ఒకరోజు సాయంత్రం స్కూలు పిల్లల బస్ లో ఎక్కాను. వెళ్ళి వెనుక సీట్లో కూర్చున్న. బస్ లో పిల్లలందరు 5వ తరగతి లోపు వారే ఉన్నారు. స్కూల్లోనే వీళ్ళ అల్లరి భరించలేం బస్ లో ఊరుకుంటారా స్కూల్లో కంటే రెట్టింపుతో అల్లరి చేస్తున్నారు. వీళ్ళను బస్సులో ఎక్కించే వ్యక్తి ఎంత అరుస్తున్నా అల్లరి మాత్రం తగ్గడం లేదు.
పిల్లలంటే అంతేగా మరీ అల్లరే అల్లరి ఒకరిద్దరు ఉంటేనే వాళ్ళ అల్లరి భరించలేం బస్ నిండా ఉంటే తేనే తెట్టును కదిలించినట్టే ఉంటది.
వీళ్ళతో మనకెందుకులే అని నా మానాన నేను మొబైల్ లో వార్తలు చదువుకుంటున్నా. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి అంకుల్ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. వార్తలు చదువుతున్నా అని చెప్పా ఎప్పుడు వార్తలేనా కొంచెం సేపు టిక్ టాక్ పెట్టు అంకుల్ అంటు రిక్వెస్ట్ చేసాడు. టిక్ టాకా ఎంటిదిరా అది అన్నాను. టిక్ టాక్ అంటే తెల్వదా అంకుల్ మస్తు జోకుంటది పెట్టంకుల్ అంటు మళ్ళి రిక్వెస్ట్ చేసేసరికి నాకు కొంచెం దాని గురించి తెలుకోవాలనిపించింది. యూట్యూభ్ లో టిక్ టాక్ అని టైప్ చేసా లేటెస్ట్ టిక్ టాక్ వీడియోస్ అంటు కొన్ని వీడియోస్ వచ్చాయి. ఓపెన్ చేసా ఆ వీడియోకు అందులోని మాటలకు ఏ సంబంధం లేకుండా ఉన్నాయి ఇక పంచులకు కొదవే లేదు పటాస్ పంచులు, పోరగాళ్ళ ఒయలు కలగలిపితే టిక్ టాక్ అని అప్పుడు అర్థమయ్యింది. వాడితో పాటు బస్ లో ఉన్న ఇంకొంత మంది పిల్లలు చుట్టు చేరారు. అంకుల్ టిక్ టాక్ అంటే ఇది కాదంకుల్ అది యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయ్యు అన్నాడు. అది యాప్ కూడా ఉందా అని అడిగాను ఆ.. ఉంది నేను రోజు చూస్తా అన్నాడు. అరే వీడు వేలెడంతా లేడు ఇప్పుడే వీడికి ఈ యాప్ లు ఇవన్ని ఏలా తెలుసబ్బా అనుకుంటు వాడిని అడిగా బాబు ఏం చదువుతున్నావ్ రా అని 3rd క్లాస్ అంకుల్ అని చెప్పాడు. మూడో తరగతి అంటే ఎడెనిమిది సంవత్సరాలు ఈ వయస్సులోనే ఈ పిల్లలకి స్మార్ట్ ఫోన్ దాని లోని యాప్స్ మొత్తం తెలుసు వాళ్ళ తల్లిదండ్రులకంటే ఎక్కవగా మొబైల్ గురించి తెలుసు.
ఇంకా నీకు ఎం తెలుసురా మొబైల్ లో అడిగాను యూట్యూభ్ తెలుసు ఫేస్బుక్ తెలుసు వాట్సాప్ తెలుసు అంటు మొబైల్ లో ఉన్న అరడజను యాప్ ల గురించి గడ గడ చెప్పేసాడు. ఇవన్ని నీకు ఎలా తెల్సురా అని అడిగా మా డాడి ఫోన్ లో నేను రోజు చూస్తాను అని చెప్పాడు. ఓ అలాగా మరీ ఎప్పుడు చదువుకుంటావురా అంటే హోంవర్క్ అయిపోయిన తర్వాత చూస్తాను అన్నాడు. అబ్బా ఈ పిల్లలు ఎంత స్పీడో కదా నా చిన్న తనంలో అయితే హోం వర్క్ అయిపోయిన తర్వాత అందరం కలిసి బయట గ్రౌండ్ కి వెళ్ళి ఆటలాడుకునే వాళ్ళం. ఇప్పటి పిల్లలకి ఆటలాడే సమయం లేదు, ఆటలమీద ఆసక్తి లేదు మొబైల్ ఫొన్ ఉంటె చాలు టిక్ టాక్ అంటారు అది బోర్ కొడితె PUBG గేమ్ అంటారు. ఇక వాడు బయటికి వెళ్ళి ఏం ఆటలాడుతారు.
టిక్ టాక్ లో కేవలం కామెడీ మాత్రమే ఉండదు పంచులే పంచులు అందులో నాన్ వెజ్ పంచులు కూడా ఉంటాయి.
ఈ వయసులోనే వీళ్ళకి నాన్ వెజ్ పంచులకి అలవాటుపడితే తొమ్మిది పది తరగతి వచ్చేలోపు
తల్లిదండ్రుల మాటలు వింటారా అసలు చదువుకుంటారా ప్రేమలు అంటారు తర్వాత తాగుడు సిగరేటు మందు అన్ని అలవాట్లు హైస్కూల్ ఏజ్ లోనె అలవాటుపడి అడ్డదిడ్డంగా తయారువుతారు. తల్లిదండ్రులు మావాడు ఇప్పుడే మొబైల్ మొత్తం తెలుసు అన్నీ యాప్ లు తెలుసు అంటు మురిసిపోతున్నారు. కాని వాళ్ళు ముందు ముందు ఎలా తయారవుతారోనని ఆలోచించడం లేదు. ప్రతీ తల్లిదండ్రులు ఇలా పిల్లలకి మొబైల్ ఫోన్ ఇచ్చి వారికి చెడుమార్గంలోకి దారి చూపిస్తున్నారు. ఈ టిక్ టాక్ లు వీడియో గేమ్ లు అవసరమా చెప్పండి. పిల్లలను ఆరు బయట ఆటలాడేందుకు ప్రోత్సహించండి క్రికెట్ ,వాలిబాల్, బాస్కెట్ బాల్, కబాడ్డీ లాంటి వ్యాయామం కలిగించే ఆటలు ఆడేలా ప్రోత్సహించండి దాని వలన ఆరోగ్యానికి మంచిది. అలాకాకుండా మొబైల్ ఫోన్ ఇచ్చి వీడియో గేమ్ ఆడిపిస్తే వాడు ఆ గేమ్ లో లీనమై బయట కూడా అలాగె ప్రవర్తిస్తాడు. మొత్తంగా సైకోల్లాగా తయారవుతారు పిల్లలు.
దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకండి. ముందు చదువుకోమనండి ఆ తర్వాత ఆటలు ఆడించండి.. మంచి భవిష్యత్ ను అందించండి. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్టు ఇప్పటి నుండె సరైన క్రమశిక్షణతో పెంచితే పెద్దవాళ్ళయ్యాక ప్రయోజకులు అవుతారు.