భానోదయం: ఉత్తరాదిలో పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా!!!

Home

18, నవంబర్ 2024, సోమవారం

ఉత్తరాదిలో పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా!!!

 పుష్ప-2 ట్రైలర్ లాంచ్ బీహార్లో ఎందుకు చేసారు?



మన తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయ్యింది దేశంలో ఎక్కడా తెలుగు సినిమా ఈవెంట్ చేసినా జనం ఎగబడి వస్తారు ఇప్పుడు. ఉదాహరణకు నిన్న బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగిన పుష్ప-2 ఈవెంట్ కి ఊహించని రీతిలో జనం భారీగా తరలివచ్చారు. అక్కడ ప్రభుత్వం కూడా 1200మంది పోలీసులతో బందోబస్తు కల్పించింది..

ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది...

మన తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేసిన అంత జనం వచ్చేవారు కాదేమో...


ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం పుష్ప కు ఉన్న క్రేజ్.. పుష్ప సినిమా పాటలు,కథ,హీరో మ్యానరిజం ఇవన్ని ఉత్తరాది ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి..

ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎర్ర చందనం స్మగ్లర్ అని తెలుస్తుంది (నాకు తెలియదా అంటే ట్రైలర్, ఎవరో చెబితే విన్నా తప్పితే నేను సినిమా చూడలేదు ఎందుకంటే 3గంటలు సినిమా చూసేంతా సమయం నాకు లేదు కాబట్టి నేను చూడలేదు వీలైతే అప్పుడప్పుడు సీరియల్ చూసినట్టు చూస్తాను)..

ఈ రోజుల్లో హీరో క్యారెక్టర్ ఎంత వైల్డ్ గా ఉంటే జనాలకి అంతగా కనెక్ట్ అవుతాడు సినిమా హిట్టవుతుంది..

అందుకే పుష్ప క్యారెక్టర్ జనాలకి బాగా కనెక్ట్ అయ్యింది.

ఉత్తరాదిలో ముఖ్యంగా బీహార్ అంటే మనకు గుర్తు వచ్చేది స్మగ్లర్లు,రౌడీలు, కూలీలు ఎక్కువ అభివృద్ధి తక్కువ. అందుకే బీహార్ ప్రజలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వలస వెళుతుంటారు.. దేశంలో ఎక్కడ చూసినా బీహార్ కూలీలే ఉంటారు. అలాగే కిరాయి రౌడీలు కూడా బీహార్ వాళ్ళే ఉంటారు చాలా వైల్డ్ గా ఉంటారు... తమ జీవితాలకు పుష్ప కథ దగ్గరగా ఉండటంతో అక్కడ బాగా క్రేజ్ ఏర్పడింది.. 


ఇది నేను పుష్ప సినిమాని తక్కువ చేసి మాట్లాడటం లేదు.. సినిమాకు ఉన్న క్రేజ్ ఎలా వచ్చింది అని చెప్పానంతే ఫ్యాన్స్ ఏమనుకోవద్దు...


తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్టవుతే ఒక తెలుగు వాడిగా గర్వపడుతాను.. 


మరో విషయం చెప్పాలి పుష్ప సినిమా షూటింగ్ మా ఊళ్ళో జరిగింది... 

డైరెక్టర్ సుకుమార్ నా ముందునుండి వెళుతున్నాడు నేను గమనించలేదు. ఆయన వెనకాల ఓ ఐదారుగురు ఉన్నారు ఎవరో అనుకున్నా మా ఊరు అబ్బాయి డైరెక్టర్ సుకుమార్ వెళుతున్నాడు అన్నా అన్నాడు. అరే అవును నాముందు నుండే వెళ్ళాడు గుర్తు పట్టలేదు. సెల్ఫీ దిగుదాం అన్నాడు వద్దులే తమ్ముడు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ పనిని మనం డిస్టర్బ్ చేయకూడదని నా పనికి నేను వెళ్ళాను... 


వాళ్ళు ఊరంతా తిరిగి ఒక మంచి పాత ఇంటి కోసం వెతుకుతున్నారు షూటింగ్ చేయడానికి.

వాళ్ళను ఆపి సెల్ఫీలు అడగడం బాగుండదు ఎవరి పని వారిని చేసుకోనియాలి. మన పని మనం చేయాలి అనుకుంటూ నాపనికి నేను వెళ్ళాను...


ఈ సారీ పుష్ప-2 భారీ విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు..


మన తెలుగు సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సూపర్ హిట్టవుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్.. 


6 కామెంట్‌లు:


  1. పుష్ప అంటే ఫ్లవరు కాదు ఫైర్
    పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్
    పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్
    పుష్ప అంటే ఆర్డినరీ కాదు ఎక్సట్రార్డ్రీనరీ
    పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్

    ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా
    తగ్గేదే ల్యా

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. ఇప్పుడు స్మగ్లర్లే హీరోలు...
      ఇదే ఇప్పుడు ట్రెండ్..
      సమాజం తోటకూర కట్ట అవసరం లేదు...
      ఇది యాపారం...

      ఇది నామాట కాదు సినిమా వారి మాట...

      తొలగించండి
    2. “యాపారం” పేరున బాధ్యతారాహిత్య సినిమాలను తీసేటట్లయితే ….. ఈ రంగం వారికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సత్కారాలు, పద్మ అవార్డులు మానెయ్యాలి. యూనివర్శిటీలు కూడా గౌరవ డాక్టరేట్లు, “కళా ప్రపూర్ణ” లాంటి బిరుదులు ప్రదానం చెయ్యడం ఆపెయ్యాలి. అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు కూడా అనవసరం.

      తొలగించండి
    3. కేంద్ర ప్రభుత్వం ఈ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది... చాలా బాధ్యత గల ప్రభుత్వాలు మనవి..

      తొలగించండి