ఖజానా ఖాళీ చేసిన బాబు గారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్న డబ్బు 100 కోట్లు మాత్రమే. ఈ నెల కావలసింది 5000 కోట్లు.
కొత్త ముఖ్యమంత్రి లోటు బడ్జెట్ తో ఈ నెల ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లిస్తారు. సంక్షేమ పథకాలు ఎలా అందిస్తారని రాస్తున్నారు. సరే అదే మళ్ళీ బాబు గారే ముఖ్యమంత్రిగా గెలిస్తే ఇలా ఖజానా గురించి రాసేవారా. అంటే జగన్ ఇలాంటి ఆర్థిక పరిస్తితులలో రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించగలడని పరోక్షంగా బాబుగారి పత్రికలు రాస్తున్నాయి.
కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి జగన్ ఎలా ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతారు. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందే ఖజానా మొత్తం ఖాళీ చేసారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాలుగున్నర ఏళ్ళలో గుర్తుకు రాని ఆడపడుచులు, రైతులు ఎన్నికలకు నాలుగు నెలల ముందు వారిపై ఎనలేని ప్రేమ ముంచుకొచ్చింది. ఖజానాలో ఉన్న కాస్త డబ్బును ఆడపడుచులకు, రైతులకు పంపిణీ చేసాడు . ఎలాగు గెలవనని బాబు గారికి తెలిసిపోయింది అందుకే ఖజానా మొత్తం ఖాళీ చేసాడు. కొత్త ముఖ్యమంత్రికి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేలా చేసాడు...
ఇలాంటి ఆర్థిక పరిస్థితులలో బాబుగారే రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడని అందరూ అనుకుంటారని బాబుగారి ఆలోచన.

ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఇలా తిట్టడం సరికాదసరికాదు. వారిని ప్రశ్నించాలి అంతే....
తొలగించండిఖాళీ చేసిన అని వ్రాయాలి. ఖాలీ అనేది తప్పు.
రిప్లయితొలగించండిఎవరైనా తిడితే ప్రచురించడం ఇంకా తప్పు. బ్లాగర్ ని తీసుకెళ్ళి జైలులో వేస్తారు. ప్రిజనర్ కి అధికారం వస్తుందిలే అనుకుంటే కంటిన్యూ చేయండి.
ఖాళీ చేసిన అని వ్రాయాలి. ఖాలీ అనేది తప్పు.
రిప్లయితొలగించండిఎవరైనా తిడితే ప్రచురించడం ఇంకా తప్పు. బ్లాగర్ ని తీసుకెళ్ళి జైలులో వేస్తారు. ప్రిజనర్ కి అధికారం వస్తుందిలే అనుకుంటే కంటిన్యూ చేయండి.
అవును ఖాలీ తప్పు సరిచేసాను..మీ తెలుగు భాషాభిమానానికి ధన్యవాదాలు నిహారిక గారు..
తొలగించండిపాలకులను ప్రశ్నించడం తప్పా.. తప్పా..తప్పా
తొలగించండినా కలం పేరు నీహారిక ....నిహారిక కాదు.
తొలగించండినీహారిక అంటే తొలిపొద్దులో కనిపించే మంచుబిందువు.
తెలంగాణాలో ఎన్నికలకు ముందు రైతుబంధు ఇవ్వలేదా ? అపుడు ఖజానాలో ఎంత ఉందో చెప్పడానికి మరో ప్రభుత్వం అధికారం లోకి రాలేదు కదా ? ఢిల్లీ వెళ్ళి ఓవర్ డ్రాఫ్ట్ గురించి చెప్పింది జగనే ...ఆయన చెప్పిందే వ్రాసారు.అధికారం లోకి రాకముందే ఓవర్ డ్రాఫ్ట్ ఉంది అని ఎలా ఊహించారు అన్నది నా ప్రశ్న !
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండినిజమే ఓట్ల కోసమే తెలంగాణలో రైతుబందు పథకం ప్రారంభించారు. ఈ పథకం వల్ల రైతులకన్నా భూస్వామీలే ఎక్కువ లాభపడ్డారు.
తొలగించండిఇక ఓవర్ డ్రాప్ట్ గురించి ఎవరైనా ఊహించి చెప్పొచ్చు.
"ఎలాగూ గెలవనని ఖజానా ఖాళీ చేసేసాడు" అనేది మీ ఆరోపణ. పత్రికలని తిడుతూనే మీరూ కాస్త అర్థం లేని ఆరోపణలు చేసేస్తున్నారు.
రిప్లయితొలగించండిపత్రికలది ఏముంది, ఎవరి పత్రిక వారికి అనుకూలంగా రాస్తుంది. తప్పుడు వార్తలు రాయొద్దని అన్న వార్నింగ్ ఇచ్చాడని ఒక పత్రిక కి అనిపిస్తే, ఇలా కుర్చీలో కూర్చోగానే మమ్మల్ని భయపెట్టేసి స్వేచ్చని హరించేస్తున్నాడని ఇంకో పత్రికకి అనిపిస్తుంది!!
పత్రికలు ప్రజలపక్షం ఉండాలి కాని ఇప్పుడు ప్రతీ పార్టీకి ఓ పత్రిక ఉంది. స్వతంత్రంగా ఉన్న పత్రికలు కూడా కొన్ని పార్టీలకు తొత్తులుగా మారాయి. ఇప్పుడు అంతా బిజినెస్ ఎవరు ఎంతిస్తే వారి వంత పాడటం అలవాటయిపోయింది.
తొలగించండికేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినపుడు ఈనాడులో మొదటి పేజీలోనే ఫుల్ కవరేజ్ ఇచ్చారు. ఎంత డబ్బు ఇచ్చిఉంటారో ? ఈ రోజు జగన్ కి ఒక మూల చిన్న కార్నర్ లో రెండు లైన్లు వ్రాసి మధ్య పేజీల్లో చదువుకోమన్నారు. నిన్న ఈనాడుని జగన్ బెదిరించిన విషయం కూడా వ్రాసార్లెండి.
రిప్లయితొలగించండిఓవర్ డ్రాఫ్ట్ గురించి మీరు ఊహించగలరా ?
తెలంగాణాకి ఉన్న అప్పులెన్ని ?
ఆంధ్ర ప్రదేశ్ కి ఉన్న అప్పులెన్ని ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటపుడు పంచుకున్న అప్పులెన్ని ?
2014 తర్వాత భారత దేశానికి ఉన్న అప్పులెన్ని ?
ప్రపంచ బ్యాంక్ కి భారతదేశం ఎంత ఋణపడి ఉంది ?
కొన్ని రోజులు సమయం తీసుకుని, తెలుసుకుని చెప్పగలుగుతారా ?
బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు చెబుతాను..
తొలగించండి