భానోదయం: ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..??

Home

22, మే 2019, బుధవారం

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..??

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..??

   మనదేశంలో అటు పార్లమెంటు ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరికి ఆసక్తికర అంశం ఎవరు గెలుస్తారు అని. కేంద్రం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలుగు ప్రజలందరిలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ గారు ఈ ముగ్గురి మధ్యే పోటి నెలకొంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఆయనకు వచ్చే సీట్లు అంకెలకే పరిమితమవుతాయి కాబట్టి ఆయన సీఎం కాలేరు ఒకవేళ కింగ్ మేకర్ అవుతాడనుకుంటే ఆయన పార్టీకి వచ్చే సీట్లతో అది సాధ్యం కాదు.
ఇక చంద్రబాబు గారు మరియు జగన్ గారి మధ్యే అసలైన పోటి. వీరిద్దరిలో జగన్ కు అత్యధికంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సారి మాత్రం జగన్ సీఎం అవడం పక్క.

చంద్రబాబు, జగన్, పవన్ ఈ ముుగ్గురిలో ప్రజలు ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు. ఎందుకుఅనేది ఇప్పుడు చూద్దాం.

చంద్రబాబు: అనుకూలతలు

సీనియర్ రాజకీయ నాయకుడు.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని స్థాపించి హైదరాబాదును ప్రపంచవ్యాప్తం చేసాడు.

ఇక రాష్ట్రం విడిపోయాక రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాడు.

ఆంధ్రుల ఎన్నో ఏళ్ళ స్వప్నం పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు.

కియా కార్ల కంపెనీని రాష్ట్రంలో నెలకొల్పాడు.

సెల్ఫోన్ తయారి కంపెనీలు రాష్టరంలో ఏర్పాటు చేసాడు.

చంద్రబాబు ప్రతికూలతలు:

ఉమ్మడి రాష్ట్రాన్ని 9 ఏండ్లు పాలించినప్పుడు కేవలం ఐటీ రంగాన్ని మాత్రమే ప్రోత్సాహించి మిగిత రంగాలను పట్టించుకోలేదు.


వ్యవసాయం దండగ అన్నాడు. వ్యవసాయ రంగాన్ని, రైతులను అవమానించాడు.

కరెంట్ అడిగిన పాపానికి రైతులపై కాల్పులు జరిపించాడు.

అన్ని రంగాలను తుంగలో తొక్కి కేవలం ఐటీ రంగాన్ని మాత్రమే ప్రోత్సహించి హైదరాబాదును అభివృద్ది చేసానని చెప్పుకుంటాడు.

ఉమ్మడి రాష్ట్రం చాలా పెద్దది కేవలం హైదరాబాదును అభివృద్ది చేసి నేను ఈరాష్ట్రాన్ని అభివృద్ది చేసానని పదే పదే చెప్పుకుంటాడు. సరే హైదరాబాదును అభివృద్ది చేసాడు మిగితా ప్రాంతాల పరిస్థితి ఏంటి.?  అక్కడ ప్రజలకు ఉపాది అవకాశాలు ఏంటి.

హైదరాబాద్ లో అభివృద్ది కూడా కేవలం ఐటీ రంగంలోనే చేసాడు. మరి మిగితా రంగాల పరిస్థితి ఏంటి..? అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదా వారికి ఉపాది అవకాశాలు ఎలా??

హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది నేనే అనే చంద్రబాబు గారు ఒకసారి మూసీ నదిని కూడా ప్రపంచ పటంలో పెట్టి ఆయన  చేసిన అభివృద్దిని ప్రపంచానికి చూపాలి..

చంద్రబాబు గారు 9ఏండ్లు సీఎం గా ఉన్నప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రానికి చేసింది ఒక ఐటీ తప్ప మిగితాదంతా శూన్యం.

