భానోదయం: నవంబర్ 2018

Home

30, నవంబర్ 2018, శుక్రవారం

మళ్ళీ ముఖ్యమంత్రిగా కెసిఆర్

         ఎవరు ఊహించని పథకాలు తెరాస ప్రభుత్వం తీసుకొచ్చింది. 60 సంవత్సరాలుగా జరగని అభివృద్ది నాలుగున్నర ఏళ్ళలో జరిగింది.
ఇంకోసారి అధికారంలోకి వస్తే తప్పకుండా బంగారు తెలంగాణ సాద్యం అవుతుంది. తెలంగాణ ప్రజలు కెసిఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్టంలో కూడా లేవు.  నిరుద్యోగులు మాత్రమే కెసిఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు వారికి కూడా వచ్చే ఏడాదిలో ఉద్యోగాలు
వస్తాయని ఆశిస్తున్నాం. అందరికి న్యాయం చేసినోడు చదువుకున్నోళ్ళకు అన్యాయం చేస్తాడా.
కెసిఆర్ మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులు ఒక్క కెసిఆర్ మాత్రమే చేసాడు.
ఈ ఎన్నికల్లో కెసిఆర్ ను గెలిపించేది ఆయన అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు.
24 గంటల కరెంట్
మిషన్ భగీరథ
మిషన్ కాకతీయ
రైతు బందు
ఆసరా పించన్లు
కళ్యాణలక్ష్మీ
కెసిఆర్ కిట్ లాంటి మరెన్నో పథకాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం లాంటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ఇలా రాష్ట్ర సర్వతోమఖాభివృద్దికి పాటు పడుతున్న కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి అంటుంది తెలంగాణ ప్రజానికం.
          మహాకూటమి సీట్ల పంపకాలలోనే వీళ్ళకి క్లారిటీ లేదు వీళ్ళేం పాలిస్తారు రాష్ట్రాన్ని ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే సీఎం సీటు కోసం కొట్లాట తప్పితే అభివృద్ది శూన్యం.
        నూటికి నూరు శాతం మళ్ళీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారు కావాలి. ఈ రాష్ట్రానికి కెసిఆర్ దిక్సూచి. జై కెసిఆర్ జై తెలంగాణ.

27, నవంబర్ 2018, మంగళవారం

తెలంగాణలో బలమైన పార్టీ ఏది??

   



    తెలంగాణ ఎన్నికల్లో తెరాస, మహాకూటమి మద్యే పోటి బిజెపి తన ఉనికిని కాపాడుకోవడానికే పోటీచేస్తుంది. ఇక లెఫ్ట్ పార్టీలను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఆ పార్టీలు పానకంలో పుడకల్లాంటివి.
 ప్రస్తుతం తెలంగాణలో బలమైన పార్టీ ఏదంటే తెరాస అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పార్టీని ఎదుర్కోవాలంటే బలమైన పార్టీ ఉండాలి. జాతీయ స్థాయి పార్టీ సైతం ఇతర పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడినప్పుడే తెరాస పార్టీ బలమైన పార్టీగా అవతరించింది.
సొంతంగా పోటీ చేసి గెలిచే ధమ్ములేక అన్ని పార్టీలు ఏకమయ్యాయి.
 మహాకూటమి ముఖ్య ఉద్ద్యేశం ఒక్కటే కెసీఆర్ ను గద్దె దింపడం అంతే తప్ప ప్రజల సంక్షేమం కోసమైతె కాదు. కెసీఆర్ లాంటి బలమైన నాయకుడు తెలంగాణలోని ఏ పార్టీలో లేడని చెప్పాలి. కాంగ్రేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కెసీఆర్ తో సమానమైన బలమైన నాయకుడైతే కాడు. ఇక ఇంకో వ్యక్తి రేవంత్ రెడ్డి
ఈయన తిట్టడానికే పనికి వస్తాడే తప్ప ఇంకేం లేదు. తిట్టడం వల్లనే గొప్ప నాయకుడు ఎలా అవుతారో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి.
ఇక తెదేపా విషయానికి వస్తే తెలంగాణలో అంతరించి పోయే పార్టిలో ముందు వరుసలో ఉంది. అందుకెనేమో ముందు చూపుతో రెవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు. రేవంత్ రెడ్డికి కెసీఆర్ ని విమర్శించడంపై ఉన్న శ్రద్ద తన నియోజకవర్గ అబివృద్దిపై ఉంటే బావుండేది. కెసీఆర్ ను  విమర్శించేముందు తన మీద ఉన్న ఓటు నోటు కేసు గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒక వ్యక్తిని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయంటే ఆ వ్యక్తి ఎంత బలమైన నాయకుడో అర్థం అవుతుంది.
   

   ప్రజలకు కావలసింది తోపులు, హీరోల్లాంటి నాయకులు కాదు ప్రజల సంక్షేమం కోసం పాటు పడే నాయకుడు కావాలి.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని,సంస్కృతిని కాపాడే పార్టీ తెరాస. తెలంగాణ అభివృద్ది చెందాలంటే అది తెరాసకే సాద్యం.
        

24, నవంబర్ 2018, శనివారం

ఆదర్శ రైతు శాస్త్రవేత్త

 

    ఈ రోజుల్లో పొలం ఉంటే ఏం చేస్తారు రేటు వస్తే అమ్మేసి కార్లు, బంగళాలు కొనేసి లగ్జరీ లెఫ్ అనుభవించాలని చూస్తారు. లేదా ఫ్లాట్లు, వెంచర్లు లాంటివి చేసి అమ్మేసి అప్పుడు కూడా లగ్జరీ లైఫ్ అనుభవించాలని చూస్తారు. ఎటు తిరిగి కార్లలో, పెద్ద పెద్ద బంగాళాలో ఉండాలని కోరుకుంటారు ఇదే మనిషి జీవన విధానం అనుకుంటారు.
         కాని వ్యవసాయం చేయాలని ఎవరు అనుకోరు అదికూడా ప్రకృతి వ్యవసాయం. వ్యవసాయం చేయాలంటే  అసలు వ్యవసాయమే దండగ అనే వారు ఉన్నారు.
వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది అప్పులే మిగులుతున్నాయి. పెట్టుబడులు సైతం రాలేని పరిస్థితి నెలకొంది ఇలాంటప్పుడు ఎవరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో నష్టాలు రావడానికి కారణం నేడు మనం పాటించే పద్దతులు మితిమీరిన ఎరువులు పురుగుమందులు వాడటం. పైగా విత్తనాలను కూడా కొంటున్నారు ఒకప్పుడు ఎవరి విత్తనాలు వారే తయారు చేసుకునే వారు సహజ సిద్దమైన ఎరువులనే వాడేవారు అలా పండించిన ఆహారం తిన్నవారు ఆరోగ్యంగా జీవించేవారు. నేడు రసాయన ఆహారం తిని రోగాల బారిన పడుతున్నారు ఈ రసాయన ఎరువులు వాడి పండించిన ఆహారం తీసుకుంటే ఒక సంవత్సర కాలంలో ఒక బస్తా ఎరువు మనకు తెలియకుండానే తింటున్నాం.
         విత్తన కంపెనీలు ఎరువుల కంపెనీలు రైతులను కీలు బొమ్మల్ల ఆడిస్తున్నాయి. మేం తయారు చేసిన విత్తనాలే వేయాలి మేం తయారు చేసిన ఎరువులు పురుగు మందులు వాడాలి అంటు వ్యవసాయం మొత్తం ఈ కంపెనీల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. రైతులు తమ సొంతంగా విత్తనాలు ఎరువులు తయారుచేయడం మానేసి ఈ కంపెనీలపై ఆధారపడుతున్నారు.
         ఈ విత్తనాలకు ఈ రేటు, ఈ ఎరువులకు ఈ రేటు అంటు కంపెనీ వాడే ధర  నిర్ణయిస్తాడు. కాని రైతులు  పండించిన పంటలకు ధర ఎవరో ధలారి నిర్ణయిస్తాడు.  ఇది రైతుల పరిస్థితి మరి ఇలాంటప్పుడు ఎవరు వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతారు.
          కాని ఒక రైతు ఉన్నాడు అతన్ని రైతు అనే కంటే వ్యవసాయ శాస్త్రవేత్త అనాలి. తనకున్న పొలంలో సహజ సిద్దంగా పంటలను పండించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
    వ్యవసాయంలో కొత్త కొత్త పద్దతులను అవలంబించి అధిక దిగుబడులను సాదిస్తున్నాడు. తను అవలంబించే విధానాలను అందరి రైతులకు ఉపయోగపడేలా తన వ్యవసాయ క్షేత్రం సందర్శించి తెలుసుకునేలా ఏర్పాటు చేసాడు. పంటలతో పాటు చేపల పెంపకం కూడా చేసి రెండు సమన్వయం చేస్తున్నాడు. ఈయన వ్యవసాయ క్షేత్రాన్ని తెలుగు రాష్ట్రలనుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు,రైతులు ,శాస్ర్తవేత్తలు సందర్శిస్తు ఉంటారు. ఆయనే విశ్వనాథ రాజు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఈయన వ్యవసాయ క్షేత్రం.
     పచ్చని పంట పొలాలను సైతం కాంక్రీట్ జంగల్లుగా మారుస్తున్న నేటీ సమాజంలో బీడు భూముల్లో సైతం బంగారు పంటలు పండిచ్చవచ్చు అని నిరూపిస్తున్న విశ్వనాథ రాజు ఎందరికో ఆదర్శం. రైతే రాజు అని ఆయన నిరూపిస్తున్నాడు.

      కార్లు బంగాళాలు కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ అనుకుంటు పీల్చే  గాలిని సైతం  కొనుక్కుంటున్నారు నేటి మనుషులు.
         పచ్చని ప్రకృతిలో ఆహ్లాదకరంగా బ్రతికే వారికి కోట్ల రూపాయలు చిత్తు కాగితాలతో సమానం.
      విశ్వనాథ రాజు లాంటి వ్యవసాయ రైతు శాస్త్రవేత్తలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శం..
          

21, నవంబర్ 2018, బుధవారం

ముద్దుల్లో మునిగి తేలుతున్న టాలీవుడ్

 

       తెలుగు  సినిమా ఇండస్ట్రీ ముద్దుల్లో మునిగి తేలుతుంది సినిమాల్లో నే కాదు ఆడియో ఫంక్షన్లలో కూడా ఈ సీన్లు చూస్తున్నాం.

  తెలుగు సినిమాల్లో ముద్దు అనేది ఇప్పుడు ట్రెండ్.  తెలుగు సినిమా మూడు ముద్దులు ఆరు హగ్గులతో విజయవంతంగా సాగిపోతుంది.బాలీవుడ్ లో మాత్రమే కొందరు హీరోలకు మాత్రమే పరిమితమయ్యే ముద్దు సీన్లు ఇప్పుడు టాలీవుడ్ లో కొత్తగా వస్తున్న హీరోలకి, డైరెక్టర్లని స్టార్లని చేస్తున్నాయి.     
      అబ్బో ఈ ముద్దు సన్నివేశాలు మామూలుగా ఉండటం లేదు మితిమీరి పోతున్నాయి. అసలు  సెన్సార్ బోర్డు పని చేస్తుందా లేదా అన్నట్టు ఉంది. కుటుంబంతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి పోయింది.   దీనిపై ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రేక్షకులు ఏది చూస్తే అదే తీస్తాం! అంటు సమాధానమిస్తున్నారు కొత్తగా వస్తున్న డైరెక్టర్లు. మంచి సినిమాలు చూస్తే నువ్వు చూస్తావ ?? అంటు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
      ముద్దులు, హగ్గులు లేకుండా సినిమాలు తీస్తే ఎవరు చూడటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు ఏది చూస్తే అదే తీస్తాం అనే ధోరణిలో కొత్తగా వస్తున్న దర్శకులు బాహాటంగానే చేబుతున్నారు. కాని మంచి కథ ఉంటే ఇలాంటి అశ్లీల దృశ్యాలు అవసరం లేదని వీరికి తెలియదు. కొత్తగా వస్తున్న దర్శకులు  మూడు ముద్దులు ఆరు హగ్గులు ఉంటే చాలు సినిమా హిట్టు అయిపోతుందని భావిస్తున్నారు.

     సినిమా అనేది ఒక బలమైన మీడియా సినిమాల ప్రభావం జనాలపై ఎంతో ఉంటుంది.
 సినిమా అంటే వ్యాపారం డబ్బుకోసమే సినిమాలు తీస్తాం సమాజం గురుంచి మాకెందుకు అని అంటున్నారు నేటి దర్శకులు.
   
   ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఏమో.??🤔🤔
  

17, నవంబర్ 2018, శనివారం

మార్పు ఆరంభం

                       

                      పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలిగే ముప్పు అంత ఇంత కాదు అన్ని విదాలుగా కాలుష్యం కలిగించే ప్లాస్టక్ ను నిషేదించాలని నేను ఎన్నో రోజులుగా ఆకాంక్షిస్తున్నాను.
 ఇప్పుడిప్పుడే పాలకులు దీనిపై దృష్టి సారించినట్టున్నారు
ఈ రోజు మా మున్సిపాలిటీలో నోటీసు లు అందజేసారు.






          ప్లాస్టిక్ నిషేదాన్ని కఠినంగా  అమలు చేస్తారా లేదా కేవలం కాగితాలకే పరిమితం అవుతుందో చూడాలి.
        ఏది ఏమైనా  పర్యావరణానికి ప్లాస్టిక్ ముప్పు నుండి కాపాడే మార్పు ఆరంభం అయ్యిందని సంతోషిస్తున్నాను.

