పవన్ ఓడిపోవడానికి ముఖ్య కారణం 150 కోట్ల డబ్బు అంట. ఇది ఎవరో అన్నది కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే అన్నారు. 150 కోట్లు ఉంటే చాలు ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించవచ్చని మనం అనుకోవాలా? అంటే జనానికి ఎవరు డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తారా? తమకు సరియైన నాయకుడు ఎవరన్నది ప్రజలకు తెలియదని పవన్ అభిప్రాయమా.? ఈ రోజుల్లో ఏ ఓటరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని డబ్బులు పంచిన తమకు సరియైన నాయకుడు ఎవరో వారికే ఓటు వేస్తారు కాని ఎవరు డబ్బులకు, మందుకు ఆశపడి ఓటు వేయరు. అది పవనాలు సార్ కి తెలుసుకోలేక పోతున్నారు. పవన్ అన్నట్టు భీమవరంలో 150 కోట్ల డబ్బులు పంచి తనను ఓడించారని అంటున్నాడు. మరీ గాజువాక లో ఎందుకు ఓడారు అక్కడ ఎన్ని డబ్బులు పంచారు. ఓడిపోయాడు ఏదో కారణం చెప్పాలి అందుకని 150 కోట్లు ఖర్చు చేసి భీమవరంలో తనను వైసీపి ఓడించిందని చెబుతున్నాడు. అంటే పవన్ దృష్టిలో డబ్బులు ఉంటే చాలు ఎన్నికల్లో గెలవచ్చని అర్థమా? . పవన్ దగ్గర డబ్బు ఉంటే ఈ ఎన్నికల్లో గెలిచే వాడేమో!
తెలుగు రాష్ట్రాలల్లో పెద్ద సెలెబ్రెటీ, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సొంత పార్టీ స్థాపించి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటి చేస్తే 150 కోట్ల రూపాయలతో ఓడించేస్తే, సామాన్య ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికి 10 కోట్లు చాలేమే. ఈ లెక్కన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ సీట్లు గెలవడానికి 2050 కోట్లు ఉంటే చాలు పవన్ సార్ ఈజీగా గెలిచేవాడేమో. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్టు డబ్బులు పంచితేనే ఎన్నికల్లో గెలుస్తారనుకుంటే వచ్చే ఎన్నికల్లో మీరు రెండు వేలకోట్లతో పాటు అవతలి పార్టీ వాళ్ళు కూడా డబ్బులు పంచుతారు కాబట్టి దానికి ఇంకో వెయ్యికోట్లు ఎక్కువ మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది మరియు ఎన్నికలకు ఇంకా ఐదేళ్ళు సమయం ఉంది కాబట్టి ఖర్చులు పెరిగిపోతాయి అందుకని జనాలకు ఇప్పుడిచ్చే దానికి రెట్టింపు డబ్బులు పంచాలి. లేదంటే ఎవరు ఎక్కవ పంచితే వారికి ఓటేస్తారు. కాబట్టి మొత్తంగా రౌండ్ ఫీగర్ ఓ 5 వేలకోట్లు సిద్ధం చేసుకోండి. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మీరే గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది నేనన్న మాట కాదు మీరే అన్న మాట డబ్బులు పంచి నన్ను ఓడించారని అన్నారు. అందుకని నేను చెబుతున్నాను మీరు కూడా ఒక చోట కూర్చుని డబ్బులు పంచండి మీరే ముఖ్యమంత్రి అవుతారు.
ఇప్పుడు ఓటర్లకు కావాలసింది సరైనా పాలన అందించే నాయకుడు కాదు ఎవరు ఎక్కువ డబ్బులు పంచితే వారినే ఎన్నికల్లో గెలిపిస్తున్నారు అనే పవన్ అభిప్రాయం ప్రకారం తెలంగాణలో కెసీఆర్ కేంద్రంలో మోడి ఇలా డబ్బులు పంచే అధికారంలోకి వచ్చారా?? అని అనుకోవాలా ఈ లెక్కన ఆంధ్రాలో చంద్రబాబు కూడా ఎన్నికలకు కొన్ని నెలలముందు పథకాల పేరుతో అధికారికంగా డబ్బులు పంచారు. అయినా ఘోరంగా ఓడిపోయారు. మరీ ఇక్కడ డబ్బు ప్రభావం ఎందుకు పనిచేయలేదు? పవన్ సార్ సమాధానం చెప్పాలి..
కేవలం డబ్బులు పంపిణీ చేస్తే ఎన్నికల్లో గెలుస్తారనుకోవడం పవన్ ఆజ్ఞానానికి నిదర్శనం.
ఈ రోజుల్లో ఓటర్లు అమాయకులేం కారు ఎవరు సమర్థవంతమైన నాయకులో వారికి తెలుసు గతంలో వారు ఏం చేసారు, వారి కుటుంబం ఎలాంటిది, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా, తమ సమస్యలను పరిష్కరించగలడా లేదా అని చూస్తారు. అంతేకాని ఎవడో రెండు వేలు నోటు చేతిలో పెడితే ఓటు వేయరు. అలా అంటే డబ్బు ఉన్న ప్రతోడు ఎన్నికల్లో గెలుస్తాడు.
పవన్ సార్.... డబ్బులు పంచి జగన్ ఎన్నికల్లో గెలవలేదు. గతంలో ఆయన తండ్రిగారి పాలన చూసి గెలిపించారు. రాష్ట్రంలో సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి జనంతో మమేకమై గెలిచాడు. తన తండ్రిలాగా పాలన చేస్తానని చెప్పి గెలిచాడు. మీకోసం నెనున్నాను అని భరోస ఇచ్చి గెలిచాడు.అంతేకాని డబ్బులు పంచి అధికారంలోకి రాలేదు. జగన్ అవినీతి పరుడు లక్షలకోట్లు సంపాదించాడని అంటున్నారు అన్ని కోట్లు ఉన్న వ్యక్తి డబ్బులు పంచి ఈజీగా గెలవచ్చంటే 2014 ఎందుకు ఓడిపోయారు.?
పవన్ సార్ ఎన్నికల్లో గెలవాలంటే కావల్సింది డబ్బులు కాదు సార్ జనానికి నేనున్నానే భరోస ఇవ్వాలి. సమర్థవంతంగా పాలించగలడనే నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకాన్ని ఈ సారి జగన్ కలిగించాడు గెలిచాడు. జగనన్న జగనన్న జనమంతా నీవెంటే అన్నారు ముఖ్యమంత్రిని చేసారు. నీవు కూడా పవనన్న పవన్న ప్రజలంతా నీవెంటే అనేలా చేయి అప్పుడు నిన్ను గెలిపిస్తారు. అయనా కష్టమే ఎందుకంటే జగన్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకో నాయకుడు ఎందుకు అని ప్రజలు భావిస్తున్నారు. అయినా అన్న చిరంజీవి గారు కూడా పార్టీని స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసినప్పడే సినిమా వాళ్ళ మీద నమ్మకం పోయింది జనాలకి. ఇప్పుడు ఆయన స్వంత తమ్ముడైనా పవన్ ను నమ్మాలంటే కష్టమేమరీ. నమ్మి గెలిపిస్తే మళ్ళీ ఏ పార్టీలోనైనా విలీనం చేసేస్తడేమేనని జనాల భయం కాబట్టి పవన్ ని జనాలు ఇప్పట్లో నమ్మరు....
ఇప్పుడు చెప్పండి పవన్ ఓడిపోవడానికి కారణం 150 కోట్ల లేదా తనపై జనాలకు లేని విశ్వసనీయత వల్లన. ఆయనే తెలుసుకోవాలి.. కేవలం డబ్బు పంచితేనే గెలుస్తారనుకుంటే ఎప్పటికి పవన్ గెలవలేరు. పైగా జనాలను నోటుకు ఓటు వేస్తారనడం వలన పవన్ ను ప్రజలు హీనంగా చూసే పరిస్థితి వస్తుంది.
పాపం ఏదో ఓడిపోయిన బాధ లో పవనయ్య అలా అన్నాడు. దానికి ఇంతోటి విశ్లేషణ ఎందుకు ? ఇలా అతన్ని విసిగిస్తే మళ్ళా పూనకం స్పీచులు ఇస్తాడు.
రిప్లయితొలగించండిఐదేళ్లు ఊరించి ఊరించి రిలీస్ చేసిన సినిమా (అందునా అవేరేజీ బిసినెస్ చేసిన అన్నయ్య బొమ్మకు సీక్వెల్) అట్టర్ ఫ్లాప్ అయినందుకు ఎదో ఒకటి చెప్పాలి కదండీ. మాది లో బడ్జెట్ కనుక ఆడలేదని, పైగా ఎగస్పార్టీ వాళ్ళు మా పోస్టర్ల మీద పెండ కొట్టారని ఏవేవో సాకులతో డైరెక్టర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడు పాపం.
రిప్లయితొలగించండి