బస్ వచ్చి చాలా సేపు అయ్యింది తొందరగా రా అంటు...నా స్నేహితుడు బస్ లో నుండి ఫోన్ చేసాడు. పరుగున వెళ్ళి గబ గబ బస్ ఎక్కాను. అక్కడ రోజు ఇద్దరే స్నేహితులు ఉంటారు కాని ఈరోజు ఎవరో కొత్త వ్యక్తి ఉన్నాడు.ఎవరా అని దగ్గరకెళ్ళి చూస్తే నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు చూసిన నా క్లాస్ మేట్ ఎక్కడనుండి ఊడిపడ్డడో ఏమో కాని ముగ్గురు దేని గురించో తీవ్రంగా చర్చిస్తున్నారు. ఆ ఇద్దరికి బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు కనిపించాడు అతడు.
మధ్యలో నేను కలుగజేసుకున్నాను ఏంటి విషయం అని అడిగాను.
రేపు సిటీలో మీటింగ్ ఉంది అక్కడికి రండి మొత్తం ప్లాన్ అర్థమవుతుంది. మీరు ప్లాన్ విన్న తర్వాత వెంటనే ఇందులో జాయిన్ అవుతారు అంటూ చెప్పాడు.
నేను మీటింగ్ విన్న వెంటనే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసేసాను అంటూ చెప్పాడు.
ఎన్ని రోజులు ఇలా ఉంటారు మీరు సంపాదించేది మీకు సరిపోతుందా ఒక్క సారి ఇందులో జాయిన్ అవ్వండి లక్షలేంటి కోట్లు సంపాదిస్తారు. అంటు గాలి బాగా కొడుతున్నాడు.
మా మిత్రుడు ఇతని గాలి కొట్టుడుకు బాగా ఉబ్బిపోతున్నాడు బెలూన్ ఉబ్బినట్టు. కాని మరీ ఎక్కవ గాలి అయితే ఏంటి పరిస్తితి అంటూ నా సందేహం.
ఏంటి ఈ స్కీమ్ అని అడిగాను.
ఎం లేదు సింపుల్ నువ్వు ఒక లక్ష రూపాయలు ఈ సంస్థలో కట్టాలి కట్టిన నెల నుండే నీకు 6000 రూపాయలు 25 నెలల పాటు వస్తాయి. మరియు 25 నెలల తర్వాత మీ లక్ష మీకు ఇస్తారు. ఇంకా నీ తరుపున ఇందులో ఎవరినైన ఇందులో చేర్పిస్తే అందుకు కమీషన్ 3%అంటే మూడు వేలు వస్తాయి నువ్వు ఎంత మందిని చేర్పిస్తే అంత సంపాదించుకోవచ్చు అంటు గుక్క తిప్పుకోకుండా ఒకటే గాలి మాటలు చెబుతూనే ఉన్నాడు.
మావాడు ఇప్పటికే బాగా బెలూన్ లా ఉబ్బిపోయాడు.
ఇంత డబ్బు వస్తుదంటే గాల్లో తేలిపోయేలా ఉన్నాడు. వీడు ఎక్కడ ఎగిరిపోతాడో అని వాడి మాటలకు అడ్డుపడి ఓకె బ్రదర్ ఇందులో సంపాదిస్తున్న వారి వివరాలు చెప్తావా??అని అడిగాను.
తన ఫోన్ తీసి ఒక ఇద్దరు ముగ్గురు తమ కార్ల ముందు దిగిన ఫోటోలు చూపించాడు.
వీళ్ళు తెలుసా అంటు అడిగాడు తెలియదు అన్నాం ..
ఒకప్పుడు ఏమీ లేనోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. వీళ్ళు చాలా మందిని చేర్పించారు. బాగా సంపాదిస్తున్నారు అంటూ ఫోటోలు చూపించాడు.
ఇంకా నమ్మకపోతే ఈ వీడియో చూడు అంటూ కొంతమంది ఓర్వలేక ఈ సంస్థ మోసాలు చేస్తుందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అందుకే సంస్థ మనేజర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సంస్థ వివరాలు చెప్పాడు. అంటూ యూట్యూబ్ లో వీడియోలు చూపించాడు.
ఓకె ... ప్రెస్ మీట్ పెట్టాడు నమ్మోచ్చు మరీ ఈసంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఉందా ? అని అడిగాను.
ఏ.. అవన్ని మనకెందుకు అన్న మనకు నెల నెల డబ్బులు వస్తున్నాయా లేదా? అంటు అన్నాడు .
ఇంకో మిత్రుడు కలుగచేసుకుని ఒకవేళ మోసం చేస్తే ఏంటి పరిస్థితి అంటు గాలి తీసేసాడు. బెలూన్ లా ఉబ్బిన మావాడు ఈ మాటతో తుస్సుమన్నాడు.
ఎలాగైన ముగ్గురి చేత డబ్బులు కట్టించి కమీషన్ పొందాలని చూస్తున్న అతడు వెనక్కి తగ్గుతాడా? ఒక ఫోటో చూపించాడు
ఈయన ఎవరో తెలుసా?? అని అడిగాడు.
హా! తెలుసు ఈయన చాలా నిజాయితి పరుడు అవినీతి పరుల గుండెల్లో రైల్లు పరిగెత్తించిన భారతదేశంలోనే ఒకరైన ఐఏస్ అధికారి అంటు ఇద్దరం సమాధానం చెప్పాం.
తెలుసు కదా ఈయన గురించి మరీ ఈ సంస్థ మోసం చేేసేదే అయితే అంత నిజాయితి పరుడైన ఐఏస్ అధికారి ఈ సంస్థ వారు చేపట్టే కార్యక్రమాలకు వస్తాడా ?? చెప్పండి అంటూ ప్రశ్న సందించాడు.
అరే అవునురా ఇందులో మోసంలేదు మనం ఇందులో లక్ష కడుదాం మన తరుపునుండి ఎవరినైనా జాయిన్ చేద్దాం డబ్బులు సంపాదించుకుందాం ఎన్ని రోజులు ఇలా చాలి చాలని జీతాలతో పని చేస్తాం నేను లక్ష కట్టేస్తా అని మా మిత్రుడు జాయిన్ అవ్వడానికి సిద్దం అయ్యాడు.
నేను ఇంకో మిత్రుడు మాత్రం సందేహిస్తూనే ఉన్నాం.
సరే ఓకవేళ మోసం చేస్తే ఏంటి పరిస్థితి?? అంటూ అడిగాం.
అరే ఏందన్నా ఇన్ని డౌట్లు నమ్మాలి అన్నా అందుకే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు ఇందులో జాయిన్ అయ్యి ప్రతీ నెల లక్షలు సంపాందించేే వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఏమి లేనటువంటి వారు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. సొంతంగా బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు నమ్మాలి అన్న నమ్మకమే జీవితం. అంటూ ధీమా వ్యక్తం చేసాడు.
నువ్వు ఎన్నైనా చెప్పు బ్రదర్ ఒక వేళ రాత్రికి రాత్రే బోర్డ్ తిప్పేస్తే ఏంటి పరిస్థితి. ఇలా బోర్డ్ తిప్పేసిన సంస్థలు చాలా చూసాం. అక్కడ డబ్బులు పెట్టి మోసపోయిన చాలా మందిని చూసాం. మేము నీ మాటలు నమ్మలేం అన్నాను.
అన్నా నమ్మితే నమ్ము లేకపోతే లేదు ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళను మాత్రం ఆపకు అంటూ కొంచెం చిరాకుగా చెప్పాడు.
నా మిత్రుడితో అరే నువ్వు ఎవరి మాట వినకు నువ్వు నా కింద జాయిన్ అవ్వు...
పోతే లక్ష పోతాయి వస్తే కోట్లు వస్తాయి ఒక్కసారి లక్ష పెట్టు నువ్వే ఇందులో ఇంకా పది మందిని చేర్పిస్తావు. ఇంకో విషయం ఎంత ఎక్కువ మందిని చేర్పిస్తే అంత కమీషన్ తో పాటు గోవా, సింగపూర్, దుబాయ్ లాంటి ప్రదేశాలకు టూర్లు కూడా పంపిస్తారు. మన పక్క ఊర్లో సగం మందికి పైగా జాయిన్ అయ్యి కార్లలో తిరుగుతున్నారు.అసలు నువ్వు ఊహించావా కార్లలో తిరుగుతావని మరియు ఫారిన్ టూర్లు వెళ్తానని ఎప్పుడైన ఊహించావా?!!
తొందరగా కట్టు ఇప్పుడే ఈ నెలలోనె లక్ష రూపాయలు కట్టి జాయిన్ అవ్వు వచ్చే నెల అంటే డిసెంబర్ లోపల జాయిన్ అవ్వు ఎందుకంటే తర్వాత జాయిన్ అయితే డబ్బులు చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అందుకే కమీషన్ తక్కువగా ఇస్తారు. నువ్వు రేపు లక్ష కట్టి జాయిన్ అవ్వు త్వరగా
అంటూ మా వాడికి బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు.
పోతే లక్ష పోతాయా లక్ష అంటే చిన్న మొత్తమా ??
నీతో పాటు ప్రయాణించే నీ మిత్రుడికి పది రూపాయలు పెట్టి బస్ టికెట్ కొనడానికి వెనక ముందు ఆలోచిస్తావు. టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇరవై రూపాయలు కట్టడానికి జేబులు తడుముకుంటావు. నీవు లక్ష పోతే పోతాయి అంటున్నావా?? ఆహా ! డబ్బు సంపాదించడానికి ఎన్నైనా చెబుతారు ఎంతకైనా దిగజారుతారు. అంటు అనుకున్నాను.
అది కూడా డిసెంబర్ లోపల కట్టాలి అంటూ తొందరపెడుతున్నాడు.
