భానోదయం: మొన్నటిదాకా రాక్షసుడు అన్నారు నేడు దేవుడంటూ పొగుడుతున్నారు

Home

2, డిసెంబర్ 2019, సోమవారం

మొన్నటిదాకా రాక్షసుడు అన్నారు నేడు దేవుడంటూ పొగుడుతున్నారు

 
        మొన్నటి వరకు రాక్షసుడు అంటూ బూతులు తిట్టారు. నేడు దేవుడంటూ పొగుడుతున్నారు.



ఆర్టీసీ కార్మికులు సారీ ఇప్పుడు వీళ్ళు కార్మికులు కాదు ఉద్యోగులుగా పరిగణించాలని సీఎం చెప్పారు. వీళ్ళు గత 55 రోజులు 26  డిమాండ్ల కోసం  సమ్మె చేసి  వాటిని సాదించకపోగా అలసిపోయి  చివరకు తమకు ఏ డిమాండ్లను వద్దు కనీసం మా ఉద్యోగం మాకు ఇవ్వండని వేడుకున్నారు. ఇక మమ్మల్ని ఉద్యోగం లోకి తీసుకుంటారో లేదోనని కన్నీరుమున్నీరయ్యారు.
సమ్మె చేస్తున్నప్పుడు కొందరు మహిళ ఉద్యోగులు లు సీఎం కెసీఆర్ ని బూతులు తిట్టారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. నిన్న కేసిఆర్ ఆర్టీసి ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి వరాలు కురిపించినప్పుడు ఆనందంతో దేవుడంటూ చప్పట్లు కొట్టారు.

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కెసీఆర్ అందించిన వరాలు:

:-  ఉద్యోగ భద్రత
:- పదవి విరమణ వయసు 58 నుండి 60 ఏళ్ళకు పెంపు
:- కార్మికులు కాదు ఉద్యోగులుగా
పరిగణించాలి
:- ఉద్యోగుల తల్లి దండ్రులకు వైద్య సదుపాయం
:- ఉద్యోగుల తల్లి దండ్రులకు ఉచిత బస్సు పాసులు
:- ఉద్యోగుల పిల్లలకు ఫిజు రీయింబర్స్మెంట్
:- ఉద్యోగుల పిఎఫ్ బకాయిల చెల్లింపు
:- తాత్కాలిక ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం
:- ప్రతీ ఏట బడ్జెట్లో  వెయ్యి కోట్ల రూపాయలు ఆర్టీసీ కి కెటాయింపు
:- మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటలు వరకే డ్యూటీ.
:- ఉద్యోగులకు గృహ నిర్మాణ పథకం
:- మహిళ ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు శిశు సంరక్షణ సెలవులు
:- ఇంక్రిమెంట్లు
:- ప్రతీ ఏటా ప్రతీ ఉద్యోగి లక్ష రూపాయల బోనస్ తీసుకునేలా చర్యలు
:- ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉండదు
:- మహిళ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ
:- చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడం
:- సమ్మె చేసిన 55 రోజుల వేతనం వెంటనే చెల్లించడం

ఇన్ని ప్రయోజనాలు ఆర్టీసి ఉద్యోగులకు సీఎం ప్రకటించినప్పుడు ఉద్యోగులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇలాంటివి ముందే ప్రకటించి ఉండొచ్చు కదా అని అందరూ అనొచ్చు. కాని ఆర్టీసీ ఉద్యోగులు చేసిన తప్పు ఏంటంటే తెలంగాణ లో పెద్ద పండుగా దసరా పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించి సమ్మె చేయడం సీఎం కెసీఆర్ గారికి ఆగ్రహం తెప్పించింది. యూనియన్ నాయకుల మాటలు విని సామాన్యులకు ఇబ్బందులకు గురిచేయడం అది పండగ పూట సమ్మె చేయడం మరింత ఆగ్రహం తెప్పించింది. అందుకే ఆర్టీసి ఉద్యోగుల పట్ల  సీఎం ఇన్నాళ్లు కఠినంగా వ్యవహరించారు. సీఎం కెసీఆర్ గారికి ఆర్టీసీ ఉద్యోగుల పట్ల  ఇన్ని రోజులు ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం యూనియన్ నాయకులు.  ముఖ్యంగా అశ్వత్థామ రెడ్డి లాంటి నాయకుల పైనే సీఎం ఆగ్రహం అంతేకాని ఉద్యోగులపై కాదు. ఇలాంటి నాయకుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందని ఇలాంటి యూనియన్ నాయకులు ఉండకూడదనే సీఎం కోరుకుంటున్నారు. అశ్వత్థామ రెడ్డి లాంటి యూనియన్ నాయకుల వల్లే కొందరు ఆర్టీసీ ఉద్యోగులు బలైపోయారు. యూనియన్ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికుల చేత సమ్మెలు చేయించి వారిని ఇబ్బందులకు గురి చేస్తారు. కొందరి కార్మికుల ప్రాణాలు తీసుకునెలా చేస్తున్నారు. ఇలాంటి యూనియన్ నాయకుల తీరు ఎలా ఉంటుందంటే వీరికి నిజంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉండదు. కేవలం యూనియన్ ఎన్నికల్లో గెలవాలనో లేదా ముడుపుల కోసమో సమ్మె లు చేయిస్తారే తప్ప కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాదు. కేవలం వారి స్వార్థ  ప్రయోజనాల కోసమే ఇలా సమ్మెలు చేయిస్తున్నారు. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు జీతాలు పెంచాలని ఇలాంటి యూనియన్ నాయకులే సమ్మెలు చేయించారు. నెల రోజుల పాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.ఆ నెల రోజులు జీతం రాక కుటుంబ పోషణ కోసం నానా అగచాట్లు పడ్డారు. నెల రోజుల తర్వాత యాజమాన్యం యూనియన్ నాయకులను చర్చలకు పిలిచింది ఆ చర్చల్లో ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు.  యూనియన్ నాయకులు వచ్చి సమ్మె విరమించండి కంపెనీ నష్టాల్లో ఉంది లాభాలు వచ్చినపుడు పెంచుతారని ఏవో మాటలు చెప్పి సమ్మె విరమింప చేసారు. ఈ నెల రోజులు యూనియన్ నాయకుల మాటలు విని  కార్మికులు నానా అవస్థలు పడ్డారు.
తర్వాత తెలిసింది ఏంటంటే కంపెనీ యాజమాన్యం యూనియన్ నాయకులకు డబ్బులు ముట్టజెప్పే సరికి సైలెంట్ అయిపోయారు. అప్పటి వరకు చిన్న ఇంట్లో నివసించే యూనియన్ లీడర్లు  ఆ తర్వాత కొన్ని నెలల్లోనే పెద్ద పెద్ద  భవంతులు నిర్మించుకున్నారు. ఇది యూనియన్ నాయకుల నిర్వాకం తాము బాగు పడడం కోసం కార్మికులను పావులుగా వాడుకుంటారు. అంతేకాని నిజంగా కార్మికుల పై ప్రేమతో కాదు...

 ఎక్కడైనా యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. డబ్బుల కోసం, రాజకీయంగా ఎదగడం కోసం మాత్రమే కార్మికుల సమస్యల పై పోరాటం చేస్తున్నట్టు నటిస్తారు. డబ్బు ఆశ చూపగానే సైలెంట్ అయిపోతారు. అందుకే కార్మికులు ఇలాంటి  యూనియన్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు.


3 కామెంట్‌లు:

  1. ఈ పూర్తి సమ్మె కాలం లో చివరికి పిచ్చోళ్ళయింది ఎవరంటే బస్సుల్లేక నానా బాధలు అనుభవించిన ప్రజలే. సమ్మె కాలానికి జీతం ఇవ్వడం ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు.
    కేసీఆర్ చర్యలు విచిత్రంగా ఉన్నాయి.

    ఉద్యోగులను తిరిగి విధుల్లో చేర్చుకోవడం సరైనదే. కానీ అతిగా వరాలు ప్రకటించడం తప్పు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సమ్మెలు చేయకుండా ఉండడానికి ఇలాంటి వరాలు ప్రకటించి ఉంటారు సీఎం.

      తొలగించండి
  2. సమ్మెలను తట్టుకుని నిలబడే వారిని బట్టి ఉంటంది. ఉమ్మడి ఏపీలో బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించిన ఒక అధికారి 1970వ దశకంలో ఆంధ్రా బ్యాంకు‌ ఛైర్మన్ గా పనిచేసిన గోపాలరావు గారు. ఉద్యోగులు వంద రోజులు work-to-rule చేసినా ఖాతరు చెయ్యలేదు (బ్యాంకుల్లో work-to-rule అని సిబ్బంది పట్టుబడితే కార్యకలాపాలు నిర్వహించడం చాలా కష్టం - ముఖ్యంగా కంప్యూటరైజేషన్ ఇంకా రాని ఆ కాలంలో). తరువాత కొంత కాలానికి మొత్తం సమ్మె మొదలుపెట్టారు. గోపాలరావు గారు చలించలేదు. చివరకు దాదాపు 70 రోజులు సమ్మె తరువాత ఉద్యోగులే విరమించి డ్యూటీ కొచ్చారు. No Work - No Pay అనే షరతు మీద అనుమతించారు ఛైర్మన్ గోపాలరావు గారు. ఆ రోజుల్లో దీన్ని గురించి చెప్పుకునేవారు ప్రజలు.

    క్రింది లింక్ లో గోపాలరావు గారి మాటల్లోనే చదవచ్చు.

    ఛైర్మన్ గోపాలరావు గారి హయాంలో ఆంధ్రా బ్యాంకు‌ సమ్మె (1972)

    రిప్లయితొలగించండి