అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోతుందా లేదా? 45 రోజులు వాయిదా పడుతుందా?
ఈ యుద్ధం ఆగిపోవాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
యుద్ధం ఆపడానికి ఏ దేశం ముందుకు రాలేదు.
ఎందుకంటే అక్కడ ఉన్నది అమెరికా, అందులోను డోనాల్డ్ ట్రంప్ ఎవరి మాట వినడు అని అందరికి తెలుసు కాబట్టి ఏ దేశం ఈ యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వం చేయలేదు..
కాని ఈ యుద్ధం ఆపడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుందంటే నమ్మలేని విషయం. పాకిస్థాన్ అంటే ప్రపంచంలో ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కర్మాగారం అలాంటి దేశం యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వం చేస్తే అమెరికా లాంటి అగ్రదేశం ఒప్పుకుంటుందా అని సందేహం..
అమెరికా లాంటి అగ్రదేశం పాకిస్థాన్ లాంటి చెత్త దేశం మాట వింటుంది అంటే అందులో అమెరికాకు లబ్ధిపొందే అంశం ఉంది అని అర్థం అవుతుంది..
ఆసీం మునీర్, ట్రంప్ గతంలో వైట్ హౌస్ లో భేటి అయ్యారు కాబట్టి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం తో యుద్ధం ముగించే అవకాశాలు ఉన్నాయి...
మొత్తం కాకపోయినా 45 రోజుల కాల్పుల ఒప్పందం కుదుర్చుకునే అవకాశం, హర్మూజ్ జలసంధిని తెరిచే అవకాశం ఉంది..
అమెరికా లాంటి దేశం పాకిస్థాన్ మాట వింటుంది అంటే అమెరికా కు పాకిస్తాన్ తో చాలా అవసరం ఉంది అని అర్థం.
ఇరాన్ పై భూతల యుద్ధం చేయడాని పాకిస్తాన్ భూభాగం నుండే అమెరికా సైనికులను ఇరాన్ సరిహద్దులు దాటింటి భూతల యుద్దానికి దిగడం..
చైనానుండి ఆయుధాలు ఇరాన్ కు పాకిస్తాన్ భూభాగం నుండే వస్తాయి కాబట్టి వాటిని అడ్డుకోవడం.
45 రోజులు కాల్పుల విరమణ చేసి భూతల దాడులకు ప్లాన్ చేసుకుని పాకిస్తాన్ భూభాగం నుండే ఇరాన్ లోకి ప్రవేశించి యుద్ధం చేయడం.
భవిష్యత్తులో కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి భారత్ మీద యుద్దానికి పాకిస్తాన్ కు సహాయం చేసి ఆయుధాలు అమ్ముకోవడం.
ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ను అమెరికా అంగీకరించే అవకాశం ఉంది.
లేకుంటే పాకిస్తాన్ లాంటి దేశానికి ప్రపంచంలో ఏదేశం కూడా విలువ ఇవ్వదు అలాంటి అమెరికా ఇస్తుందంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మధ్యవర్తిత్వానికి ఒప్పుకునే అవకాశం ఉంది.
పాకిస్థాన్ కు అమెరికా విలువ ఇస్తుంది అనడం కంటే తమ తమ అవసరాలకు వాడుకుంటుంది అనడం సమంజసం..
పాకిస్థాన్ మాత్రం తాము యుద్ధం ఆపగలిగాం అని గొప్పగా చెప్పుకుంటుంది. అమెరికా మా వెనకాల ఉందని మన దేశాన్ని హెచ్చరించండం చేస్తుంది..
కాని అమెరికా పాకిస్తాన్ ను ఒక పావుగా మాత్రమే వాడుకుంటుంది.
పాకిస్తాన్ తో ఇరాన్, చైనా,భారత్ వంటి దేశాలతో సరిహద్దు ఉండటం వలన అమెరికా ఆదేశాన్ని మిత్ర దేశంగా చేసుకుని తన ప్రయోజనాలు తీర్చుకుంటుంది.
అదికూడా డోనాల్డ్ ట్రంపులాంటి దుందుడుకు స్వభావం ఉన్న అధ్యక్షుడు ఉన్నంత వరకే ...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి