ఎండాకాలం అంటే ఎండలు మండిపోతుంటాయి. చల్లని పానియాలు తాగుతు సేదతీరుతాం.
ఎండాకాలంలో వచ్చే పండ్లు అంటే ముందుగా మనకు మామిడి పండ్లు గుర్తొస్తాయి. మండే ఎండల్లో మామిడి పండ్లతో సేదతీరుతాం.
మామిడిపండు పండ్లల్లో రారాజు. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. బంగినపల్లి మామిడి పండ్లు ఫేమస్.
ఏ రకం మామిడి అయితే ఏంటి మామిడిపండ్ల రుచి అద్భుతం. మామిడి తోటలు మనకు అనేకం ఉన్నాయి. సంవత్సరంలో ఒకేసారి కాసే మామిడి పండ్లు ఎండాకాలం సీజన్ కాబట్టి ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంటాయి.
మామిడి మొక్కల నర్సరీలకు కేరాఫ్ అడ్రస్ పెద్దాపుర్ గ్రామం. ఈ గ్రామం సంగారెడ్డి పట్టణానికి దగ్గరలో NH9 కు అనుకుని ఉంది. ఇక్కడ అనేక నర్సరీలు ఉన్నాయి. ఎక్కువగా మామిడి మొక్కల నర్సరీలే ఉన్నాయి.
మామిడి తోటలు పెంచాలనుకునే వారు ఇక్కడ నుండి మొక్కలను తీసుకెళ్తుంటారు.
మామిడి మొక్కలు కావలసిన వారు ఇక్కడ నుండి తీసుకెళ్ళవచ్చు. వానాకాలం మొదలయ్యే ముందు నాటుకుంటే మంచిది వర్షపు నీటికి మొక్కలు తొందరగా పెరుగుతాయి.
ఇక నేను చాలా సార్లు చేప్తుంటాను మొక్కలు నాటండని. మాకు వీలు కాదు అనేవారు ఒక చిన్న పని చేయండి. మీరు మామిడి పండ్లు తిన్న తర్వాత వాటి పీసులను చెత్త బుట్టల్లో పారవేయకండి. రోడ్డు వెంబడి వెలుతున్నప్పుడు అడవుల్లో కాని రోడ్డుకు ఇరువైపుల పారవేయండి. వచ్చేది వానాకాలం కాబట్టి వాటంతట అవే మొలకెత్తుతాయి. మీకు తెలియకుండానే మొక్కలు పెంచిన వారు అవుతారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి