప్పుడున్న చట్టాలను మన ఆడపిల్లల రక్షణకోసం మార్చాలి. ఇవి ఎలా ఉండాలంటే ఆడపిల్లలను చూడాలంటేనే భయపడిపోవాలి.
నేరం చేసిన వారికి వెంటనే  అందరి ముందు క్రూరంగా శిక్షించాలి. మన చిట్టీ తల్లుల రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకరాలేమా...
  ప్రభుత్వాలు ఆడపిల్లల రక్షణకోసం కోసం కఠిన చట్టాలను తీసుకురావడం చేతకాక పోతే ఇలాంటి నేరాలు చేసిన వారిని ప్రజలకు అప్పగించండి ఆన్ ది స్పాట్ వారిని ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తారు. అది చూసి ఇంకెవ్వడు కామంతో  ఆడపిల్లల వైపు చూడ్డానికే బయపడిపోతాడు.

ఈ పోలీసులు న్యాయస్థానాలు చట్టాలు ఇలా ఉన్నంతకాలం ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి.

చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుంది అంటే కామాంధులు ఆడపిల్లలను అత్యాచారాలు చేసి హత్యలు చేస్తూనే ఉంటారు....

గంటల వ్యవధిలో మృగాళ్లు క్రూరంగా అత్యాచారాలు చేసి హత్యలు చేస్తున్నారు. మరీ మన చట్టాలు నేరం రుజువైన వెంటనే అంతే ధారుణంగా వారిని ఎందుకు శిక్షించడం లేదు... ఎందుకు చట్టాలు , పోలీసులు ,న్యాయస్థానాలు వీరిని కాపాడుకుంటూ వస్తున్నాయి?????
 నేరస్తులను శిక్షించలేనప్పుడు ఈ వ్యవస్థలు ఉండి ఏం లాభం వీటి వల్ల వారికి ఎవరికి ప్రయోజనం. సామాన్యులకు రక్షణ కల్పించని పోలీసు వ్యవస్థ ఎందుకు? బాధితులకు న్యాయం చేయలేని న్యాయస్థానాలు ఎందుకు? పనికి రాని చట్టాలెందుకు???
ఈ వ్యవస్థలు పని చేసేది సామాన్యుల కోసం కాదు. నేరం చేసే వాళ్ళను కాపాడటం కోసమే ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి..

 ఆడ పిల్లలు, వారి తల్లిదండ్రులకు నేను విన్నవించేది ఏంటంటే మన పిల్లలను కాపాడే బాధ్యత మనదే. పోలీసులు న్యాయస్థానాలు చట్టాలు ఇవేవి ఈ దేశంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించలేవు. అవి నేరస్తుల శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి వాటిపై నమ్మకం పెట్టుకోకండి మన పిల్లలను కాపాడే బాధ్యత మనదే....
   

మేరా భారత్ మహాన్ అని అంటారు.
ఎందులో మహాన్ ఈ దేశం..
ఆడపిల్లలను అత్యాచారాలు చేయడంలో మహాన్
ఆడపిల్లలను క్రూరంగా హింసించి చంపడంలో మహాన్
  క్రూరమైన నేరస్తులను పోలీసులు కాపాడడంలో మహాన్
 పోలీసులు బాధితులను హింసించడం లో మహాన్.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో  ఉన్నాయి.

ఘోరమైన నేరాలు చేయడంలో మేరా భారత్ మహాన్

ఈ దేశంలో పుట్టినందుకు ఒక భారతీయుడిగా సిగ్గు పడుతున్నాను...

 

         

17 comments:

Anonymous said...

నిర్భయ అత్యాచారం చేసిన మృగాలు ఏడేళ్ల తరువాత ఇంకా ప్రభుత్వ ఖర్చుతో ముప్పూటలా మెక్కి బలిసిపోతున్నాయి. ఈ దౌర్భాగ్య దేశం లో న్యాయం జరగదు.

అందుకే ప్రజలే ఈ కామ పిచ్చి కుక్కలను కొట్టి చంపాలి.

Chiru Dreams said...

చంపితే ఏమొస్తుంది? వాల్లకి ఆ బాధ ఒక్క క్షణంలో తీరిపోతుంది. జైల్లో ఉంటేనే వాళ్లకి ప్రతి క్షణం నరకంగా ఉంటుంది. రాజీవ్ ని చంపిన నళిణి.. ఈ జీవితం మాకొద్దు అంటూ కారుణ్య మరణానికి అప్లై చేసుకుంది.

Chiru Dreams said...

పత్రికలు కూడా వాళ్ళు జైల్లో పడుతున్న నరకయాతన ప్రజలకి కళ్ళకి కట్టినట్టు చూపుతుండాలి. అప్పుడే ఇంకొకరు ఇలాంటి అరాచకాలు చెయ్యడానికి భయపడతారు.

భానోదయం said...

జైల్లో నేరస్థులు నరకయాతన అనుభవిస్తున్నారా!
శంషాబాద్ లో దిశను క్రూరంగా హింసించి చంపేసిన నేరస్తులకు జైల్లో మటన్ తో భోజనం వడ్డించారట. ఆహా ఏమి మర్యాదలు దేవుడా! ఒక్క పూట తిండిలేక ఆకలితో అలమటించే వారు ఎందరో ఉన్నారు ఈదేశంలో ఎవడు పట్టించుకోడు. అలాంటిది ఆడపిల్లలను అత్యాచారాలు చేసి హత్యలు చేసేవారికి వింధుబోజనాలు వడ్డిస్తున్నారు. అందుకే ఎవడూ కూడా నేరం చెయడానికి భయపడడం లేదు.

Chiru Dreams said...

మీరు విన్నది ఒక ఫాల్తూ న్యూస్ అనుకుంటా.. జైల్లో ఇలా మటన్ బోజనాలు పెడుతుంటే, అంతా జైలుకే పోతారు. అందరికంటే ముందు, ఆ వార్త పుట్టిచ్చినవాడు.

Chiru Dreams said...

My mistake. I too just saw this news. Sorry

భానోదయం said...

https://www.andhrajyothy.com/artical?SID=970092
ఇది ఆంధ్రజ్యోతి లో వచ్చిన వార్తా ఇది ఫేక్ న్యూసా?

సూర్య said...

వార్తని సరిగా చదవండి. జైలు నియమాల ప్రకారం ఆదివారం మిగతా ఖైదీలకు ఏం వడ్డించారో వీళ్లకి అదే వడ్డించారు.

Chiru Dreams said...

https://www.andhrajyothy.com/artical?SID=970086

Chiru Dreams said...

వాల్లకి ఏం వడ్డించారు అన్నదానికంటే, జైలు జీవితం ఎలా, ఎంత నరకంగా ఉంటుందో బాను గారికి చూపించాలనుకున్నాను. అందుకు తగ్గ ఇంఫర్మేషన్ దొరికే వరకు ఆగి, అదే ఆంధ్రజ్యోతి లింక్ ఇచ్చాను. ఇప్పుడూ అర్ధమైందనుకుంటాను నేనేం చెప్పాలనుకున్నానో.

భానోదయం said...

నేరస్తుడు ఎవడైనా నేరస్తుడే వీళ్ళకు ఇలాంటి భోజనం పెట్టి మేపడం అవసరమా? చెప్పండి..

భానోదయం said...

ఇలాంటి శిక్షలు సరిపోవండి ఈ మృగాలకు.

Anonymous said...

Don't get too much excited, it seems you are sick

భానోదయం said...

ఇది ఉత్సాహం కాదు ఆవేదన‌.

Chiru Dreams said...

మీ బాధని అర్ధం చేసుకోగలను భానుగారు. కానీ వాళ్ళ శిక్ష ఒక్క రోజులో ఐపోగూడదు. టీఆర్పీ కోసం చానల్లు ప్రాకులాడడంలో తప్పులేదు ఎందుకంటే వాళ్ళేం దేశసేవ చెయ్యడానికి ఆ ఫీల్డ్లోకి రాలేదు. డబ్బు సంపాదించడానికే వొచ్చారు. కాకపోతే, వాళ్ళ సమయంలో కొంతభాగం, జైల్లో ఉన్న నేరస్తులు, వాళ్ళు చేసిన తప్పులు, వాల్లు పడే కష్టాలు కూడా ప్రసారం చెయ్యాలి. నేరాలూ.. ఘోరాలూ అంటూ ప్రసారం చేసే వాళ్ళకి, ఇది పెద్ద కష్టం కాబోదు...

Anonymous said...

Early justice means police Encounter? What is that you wanted?

భానోదయం said...

Yes!! we want early Justice. Encounter is correct punishment. Thank you sir cp sajjanar..