పల్లెల్లో ఇంకా పంచాయితి ఎన్నికలు జరగకముందే అభివృద్ది ఎలా ఉంటుందో చూపిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. పోటిపడి మరీ క్వాటర్ సీసా, నోట్లతో అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తున్నారు. ప్రతీ ఇంట్లో అరడజను పైగా మందుసీసాలతో కళకళలాడుతున్నాయి. మొత్తంగా మూడు నోట్లు,ఆరు క్వార్టర్
సీసాలతో వాళ్ళు చేసే అభివృద్ది ఏంటో చూపిస్తున్నారు. జనాలను మత్తులో ముంచుతున్నారు. నేను గెలిస్తే ఊళ్ళో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాను అని ఏ ఒక్క అభ్యర్థి చెప్పిన పాపాన పోలేదు.
సర్పంచ్ పదవికి పోటీచేసే అభ్యర్థుల దృష్టిలో ఓటర్లను గొర్రెల్లాంటి వారుగా భావిస్తారో ఏమోగాని ఇప్పటికి కూడాను మందు,నోట్లు ఆశచూపితే గెలుస్తామనే ధీమాలో ఉంటున్నారు. ఇచ్చేవాడిది తప్పు అయితే తీసుకునేవాడిది కూడా తప్పే కదా!
కాని ఓటర్లెవరు కూడా మాకు మందు డబ్బులు వద్దు ఊరిని అభివృద్ది చేయండి అని ఎవరు చెప్పరు. ఎవడిచ్చిన తీసుకోవడమే. డబ్బులు ఎవరికి ఊరికే రావు!! అన్నట్టు ఇచ్చింది పుచ్చుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు.
చదువుకోని నిరక్ష్యరాస్యులైన ఓటర్లు డబ్బుకు,మందుకు ఆశపడితే ఇక చదువుకున్న యువ ఓటర్లు వీళ్ళన్న అభివృద్ది గురించి అడుగుతారననుకుంటే అదీ లేదు ఎంత ఖర్చు అయిన పరవాలేదు పక్కోడు ఓడిపోవాలి మనం గెలవాలి అనే దానిపైనే వీళ్ళ దృష్టంతా. పంతం నీదా నాదా సై! అంటున్నారే తప్ప అభివృద్ది ఊసే ఎత్తట్లేదు. ఇక ఊరి అభివృద్ది సంగతి దేవుడెరుగు.
అసలు సర్పంచ్ ఎన్నికలు అంటే ఐదేళ్ళకోసారి వచ్చే వారం రోజుల మందు పండుగలా తయారయింది.
ఇలా అయితే ఊళ్ళు ఎప్పుడు బాగు పడుతాయి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి