ప్రస్తుతం అందరు నాటుకోళ్ళ మాంసం పై మక్కువ చూపుతున్నారు. ఫారం కోళ్ళ మాంసం అంత రుచిగా ఉండదు పైగా ఫారం కోళ్ళు తొందరగా ఎదగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచుతారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు. అందువలన నాటుకోళ్ళ మాంసం తినడానికి మక్కువ చూపుతున్నారు. మన నాటుకోడిని ఏ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా సహజంగా పెంచుతాం వీటి మాంసం కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కోళ్ళు అన్ని వాతావారణ పరిస్థితులను తట్టుకుంటాయి. నాటుకోళ్ళకి రోగనిరోదక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కోళ్ళ మాంసం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నేను సహజసిద్దంగా నాటుకోళ్ళను పెంపకం చేపడుదామనుకుంటున్నాను. నాటుకోళ్ళ పెంపకం ఎలా ఉంటుంది.. బాగుంటుందా? నాటుకోళ్ళ పెంపకంలో సలహాలు సూచనలు తెలుపగలరు. కోళ్ళ షెడ్ మా పొలంలో వేయాలనుకుంటున్నాను. ఎవరైనా పెట్టుబడి పెట్టగలరా? ఇంకా ఏమైనా సలహాలు ఉంటే నాతో పంచుకోగలరు.
మీరు హైదరాబాద్ కి దగ్గర్లో ఉంటే నాటుకోళ్ళు కొంటాను. వెల్లుల్లి బాగా దట్టించి నాటుకోడి చిల్లు గారెలు వండితే సూపర్ అసలు. ఆంధ్రా వాళ్ళు బాగా ఇష్టపడతారు. శుభస్థ్య శీఘ్రం ...మొదలుపెట్టేయండి !
రిప్లయితొలగించండిథ్యాంక్స్ అండీ నిహారిక గారు. మా ఊరు హైదరాబాద్ కి 60 కి.మీ. దూరంలో ఉంటుంది.
తొలగించండిhttps://youtu.be/rR4hMcANIcI
తొలగించండిhttps://youtu.be/jMd04OCjV0Y
తొలగించండి