ఇక రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు గారు చేసింది రాజధాని నిర్మాణం అది సాగుతూనే ఉంటుంది సింగపూర్ ల చేస్తా అని చెప్పుకుంటున్నారు. అది పూర్తయ్యేదెప్పుడో.

పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నానని గొప్పలు చెప్పే బాబుగారు ఆ ప్రాజెక్ట్ ను ప్రాజెక్ట్ ఐదేళ్ళలో పూర్తి చేయలేదు ఎందుకు ??  ఎందుకంటే చంద్రబాబు  మళ్ళీ గలవకపోతే   ప్రాజెక్ట్ పూర్తవదని జనాలు అనుకుని మళ్ళీ గెలిపిస్తారని ఆయన భ్రమ.

ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట మాట్లడుతారు.

ఇక గొప్ప కార్ల కంపెని కియా ను రాష్ట్రంలో ఏర్పాటు చేసాను. ఇలాంటి కంపెనీలు చంద్రబాబు వల్లే సాధ్యం అని ప్రజలు భావించి మళ్ళీ తనని గెలిపిస్తారని అనుకుంటున్నాడు. ఓకే..   కార్ల కంపెని వచ్చింది రాష్ట్రానికి. దానివల్ల ఎవరికి ప్రయోజనం
స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని అనుకోవచ్చు కాని అందులో పెద్ద ఉద్యోగాలు అన్ని ఇతర దేశాలు లేదా ఇతర రాష్ట్రాల వారికే వస్తాయి. చిన్న చితక ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారు. అందులోను గొడ్డు  చాకిరి చేయించుకుంటారు. ఇలాంటి గొడ్డు పనులు ఎలాగు  మనవాళ్ళు చేయరు అందువలన ఇతర రాష్ట్రాలు ఒడిశా, బీహార్ లాంటి రాష్ట్రాల వారిని  తెప్పించి వారితో చేయించుకుంటారు. ఇప్పుడు చెప్పండి స్థానికులకు ఉద్యోగాలు ఎక్కడివి. ఇలాంటి కంపెనీల వలన ఎవరికి ప్రయోజనం.

మిగితా కంపెనీలైనా సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ కంపెనీలలో కూడా ఇదే పరిస్థితి స్థానికులకు ఉద్యోగాలు శూన్యం. పేరుకు ఉద్యోగాలు ఇస్తారు కాని మనవాళ్ళ చేత గొడ్డు చాకిరి చేయించి పొమ్మనలేక పొగ పెట్టిన చందాన వ్యవహరించి బయటికి వెళ్ళేలా చేసి ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు చెప్పండి ఇదేనా అభివృద్ది అంటే ఈ కంపెనీల వల్ల స్థానికులకు ప్రయోజనం లేకపోగా కాలుష్యం మాత్రం దండిగా ఉంటాది. కాలుష్యం స్థానికులకి ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వారికి ఇది చంద్రబాబు అభివృద్ధి.

ఇక రైతుల విషయానికి వస్తే చంద్రబాబు గారు చేసింది అప్పుడు శూన్యమే ఇప్పుడు పరమ శూన్యం.  రైతులకు , కార్మికులకు,పేదవారికి, మధ్యతరగతి వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని బాబు గారు మళ్ళీ ఎలా ముఖ్యమంత్రిగా గెలుస్తారు.
చంద్రబాబు గారికి ఓటు వేసేది కేవలం ఐటీ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు మాత్రమే.

ఇక జగన్ విషయానికి వస్తే

ప్రతికూలతలు:

అక్రమ ఆస్తుల కేసులు ఒక్కటే ఆయనపై ఉన్న ఉన్న ప్రతికూల అంశం.

ఇంకోకటి పరిపాలన అనుభవం లేకపోవడం.

 అనుకూలతలు:

రాష్ట్రమంతట పాదయాత్ర చేసి
ఒంటి చెత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయిన  మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కూమారుడిగా ప్రజల్లో జగన్ అంటే అభిమానం.

దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల జనాల హృదయాలు గెలుకున్న నేత ప్రియతమ రాజశేఖర్ రెడ్డిగారు.

రాష్ట్ర ప్రజల సేవలో నిరంతరం కృషి చేస్తూ ప్రజాసేవలోనే తన జీవితాన్ని త్యాగం చేసిన మహావ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు. ముఖ్యమంత్రి పదవికే వన్నే తెచ్చిన మహానేత.
అలాంటి మహానేత కుమారుడు  ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాజశేఖర్ రెడ్డిగారిలా రాష్ట్రాన్ని పాలిస్తాడని జనాలు విశ్వసిస్తున్నారు.

రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాల ద్వారా లభ్ధి పొందారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చిరస్మరణీయం.

  మహానేత  రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతాడని జనాలు విశ్వసిస్తున్నారు.

మరో విషయం ఏంటంటే  జగన్ రాష్ట్రమంతట పాదయాత్రలు చేసి ఆయా ప్రాంతాల పరిస్థితులను  అక్కడి సమస్యలను దగ్గరుండి చూసాడు కాబట్టి జగన్ సీఎం అయితే అక్కడి సమస్యలు పరిష్కారం అవుతాయని జనం జగనే సీఎం కావాలనుకుంటున్నారు.

జగన్ సీఎం అయితే  రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్ని మళ్ళీ ప్రారంభించి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతాడని ప్రజలు జగనే సీఎం కావాలనుకుంటున్నారు.

ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నూటికి నూరు శాతం వైయస్ జగన్ గారే.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే లగడపాటి  సర్వే ఏపి ఎన్నికల విషయంలో తప్పు చెప్పిన పవన్ కళ్యాణ్ గారి గురించి కరెక్ట్ గా చెప్పారు.   ఒకటి నుండి మూడు సీట్లు మహా అయితే అంకెలు దాటి సంఖ్యలకు వెళ్ళవు ఆయన పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య. కాబట్టి పవన్ ఈసారి పోటిలో ఉన్న ముఖ్యమంత్రి అన్న పదానికి ఇంకో 20 ఏండ్లు వేచిచూడాలి.

పవన్ పరిస్థితి  ఎలా ఉందంటే పూనకం వచ్చినప్పడు ఊగిపోయి పప్రంగిస్తుంటాడు. ఆయనకు అంత ఆవేశం ఎందుకో ఆయన అభిమానులకే అర్థం కాదు.

రాజకీయాల పట్ల అవగాహన లేదు. పరిపాలన పట్ల అంతకన్నా లేదు ఇలాంటి వ్యక్తి సీఎం అవడం కష్టం. ఇది సినిమా కాదు జీవితం సినిమాల్లో లాగా డైలాగులు కొడితే ఈలలు పడుతాయే తప్ప ఓట్లు పడవు. జనాలకు కావాలసింది పంచ్ డైలాగులు కొట్టేవాడు కాదు. సమర్థవంతంగా రాష్ట్రాన్ని పాలించేవాడు. ఆ నమ్మకం ఈసారి ప్రజలు జగన్ పై ఉంచారు.

2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైయస్ జగన్.






39 కామెంట్‌లు:

  1. పవన్ ఆవేశం సంగతి సరే అసలు ఫలితాలు రాకుండానే అంత ఆవేశం మీకెందుకో!
    ఇక మీ బ్లాగులో మహానేత మహానేత మహానేత కుమారుడు కాబట్టి జగనే సీఎం అయిపోవలంటే ఈ దేశానికి కూడా రాహుల్ తప్ప ఇంకో దిక్కు లేదని చెప్పుకోవాలి. అంత అవసరమా! ఎవడి బ్రతుకు వాడు బ్రతకాలి. పక్కోడి వంశం కోసం బతకడం కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆయన మంచిపనులు చేసారు. ఇక మీరు అన్నట్ట్టు కుటుంబ రాజకీయల గురించి మాట్లడితే చంద్రబాబుది కుటుంబ రాజకీయం కాదా..? ఆయన తర్వాత సీఎం ఆయన కుమారుడు లోకేశం కాదా???

      పవన్ కళ్యాణ్ ది కుటుంబ రాజకీయం కాకపోయిన ఆయన అన్న గారి పార్టీ ఏమైంది...??

      ఇక దేశం విషయానికి వస్తే మోడి ని ఓడించే సత్తా ఎవరికి లేదు.

      ఈ దేశాన్ని పప్ఫులు పాలించలేరు.

      ఇక జగన్ కి రాహుల్ కి పోలిక ఏంటి జగన్ ఎక్కడా పప్పు ఎక్కడ.

      పప్పులను గెలిపించడానికి ఈ దేశప్రజలు వెర్రిపుష్పాలు కాదు.

      జగన్ ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి ఆయనే సీఎం కావాలని నేను అనట్లేదు గత ఐదేళ్ళలో చంద్రబాబు గారి పాలనలో విసిగిపోయిన జనం జగన్ సీఎం అయితే అభివృద్ది జరుగుతుందని జగన్ సీఎం కావాలనుకుంటున్నారే తప్ప ఆయన మహానేత కొడుకని కాదు.
      మహానేత కొడుకు అని ఆయనే సీఎం కావాలంటే 2014 లో సీఎం అయ్యేవారు కదా..


      నేను వైయస్ఆర్ గారిని మహానేత మహానేత అన్నందుకు మీకు చిరాకుగా ఉన్నట్టుంది. ఒకసారి కాదు వెయ్యిసార్లు అంటాను. ఆయన లాంటి ముఖ్యమంత్రిని మరొకరిని చూపించండి.

      వారసులైనంత మాత్రానా ఎవరు సీఎం లు పీఎం లు అయిపోరు.

      చంద్రబాబు వారసుడు లోకేశం ని రాజీవ్ వారసుడు రాహుల్ లాంటి పప్పూలను సీఎం లు పీఎం లు చేయడానికి జనాలు వెర్రివాళ్ళుకాదు.

      వారసులను చూసి ఎవరు ఓటు వేయరు వ్యక్తిని చూసి ఓటు వేస్తారు.

      పవన్ కళ్యాణం ఆవేశం గురించి మాట్లాడితే ఆయనకు అంత ఆవేశం ఎందుకు ఎవరికి అర్థం కాదు. చిరంజీవి పార్టీని స్థాపించినపుడు ఇలాగే ఆవేశపడి పంచలు ఊడగొట్టండి అంటూ ఆవేశంతో ఏదేదో మాట్లాడాడు. అంత ఆవేశం ఉన్న వ్యక్తి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు ఏం పీకాడు...
      ఇప్పుడు మళ్ళీ వచ్చి అదే ఆవేశంలో ఎదేదో మాట్లాడుతాడు ఆయనకు అసలు క్లారిటీ ఉందా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఈ రాష్ట్రానికి..
      మహా అయితే పార్టీని తెలుగుదేశంలో విలీనం చేసి అన్న బాటలోనే సినిమాలు తీసుకుంటాడు . ఇలాంటి వారిని జనాలు నమ్మే ప్రసక్తేలేదు...

      తొలగించండి
    3. చంద్రబాబుది కుటుంబ రాజకీయం కాదని నేను అన్నానా?
      జగన్ ని సమర్థించే వ్యాఖ్యల్లో మీరే ఎక్కువగా మహానేత ప్రస్తావన తీసుకొచ్చారు. YS కొడుకైనంత మాత్రాన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాడు. ఆమాటకొస్తే భాజపా తప్ప అన్నీ కుటుంబ పార్టీలే!
      కార్ల ఫాక్టరీలు సెల్ ఫోన్ ఫాక్టరీలు అవసరం లేదా? ఈ లెక్క జగన్ వస్తే ఏ పని కల్పించాలని మీ ఉద్దేశం? పొలాల్లో కూలిపని లేదా డ్రైవర్ పనో చేసుకోమంటారా?

      మీకు పక్కవాడు పప్ప లా కనిపిస్తే అవతలవాడికి మీవాడు పప్పుబద్ద లా కనబడొచ్చు. సహజం!

      తొలగించండి
    4. కూలిపని చేసుకోవాలా అంటున్నారు కూలిపని అంటే పనికాదా?? అంతచిన్న చూపు ఎందుకు. చంద్రబాబుకు ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళకు వ్యవసాయం అంటే గిట్టదు .


      మీకు పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ జాబులైతేనే చేస్తారు... వ్యవసాయ పనులంటే అసహ్యం..

      అందుకే బాబును ఇంటికి పంపించారు.

      తొలగించండి
    5. "కూలిపని చేసుకోవాలా" అంటే కూలిపనిని చిన్నచూపు చూసినట్లు మీకు ఎందుకు అనిపించింది?

      తొలగించండి
    6. పొలాల్లో కూలిపని చేసుకోవాలా లేదా డ్రైవర్ పని చేసుకోవాలా అన్నారు మీరు పై కామెంట్ లో.పని ఏదైనా పనే పనియే దైవంగా భావించాలి. అంతేకాని వ్యవసాయ కూలిలను చిన్నచూపు చూడకండి చంద్రబాబులా... సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఒక్కటే గొప్ప పని అనుకోకండి. అన్నం పెట్టే రైతులను గౌరవించండి.

      తొలగించండి
  2. జగన్ మీద "ఫలానా" వర్గం వారికి పట్టలేని ద్వేషం ఉండడానికి ప్రధాన కారణం ఆయన క్రైస్తవుడు కావడమే. ఆమాట నేరుగా అనలేరు కనుక అవినీతి, ఫాక్షన్ అంటూ రాగాలు తీస్తారు.

    రిప్లయితొలగించండి
  3. జగన్ క్రైస్తవుడు అయినంత మాత్రాన ఆయన ఏ ఇతర మతాలను కించపర్చేవిధంగా ఎప్పుడు మాట్లడలేదు. జగన్ క్రైస్తవుడయినంత మాత్రాన ద్వేషించడం సరికాదు.

    హిందువులను హిందు మతాన్ని పదే పదే కించపర్చే లోకనాయకుడు కమల్ హాసన్ లాంటి హిందు వ్యతిరేకుల గురించి ఎవరు మాట్లడరు ద్వేషించరు.

    అన్ని మతాలను గౌరవించే జగన్ పై అంత ద్వేషం ఎందుకు..

    రిప్లయితొలగించండి
  4. religious Conversions YSR time ?
    They were all time high in the history of Hinduism.

    No Dalith christian leader in YSRCP ? reason is simple.

    రిప్లయితొలగించండి
  5. ఒక మతాన్ని, సంస్కృతీ ని అంతం చేయాలంటే , ఆ మతాన్ని , సంస్కృతీ ని తిడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు .
    జగన్ కంటే కమల్ హాసన్ నయం .

    రిప్లయితొలగించండి
  6. నేను ఏ పార్టీకి కాని ఏ పార్టీ నాయకులకు కాని అనుకూలం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియజేసానే తప్ప నేను ఏ పార్టీకి అనుకూలం కాదు అలాగే ఏపార్టీకి వ్యతిరేకం కాదు.మెజారిటీ ప్రజల తరపున నా అభిప్రాయం తెలియజేసాను.కావున ఒక పార్టీకి అనుకూలం అనుకోవద్దు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పు తప్పు. మీరు వ్యక్తం చేసింది మీ అభిప్రాయం. ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు అడగనే లేదు. మెజారిటీ ప్రజలని మీరు అడిగినట్లు ఏవిడెన్స్ ఉందా? జస్ట్ కుర్చీలో కూర్చుని ఎదో రాసేసి ఇదే ప్రజాభిప్రాయం అనొద్దు. నవ్వు వస్తుంది.

      తొలగించండి
  7. Instead of fixing the problem, he gave incentives for alternatives. Eg:, instead of fixing govt provided education, he said we will reimburse whatever you pay for private college, same thing with healthcare, instead of fixing the govt hospitals, he said people can go to corporate hospitals and govt will pay for them. Think through, Who are benefitting majorly from all these and what damage he has done to govt provided services?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు అన్నది కూడా నిజమే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా సౌకర్యాలు కల్పించాల్సింది. మరో ఫీజు రీయింబర్స్ మెంటుకు బదులు ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విధ్యను అందిచాల్సింది.
      ఈ విషయంలో మీతో నేను ఏకభవిస్తున్నాను.

      తొలగించండి
    2. ఏకీభవించడమే కాదు, ఇంత చిన్న ఆలోచన ఆ మహానేతకి ఎందుకు రాలేదో ఆలోచిస్తే తెలుస్తుంది అతను కూడా ఒక మామూలు ముఖ్యమంత్రే అని!

      తొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. కొన్ని ప్రభుత్వ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారు అంటున్నారు. నిజమే ఈ పోటీ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం ఏ రంగంలో చూసిన విపరీతమైన పోటీ నెలకొంది 1000 ఉద్యోగాలకు లక్షల మంది పోటీ పడుతున్నారు. అందరికి ఉద్యోగాలు ఇవ్వలేరుగా మిగితావారి పరిస్థితి ఏంటి అలాంటి వారి కొంతైన సాయం చేయాలని కొన్ని పథకాలు అవసరం అంతేకాని టాక్స్ కట్టే ధనవంతుల డబ్బును వీరికి పంచి సోమరులను చేస్తున్నారనడం కరెక్ట్ కాదు.
    ఈ దేశంలో కొందరికి వందల ఎకరాల భూములు ఉన్నాయి అవి ఎక్కడివి ఎంత కష్టపడి సంపాదించారు.? వందల కోట్ల ఆస్తులు ఉన్న కోటీశ్వరులు ఉన్నారు అవి ఎలా సంపాదించారు.
    వారు ఎలా అన్ని కోట్లు సంపాదించారంటే ఎంతో అవినితి చేస్తేకాని అన్నికోట్లు సంపాదించరు.సొమాన్యులను తొక్కేసి పైకి వచ్చిన వారే ఈ ధనవంతులు. పైగా జనాలకు మేము కట్టే టాక్సులను సంక్షేమ పథకాల రూపంలో అందించి సోమరిపోతులను తయారు చేస్తున్నారని అంటున్నారు. ఎవరికి సోమరితనం ఉప్పుకారం తినే వాడెవడైనా ప్రభుత్వం ఇచ్చె డబ్బుకోసం ఆశపడి సోమరిలా తిని పడుకోడు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఎందుకు సరిపోతుంది చెప్పండి అది మీలాంటి ధనవంతులకి ఒక పూట ఎంజాయ్ చేయడానికి కూడా సరిపోదు. కాని పేదవారికి ఎలాంటి ఆదాయం లేనప్పపుడు పొట్ట నింపుకోవడానికి అదేదిక్కు. ఇలా ప్రభుత్వ పథకాలు పొందేవారు సోమరులు కాదు ఏరంగంలో అయిన సామాన్యులను ధనవంతులు పైకి రాకుండా తొక్కేసినప్పుడు దిక్కులేని పరిస్థితులలో ప్రభుత్వ పథకాలపై ఆధారపడాల్సివస్తుంది.

    మీ దృష్టిలో విజయ్ మాల్యా , నీరవ్ మోది లాంటి వాళ్ళు కష్టపడి పైకి వచ్చినవాళ్ళు.

