భానోదయం: ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం

Home

7, ఏప్రిల్ 2019, ఆదివారం

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం


        ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుల్లో వెనుకబడి ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళు రేపు ఏ రంగంలో రాణిస్తారు.
మరో వైపు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు నాణ్యమైన విద్యాబోధన వలన అన్ని రంగాల్లోను రాణిస్తున్నారు. ఇది తీవ్రమైన పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో  రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తుంది.  అలాంటి టెక్నాలజీని అందిపుచ్చుకుని అప్డేట్ అవ్వాలి. కాని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందంటే 70ఏళ్ళైనా ఏమీ మారలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఈ పరిస్థితి మారదా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరగదా.?

  ప్రభుత్వాలు ఎలాగు ఈ పాఠశాలలను పట్టించుకోవు. టీచర్లు కూడా ఎలాంటి సలహాలు ఇవ్వరు. వాళ్ళ జీతం వాళ్ళకు వస్తే చాలు విద్యార్థులు ఏమైపోతే ఏంటి అనుకుంటారు.

   నాణ్యమైన విద్య అంటే అర్థవంతమైన పాఠాలు చెప్పడం. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఎలా ఉంటుందో మనకు తెలుసు ఒక నల్ల బోర్డు చాక్ పీస్ అంతే మొత్తం పాఠాలు నల్ల బోర్డు పైనే. ఇలా చెప్తె ఎంత మందికి అర్థమవుతుంది చెప్పండి. పాఠం గురించి ఊహించుకోవాలి అంతే అలా ఊహించుకుని అర్థం చేసుకునే శక్తి అందరికి ఉండదు. ఈ రోజు చెప్పిన పాఠం రేపు అడిగితే చెప్పలేకపోతారు. ఎందుకంటే పాఠాలు చెప్పే విధానం అర్థం కాకపోవడమే.అదే పలాన సినిమాలో హీరో ఎవరంటే టక్కున చెప్పేస్తారు. మొత్తం సినిమా కథ చెప్పమన్న చెప్పేస్తారు. దీనికి కారణం సినిమా అనేది దృశ్యరూపం ఆకర్శనీయంగా ఉంటుంది. ఒకసారి చూస్తే అలాగే గుర్తుండి పోతుంది. అలాగని సినిమాలు చూపించమనట్లేదు. పాఠాలనే అర్థవంతంగా దృశ్యరూపంలో చూపిస్తే చాలా బాగా అర్థం చేసుకుంటారు. అదేనండి స్మార్ట్ క్లాస్ విధానం. ఈ స్మార్ట్ క్లాస్ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. అప్పుడే విద్యార్థులు అర్థవంతంగా పాఠాలు నేర్చుకుంటారు.

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసెస్ ప్రారంబించాలంటే ప్రభుత్వాల వల్ల కాదు. మనమే చేయాలి ఎలాగంటే స్వచ్ఛంద సంస్థలు గాని లేదా ఎవరైన కొంతమంది ఒక జట్టుగా ఏర్పడి ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం గురించి అవగాహన కల్పించాలి. ప్రతి పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూం ఎర్పాటు చేసేలా కృషి చేయాలి. ఇందుకు డబ్బులు ఎలా అంటే పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థి వద్ద నుండి కొంత మొత్తం వసూలు చేసి  ఈ స్మార్ట్ క్లాస్ ఎక్విప్ మెంటుకు సరిపడ డబ్బు తీసుకుంటె సరిపోతుంది. అలాగే ఉపాద్యాయుల వద్ద కూడా కొంత మొత్తం తీసుకుని
పాఠశాలలోని ఒక గదిలో స్మార్ట్ క్లాస్ సెటప్ ను సెట్ చేసుకుంటే చాలు.  ప్రొజెక్టర్, స్క్రీన్,  స్పీకర్స్, పాఠాలకు సంబందించిన మెమరీ డ్రైవ్ లు పాఠశాలల్లో అందించి వాటి ఆపరేటింగ్ గురించి ఉపాద్యాయులకు శిక్షణ  ఇచ్చేస్తే చాలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు  నాణ్యమైన విద్య బోధనను అందిచి వారి అభివృద్దికి పాటుపడుదాం.

ఈ నా ఆలోచన నచ్చినవారు  మీకు వీలైతే ఈ స్మార్ట్ క్లాస్ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయగలరు.



   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి