భానోదయం: ఆదర్శ రైతు శాస్త్రవేత్త

Home

24, నవంబర్ 2018, శనివారం

ఆదర్శ రైతు శాస్త్రవేత్త

 

    ఈ రోజుల్లో పొలం ఉంటే ఏం చేస్తారు రేటు వస్తే అమ్మేసి కార్లు, బంగళాలు కొనేసి లగ్జరీ లెఫ్ అనుభవించాలని చూస్తారు. లేదా ఫ్లాట్లు, వెంచర్లు లాంటివి చేసి అమ్మేసి అప్పుడు కూడా లగ్జరీ లైఫ్ అనుభవించాలని చూస్తారు. ఎటు తిరిగి కార్లలో, పెద్ద పెద్ద బంగాళాలో ఉండాలని కోరుకుంటారు ఇదే మనిషి జీవన విధానం అనుకుంటారు.
         కాని వ్యవసాయం చేయాలని ఎవరు అనుకోరు అదికూడా ప్రకృతి వ్యవసాయం. వ్యవసాయం చేయాలంటే  అసలు వ్యవసాయమే దండగ అనే వారు ఉన్నారు.
వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది అప్పులే మిగులుతున్నాయి. పెట్టుబడులు సైతం రాలేని పరిస్థితి నెలకొంది ఇలాంటప్పుడు ఎవరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో నష్టాలు రావడానికి కారణం నేడు మనం పాటించే పద్దతులు మితిమీరిన ఎరువులు పురుగుమందులు వాడటం. పైగా విత్తనాలను కూడా కొంటున్నారు ఒకప్పుడు ఎవరి విత్తనాలు వారే తయారు చేసుకునే వారు సహజ సిద్దమైన ఎరువులనే వాడేవారు అలా పండించిన ఆహారం తిన్నవారు ఆరోగ్యంగా జీవించేవారు. నేడు రసాయన ఆహారం తిని రోగాల బారిన పడుతున్నారు ఈ రసాయన ఎరువులు వాడి పండించిన ఆహారం తీసుకుంటే ఒక సంవత్సర కాలంలో ఒక బస్తా ఎరువు మనకు తెలియకుండానే తింటున్నాం.
         విత్తన కంపెనీలు ఎరువుల కంపెనీలు రైతులను కీలు బొమ్మల్ల ఆడిస్తున్నాయి. మేం తయారు చేసిన విత్తనాలే వేయాలి మేం తయారు చేసిన ఎరువులు పురుగు మందులు వాడాలి అంటు వ్యవసాయం మొత్తం ఈ కంపెనీల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. రైతులు తమ సొంతంగా విత్తనాలు ఎరువులు తయారుచేయడం మానేసి ఈ కంపెనీలపై ఆధారపడుతున్నారు.
         ఈ విత్తనాలకు ఈ రేటు, ఈ ఎరువులకు ఈ రేటు అంటు కంపెనీ వాడే ధర  నిర్ణయిస్తాడు. కాని రైతులు  పండించిన పంటలకు ధర ఎవరో ధలారి నిర్ణయిస్తాడు.  ఇది రైతుల పరిస్థితి మరి ఇలాంటప్పుడు ఎవరు వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతారు.
          కాని ఒక రైతు ఉన్నాడు అతన్ని రైతు అనే కంటే వ్యవసాయ శాస్త్రవేత్త అనాలి. తనకున్న పొలంలో సహజ సిద్దంగా పంటలను పండించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
    వ్యవసాయంలో కొత్త కొత్త పద్దతులను అవలంబించి అధిక దిగుబడులను సాదిస్తున్నాడు. తను అవలంబించే విధానాలను అందరి రైతులకు ఉపయోగపడేలా తన వ్యవసాయ క్షేత్రం సందర్శించి తెలుసుకునేలా ఏర్పాటు చేసాడు. పంటలతో పాటు చేపల పెంపకం కూడా చేసి రెండు సమన్వయం చేస్తున్నాడు. ఈయన వ్యవసాయ క్షేత్రాన్ని తెలుగు రాష్ట్రలనుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు,రైతులు ,శాస్ర్తవేత్తలు సందర్శిస్తు ఉంటారు. ఆయనే విశ్వనాథ రాజు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఈయన వ్యవసాయ క్షేత్రం.
     పచ్చని పంట పొలాలను సైతం కాంక్రీట్ జంగల్లుగా మారుస్తున్న నేటీ సమాజంలో బీడు భూముల్లో సైతం బంగారు పంటలు పండిచ్చవచ్చు అని నిరూపిస్తున్న విశ్వనాథ రాజు ఎందరికో ఆదర్శం. రైతే రాజు అని ఆయన నిరూపిస్తున్నాడు.

      కార్లు బంగాళాలు కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ అనుకుంటు పీల్చే  గాలిని సైతం  కొనుక్కుంటున్నారు నేటి మనుషులు.
         పచ్చని ప్రకృతిలో ఆహ్లాదకరంగా బ్రతికే వారికి కోట్ల రూపాయలు చిత్తు కాగితాలతో సమానం.
      విశ్వనాథ రాజు లాంటి వ్యవసాయ రైతు శాస్త్రవేత్తలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శం..
          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి