భానోదయం: ఏప్రిల్ 2019

27, ఏప్రిల్ 2019, శనివారం

నాటుకోళ్ళ పెంపకం

     
నాటుకోడి

      ప్రస్తుతం అందరు నాటుకోళ్ళ మాంసం పై మక్కువ చూపుతున్నారు. ఫారం కోళ్ళ మాంసం అంత రుచిగా ఉండదు పైగా ఫారం కోళ్ళు తొందరగా ఎదగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచుతారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు. అందువలన నాటుకోళ్ళ మాంసం తినడానికి మక్కువ చూపుతున్నారు. మన నాటుకోడిని ఏ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా సహజంగా పెంచుతాం వీటి మాంసం కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కోళ్ళు అన్ని వాతావారణ పరిస్థితులను తట్టుకుంటాయి. నాటుకోళ్ళకి రోగనిరోదక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కోళ్ళ మాంసం  ఆరోగ్యానికి ఎంతో మంచిది.
         
       నేను   సహజసిద్దంగా నాటుకోళ్ళను పెంపకం చేపడుదామనుకుంటున్నాను.  నాటుకోళ్ళ పెంపకం ఎలా ఉంటుంది.. బాగుంటుందా? నాటుకోళ్ళ పెంపకంలో సలహాలు సూచనలు తెలుపగలరు. కోళ్ళ షెడ్ మా  పొలంలో వేయాలనుకుంటున్నాను. ఎవరైనా పెట్టుబడి పెట్టగలరా? ఇంకా ఏమైనా సలహాలు ఉంటే నాతో పంచుకోగలరు. 

15, ఏప్రిల్ 2019, సోమవారం

అమెరికా ఎలా ఉంటుంది


   అమెరికా ఎలా ఉంటుంది అక్కడి విశేేషాలు తెెలుసుకోవాలని అందరికి ఉంటుంది.

      తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే దేశం ఎదంటే అది  అమెరికా అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒక్కసారైననా అమెరికా వెళ్ళాలని ఉంటుంది. ఐ.టి రంగంలో ఉద్యోగాలు చేసేవారు అమెరికాలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న తెలుగు వారు చాలా మందే ఉన్నారనుకోండి. మరియు ఉన్నత చదువులకోసం వెళ్ళిన తెలుగు విద్యార్థులు ఉన్నారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న  వారు తమ కుటుంబ సభ్యులను కూడా ఎప్పుడో ఒకసారి అమెరికా తీసుకెళ్తుంటారు. ఇంకా కొంతమంది డబ్బున్న వాళ్ళు అమెరికా పర్యటనకు వెళ్ళి చూసొస్తుంటారు. వీళ్ళ సంగతి పక్కన పెడితే నాలాంటి వారు అమెరికా వెళ్ళడం ఒక కల. అమెరికా ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం, ప్రజలు , సంస్కృతి, అభివృద్ది ఇంకా అమెరికా ప్రజల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్ళాలని ఉంటుంది.

       అమెరికాను ప్రత్యక్షంగా చూడటం కుదరదు కాని
ఇంటర్నెట్ ద్వారా నా కల సాకారం అయ్యింది.  అక్కడ పరిస్థితులను అక్కడి విషయాలను మనకు తెలియజేస్తున్నారు  మన తెలుగువాడైనా వాసు గారు. వాస్ వ్లాగ్స్ (vaas vlogs) యూట్యూభ్ చానెల్ ద్వారా అమెరికా ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.

vaas vlogs

అలాగే మరొకరు కూడా అమెరికా విశేషాలను చాలా చక్కగా వివరిస్తున్నారు ఆవిడే మహాలక్ష్మీ గారు. Us lo mahalaxmi అనే యూట్యూభ్ ఛానెల్ ద్వారా అమెరికా గురించి వివరిస్తున్నారు.

US lo Mahalaxmi


 ఇతర దేశాల గురించి తెలుసుకోవడం అంటే నాకు చాలా ఆసక్తి అందులో అమెరికా గురించి అయితే ఇంకా ఆసక్తి ఎక్కువ.

అమెరికా ఎలా ఉంటుంది మరియు
అమెరికా దేశం విశేషాలు తెలియజేస్తున్న  మన తెలుగు వారికి ధన్యవాదములు.

10, ఏప్రిల్ 2019, బుధవారం

మామిడి మొక్కల నర్సరీలు కేరాఫ్ పెద్దాపూర్ గ్రామం


      ఎండాకాలం అంటే ఎండలు మండిపోతుంటాయి. చల్లని పానియాలు తాగుతు సేదతీరుతాం.
 ఎండాకాలంలో వచ్చే పండ్లు అంటే ముందుగా మనకు మామిడి పండ్లు గుర్తొస్తాయి. మండే ఎండల్లో మామిడి పండ్లతో సేదతీరుతాం.
మామిడిపండు పండ్లల్లో రారాజు. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. బంగినపల్లి మామిడి పండ్లు ఫేమస్.
     ఏ రకం మామిడి అయితే ఏంటి మామిడిపండ్ల రుచి అద్భుతం. మామిడి తోటలు మనకు అనేకం ఉన్నాయి. సంవత్సరంలో ఒకేసారి కాసే మామిడి పండ్లు ఎండాకాలం సీజన్ కాబట్టి ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంటాయి.


Mango nursey

Mango nursery






      మామిడి మొక్కల నర్సరీలకు కేరాఫ్ అడ్రస్ పెద్దాపుర్ గ్రామం. ఈ గ్రామం  సంగారెడ్డి పట్టణానికి దగ్గరలో NH9 కు అనుకుని ఉంది. ఇక్కడ అనేక నర్సరీలు ఉన్నాయి. ఎక్కువగా మామిడి మొక్కల నర్సరీలే ఉన్నాయి.
మామిడి తోటలు  పెంచాలనుకునే వారు ఇక్కడ నుండి మొక్కలను తీసుకెళ్తుంటారు.
మామిడి మొక్కలు కావలసిన వారు ఇక్కడ నుండి తీసుకెళ్ళవచ్చు. వానాకాలం మొదలయ్యే ముందు నాటుకుంటే మంచిది వర్షపు నీటికి మొక్కలు తొందరగా పెరుగుతాయి.

  ఇక నేను చాలా సార్లు చేప్తుంటాను మొక్కలు నాటండని. మాకు వీలు కాదు అనేవారు ఒక చిన్న పని చేయండి.   మీరు మామిడి పండ్లు తిన్న తర్వాత వాటి పీసులను చెత్త బుట్టల్లో పారవేయకండి. రోడ్డు వెంబడి వెలుతున్నప్పుడు అడవుల్లో కాని రోడ్డుకు ఇరువైపుల పారవేయండి.  వచ్చేది వానాకాలం కాబట్టి వాటంతట అవే మొలకెత్తుతాయి. మీకు తెలియకుండానే మొక్కలు పెంచిన వారు అవుతారు.

7, ఏప్రిల్ 2019, ఆదివారం

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం


        ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుల్లో వెనుకబడి ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళు రేపు ఏ రంగంలో రాణిస్తారు.
మరో వైపు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు నాణ్యమైన విద్యాబోధన వలన అన్ని రంగాల్లోను రాణిస్తున్నారు. ఇది తీవ్రమైన పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో  రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తుంది.  అలాంటి టెక్నాలజీని అందిపుచ్చుకుని అప్డేట్ అవ్వాలి. కాని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందంటే 70ఏళ్ళైనా ఏమీ మారలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఈ పరిస్థితి మారదా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరగదా.?

  ప్రభుత్వాలు ఎలాగు ఈ పాఠశాలలను పట్టించుకోవు. టీచర్లు కూడా ఎలాంటి సలహాలు ఇవ్వరు. వాళ్ళ జీతం వాళ్ళకు వస్తే చాలు విద్యార్థులు ఏమైపోతే ఏంటి అనుకుంటారు.