అబ్బా ఇంత తొందర ఏంటి డిసెంబర్ లోపలె కట్టాలా ??? డిసెంబర్ లోపల వీళ్ళ టార్గెట్ మనీ రీచ్ అయితే బోర్డు తిప్పేద్దామని కాబోలు.. అని నా సందేహం..
ఇప్పుడు మా మిత్రుడికి ఎంత చెప్పిన వినేలా లేడు.
మా వాడి బ్రెయిన్ లో కార్లు ,టూర్లు ,డాలర్లు షికారు చేస్తున్నాయి.
కార్లల్లో తిరగాలని ఫారిన్ టూర్లు వెళ్ళాలని అందరికీ ఉంటుంది కానీ వాడు మోసం చేస్తే కార్లు టూర్లు ఏమో కాని వీడిని నమ్మీ డబ్బు పెట్టిన వారు, నీ మీద నమ్మకం తోనే ఇందులో డబ్బులు పెట్టాం. ఆ డబ్బులు నువ్వే ఇవ్వు అంటే కనీసం సొంత ఊళ్ళోనైనా తిరగగలడా??
నెల రోజుల తరువాత డిసెంబర్ నెల...
ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నాం.
వార్తల హెడ్ లైన్స్ ...
అంబాని వారింట పెళ్ళి సందడి ప్రపంచంలోనే ఖరీదైన పెళ్ళంటా..
తెలంగాణలో ఓటమికి కారణాలు అన్వేషిస్తున్న కూటమి..
దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్..
అధిక వడ్డీలు ఇస్తామంటూ బోర్డ్ తిప్పేసిన సంస్థ..
ఆస్ట్రేలియాతో భారత్ ఓటమి..
సిందు ఖాతాలో మరో విజయం..
అంబానీల సంబురాల కంటే
కూటమి ఓటమి కంటే
తుఫాన్ భీభత్సం కంటే
భారత్ ఓటమి కంటే
సిందు విజయం కంటే
ఇన్ని వార్తల్లో హైలెట్ ఏంటంటే కోట్లల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ..!!!
ఆ సంస్థ మరేదో కాదు ఒ రోజు మాకు బస్సులో బ్రెయిన్ వాష్ చేసిన వ్యక్తి తాలుకు సంస్థే.
ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఫోన్ స్విఛాఫ్ చేయబడి ఉంది. అంటూ సమాధానం వచ్చింది.
ఎప్పటికైనా బోర్డు తిప్పేస్తారని ఊహించాం కానీ ఇంత తొందర గా తిప్పేస్తారని ఊహించలేం.
ఒక ప్రభుత్వ పాఠశాల టీచర్.
14000 మందిని నిలువునా ముంచేసాడు.
158 కోట్లు కాజేసాడు.
అత్యాశకు పోయి కష్టపడి సంపాదించున్న డబ్బులు. ఏ కష్టం చేయకుండా సంపాదించుకోవచ్చు అని చెపితే గొర్రెల్లా వెళ్ళి ఈ మాయగాడికి సమర్పించుకున్నారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం???
నువ్వు చేరు నీ కింద ఇంకో ముగ్గురుని చేర్పించు ఇక అంతే నువ్వు ఏ పని చేయక్కర్లేదు కూర్చున్న చోటకే డబ్బులు వస్తాయి అని చెప్పే మాయగాళ్ళ మాటలు నమ్మి చాలా మంది మోసపోతున్నారు.
ఇంకా కూడా మోసపోతూనే ఉంటారు.
ఈజీగా డబ్బు వస్తుందటే అది 100% మోసమే అని గుర్తించాలి..
వీళ్ళు అందరిని నమ్మించడానికి చాలా కార్యక్రమాలు చేస్తారు మంచి పేరున్న వ్యక్తులను పిలిపించి సేవా కార్యక్రమాలను చేపడుతారు.
మీటింగ్ లు పెట్టి వింధు భోజనాలు పెట్టిస్తారు. వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి పెట్టుబడి పెట్టెలా "కలుస్తే గెలుస్తం" అంటూ ఉపన్యాసాలతో ఊదరగొడతారు.
అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు పెట్టేస్తున్నారు సామాన్య జనం.
అప్పులు చేసి మరీ ఇందులో పెడుతున్నారు.
వాళ్ళు అనుకున్న అమౌంట్ వచ్చినాక బిచానా ఎత్తేస్తారు. సంస్థ నిర్వాహకులు.
ఎన్నీ సంస్థలు బోర్డులు తిప్పేసిన ఇంకో కొత్త సంస్థలు వస్తూనే ఉంటాయి. గొర్రెల్లా జనాలు అందులో డబ్బులు పెట్టి మోసపోతూనే ఉంటారు.
నిర్వాహకులు మాత్రం కోట్లు వెనకేసుకుంటున్నారు.
ఒక్క రూపాయి లేకుండా కోట్లు సంపాదించడం ఎలా??
అంటూ, ఇలా ప్రజలను మోసం చేసి సంపాదిస్తున్నారు.