భానోదయం: ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం ఎవరు

Home

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం ఎవరు

             2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలుపొందే నాయకుడు ఎవరు?
ముఖ్యంగా నాలుగు పార్టీల నేతల మధ్య పోటీ నెలకొని ఉంది. చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ గారు , పాల్ గారు. వీళ్ళందరిలో ఎవరి వైపు జనం మొగ్గు చూపుతున్నారు.

ముందుగా చంద్రబాబు గారి గురించి చూస్తే 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు.

 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపిన ఘనత చంద్రబాబు గారిదే.

ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక  కొత్త రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాడు.

ఆంధ్రుల ఎన్నో ఏళ్ళ కల పోలవరం ప్రాజెక్ట్ ను కూడా కట్టిస్తున్నాడు.

 ఇక కరువు సీమ అనంతపురానికి కియా కార్ల కంపెని తీసుకొచ్చాడు.

చిత్తూరు జిల్లాలో తిరుపతి సిలికాన్ సిటీగా మార్చే ప్రయత్నంలో కొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా వచ్చాయి.

ఇన్ని అభివృద్ది పనులు చేసిన చంద్రబాబు గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా అంటే ఈ సారికైతే లేవనే చెప్పాలి. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రతికూలతలు కూడా చాలానే ఉన్నాయి.

చంద్రబాబు గారు కేవలం కంప్యూటర్లు ఐటీ రంగం పైనే ఎక్కవగా దృష్టి పెడతారు. కాని రైతులను సామాన్యులను పట్టించుకున్న పాపాన పోలేదు ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఇప్పుడైనా.

 ఆంధ్రాను సింగపూర్ చేస్తా అమరావతిని అమెరికా చేస్తా అమలాపురం ను ఆస్ట్రేలియా చేస్తా అంటాడు.  సార్ బాబు గారు ఆంధ్రాను అమెరికాలు సింగపూర్లు చెయ్యాల్సిన అవసరం లేదు అన్నదాతలను ఆదుకోండి అంతేకాని పచ్చని పంటపొలాలను అభివృద్ది పేరుతో నాశనం చేయకండి.

దేశానికే  అన్నం పెట్టె అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని అందరికి తెలుసు కాని బాబు గారు వ్యవసాయం దండగా అంటారు. అసలు చంద్రబాబుకు రైతులంటేనే అసహ్యం.

బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ ఐదేళ్ళలో.

బాబు గారు తీసుకొచ్చిన కియా మరియు ఎలక్ట్రానిక్ విడిబాగాల కంపెనీలలో వేల  ఉద్యోగాలు వచ్చాయి కదా అని అనొచ్చు కాని వాటిలో ఎక్కవగా ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారే ఉంటారు.  ఈ కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఎంత పెద్ద కంపెనీలు వస్తే ఏం లాభం వాటి వల్ల  స్థానికులకు ఉద్యోగాలు రాకపోగా బోనస్ గా కాలుష్యం మాత్రం
ఫ్రీగా వస్తుంది. కాలుష్యం స్థానికులకు ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వారికి. ఇదేనా చంద్రబాబు గారి అభివృద్ది.

ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు.

విద్యార్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదు.

ఆరోగ్య శ్రీ పథకాన్ని అటకెక్కించాడు.

కేవలం ఐటీ ఐటీ అనడం తప్ప రైతులకు పేదలకు చేసిందేమి లేదు.

ఎన్నికల ముందు ఎవో కొన్ని పథకాలు ప్రవేశపెట్టి డబ్బులు పంపిని చేసినంత మాత్రాన మళ్ళీ గెలుస్తానని అనుకోవడం చంద్రబాబు భ్రమ. జనాలు ఎర్రి పుష్పాలు కాదు ఐదేళ్ళ నుండి ఆయన చేసిన ఘనకార్యాలను చూస్తూనే ఉన్నారు.

ఐదేళ్ళుగా రైతులకు ఆడపడుచులకు చేయలేని సాయం కేవలం ఒక నెల రెండు నెలల ముందు చేస్తే ఏమిటి ప్రయోజనం. అప్పుడు గుర్తురాలేదా? పేదలు, రైతులపై ఎన్నికలు సమీపించగానే ఎక్కడాలేని ప్రేమ పొంగుకొస్తుంది బాబు గారికి.

 పేదలను,రైతులను ఓటు బ్యాంకుగా చూస్తాడే తప్ప ఇంకోటి కాదు.

ప్రత్యేక హోదా గురించి రోజుకో మాట మాట్లాడుతుంటాడు.

అమరావతి , పోలవరం కడుతూనే ఉన్నారు ఎప్పటి వరకు కడతారండి. సగం కట్టి ఆపేస్తారు ఎందుకో ఒక వేళ బాబుగారిని గెలిపించకపోతే అవి ఆగిపోతాయని ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్ళీ గెలవాలని ప్లానింగా. రాజకీయాలలో ఇదో ఎత్తుగడ.

ఒక పనిని చేయడానికి మీకు ఐదేళ్ళు కూడా సరిపోవు దిన్ని పూర్తి చేయడానికి మళ్ళీ గెలిపించాలా. ఒక విద్యార్థి పరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయితేనే బయటికి గెంటివేస్తారు. అలాంటిది మీరు ఒక పనిని చేయడానికి ఐదు సంవత్సరాలైనా చేయకపోతే మిమ్మల్ని ఏం చేయాలి.

ఆంధ్రా ప్రజలు  బాబు గారికి మళ్ళీ ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తారా. లేదా రైతులను పేదలను పట్టించుకోనందుకు, ఐదేళ్ళైనా పూర్తి చేయని పనులవలన ఓడిస్తారా గెలిపిస్తారా  చూద్దాం.....

ఇక రెండో వ్యక్తి  వై యస్ జగన్ గారి గురించి చూస్తే

జగన్ గారి గురించి ప్రజల్లో అనుకూలతలు:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి జన హృదయనేత వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అవడం వలన  జనాల్లో ఆయనకు అభిమానం ఎక్కవ.

రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు చిరస్మరణీయం దేశంలో  ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశ పెట్టని పథకాలు ప్రవేశ పెట్టి పేదలు, రైతులకు ఎంతో మేలు చేసాడు. ఆయన పుత్రుడు జగన్ గెలిస్తే మళ్ళీ రాజశేఖర్ రెడ్డిలా పరిపాలన చేస్తాడని జనాలు భావిస్తున్నారు.

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

రాష్ట్రంలోని  13 జిల్లాల్లో పాదయాత్రలు చేస్తూ ప్రజల భాధలను దగ్గరనుండి చూసి వారికి అండగా ఉంటానని హామి ఇచ్చి ప్రజలకు దగ్గగరయ్యాడు.

ఇక ప్రతకూలతల విషయానికి వస్తే

జగన్ పై ఉన్న కేసులు.

పరిపాలన అనుభవం లేకపోవడం.

ఎక్కవ శాతం ప్రజలు జగన్ వైపే   మొగ్గుచూపుతున్నారనిపిస్తుంది.

ఇక మూడో వ్యక్తి పవన్ గురించి చూస్తే

గొప్ప సినిమా స్టార్
చిరంజీవి తమ్ముడు

రాజకీయాల్లో మార్పుకోసం తపిస్తున్న వ్యక్తి.

రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసిన వాడు . దగ్గరుండి మరీ ప్రజల కష్టాలు ఓర్పుగా వింటాడు.

 పవన్ ప్రతికూలతలు:

2009 లో ఇలాగే రాజకీయాల్లో మార్పుకోసం చిరంజీవి పార్టీని స్థాపించి అనుకున్న  ఫలితాలు సాదించలేక పార్టీని కాంగ్రేస్ లో విలీనం చేసి చేతులు దులుపుకున్నాడు. చిరంజీవిలాగే పవన్ కూడా చేస్తాడేమోనని ప్రజల భయం.

