ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లగాలి కోసం కూలరో, ఏ.సి నో వాడుతుంటారు. ఈ రెండింటిలలో ఏది ఉత్తమం.
ముందుగా కూలర్ గురించి చూద్దాం:
సామాన్యంగా కూలర్లను ఎండాకాలంలో మాత్రమే వాడుతుంటారు. మిగితా రోజులు పక్కన పెట్టేస్తుంటారు. ఏ.సీ లను గోడకు బిగిస్తాం కాబట్టీ ఎప్పుడైనాా వాడుకుంటాం. ఏ.సి లు, కూలర్ల వల్ల కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, అసౌకర్యాలు కూడా ఉన్నాయి.
అవేంటో చూద్దాం
ప్లస్ పాయింట్లు:
➡️కూలర్ విషయానికి వస్తే దీని ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది.
➡️ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ జరుపుకోవచ్చు.
➡️ మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ.
➡️తక్కువ కరెంట్ బిల్ వస్తుంది
మైనస్ పాయింట్లు:
➡️కూలర్ నుండి శబ్ధం ఎక్కువగా వస్తుంది
➡️కూలర్ల వల్ల కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది
➡️నీరు అధికంగా అవసరం అవుతుంది.
➡️కూలర్ నీరు శుభ్రం చేయకపోవడం వలన శ్వాస సంబంద సమస్యలు వస్తాయి.
➡️గదిలో గాలిని కూలర్లు ఫిల్టర్ చేయలేవు కనుక కార్బన్ డై ఆక్సైడ్ గదిలో నే ఉండిపోతుంది.
➡️ కూలర్ లోపల తేమ వలన ఇనుప పట్టీలు తుప్పు పడుతుంటాయి.
➡️కూలర్ ను తరుచుగా శుభ్రం చేస్తుండాలి లేదంటే దుర్వాసన వస్తుంది.
తప్పని పరిస్థితుల్లో కూలర్ వాడవలసి వస్తే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
కూలర్ ని గదిలో కాకుండా గది బయట ఉంచితే బయట ఉన్నా మంచి గాలి కూలర్ ద్వారా గదిలోకి వస్తుంది.
రెండు మూడు రోజులకు ఒకసారి నీటిని పూర్తిగా తీసేసి శుభ్రం చేస్తుండాలి.
శుభ్రం చేసేటప్పుడు కూలర్ కరెంట్ ప్లగ్ను సాకెట్ నుండి తీసివేసిన తర్వాతే శుభ్రం చేయాలి.
కూలర్ ఫ్యాన్ ను బిగించే పట్టీలు తుప్పు పట్టకుండా పెయింట్ వేయాలి.
ఇలా చేయడం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఇప్పుడు ఏ.సి యొక్క సౌకర్యాలు, అసౌకర్యాల గురించి చూద్దాం.
ఏ.సి ని గదిలో గోడకు శాశ్వతంగా బిగిస్తాం కాబట్టి ఏ కాలంలో నైనా వాడుకుంటాం. దీని ఖరీదు ఎక్కువే అయిన ఆరోగ్యపరంగా కూలర్ కంటే బెటర్.
ఏ.సి యొక్క ప్లస్ పాయింట్లు:
➡️ఏ. సి వల్ల గదిలో మనకు కావలసినంత చల్లదనంగా ఉంచుకోవచ్చు.
➡️గోడకు పైన ఉంటుంది కాబట్టి కరెంట్ షాక్ వంటి ప్రమాదాలు ఉండవు.
➡️గదిలోని కర్బెన్ డై ఆక్సెడ్ ను బయటికి పంపి స్వచ్ఛమైన గాలిని గదిలోకి పంపుంతుంది.
➡️నీటి అవసరం ఉండదు
మైనస్ పాయింట్లు:
➡️ ఏ.సి ఖరీదు ఎక్కువ
➡️ఒక చోట నుండి వేరే చోటుకి జరపలేం
➡️కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది
ధర పరంగా చూసుకుంటే కూలర్ బెటర్.
భద్రత, ఆరోగ్య పరంగా చూసుకుంటే ఏ.సీ బెటర్.
ఏ.సి ,కూలర్ల కంటే ఇంటి ముందు కొన్ని చెట్లు పెంచుకుంటే ఉత్తమం.
>>ఏ.సి ,కూలర్ల కంటే ఇంటి ముందు కొన్ని చెట్లు పెంచుకుంటే ఉత్తమం.>>>
రిప్లయితొలగించండికేవలం 5 మామిడిచెట్లు పెంచాం. 5 డిగ్రీలు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.మామిడికాయలు బోనస్. ఏసీ అవసరం ఇంతవరకూ రాలేదు.చెత్త మాత్రం రోజూ వస్తుంది. మైనస్ లు కూడా చెప్పాలి కదా ?
చెత్త వేస్ట్ కాదండీ దానితో కంపోస్ట్ తయారు చేసుకుంటే మరిన్ని మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు.
తొలగించండిNice one
రిప్లయితొలగించండిThank you.
తొలగించండి"గదిలోని కర్బెన్ డై ఆక్సెడ్ ను బయటికి పంపి స్వచ్ఛమైన గాలిని గదిలోకి పంపుంతుంది"
రిప్లయితొలగించండికాదేమో...
ఏ.సి లోని ఎవపరేటర్ యూనిట్ వేడిగాలిని తీసుకొని కండెన్సర్ యూనిట్ ద్వారా బయటకు పంపిస్తుంది.
తొలగించండి"5 మామిడిచెట్లు పెంచాం. 5 డిగ్రీలు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది."
రిప్లయితొలగించండిSo, 1degree/1Mango tree? :D
అంతేగా..
తొలగించండిఆక్సిజన్ ని అందిస్తున్నందుకుగాను ఏ ఇంట్లో 5 వృక్షాలు ఉంటే ఆ ఇంటి ఆస్థి పన్ను సంవత్సరానికి 50 రూ తగ్గించాలసలు !
తొలగించండి