   నాణ్యమైన విద్య అంటే అర్థవంతమైన పాఠాలు చెప్పడం. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఎలా ఉంటుందో మనకు తెలుసు ఒక నల్ల బోర్డు చాక్ పీస్ అంతే మొత్తం పాఠాలు నల్ల బోర్డు పైనే. ఇలా చెప్తె ఎంత మందికి అర్థమవుతుంది చెప్పండి. పాఠం గురించి ఊహించుకోవాలి అంతే అలా ఊహించుకుని అర్థం చేసుకునే శక్తి అందరికి ఉండదు. ఈ రోజు చెప్పిన పాఠం రేపు అడిగితే చెప్పలేకపోతారు. ఎందుకంటే పాఠాలు చెప్పే విధానం అర్థం కాకపోవడమే.అదే పలాన సినిమాలో హీరో ఎవరంటే టక్కున చెప్పేస్తారు. మొత్తం సినిమా కథ చెప్పమన్న చెప్పేస్తారు. దీనికి కారణం సినిమా అనేది దృశ్యరూపం ఆకర్శనీయంగా ఉంటుంది. ఒకసారి చూస్తే అలాగే గుర్తుండి పోతుంది. అలాగని సినిమాలు చూపించమనట్లేదు. పాఠాలనే అర్థవంతంగా దృశ్యరూపంలో చూపిస్తే చాలా బాగా అర్థం చేసుకుంటారు. అదేనండి స్మార్ట్ క్లాస్ విధానం. ఈ స్మార్ట్ క్లాస్ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. అప్పుడే విద్యార్థులు అర్థవంతంగా పాఠాలు నేర్చుకుంటారు.

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసెస్ ప్రారంబించాలంటే ప్రభుత్వాల వల్ల కాదు. మనమే చేయాలి ఎలాగంటే స్వచ్ఛంద సంస్థలు గాని లేదా ఎవరైన కొంతమంది ఒక జట్టుగా ఏర్పడి ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం గురించి అవగాహన కల్పించాలి. ప్రతి పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూం ఎర్పాటు చేసేలా కృషి చేయాలి. ఇందుకు డబ్బులు ఎలా అంటే పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థి వద్ద నుండి కొంత మొత్తం వసూలు చేసి  ఈ స్మార్ట్ క్లాస్ ఎక్విప్ మెంటుకు సరిపడ డబ్బు తీసుకుంటె సరిపోతుంది. అలాగే ఉపాద్యాయుల వద్ద కూడా కొంత మొత్తం తీసుకుని
పాఠశాలలోని ఒక గదిలో స్మార్ట్ క్లాస్ సెటప్ ను సెట్ చేసుకుంటే చాలు.  ప్రొజెక్టర్, స్క్రీన్,  స్పీకర్స్, పాఠాలకు సంబందించిన మెమరీ డ్రైవ్ లు పాఠశాలల్లో అందించి వాటి ఆపరేటింగ్ గురించి ఉపాద్యాయులకు శిక్షణ  ఇచ్చేస్తే చాలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు  నాణ్యమైన విద్య బోధనను అందిచి వారి అభివృద్దికి పాటుపడుదాం.

ఈ నా ఆలోచన నచ్చినవారు  మీకు వీలైతే ఈ స్మార్ట్ క్లాస్ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయగలరు.



   

6, ఏప్రిల్ 2019, శనివారం

పవన్ కళ్యాణ్ అభిమాని

పవన్ కళ్యాణ్ సార్ మీరంటే మాకు ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేం. మీరు  దేవుడు సార్ దేవుడినైనా చూడడానికి జనాలు వస్తారో రారో కాని మిమ్మల్ని చూడడానికి లక్షల మంది వస్తారు.  అక్కడ స్థలం సరిపోక పోతే చుట్టూ ఉన్న చెట్లు, స్థంభాలు , హోర్డింగులు, ఆఖరికి కరెంట్ పోల్ కూడా వదలకుండ ఎక్కి చూస్తాం. కరెంట్ పోల్ లో పవర్ ఉంటుంది! షాక్ కొడుతుంది అనుకునేరు మీ పవర్ ముందు ఈ పవర్ ఎంత సార్. ఇంత కష్టపడే బదులు టీవీల్లో చూడవచ్చు కదా అంటారమో!? టీవీలో చూడటం కంటే స్థంభం ఎక్కి చూస్తే వచ్చే కిక్కే వేరప్పా..చూసారా  సార్ మీరంటే మాకు ఎంత అభిమానమో! ఒక్కసారైనా మిమ్మల్ని ఎదురుగా చూడాలని ఎదురు చూస్తాం. అవకాశం వస్తే గట్టిగా  గట్టిగా కౌగిలించుకుంటాం ఎంత గట్టిగా అంటే  మీకు ఊపిరి ఆడనంత గట్టిగా. కౌగిలించుకునే వీలు లేకుంటే మీ  కాళ్ళనైన పట్టుకుంటాం అదికూడా గట్టిగా ఎంతలా అంటే మీరు పట్టుకున్న మైక్ విరిగిపోయి మీరు కింద పడిపోయేంతలా. మీకు ఓపిక ఉందో లేదో మాకు అనవసరం మిమ్మల్ని హత్తుకోవడమే మాకు కావాలి. మీరు పడిపోయిన, కిందపడి గిలగిల కొట్టుకున్న మాకు అనవసరం. అలా చేయడం  మీమీద మాకు ఉన్న  అ....భిమానం.


              అంతేనా సినిమా ఫంక్షన్లలో ఎవరి సినిమా అయిన పర్వాలేదు మీ పేరు వినపడితే చాలు మాకు పూనకం వచ్చేస్తుంది మా అరుపులతో హాలు దద్దరిల్లి పోవాలసిందే ఎవరు మాట్లడానికి వీలులేకుండా. అది సార్ మీరంటే మాకు అభిమానం కాదు సార్ వీరాభిమానం.

     మీరు స్టేజీపైనా పూనకం వచ్చినట్టు ఊగిపోతు ప్రసంగిస్తుంటే మాకు పూనకాలు వచ్చేస్తాయి. అప్పుడు కూడా గట్టిగా పట్టుకోవాలని ఉంటుంది కాని సెక్యూరిటీ వాళ్ళు రానివ్వరు.
 రాష్ట్రం విడిపోయినప్పుడు బాధతో మీరు ఎనిమిది రోజులు అన్నం మానేశారని తెలిసి మేము  మీకంటే పదిరెట్లు  ఎక్కువగా బాధపడ్డాం  రాష్ట్రం విడిపోయినందుకు కాదు మీరు అన్నం మానేసినందుకు!

మాకోసం మీరు ఇంత సహనం, ఓర్పుతో  రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడుతున్నారు. అయిన మీకు వచ్చే సీట్లు మాత్రం  కూడా అంకెలల్లో నైనా  వస్తాయో లేదో. మిమ్మల్ని గెలిపించడం కోసం ఏమైనా చేస్తామో చేయమో కాని మిమ్మల్ని మాత్రం గట్టిగా గట్టిగా పట్టుకోవాడాని ఏమైనా చేస్తాం.

రాజకీయాల్లో  మార్పు తీసుకురావడం పవన్ లక్ష్యం.

పవన్ పేరు చెబితే గట్టిగా అరవడం అభిమానుల లక్ష్యం.

సీఎం కావడం పవన్ లక్ష్యం.

పవన్ ను గట్టిగా పట్టుకోవడం అభిమానుల లక్ష్యం.

మీ ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు సార్..

మిమ్మల్ని గట్టిగా పట్టుకోవడానికి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాం సార్.

జై పవన్ జై పవన్ అభిమాని

                             _ఒక పవన్ అభిమాని



5, ఏప్రిల్ 2019, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం ఎవరు

             2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలుపొందే నాయకుడు ఎవరు?
ముఖ్యంగా నాలుగు పార్టీల నేతల మధ్య పోటీ నెలకొని ఉంది. చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ గారు , పాల్ గారు. వీళ్ళందరిలో ఎవరి వైపు జనం మొగ్గు చూపుతున్నారు.

ముందుగా చంద్రబాబు గారి గురించి చూస్తే 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు.

 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపిన ఘనత చంద్రబాబు గారిదే.

ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక  కొత్త రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాడు.

ఆంధ్రుల ఎన్నో ఏళ్ళ కల పోలవరం ప్రాజెక్ట్ ను కూడా కట్టిస్తున్నాడు.

 ఇక కరువు సీమ అనంతపురానికి కియా కార్ల కంపెని తీసుకొచ్చాడు.

చిత్తూరు జిల్లాలో తిరుపతి సిలికాన్ సిటీగా మార్చే ప్రయత్నంలో కొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా వచ్చాయి.

ఇన్ని అభివృద్ది పనులు చేసిన చంద్రబాబు గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా అంటే ఈ సారికైతే లేవనే చెప్పాలి. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రతికూలతలు కూడా చాలానే ఉన్నాయి.

చంద్రబాబు గారు కేవలం కంప్యూటర్లు ఐటీ రంగం పైనే ఎక్కవగా దృష్టి పెడతారు. కాని రైతులను సామాన్యులను పట్టించుకున్న పాపాన పోలేదు ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఇప్పుడైనా.

 ఆంధ్రాను సింగపూర్ చేస్తా అమరావతిని అమెరికా చేస్తా అమలాపురం ను ఆస్ట్రేలియా చేస్తా అంటాడు.  సార్ బాబు గారు ఆంధ్రాను అమెరికాలు సింగపూర్లు చెయ్యాల్సిన అవసరం లేదు అన్నదాతలను ఆదుకోండి అంతేకాని పచ్చని పంటపొలాలను అభివృద్ది పేరుతో నాశనం చేయకండి.

దేశానికే  అన్నం పెట్టె అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని అందరికి తెలుసు కాని బాబు గారు వ్యవసాయం దండగా అంటారు. అసలు చంద్రబాబుకు రైతులంటేనే అసహ్యం.

బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ ఐదేళ్ళలో.

బాబు గారు తీసుకొచ్చిన కియా మరియు ఎలక్ట్రానిక్ విడిబాగాల కంపెనీలలో వేల  ఉద్యోగాలు వచ్చాయి కదా అని అనొచ్చు కాని వాటిలో ఎక్కవగా ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారే ఉంటారు.  ఈ కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఎంత పెద్ద కంపెనీలు వస్తే ఏం లాభం వాటి వల్ల  స్థానికులకు ఉద్యోగాలు రాకపోగా బోనస్ గా కాలుష్యం మాత్రం
ఫ్రీగా వస్తుంది. కాలుష్యం స్థానికులకు ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వారికి. ఇదేనా చంద్రబాబు గారి అభివృద్ది.

ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు.

విద్యార్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదు.

ఆరోగ్య శ్రీ పథకాన్ని అటకెక్కించాడు.

కేవలం ఐటీ ఐటీ అనడం తప్ప రైతులకు పేదలకు చేసిందేమి లేదు.

ఎన్నికల ముందు ఎవో కొన్ని పథకాలు ప్రవేశపెట్టి డబ్బులు పంపిని చేసినంత మాత్రాన మళ్ళీ గెలుస్తానని అనుకోవడం చంద్రబాబు భ్రమ. జనాలు ఎర్రి పుష్పాలు కాదు ఐదేళ్ళ నుండి ఆయన చేసిన ఘనకార్యాలను చూస్తూనే ఉన్నారు.

ఐదేళ్ళుగా రైతులకు ఆడపడుచులకు చేయలేని సాయం కేవలం ఒక నెల రెండు నెలల ముందు చేస్తే ఏమిటి ప్రయోజనం. అప్పుడు గుర్తురాలేదా? పేదలు, రైతులపై ఎన్నికలు సమీపించగానే ఎక్కడాలేని ప్రేమ పొంగుకొస్తుంది బాబు గారికి.

 పేదలను,రైతులను ఓటు బ్యాంకుగా చూస్తాడే తప్ప ఇంకోటి కాదు.

