భానోదయం: ఇంత భారీ ట్విస్టు సినిమాలో కూడా చూడలేదే...!!

30, జులై 2022, శనివారం

ఇంత భారీ ట్విస్టు సినిమాలో కూడా చూడలేదే...!!

 


ఇంత భా...రీ ట్విస్టు సినిమా లో కూడా చూడలేదు స్వామీ.. 


ఇలాంటి ట్విస్టులు మాకెందుకు రాలేదా అని సినిమా రైటర్లు కూడా అవాక్కయ్యేలా ఉంది ఈ ట్విస్టు..విశాఖపట్నం ఆర్.కె బీచ్ కి భర్తతో వెళ్ళిన అమ్మాయి, నెల్లూరు లో ప్రియుడిని పెళ్ళి చేసుకుని, బెంగుళూరులో ప్రత్యక్షం అయ్యి, నిన్న విశాఖపట్నం పోలీసు స్టేషన్ కి చేరింది..


పాపం అన్ని స్కెచ్ లు,ప్లానింగ్ లు వేసి ఆ ఊరు ఈ ఊరు పరిగెత్తి అలిసిపోయినట్లుంది. సొమ్మసిల్లి పడిపోయింది పోలీస్ స్టేషన్ లో.

పాపం....

ఆ ధీరవనితా.. విశాఖపట్నం బీచ్ లో గల్లంతైందని అందరూ అనుకున్నారు. అక్కడ భర్త చెప్పె మాటలు వింటే అలాగే అనిపించింది. ఇక  భార్తే ఆమెని సముద్రంలో తోసేసాడని అందరికి అనుమానం కలిగింది.

 


హెలికాప్టర్, ఓడలతో వెతికితే జాడలేదు. 


ఇక్కడ అందరికి వచ్చే మొదటి డౌటు  భర్తనే సముద్రంలో తోసేసాడని.. ఏ తిమింగలమో వచ్చి మింగేసి ఉండొచ్చు అని..


కానీ ఆమె ఓ పెద్ద తిమింగలం అని ఎవరూ ఊహించలేదే...!


ఇక రెండో డౌటు.. అమ్మాయి ప్రియుడితో లేచిపోయిందని. ఛా..ఛా.. ఛీ..ఛీ.. ఇలాంటి పని మా అమ్మాయి చెయ్యదు.మా అమ్మాయి నిప్పు లాంటింది..

అంటారు.. వారి కుటుంబ సభ్యులు.. జనాలు కూడా పెళ్ళైన అమ్మాయి అలా చెయ్యదు అని అబ్బాయే ఏదో చేసాడు అని డిసైడ్ అయిపోయారు..


కానీ ఆ నిప్పే ఇప్పుడు తుప్పు అయ్యిందే..!


తీరా నిజం తెలిసే సరికి అందరి అనుమానాలు తలకిందులయ్యి రెండో డౌటే నిజం అయ్యింది..


ఇందులో అమ్మాయి భర్త బలి పశువయ్యాడు.

ప్రభుత్వానికి కోటి రూపాయల ఖర్చు అయ్యింది..


ఇప్పుడు నిజం తెలిసాక అమ్మాయిని అందరు తిట్టుకుంటారు.


 ఇంత చేసినా ఆ అమ్మాయిది జాలిగల హృదయం లేకుంటే ఆమె భర్తని అంతం చేసి వెళ్ళిపోయేది. ఏమూలనో ఆమెకి మానవత్వం ఉంది అందుకే భర్తను ఈ తిమింగలం ప్రాణాలతో వదిలేసింది...


పాపం ఆ అమాయక చక్రవర్తి..

చావు తప్పి కన్ను లొట్టబోయింది..


 రెండు మూడు రోజులు అందరు అనుమానించారు.. అవమానించారు..అసలు నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కాదు..!

ఒక్క నిమిషంలో ఎలా భర్త కళ్ళు గప్పి పారిపోయింది ఈమె..???


హార్రర్ సినిమాల్లో కూడా ఇంత ఫాస్ట్ గా మనుషులు మాయమైపోరు..!!


ఆహా ఈమె తెలివికి జోహార్లు..!!


ఆమె గల్లంతయ్యిందని అందరు భావించిన ఆర్.కె బీచ్ లో ఆమెకి, ఆమె ప్రియుడిని సన్మానించాలి. ఆమె చేసిన ఘణకార్యానికి.. 


ఇంకా నయం భర్తను అంతం చేయకుండా వదిలేసింది..

వదిలేసిందో లేక ప్లాన్ వర్కవుట్ కాలేదో.. ఇలా చేసే అమ్మాయిలు, భర్త ఇష్టం లేకుంటే విడాకులిచ్చి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని ఆపే వారు ఎవరు లేరు. మీ జీవితం మీ ఇష్టం.

అంతేకాని ఇలా మోసం చేసి అమాయకులను కష్ట పెట్టడమో లేదా క్రురంగా అంతం చేయడమో చేయకండి...


కామెంట్‌లు లేవు: