భానోదయం: బోరున విలపిస్తున్న ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు

12, జూన్ 2019, బుధవారం

బోరున విలపిస్తున్న ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు

     


           అయ్యా చంద్రబాబు మీరు లేకపోతే ఎట్లాగయ్యా మా బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. అన్నదాత సుఖీభవ రద్దు చేశామంటున్నారు. రుణమాఫీ చేయమంటున్నారు ఇట్లగయితే మేం ఎలా వ్యవసాయం చేసేది అంటూ రైతులు  చంద్రబాబు వద్ద గొల్లున ఏడుస్తున్నారు. అయ్యా చంద్రబాబు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు భూములరేట్లు పడిపోయాయి ఇలాగయితే మేం బతికెదెట్ల అంటూ
రాజధాని చుట్టు పక్కల ప్రాంత ప్రజలు చంద్రబాబు వద్ద వాపోతున్నారు.

     సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని చూసే మేము బీటెక్ చదువుకున్నాం రెపోమాపో జాబ్ వస్తుంది అనుకున్నాం. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే  మాకు జాబు వచ్చేలా లేదు అంటూ నిరుద్యోగులు బోరున విలపిస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని ఆధర్శంగా తీసుకునే మా పిల్లల్ని చదివిస్తున్నాం ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంటీ? మీరు ఓడిపోయిన తర్వాత ఇక ఇక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు రావట, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతాయట ఇలాగయితే మా పిల్లల భవిష్యత్ ఏంటని చంద్రబాబు గారి వద్ద పిల్లల తల్లిదండ్రులు బోరున విలపించారట. రైతులు, రాజధాని ప్రాంత ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని తమ కష్టాలను చెప్పుకుని బోరున విలపించారు.

బాబుగారు...

మళ్ళీ మీరొస్తేనే భూముల రేట్లు పెరుగుతాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి,
 కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి,

 రైతులకు అన్నదాత సుఖీభవ వస్తుంది,
రైతులకు రుణమాఫీ అవుతుంది,

మా పిల్లల భవిష్యత్ బాగుంటుంది మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలని, తమ కష్టాలను తీర్చాలని ప్రజలు నిన్న  చంద్రబాబు వద్ద బోరున విలపించారట.

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీరు చిత్తశుధ్ధిగా ఈ మాటలు అన్నారో లేదో తెలియదు. ఒకవేళ వెటకారమే ఐనా కొంతగా ఐనా నిజం. కొన్ని పెట్టుబడులూ కొన్ని కంపెనీలూ ఇప్పటికే వెనుతిరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

భానోదయం చెప్పారు...

ఇప్పుడు బాబుగారు ఏం చేయగలరు. అధికారం వచ్చేవరకు ఆగమంటారు.

Jai Gottimukkala చెప్పారు...

"కొన్ని పెట్టుబడులూ కొన్ని కంపెనీలూ ఇప్పటికే వెనుతిరిగినట్లు వార్తలు వస్తున్నాయి"

రావాండీ మరి, "వార్తాపత్రికల" పేరుతో నడుపుతున్న కులగజ్జి పచ్చబాకాలలో ఇవి కాక ఇంకేమి రాస్తారు?

అప్పట్లో ఆంధ్రకు రావాలనుకున్న బహుళజాతి కంపెనీ వారిని "వద్దు గుజరాత్ వెళ్ళండి" అంటూ మోడీ గారే స్వయంగా ఒత్తిడి చేసారని పుక్కిటి పురాణాలు రాసిన CBN Chandrajyothy వెర్రిమొర్రి బాధాకృష్ణ లాంటోళ్ళు ఇంకా కట్టుకథలు రాస్తూనే ఉంటారు.

భానోదయం చెప్పారు...

చంద్రజ్యోతి పత్రికలోనే వచ్చింది..

అజ్ఞాత చెప్పారు...

గొట్టిముక్కల వారి వెకిలి వెటకారాలు కొత్తవి కావు. ఏవి ముందుకు వస్తాయో ఏవి వెనక్కి పోతాయో కాలం తేలుస్తుంది.

Jai Gottimukkala చెప్పారు...

"ఏవి ముందుకు వస్తాయో ఏవి వెనక్కి పోతాయో కాలం తేలుస్తుంది"

ఒబామా గెలిస్తే సర్వనాశనం అవుతుందని అమెరికా తెల్ల జాత్యహంకారులు అన్నారు. తెలంగాణ వస్తే పరిశ్రమలు తరలిపోతాయని, కరెంటు లేక అంధకారంలో ముణిగిపోతామని ఇదే పచ్చమీడియా రాసింది. ఈ తరహా fear mongering జోస్యాలు నిజం కాలేదన్నది కాలం నేర్పిన పాఠాలు.

సూర్య చెప్పారు...

అట కబురులెందుకు? వైఎస్ హయాం లో ఏయే కంపెనీలు పెట్టారో వివరిస్తూ రాస్తే సరిపోతుందిగా.

భానోదయం చెప్పారు...

చంద్రబాబు నాయుడు ఒక్కడే రాష్ట్రాన్ని పాలించగలడు, ఇంకెవ్వరూ పాలించలేరని రాధాక్రిష్ణ గారి అభిప్రాయం... అనకుంటా

భానోదయం చెప్పారు...

చంద్రబాబు ఓడిపోయినంత మాత్రాన రాష్ట్రం ఏదో అంధకారంలోకి వెళ్ళిపోతుంది, పాలన స్థంబించిపోతుంది అన్నట్టు ఉన్నాయి చంద్రబాబును సపోర్ట్ చెసే పత్రికలు...