భానోదయం: మా వి గన్ - మీ జ గన్

Home

5, ఏప్రిల్ 2026, ఆదివారం

మా వి గన్ - మీ జ గన్

 ఆంధ్రప్రదేశ్,తెలంగాణ విడిపోయాక రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేసిన ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కి సొంత రాజధాని ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా చేసుకొని తాత్కాలికంగా భవనాలు నిర్మించి పరిపాలనా సాగించారు..


రాజధాని నిర్మించాలంటే దశాబ్దాలు పడుతుంది అలాంటిది ఐదేళ్లలో నిర్మాణం సాధ్యం కాదు.

చంద్రబాబు నాయుడు గారి హాయాంలో అమరావతి రాజధానిగా పునాది వేసారు... 


ఐదేళ్ల తర్వాత అభివృద్ధి లేదని బాబు గారిని ఓడించి మహా మేధావి అయిన జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు..


జగన్ గారు ఎలాగూ చంద్రబాబు గారి పనులు నచ్చవు కాబట్టి అమరావతి రాజధానని అటకెక్కించి.

మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు.

ఒక రాజధాని కట్టడమే ఎన్నో ఏళ్ళు పడుతుంది 3మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు అంటే 3శతాబ్దాలు కావాలి.


మూడు రాజధానులు ప్రకటించాడు కాని అమలు చేయడం మరిచిపోయాడు, రిషికొండ తవ్వి ప్యాలెస్ కట్టాడు. రాజధాని కట్టమంటే ప్యాలెస్ కట్టాడు బహుశా రాజధాని అంటే తన సొంత ఆస్తి అనుకున్నాడేమో.


అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు 5ఏళ్ళు పోరాటం చేసినా వారిని పట్టించుకోలేదు కదా ఇబ్బందులకు గురిచేసాడు.


ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా అమోద ముద్ర వేసాక .

అమరావతి వద్దు "మా వి గన్" రాజధాని చేయాలంటాడు.


సినిమాలో కమెడియన్ చెప్పినట్టు మంచిలీపట్నం నుండి మ, విజయవాడ నుండి వి, గుంటూరు నుండి గన్ తీసుకుని మా వి గన్ అని రాజధాని పేరు పెట్టాలి అంటాడు..


దీనిపై అందరూ రకరకాల ఊర్ల పేరుతో ఆ ఊరి నుండి ఒక అక్షరం ఈ ఊరి నుంచి ఒక అక్షరం తీసుకుని చాలా హాస్యాస్పదంగా పేర్లు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మేధావి అని పొగుడుతున్నారు.


ఇంత మహా మేధావి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో నాకైతే అర్థం కాలేదు...


కాని మా వి గన్ ఆలోచనను చూసి అందరూ మాకెందుకు రాలేదు ఈ ఆలోచన అని సిగ్గుపడుతున్నారు.


జగన్ మోహన్ రెడ్డి గారు సినిమాల్లోకి వెళితే చాలా పెద్ద హాస్య నటుడు అవుతారు. 


ఆ పదాలు, ఆ ప్రాసలు మహా అద్భుతం...


మా వి గన్ - మీ జ గన్



1 కామెంట్‌:

  1. 30 వేల ఎకరాలు పైన సారవంతమైన వ్యవసాయ భూములను సేకరించి గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం చేయడం ఎందుకు. మూడు రాజధానులు, మావిగన్ ప్రతిపాదనలు అంతకన్నా అవివేకం. ఈ విధంగా వ్యవసాయ భూములు కోల్పోతే భవిష్యత్తు లో ఆహారధాన్యాల సంక్షోభం వస్తుంది.

    500-1000 ఎకరాలు విజయవాడ గుంటూరు మధ్య సేకరించి రాజధాని పరిపాలన కు అవసరమైన ముఖ్యమైన భవనాలు కడితే సరిపోయేది.

    రిప్లయితొలగించండి