     ఇలా ప్రతీచోట ప్లాస్టిక్ నిషేదాన్ని అమలు పరచాలని కోరుకుంటున్నాను.
     కొంచెం బద్దకాన్ని వదిలి ప్రతీ ఒక్కరు ఇంటినుండి బజారుకి  కూరగాయలకి, కిరాణ కొట్టుకి వెళ్ళేటప్పుడు చేతిసంచులు తీసుకెళ్తే ఈ సమస్య పరిష్కారం అవ్వడానికి ఎన్నో రోజులు పట్టదు.

   "ప్లాస్టిక్ వాడాకాన్ని నిషేదిద్దాం                                                                    పర్యావరణాన్ని కాపాడుదాం"

15, నవంబర్ 2018, గురువారం

రైతులకు వరం వేస్ట్ డీకంపోసర్

     
 పంటలకు కృత్రిమ ఎరువులు,పురుగు మందులు వాడటం వలన పంటల దిగుబడి ఎలా ఉన్నా నష్టాలు మాత్రం అనేకం భూసారం కోల్పోవడం, రైతులు అనారోగ్యాల పాలవడం, ఖర్చులు పెరగడం, పర్యావరణం దెబ్బతినడం జ‌రుగుతుంది.
        మరియు రసాయనాల అవశేషాలు కలిగిన ఆహారం తినడం వలన ప్రజలు కూడా అనారోగ్యం భారిన పడుతున్నారు

           మరి దీనికి పరిష్కారం సేంద్రీయ వ్యవసాయ చేయడం. కాని సేంద్రీయ వ్యవసాయం అందరికి సాద్యపడక పోవచ్చు. అలాంటి వారికోసం మరియు అందరు రైతులు
వాడుకునేలా తయారు చేసిందే ఈ వేస్ట్ డీకంపోసర్ దీని ధర కేవలం ‌20రూపాయలు మాత్రమే. వేస్ట్ డీకంపోసర్  పంటలకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. చీడపీడలనుండి పంటలను కాపాడుతుంది మరియు పంటలకు ఎరువుగాను ఉపయోగపడుతుంది. భూమిలో సారాన్ని పెంచి పంటలు అధిక దిగుబడులు వచ్చేలా తోడ్పడుతుంది. చీడపీడలు సోకినపుడు ఈ ద్రావణాన్ని పంటలపై పిచికారి చేయవచ్చు.

         ఈ వేస్ట్ డీకంపోసర్ ను తయారు చేసింది కేంద్రప్రభుత్వ సంస్థ "నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్" ఇది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉంది.

 వేస్ట్ డీకంపోసర్ ను వాడే విదానం : 
   
 20 రూపాయల వేస్ట్ డీకంపోసర్ డబ్బాలోని పదార్థాన్ని ఒక ప్లాస్టక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకుని అందులో వేసి అందులో 2కీలోల నల్ల బెల్లాన్ని వేసి రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం కర్రతో తిప్పాలి అలా వారం రోజుల పాటు తిప్పుతూ ఉంటె నుురగ వస్తుంది మరియు పులిసిన వాసన వస్తుంది అలా వచ్చినపుడు పంటలకు వాడుకోవడానికి సిద్దంగా ఉందని గమనించాలి. అలా తయారయిన ద్రావణాన్ని నీటితోపాటు పొలం అంత పారేలా చేయాలి దీనివలన భూసారం పెరుగుతుంది. పంటలకు  చీడపీడలు ఆశించినప్పుడు నేరుగా పంటలపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం రెండు విదాలుగా ఉపయోగ పడుతుంది. ఒకసారి తయారు చేసుకున్న ద్రావణాన్ని కొద్ధిగా ఉంచుకుని మళ్ళీ అందులో బెల్లం నీరు కలిపి ఎన్నీ సార్లైనా వాడుకోవచ్చు. దీనిలో సూక్ష్మజీవులు పెరుగుతునే ఉంటాయి. అలా తయారు చేసుకున్న ద్రావణాన్ని కొద్దిగా ఉంచుకొని మళ్ళీ నీళ్ళు బెల్లం కలిపితే మళ్ళీ తయారవుతుంది. ఈ వేస్ట్ డీకంపోసర్ ఒకసారి కొంటే చాలు ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు. ఈ వేస్ట్ డీకంపోసర్ ని వాడి చాలా మంది రైతులు అధిక దిగుబడులు సాధించారు. రసాయనిక ఎరువులు ,మందులు వాడకపోవడం ఖర్చులు తగ్గడం అధిక దిగుబడులు రావడం వలన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు... ఈ వేస్ట్ డీకంపోసర్ ని అన్ని పంటలకు వాడవచ్చును .