భానోదయం: తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుండి సంస్కారవంతంగా పెంచితేనే సమాజంలో నేరాలు,ఘోరాలు జరగవు.

Home

3, డిసెంబర్ 2019, మంగళవారం

తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుండి సంస్కారవంతంగా పెంచితేనే సమాజంలో నేరాలు,ఘోరాలు జరగవు.


    
      ఇప్పుడు సమాజంలో 14 నుండి 25 ఏళ్ళ యువకులకు విలువలు అంటే ఏమిటో తెలియదు. పెద్దలంటే గౌరవం లేదు. మహిళల పట్ల గౌరవం లేదు. తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వడం లేదు.
పాఠశాల స్థాయి నుంచే వీరు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పేది వినరు వారికి ఎదురు తిరుగుతున్నారు. అలాంటప్పుడు ఉపాధ్యాయులు మాత్రం ఏం చేస్తారు. మొక్కుబడిగా తమ పాఠాలు తాము చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకు సార్ మాకు ఈ చదువులు అనే విద్యార్థులు ఉన్నారు. వీరికి తెలుగు కూడా సరిగా చదవడం రాదు. ఎలాగోలా పది వరకు చదివి బయటకు వచ్చి ఆటోలో, లారీలో నడుపుకుంటూ అన్ని అడ్డమైన అలవాట్లు నేర్చుకుని నేరాలు చేసే స్థాయికి ఎదుగుతున్నారు.
  
        ఇప్పుడున్న యువతకు పెద్దలు పట్ల, మహిళల పట్ల, సమాజం పట్ల గౌరవం లేకపోవడానికి మరో కారణం ఇప్పుడొస్తున్న చెత్త సినిమాలు. ఆ మధ్య ఓ సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని ఈ సినిమా పోస్టర్ అసభ్యకరంగా ఉందని పెద్దాయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు గారు ఇలాంటి సినిమాల వల్ల యువత చెడిపోతుందని ఇలాంటి సినిమాలను అడ్డుకోవాలని చెబితే ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ 'చిల్ తాతయ్య' అంటూ చీప్ గా తీసిపారేసాడు. ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ అంటూ మూసుకుని కూర్చో అనే విధంగా మాట్లడాడు. ఆ సినిమాలో ఏముందో నాకయితే అర్థం కాలేదు కానీ జనాలు మాత్రం అంత పెద్ద హిట్టు చేసారు.  ఈ సినిమాలో బూతులు,ముద్దులు, ఎప్పుడు మందు తాగుతూ,డ్రగ్స్  తీసుకుంటూ ,  కామంతో రగిలిపోతూ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మన హీరో విజయ్ దేవరకొండ.  ఇంత చెత్త మూవీ జనాలతో పాటు సెలబ్రిటీలకు  ఎలా నచ్చిందో   నాకిప్పటికీ అర్థం కాదు. ఈ మూవీ రిలీజ్ కి ముందు ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మనం ప్రేమించిన అమ్మాయి పై ఎవడైనా చెయ్యి వేస్తే ఊరుకుంటామా అంటూ బూతులు తిడతాం, కొడతాం అన్నాడు. అవును ఎవరమైనా ఇలాగే చేస్తాం. మరీ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఒక సీన్లో వేరే వాడి భార్యతో ఎంతో కామంతో హీనంగా ప్రవర్తిస్తాడో చూసాం. ఇంతలో ఆమె భర్త వచ్చే సరికి అతని ముందు నుంచే హీరో విజయ్ దేవరకొండ వెళ్ళిపోతాడు. మరీ అప్పుడు ఆమె భర్త ఏమి చేయాలి హీరోని??? అంటే నువ్వు వేరే ఆడవాళ్ళను ఏమైనా చేయవచ్చు మీ ఆడవాళ్ళను ఎవరు ఏమి అనవద్దు ఎందుకంటే నువ్వు హీరోవనా??? నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యోచ్చా??? నీలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసూకునే యువత పాడైపోతున్నారు. ఇలాంటి సినిమాలు చూసి ఎవడికి వాడు హీరోలా ఫీలయిపోతున్నారు. సమాజం పట్ల, స్త్రీల పట్ల గౌరవం లేకుండా తయారవుతున్నారు. 

     యువత చెడిపోవడానికి మరో కారణం స్మార్ట్ ఫోన్ లు పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. వారు ఫోన్లలో ఏమి చూస్తున్నారో తల్లిదండ్రులు పట్టించుకోరు. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి మంచిగా చదువుకోవచ్చు కానీ ఎంతమంది దానిని చదువుకోసం ఉపయోగిస్తున్నారు. వాటిలో ఎక్కువగా బూతు సైట్లే చూస్తున్నారు.
  
     ప్ర‌స్తుతం యువత ఎవరు చెప్పినా వినే స్థితిలో లేరు. ఎవరి మాటలు మేమెందుకు వినాలి అనే దోరణిలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్ చేయించుకుని తల్లిదండ్రులు కొనిచ్చిన బైకులపై అవసరం ఉన్నా లేకున్నా రోడ్లపై పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వేగంగా వెలుతుంటారు.  మహిళలు కనిపిస్తే చాలు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. పదిమంది ఒక చోట చేరి రోడ్డుపై వచ్చిపోయే ఆడవారిని ఎగాదిగా చూస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తుంటారు. ఇది రోజు మా ఊర్లో జరిగేదే..... కాని ఏం చేస్తాం చూసి చూడనట్లు వెళుతున్నాను... ఎందుకంటే ఒకరు చెబితే వినే స్థితిలో లేరు వీళ్ళు. మొక్కై వంగనిదీ మానై వంగునా అన్నట్టు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను సభ్యతగా పెంచితే ఇలా ఆవారాగాళ్ళలా తయారవకుండా ఉంటారు.