ప్రత్యేక హోదా గురించి రోజుకో మాట మాట్లాడుతుంటాడు.

అమరావతి , పోలవరం కడుతూనే ఉన్నారు ఎప్పటి వరకు కడతారండి. సగం కట్టి ఆపేస్తారు ఎందుకో ఒక వేళ బాబుగారిని గెలిపించకపోతే అవి ఆగిపోతాయని ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్ళీ గెలవాలని ప్లానింగా. రాజకీయాలలో ఇదో ఎత్తుగడ.

ఒక పనిని చేయడానికి మీకు ఐదేళ్ళు కూడా సరిపోవు దిన్ని పూర్తి చేయడానికి మళ్ళీ గెలిపించాలా. ఒక విద్యార్థి పరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయితేనే బయటికి గెంటివేస్తారు. అలాంటిది మీరు ఒక పనిని చేయడానికి ఐదు సంవత్సరాలైనా చేయకపోతే మిమ్మల్ని ఏం చేయాలి.

ఆంధ్రా ప్రజలు  బాబు గారికి మళ్ళీ ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తారా. లేదా రైతులను పేదలను పట్టించుకోనందుకు, ఐదేళ్ళైనా పూర్తి చేయని పనులవలన ఓడిస్తారా గెలిపిస్తారా  చూద్దాం.....

ఇక రెండో వ్యక్తి  వై యస్ జగన్ గారి గురించి చూస్తే

జగన్ గారి గురించి ప్రజల్లో అనుకూలతలు:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి జన హృదయనేత వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అవడం వలన  జనాల్లో ఆయనకు అభిమానం ఎక్కవ.

రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు చిరస్మరణీయం దేశంలో  ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశ పెట్టని పథకాలు ప్రవేశ పెట్టి పేదలు, రైతులకు ఎంతో మేలు చేసాడు. ఆయన పుత్రుడు జగన్ గెలిస్తే మళ్ళీ రాజశేఖర్ రెడ్డిలా పరిపాలన చేస్తాడని జనాలు భావిస్తున్నారు.

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

రాష్ట్రంలోని  13 జిల్లాల్లో పాదయాత్రలు చేస్తూ ప్రజల భాధలను దగ్గరనుండి చూసి వారికి అండగా ఉంటానని హామి ఇచ్చి ప్రజలకు దగ్గగరయ్యాడు.

ఇక ప్రతకూలతల విషయానికి వస్తే

జగన్ పై ఉన్న కేసులు.

పరిపాలన అనుభవం లేకపోవడం.

ఎక్కవ శాతం ప్రజలు జగన్ వైపే   మొగ్గుచూపుతున్నారనిపిస్తుంది.

ఇక మూడో వ్యక్తి పవన్ గురించి చూస్తే

గొప్ప సినిమా స్టార్
చిరంజీవి తమ్ముడు

రాజకీయాల్లో మార్పుకోసం తపిస్తున్న వ్యక్తి.

రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసిన వాడు . దగ్గరుండి మరీ ప్రజల కష్టాలు ఓర్పుగా వింటాడు.

 పవన్ ప్రతికూలతలు:

2009 లో ఇలాగే రాజకీయాల్లో మార్పుకోసం చిరంజీవి పార్టీని స్థాపించి అనుకున్న  ఫలితాలు సాదించలేక పార్టీని కాంగ్రేస్ లో విలీనం చేసి చేతులు దులుపుకున్నాడు. చిరంజీవిలాగే పవన్ కూడా చేస్తాడేమోనని ప్రజల భయం.

2009  లో చిరంజీవే సీ ఎం అవుతాడని అందరు అనుకున్నారు కాని రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయింది ఆయన పార్టీ.

సినిమాలు వేరు రాజకీయం వేరు పవన్ కు
రాజకీయ అనుభవం లేదు.

పవన్ కళ్యాణ్ అంటే యువతకు మాత్రమే తెలుసు పెద్దవయసు  ఓటర్లకు పవన్ అంటే చాలా మందికి తెలియదు. అలాంటప్పుడు పవన్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు.

ఇక చివరగా నాలుగో వ్యక్తి కే ఏ పాల్ ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
కామెడి పీస్ బిల్డప్ బాబాయ్.
ఆయన ఏం మమాట్లాడిన జనాలు కామెడిగానే చూస్తారు.

 పాల్  గారు సీ ఎం కాదు కదా ఒక ఊళ్ళో సర్పంచ్ కూడా కాలేరు.

చివరగా నా అంచనా ప్రకారం జగనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.

 ఏ నాయకునికి ఎంత మంది ప్రజలు అనుకూలంగా ఉన్నారంటే

 జగన్ కు 70 శాతం
 చంద్రబాబు కు 20 శాతం
 పవన్ కు 9 శాతం
 పాల్ కు 1 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారు.

ఇది కేవలం నాకు అనిపించిన అంచనా మాత్రమే.
తుది నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తారు.


2, ఏప్రిల్ 2019, మంగళవారం

గిజిగాడు గూడు

       సాదారణంగా పక్షులు గుడ్లు పెట్టడానికి గూళ్ళు కట్టుకుంటాయి. అందులో ప్రత్యేకమైనది గిజిగాడు గూడు అసలు ఈ గిజిగాడు పక్షి గూడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేం.
అందంతో పాటు రక్షణ పరంగానే కాకుండా గిజిగాడు గూడు అన్ని విధాలుగా సౌకర్య వంతంగా నిర్మిస్తుంది.



                      అన్ని పక్షి గూళ్ళు మామూలుగా గంప మాదిరి పైన తెరుచుకొని ఉంటుంది వర్షం వచ్చిన గాలి వచ్చిన పక్షి పిల్లలకు రక్షణ ఉండదు అలాగే ఇతర ప్రాణుల నుండి కూడా రక్షణ ఉండదు.
కాని గిజిగాడు గూడు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. గిజిగాడు పక్షి గూడు నిర్మించే సమయంలో ముందుగా రక్షణ పరంగా ఉండేందుకు ముళ్ళ చెట్టును ఎంపిక చేసుకుంటుంది. తుమ్మ లేదా  ఈత చెట్ల కొమ్మల అంచున గూడును నిర్మింస్తుంది. చిన్న చిన్న పుల్లలతో ఎంతో ఓపికగా చాలా పటిష్టంగా గూడును అల్లుతుంది. ఈ గూడును బోర్లించిన కూజాలాగా నిర్మిస్తుంది. గూడులోకి వెళ్ళే మార్గం కిందినుండి ఉంటుంది. దాని లోపల ఇంకెంత అందంగా మలుస్తుందో, అందులో ఎన్ని గదులు ఉంటాయో! ఎంత మెత్తని పరుపులు నిర్మింస్తుందో కదా! మగపక్షి మాత్రమే గూడుని నిర్మిస్తుందట. తన పిల్లలని కంటికి రెప్పల కాపాడుకుంటాయి. ఆడపక్షి పిల్లల పోషణ చూస్తుందట.





ఈ గిజిగాడు పక్షులు అన్ని ఒకే చోట చాలా గుళ్ళు నిర్మించుకుంటాయి ఎందుకంటే ఇతర పక్షుల నుండి కాపాడుకోవడానికి అన్ని కలిసి కట్టుగా ఒక సమూహంలా ఒకే చోట గూళ్ళు నిర్మించుకుంటాయి.
ఏదైన ఆపద వస్తే అన్ని కలిసి వెళ్ళిపోతాయి.
ఎంత అద్భుతం కదా ఈ గిజిగాడు గూడు. అంత చిన్న పక్షి ఇంత అద్భుతంగా ఎంతో అందంగా మరియు చాలా పటిష్టంగా తన గూడును నిర్మింస్తుందంటె ఆశ్చర్యం వేస్తుంది.
 మనుషుల్లాగా అది డ్రాయింగులు వేయదు ఎలాంటి పనిముట్లు వాడదు ఏ కంపెనీల నుండి గూడుకు సరిపోయే పుల్లలను తీసుకురాదు. అయిన ప్రకృతిలో దొరికే సహజ సిద్దమైన వాటితోనే గూడును నిర్మించి ప్రకృతికి ఏలాంటి నష్టం కలుగజేయకుండా తన నైపుణ్యంతో గూడుని నిర్మించి ప్రకృతికి కొత్త అందాన్ని సంతరిస్తుంది.
గిజిగాడు గూడు నిర్మాణం ఇంజనీరింగ్ లకు సైతం అర్థం కానంతలా అద్భుతంగా  ఉంటుంది.



  గిజిగాడు గూడు ప్రకృతిలో ఓ అందమైన  అద్భుతమైన వింత.

ఓ గిజిగాడు గూడు కట్టడంలో నీవే మొనగాడు.

1, ఏప్రిల్ 2019, సోమవారం

ఏప్రిల్ ఫూల్ కాదు ఏప్రిల్ కూల్ చేద్దాం.


           ఏప్రిల్ 1 అంటే అందరికి తెలుసు ఏప్రిల్ ఫూల్ డే. అసత్య కథనాలతో అందరూ   ఆటపట్టిస్తూ ఫూల్ చేస్తుంటారు. ఇలా ఆటపట్టించడం సరదాగానే ఉంటుంది కాని కొందరు నిజమే అనుకుని కంగారుపడుతుంటారు. ఇలాంటివి చేయడం కొందరికి సంతోషం కలిగిన ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా అందరిని ఫూల్స్ చేసామని సంతోషిస్తుంటారు. ఏప్రిల్ 1 ఫూల్స్ డే ఇదొక్క రోజే ఫూల్స్ ని చేయడం అనుకుంటారు. ప్రతిరోజు చాలా మంది ఫూల్స్ని చేస్తునే ఉంటారు.
ఇ‌లా కొత్తగా ఒకరోజు ఫూల్స్ చేయడం ఏంటి ప్రతిరోజు కొందరు కొందరిని ఫూల్స్ చేస్తూనే ఉంటారు.

ఉదా: కాలేజికి వెళ్ళిన విద్యార్థులు సినిమాలకి షికారులకు వెళ్ళి తల్లిదండ్రులను ఫూల్స్ చేస్తుంటారు.

ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు ఒక రోజులో అయిపోయే పనులు చేయడానికి రోజుల తరబడి తిప్పుతూ ప్రజలను ఫూల్స్ చేస్తుంటారు.

ఎన్నికల్లో రాజకీయ నాయకులు హామీలిచ్చి ప్రజలను ఫూల్స్ చేస్తుంటారు.

విత్తన కంపెని వాడు నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను ఫూల్స్ చేస్తాడు.

ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ కు వెళితే ధళారులు రైతులను ఫూల్స్ చేస్తారు.


  • కొందరు డాక్టర్లు రోగులను ఫూల్స్ చేస్తారు.


దొంగ బాబాలు అమాయక భక్తులను ఫూల్స్ చేస్తారు.

కొందరు క్రైస్తవ ఫాదర్ లు తమ గారడీలతో ప్రజలను ఫూల్స్ చేస్తుంటారు.

ఆకరికి రోడ్లమీద పండ్లు అమ్మేవారు కూడా వినియోగదారులకు మంచి పండ్లు చూపించి పాడైపోయిన పండ్లు ఇచ్చి ఫూల్స్ చేస్తుంటారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఏప్రిల్ ఫూల్ డేనే ఇంకా కొత్తగా ఎందుకండి ఏప్రిల్ ఫూల్ డే.

సరే ఈ విషయాలన్ని వదిలేయండి ఇవి రోజు జరిగేవే వీటిని ఎవరు మార్చలేరు. ఎందుకంటే మనది భారతదేశం.

మనకు సంవత్సరమంతా ఏప్రిల్ ఫూల్స్ డేనే కనుక ఈ  ఒక్కరోజు అయిన అందరూ ఒక మొక్క నాటి
   "ఏప్రిల్ ఫూల్ కాదు ఏప్రిల్  కూల్ చేద్దాం".