    ప్రభుత్వ పథకాలపై ఆధారపడే ప్రజలు మాత్రం సోమరిపోతులు...

    విజయ్ మాల్యా, నీరవ్ మోది లాగా మోసం చేసే తెలివి తేటలు సామాన్యులకు లేవు ఎందుకంటే సామాన్యులు సోమరులు. మోసం చేయడం చేతకాదు.

    మీ దృష్టిలో మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడం చేతకాని వారు సోమరిపోతులు.
    అంతేకదా మిస్టర్ రాజేష్ గారు....

    రిప్లయితొలగించండి
  10. సో డబ్బున్న ప్రతివాడూ మోసం దగా చేసి సంపాదించాడు అని ఫిక్సయిపోయారన్న మాట. టాక్స్ కట్టేది ధనవంతులు మాత్రమే కాదు. సాధారణ ప్రజలు కూడా. అలా కష్టపడి టాక్స్ కట్టే వారెవరైనా ఉచితంగా డబ్బు పంచి పెట్టడాన్ని వ్యతిరేకిస్తారు. మాల్యా లాంటి వారు ఉచిత డబ్బు పంపిణీ ని వ్యతిరేకించరు. ఆ డబ్బు ఏ మందో మాకో అమ్మడం ద్వారా వాళ్ళ జేబుల్లోకే వెళ్తుంది.
    అసలు సంపద సృష్టి లేకుండా పంపిణీ కి ఆస్కారమే లేదు. సంపద సృష్టి కేవలం వ్యవసాయం వల్ల మాత్రమే జరిగిపోదు. పరిశ్రమలు కావాలి. మీరేమో "ఆ కట్టావులే ఫాక్టరీ.. ఇందులో ఎవడు పని చేస్తాడు"అని నసుగుతున్నారు. ఇక ఈరాష్ట్రం ఎలా బాగుపడుతుంది.

    రిప్లయితొలగించండి
  11. ఈ పోస్ట్ కు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మిత్రులకు ధన్యవాదాలు. మన వాదోపవాదాలు పక్కన పెడితే ఇప్పుడు అసలు విషయం ఎవరు గెలుస్తారని. ఇంకో కొన్ని గంటల్లో ఎవరు సీఎం అవుతారో తెలిపోతుంది. కాబట్టి wait and see

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎగ్జాక్ట్లీ. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా నేను పెద్దగా పట్టించుకోను. తమ జీవితాన్ని తామే బాగుచేసుకోవాలనే ఆలోచన రానంతవరకు పదవిలో ఎవ్వరున్నా ఈ దేశాన్ని బాగుచెయ్యలేరు.

      తొలగించండి
    2. ఎవరో వస్తారని
      ఏదో చేస్తారని
      ఎదురు చూసి మోసపోకుమా...
      నిజము మరచి
      నిదురపోకుమా...
      ఎవరో తోడు వస్తారని
      ఏదో మేలు చేస్తారని
      ఎదురు చూసి మోసపోకుమా....


      ఎవరు జీవితాలు వాళ్ళే బాగుచేసుకోవాలి.

      తొలగించండి
  12. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. ఆగండెహె. పవన్ కళ్యాణ్ ని ఓడించి బాలయ్య ని ఎందుకు గెలిపించారా అని జుట్టు పీక్కుంటున్నా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పవనాలు సార్ సీఎం సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా దాటలేదు. ఎంతకైనా బాలయ్య లెజెండ్ కదా ఈసారికి అసెంబ్లీ గేటు దాటాడు...

      పవణ్ కళ్యాణ్ పేరు వినపడితే చాలు ఈలలు గోలలు. అది చూసి ఆయనకు జనాలు ఎన్నికల్లో బ్రహ్మరథం పడతారు అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది జగన్ ప్రభంజనంలో పవనాలు సార్ కొట్టుకుపోయాడు.

      తొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. పవన్ మొకం సూతే డోకొస్తదని లేపేసేరు. బాలయ్య తోదగొడితే సుమోలు లెగుస్తాయేమోనని/ మాటలకి నవ్వేనా వస్తదని గెలిపించినారు. ఉన్నయ్యే నాలుగెంట్రుకలు పీకేసుకోకు :)

    రిప్లయితొలగించండి
  17. పవన్ మొకం సూతే డోకొస్తదని లేపేసేరు. బాలయ్య తోదగొడితే సుమోలు లెగుస్తాయేమోనని/ మాటలకి నవ్వేనా వస్తదని గెలిపించినారు. ఉన్నయ్యే నాలుగెంట్రుకలు పీకేసుకోకు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంట్రుకలు లెక్కబెట్టే పనికి బాగా పనికొచ్చేలా ఉన్నావ్ అబ్బాయ్!

      తొలగించండి
  18. https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/60796935_2406679149394861_2846889256490631168_n.jpg?_nc_cat=108&_nc_ht=scontent.fhyd2-1.fna&oh=34bbf07d89162bb9b91968dd58f7739c&oe=5D50E86C

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంటికి సీఎం సీటుకి ఏమైన సంబంధం ఉందా...

      నీలాంటోడు (కొమ్మినేని) చెబితే మోహం బాలేనోడు అద్దం పగలగొట్టుకున్నాడట..

      మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాలుగు బాత్ ‌రూమ్ ల వల్ల బిజేపి ఓడిపోయిందన్నారు.

      ఇప్పుడు నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి. అంటే నాలుగు ఆ బాత్ రూమ్ లు కూలగొట్టారా ఏంటీ..

      తొలగించండి
  19. ఒక్కదానికేనా... ఇలాంటి బోలెడు క్యామెడీ లింకులున్నై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జాతకాలు నమ్ముకుంటే గెలవరు. జనాలకు నేనున్నాను అనే భరోస ఇచ్చి వారి సంక్షేమం కోసం పాటుపడే వారే గెలుస్తరు.

      జాతకాలు నమ్ముకుని ఇళ్ళు కట్టుకుంటే అందరూ సీఎం లు అయిపోతారా.. ఏంటీ సార్


      జనాల గురించి ఆలోచించండి సార్ జాతకాల గురించి కాదు.

      తొలగించండి
  20. @భానోదయం:

    లక్ష్మీ నివాసం సినిమాలో కవి "కూలివాన చెమటలో ధనమున్నదిరా" అంటాడు. Dignity of labor ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ వాక్యం ఒక ఉదాహరణ. శ్రమజీవులకు & వాళ్ళ కాయకష్టానికి గౌరవం ఇవ్వలేకపోవడం elitism. ఈ ధోరణి రానురాను కులగజ్జికి & అధికార దర్పానికి దారి తీసే ప్రమాదం ఉంది.

    1983 ఎన్నికలలో పదిరికుప్పం దళితులు తమకు వోటేయలేదని పచ్చదండు వారిని హతమార్చింది. 1985 కారంచేడులో అదే సీన్ రిపీట్ అయింది. పులివర్తి నాని, చింతమనేని ప్రభాకర్ లాంటి తెగులు తమ్ముళ్లు బడుగుల మీద అదే తరహా దౌర్జన్యం కొనసాగిస్తున్నారు. ఓడిపోయామన్న ఉక్రోషంతో సై"కిల్" పార్టీ కామందులు ప్రతీకార దాడులకు దిగకుండా వైఎస్ జగన్ గారు జాగ్రత్త పడాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జగన్ గారి పాలనలో రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళ ఆటలు సాగవని నేను నమ్ముతున్నాను.

      తొలగించండి
  21. పచ్చ మూకలకు పంచెలూడిపోతాయి. పచ్చ కుల పైశాచికం నుంచి విముక్తి కలిగింది.

    రిప్లయితొలగించండి