Home
26, అక్టోబర్ 2022, బుధవారం
పొట్లం యాప్ ఆన్లైన్ కూరగాయలు
4, అక్టోబర్ 2022, మంగళవారం
ఆదిపురుష్ కూడా డిజాస్టర్? ప్రభాస్ సినిమాలు ఎందుకు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి..
బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది.
ప్రభాస్ ఉంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ ప్రభాస్ వెంట పడ్డారు. ఏడాదికి ఒక సినిమా చొప్పున సినిమాలు తీస్తున్నాడు ప్రభాస్.
బాహుబలి, బాహుబలి 2 ఈ రెండు సినిమాలు చేయడానికి ఐదు సంవత్సరాల పట్టింది. మరి తీసింది ఎవరు రాజమౌళి. అందుకే ఈ సినిమా ఆ రేంజ్ లో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది.
ఇక ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు పెద్దగా హిట్టు అవ్వటం లేదు. 'సాహో' రిచ్ గా ఉంటుంది పిల్ల డైరెక్టర్ తో తీసాడు ఏమయ్యింది ఫ్లాప్ అయ్యింది. తర్వాత "రాధే శ్యామ్" ఇది పెద్ద డిజాస్టర్. ఇప్పుడు "ఆదిపురుష్" ఈసినిమా పేరు వినగానే అనుకున్నా ఇది కూడా పెద్ద డిజాస్టర్ అని. మొన్న టీజర్ చూడగానే ఇది కూడా పెద్ద డిజాస్టర్ అని అర్థం అవుతుంది.
ఆదిపురుష్ కంటే సాహో, రాధే శ్యామ్ సినిమాలు 100 శాతం ఉత్తమం. ఎందుకంటే అందులో ప్రభాస్ నటించాడు. ఇందులో ప్రభాస్ కార్టూన్ క్యారెక్టర్ ఉంది. ఇది చూసి ప్రభాస్ ఫ్యాన్సే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆదిపురుష్ కథ రామాయణం. ఈ సినిమాలో కథ ఉంది తీసే విధానమే బాగాలేదు. ఏదో కార్టూన్ సినిమా తీసినట్టు ఉంది. దీనికంటే కార్టూన్ సినిమానే చాలా బాగుంటుంది. 500 వందల కోట్ల సినిమా అంటున్నారు. 5 కోట్లు కూడా సినిమాకు పెట్టినట్లు లేదు. ఈ ఆదిపురుష్ టీజర్ చూస్తుంటే మొబైల్ ఫోన్ లో ఇంతకంటే బాగా యానిమేషన్ క్రియేట్ చేయోచ్చు అనిపిస్తుంది. ఇందుకు 500 కోట్లు అవసరమా అనిపిస్తుంది. బహుశా ఆ 500 కోట్లు నటీనటులకు, డైరెక్టర్ల రెమ్యునరేషన్ కే సరిపోయినట్టుంది. అందుకే ఇక బడ్జెట్ లేక యానిమేషన్ సినిమా తీసినట్టు ఉంది..
ఎందుకిలా ప్రభాస్ సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటి వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఉన్నాడు.
ఎందుకిలా ??
ప్రభాస్ కు ఏమయ్యింది అనుకుంటాం.
కాని ప్రభాస్ రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా తీసుకుంటూ పోతే తనకు నష్టమే కదా..
బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు 5 సంవత్సరాలు వేరే సినిమాలు ఏవి చేయలేదు. సంపాదన పరంగా ఆయనకి నష్టమే. బాహుబలి రిలీజ్ అయ్యింది 5 సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కింది. తన రేంజ్ పెరిగిపోయింది, రెమ్యునరేషన్ కూడా ఆటోమెటిక్ గా పెరిగిపోతుంది. దీనినే ప్రభాస్ క్యాష్ చేసుకోవడానికి కథ ఎలా ఉన్నా, డైరెక్టర్ ఎవరైనా సినిమాలకు ఓకే చెప్పేస్తున్నాడు. అందుకే ఇలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
కథ లేకుండా కేవలం హీరో వల్ల మాత్రమే సినిమాలు హిట్టవుతాయంటే కుదరదు. సినిమాలో ఎంత పెద్ద పాన్ ఇండియా హిరో ఉన్న ముందు కథ ఉండాలి, తీసే విధానం బాగుండాలి అంతేకాని హీరో ఒక్కడే ఉంటే సరిపోదు.
ఎంతైనా రాజమౌళి రాజమౌళే ఆయన సినిమాలు తీసే విధానం వల్లే సినిమాలు హిట్టు అవుతున్నాయి. అంతేకాని హీరోల వల్ల సినిమాలు హిట్టు అవ్వవు.