2009  లో చిరంజీవే సీ ఎం అవుతాడని అందరు అనుకున్నారు కాని రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయింది ఆయన పార్టీ.

సినిమాలు వేరు రాజకీయం వేరు పవన్ కు
రాజకీయ అనుభవం లేదు.

పవన్ కళ్యాణ్ అంటే యువతకు మాత్రమే తెలుసు పెద్దవయసు  ఓటర్లకు పవన్ అంటే చాలా మందికి తెలియదు. అలాంటప్పుడు పవన్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు.

ఇక చివరగా నాలుగో వ్యక్తి కే ఏ పాల్ ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
కామెడి పీస్ బిల్డప్ బాబాయ్.
ఆయన ఏం మమాట్లాడిన జనాలు కామెడిగానే చూస్తారు.

 పాల్  గారు సీ ఎం కాదు కదా ఒక ఊళ్ళో సర్పంచ్ కూడా కాలేరు.

చివరగా నా అంచనా ప్రకారం జగనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.

 ఏ నాయకునికి ఎంత మంది ప్రజలు అనుకూలంగా ఉన్నారంటే

 జగన్ కు 70 శాతం
 చంద్రబాబు కు 20 శాతం
 పవన్ కు 9 శాతం
 పాల్ కు 1 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారు.

ఇది కేవలం నాకు అనిపించిన అంచనా మాత్రమే.
తుది నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తారు.


19 కామెంట్‌లు:

  1. చాలా జాగ్రత్తగా 'జగన్ అనుకూల ప్రచారం' నిర్వహించారు.
    చూదాం ఏం జరుగుతుందో!

    రిప్లయితొలగించండి
  2. జగన్ అనుకూల ప్రచారం కాదండి. జనాలు ఏమనుకుంటున్నరో రాసాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారీ. నేనూ జనాల్లో ఒక్కడినే. కానీ మీలా అనుకోవట్లేదు.

      ”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి జన హృదయనేత వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అవడం వలన  జనాల్లో ఆయనకు అభిమానం ఎక్కవ"
      -----------
      YSR కొడుకైతే ఏమిటట? తండ్రి చనిపోయెప్పుడు పోయిన వాళ్ళందర్ని ఒక లిస్టులో చేర్చేసి వాళ్ళని ఓదార్చడానికే ఏళ్ళు తీసుకున్నాడు మరి. అందరినీ ఓదార్చాడో లేదో తెలియదు. దీనికే ఇంత టైం పడితే ఇక పోలవరం లాంటి ప్రాజెక్టు తను కట్టాలంటే ఎన్నాళ్ళు తీసుకుంటాడో!

      తొలగించండి
  3. తెలంగాణా ఎన్నికలపుడు కేసీఆర్ గెలుస్తారని ఖచ్చితంగా చెప్పాను. తెలంగాణావారిలో ఒక్కరైనా చంద్రబాబుగారు గెలుస్తారని చెపుతారేమో అని ఎదురుచూస్తున్నాను.మీరు కూడా....

    పాల్ కి కూడా ఒక్క శాతం ఇచ్చేసారంటే మీరు దేవుడు సర్ !

    హే... నీహారిక నువ్వు రాజకీయాల్లో లేకపోవడం ఈ దేశం చేసుకున్న దురదృష్టం !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిహారిక గారు మీరు రాజకీయల్లోకి రావాలనుకుంటున్నారా.!

      తొలగించండి
  4. "ఇక చివరగా నాలుగో వ్యక్తి కే ఏ పాల్ ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కామెడి పీస్ బిల్డప్ బాబాయ్"

    తెలంగాణా ఎన్నికలలో Samajwadi Forward Bloc (SMFB) అనే "పార్టీ" వాళ్ళు కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తుతో అభ్యర్థులను నిలబెట్టారు. ఈ అభ్యర్థులలో పలువురి పేర్లు తెరాస అభ్యర్థుల పేర్లకు దగ్గరగా ఉన్నాయి.