     సమాజంలో పెద్దల పట్ల, ఆడపిల్లలు, మహిళల పట్ల యువకులు గౌరవంగా ఉండాలంటే తల్లి దండ్రులు తమ పిల్లలను చిన్నప్పటినుండే సంస్కారవంతంగా పెంచాలి.

ఉపాధ్యాయులు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఒక లక్ష్యం ఏర్పరుచుకునేలా చేసి లక్ష్యం సాధించే విధంగా ప్రోత్సహించాలి.

సినిమాలు తీసేవారికి సామాజిక బాధ్యత ఉండాలి.
యువత చెడిపోయే విదంగా సినిమాలు తీయకూడదు.

డైరెక్టర్ సందీప్ వంగా లాంటి వారు బూతు సినిమాలు తీయకుండా ఉండాలి.

 మద్యపానం నిషేదించాలి.

అప్పుడే సమాజంలో నేరావు ఘోరాలు జరగకుండా ఉంటాయి.

6 కామెంట్‌లు:

  1. ఒక పిచ్చి కుక్కను కొట్టి చంపినా రెండో పిచ్చికుక్కల కు ఏమీ ప్రభావమూ ఉండదు. అందుకే పిచ్చికుక్కల ను ఏరి ఏరి చంపెయ్యాలి. ఈ కామ పిశాచాలు కొవ్వొత్తుల రాలీలు చేస్తే మారవు.

    మనదేశం ప్రస్తుత న్యాయవ్యవస్థ లో న్యాయం జరగదు.
    ఇంకోవైపు చూస్తే మోడల్లు, సినీ తారలు ప్రతిరోజూ బట్టలు విప్పి బికినీల్లో అంగ ప్రదర్శన చేసి ఫోటో షూట్ చేయడం
    మృగాళ్ల కు కలుషితం చేయడం అసలే అవి కామ పిచ్చి కుక్కలు.

    సినీ మోడల్స్ లో ఈ వ్యభిచారి విచ్చలవిడి ప్రవృత్తి పోవాలి.
    పూరీ జగన్ రామ్ గోపాల్ వర్మ సందీప్ రెడ్డి ఉపేంద్ర వీళ్ళు తీసే పైశాచిక సైకో చిత్రాల వల్ల కూడా ఎంతో చెడు జరుగుతుంది.

    పాకిస్థాన్ బం్లాదేశ్ లో ఆశీల పరన్ సైట్లు పూర్తిగా నిషేధించింది. మనదేశం లో ఎందుకు చేయరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరీ జగన్ రామ్ గోపాల్ వర్మ సందీప్ రెడ్డి ఉపేంద్ర వీళ్ళు తీసే పైశాచిక సైకో చిత్రాల వల్ల కూడా ఎంతో చెడు జరుగుతుంది.

      అవును బ్రదర్ ఇలాంటి డైరెక్టర్ల సినిమాల వల్ల సమాజానికి ఎంతో చెడు జరుగుతుంది..

      తొలగించండి
  2. Nude modelling గురించి నేను ఒకసారి అడిగాను. "అది నీకు అవసరమా?" అని పెద్దవాళ్ళే నన్ను తిట్టారు తప్ప మన సంస్కృతి ఈ లెవెల్‌లో ఉన్నందుకు వాళ్ళు బాధపడలేదు. మన ఇంటిలోని ఆడవాళ్ళు గడపదాటకపోతే చాలు, వేరే ఆడవాళ్ళు బట్టలు విప్పుకుని మోడలింగ్ చేసినా పర్వాలేదు అని నమ్మేవాళ్ళు ఉన్న దేశం మనది. మన రాష్ట్రం స్వాతి అనే పత్రిక ఉంది. మా చిన్నప్పుడు "ఈ రోజుల్లో సెక్స్ గురించి మాట్లాడడం తప్పని ఎవరూ అనుకోవడం లేదు" అని ఒక వైపు వ్రాస్తూనే మరో వైపు "నాకేమిటి, నేను మగాణ్ణి" లాంటి టైటిల్స్‌తో కథలు ప్రచురించేది ఆ పత్రిక. మేము ఆ పత్రిక చదివితే మా పెద్దవాళ్ళు అది లాక్కుని చింపేసేవాళ్ళు. ఒక వైపు మగవాళ్ళని ఆకర్షించడానికి సెక్స్ కథలు ప్రచురిస్తూనే మరో వైపు ఆడవాళ్ళని ఆకర్షించడానికి కుటుంబ కథలు ప్రచురించేది ఆ పత్రిక. అందు వల్ల చాలా మంది ఆడవాళ్ళు కూడా ఆ పత్రిక చదివేవాళ్ళు. ఆ పత్రిక రాష్ట్రంలోనే అత్యధిక సర్క్యులేషన్ గల వార పత్రికగా నిలిచింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వాతి సకుటుంబ సపరివార పత్రిక.
      ఒకవైపు నీతులు మరోవైపు బూతులు.

      తొలగించండి
  3. >>పాకిస్థాన్ బం్లాదేశ్ లో ఆశీల పరన్ సైట్లు పూర్తిగా నిషేధించింది.

    ప్రపంచంలో పోర్న్ చూడడంలో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. రెండవది ఇండియా..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనదేశంలో ను పోర్న్ సైట్లను పూర్తీగా నిషేదించలేరు.

      తొలగించండి