ఓలా అంటే ఒకప్పుడు క్యాబ్ సర్వీస్ అందించే సంస్థ.ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ లను తయారు చేసే కంపెనీ.
ఓలా మొదట్లో క్యాబ్ సర్వీసులను అందించి బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకుంది. జనాల నోళ్ళలో ఓలా పేరు మారుమోగింది. ఓలా ఓ పెద్ద బ్రాండ్ అయ్యింది. ఒక కంపెనీ బ్రాండ్ ఇమేజ్ వచ్చాక ఇక ఏరంగంలో ప్రవేశించిన తిరుగుండదు. అది అనుభవం లేని రంగం అయినా..
అలా క్యాబ్ సర్వీస్ అందించే ఓలా బ్రాండ్ ఇమేజ్ వచ్చాక
అంటే "జనాల నోళ్ళలో ఒక పేరు నానింది అంటే అదే బ్రాండ్ ఇమేజ్". అది ఓలాకు వచ్చింది ఒక కంపెనీకి బ్రాండ్ ఇమేజ్ వచ్చాక ఊరుకుంటుందా విస్తరించుకోవాలని ఇతర రంగాల్లో ప్రవేశించాలని చూస్తుంది. అలా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారి రంగంలోకి వచ్చింది.
బ్రాండ్ ఇమేజ్ వచ్చాక పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడతాయి. బ్రాండ్ వచ్చేవరకే కష్టపడాలి ఒకసారి వచ్చిందంటే ఇక పెట్టుబడులకు తిరుగుండదు. అలా ఓలా కు కూడా పెట్టుబడులకు కొదవలేదు.
వెనువెంటనే ఎలక్ట్రిక్ స్కూటర్ తయారి రంగంలోకి దూకి విదేశీ స్కూటర్ కంపెనీని కొనేసి చెన్నై లో ప్లాంటు రెడి చేసి ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లో విడుదల చేసారు.బ్రాండు మహిమ జనాలు విరగబడి కొన్నారు.
తర్వాత ఓలా స్కూటర్లు లో ఒక్కో సమస్య రావడం ప్రారంభం అయ్యింది. స్కూటర్ ముందు చక్రం విరిగిపోవడం,బ్యాటరీలో మంటలు రావడం, సాంకేతిక సమస్యలతో ఆగిపోవడం ఇలా పలు రకాల సమస్యలతో వినియోగదారులు ఇబ్బందులకు గురి అయ్యారు.
తమ సమస్య పరిష్కారం కోసం ఓలా కంపెనీని సంప్రదిస్తే సరైనా పరిష్కారం లభించక కోపంతో స్కూటర్లు తగలబెట్టడం,షోరూం ను కూడా తగులబెట్టారు. ఇంత జరిగినా ఓలా కంపెనీ సరైనా పరిష్కారం చూపలేదు.
వీళ్ళకి కేవలం బ్రాండ్ ఇమేజ్ తప్ప క్వాలిటీ లేదు అంతా డొల్లా..
ఈ రోజుల్లో ఎలాగోలా చేసి ఒక కంపెనీ పెట్టీ బ్రాండ్ సంపాదిస్తున్నారు దాని ద్వారా పెట్టుబడులు ఆకర్షించి ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని చూస్తున్నారు. ఇలా చేయడం తప్పుకాదు కానీ మనం ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యమైనదిగా ఉండాలి, ఆలాగే మన సేవలు వినియోగదారులకు అందుబాటులో ఎప్పుడూ ఉండాలి.అంతేకాని ఒక బ్రాండ్ సంపాందించి ఏదో చెత్త అమ్మిన జనాలు కొంటారు అనే భ్రమలో ఉండొద్దు ఇలా అయితే చివరకు బ్రాండ్ బైజూస్ అవుతుంది అంటే కనుమరుగై పోతుంది.
నా అభిప్రాయం ప్రకారం అసలు ఓలా స్కూటర్ను చూస్తేనే తెలుస్తుంది అందులో నాణ్యత లేదని,అలాగే ఆ డిజైన్ బాగుండదు అసలు జనాలు ఎలా కొంటారో వీటిని అంతా బ్రాండ్ మహిమ. అసలు ఎలక్ట్రికల్ వాహనాలు 100శాతం ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మరో పది సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఇంకా వీటిపైనా ప్రయోగాలు చేసి సమస్యలు పరిష్కరించి అప్పుడు మార్కెట్లోకి వదలాలి. అంతేకాని ఏదో చైనా నుంచి విడిభాగాలు తెప్పించి ఇక్కడ అతికించి మేడిన్ ఇండియా ఓలా అంటే నాణ్యత డొల్లే అవుతుంది.
ఇప్పుడు ఓలా కూడా మరో బైజూస్ అవుతుంది ఇందులో సందేహం లేదు..
బ్రాండ్ బైజూస్ అవుతుంది. - బతుకు బస్టాండ్ అవుతుంది.
రిప్లయితొలగించండిబహుశః: కంపెనీ వారు ఓలా బండిలో వస్తున్న లోపాలు సరిదిద్దుతారు లెండి. ఏ కంపెనీ అయినా బ్రాండు కు ఉన్న పేరును నిలబెట్టుకోవాలి అనే చూస్తుంది. ఒక భారతీయ కంపెనీ ఇంత మాత్రం పురోగతి సాధించడం విశేషమే.
ఓ లా కొని చూడండీ దాని విలువ తెలుస్తుంది
రిప్లయితొలగించండికతలెవరైనా రాయొచ్చూ చచ్చుపుచ్చని.
https://www.eenadu.net/telugu-news/business/ccpa-orders-probe-on-ola-electric/0101/124205149
తొలగించండి