    Example: Tandur

    4 P.MAHENDAR REDDY M 44 GEN SMFB Truck 2608 0 2608 1.67

    కేఏ పాల్ "ప్రజాశాంతి పార్టీ" గుర్తు ఫానును పోలిన హెలికాఫ్టర్, అభ్యర్థులలో మంది వైకాపా కాండిడేట్లకు దగ్గరగా ఉండేట్టు జాగ్రత్త పడ్డాడు.

    ఇటువంటి వాటిని కామెడీగా కాక yellow dirty tricks department తాలూకా వెధవ్వేషాలుగా చూడాలి.

    రిప్లయితొలగించండి
  5. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఆదాయం వచ్చి పడుతుంటే అభివృద్ధి చేయకపోవడం నేరమే ! చంద్రబాబుగారికి డర్టీ పాలిటిక్స్ చేయడం రాదులెండి. రాహుల్ గాంధీ గారు కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసినట్లే, పీ వీ గారిని, చాయ్ వాలాని ప్రధానిని చేసినట్లే, నన్నూ చేయకపోతారా అని కలలు కంటున్నాను. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు కదా ?

    రిప్లయితొలగించండి
  6. రాహుల్ గాంధీ గారు కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడమేంటీ.!??

    రాహుల్ గాంధీ కి కేసీఆర్ కి ఏమైన పొంతన ఉందా.?

    అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు. కాని పగటి కలలు కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్న ఒక సభలో కేసీఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయనమ్మ దగ్గరనుండి రాహుల్ గాంధీ వరకూ పేదలకోసం ఏం చేసారు అని అడిగారు.కేసీఆర్,పీవీ,మోడీ లాంటి పేదవాళ్ళని ముఖ్యమంత్రిగానూ, ప్రధానిగానూ చేయలేదా ?
      నాయనమ్మ జమానా లో సంగతికి మనవడిని బాధ్యుడిని చేయడం పొంతన కుదిరిందా ? సోనియా గాంధీ కాళ్ళు పట్టుకునైనా తెలంగాణా తెచ్చుకుంటాం అనలేదా ? అందితే కాళ్ళు అందకపోతే తిట్లు మీకు అలవాటేగా ?

      తొలగించండి
  7. చంద్రబాబు గారి నోటుకు ఓటు కేసు ఎలా అర్థం చేసుకోవాలి.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. // "రాహుల్ గాంధీ గారు కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడమేంటీ.!?? " //

    భానోదయం గారు, సంబంధిత వ్యాఖ్య యొక్క కవిహృదయం బహుశః ఇలా ఉండుంటుందని నేను అనుకోవడం 👇:-
    ~ తెలంగాణా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వారి హయాంలో కదా. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కాబట్టి ఎన్నికలు జరిగాయి, కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే పరోక్షంగా కాంగ్రెస్ వారు కారణం అన్నమాట 🙂.
    ~ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి బిజెపి గెలిచి మోదీ గారు పిఎమ్ అయ్యారు. కాంగ్రెస్ ఓడిపోవడం వల్లనే కదా మోదీ గారు గద్దెనెక్కగలిగారు. అంటే మళ్ళీ పరోక్షంగా కాంగ్రెస్ వారు కారణం అన్నమాట 🙂.
    ~ సరే, పివి గారు ఎలాగూ కాంగ్రెస్ నాయకుడే కదా 🙂.

    అదయ్యుంటుందన్నమాట భావం 🙂.
    (సరదాకి వ్రాసినది. jk 🙂🙂 )

    రిప్లయితొలగించండి
  10. ఇందిరాగాంధీ గారు కేసీఆర్ గారిని సీఎం చేసారా?
    పీ.వీ గారిని మోడి గారిని ప్రదానులను చేసారా?

    రిప్లయితొలగించండి
  11. అవునండి, అలనాటి జానపదచిత్రాల్లో ఊ అంటే ఆ అంటే పరకాయప్రవేశం చేస్తుండే రాజనాల .... నేనే 😉 😀.
    (ఇదీ jkనే 🙂)

    రిప్లయితొలగించండి