బైక్, స్కూటర్ ఏది బెస్ట్
ఈ రోజుల్లో బయటికి వెళ్లి ఏపని చేయాలన్నా బైక్ తప్పనిసరిగా ఉండాలి. కోవిడ్ వల్ల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అంతగా నడవడం లేదు. పైగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అన్నిచోట్లా ఉండదు. పల్లెటూళ్ళలో అసలే ఉండదు. సిటీలో కూడా అన్నిచోట్లకు బస్సు సౌకర్యం ఉండదు. ఆటోలో వెళ్ళాలంటే ఎక్కువ మొత్తంలో చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదికాక టైం కి ఆటో కాని బస్ కాని ఉండదు. కోవిడ్ వల్ల ఎక్కువగా ఆటోలు, బస్సు లు కూడా తిరగడం లేదు. ఒకవేళ తిరిగిన అంతమంది లో వెళ్ళాలంటే వైరస్ భయం.
ఇన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం అదేంటంటే బైక్ కొనుక్కోవడం. టైం కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వైరస్ భయము ఉండదు. ఈ సమయంలో ప్రతి ఇంట్లో బైక్ ఉండాల్సిందే. లేకపోతే ఏపని జరగదు. కాబట్టి ప్రతీ ఒక్కరు కొనాలి అని చూస్తారు. అంటే అందరూ కాదు బండి లేని వాళ్ళు.
ఇప్పుడు మార్కెట్లో బండి కొనాలంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి "బైక్" మరొకటి "స్కూటర్" ఈ రెండింటిలో ఏది కొనాలని చాలామందికి డౌట్ వస్తుంది. మరి అలాంటప్పుడు బైక్ బెటరా స్కూటర్ బెటరా.? మనకు ఏది కంఫర్ట్ తెలుసుకోవాలి.
ముందుగా బైక్ గురించి తెలుసుకుందాం.
ప్లస్ పాయింట్స్:-
బైక్ చూడడానికి లుక్ బాగుంటుంది.
ఎక్కువ మైలేజీ ఇస్తుంది.
మెయింటెనెన్స్ తక్కువ.
దూర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.
మైనస్ పాయింట్స్:-
గేర్లు, క్లఛ్ మళ్ళీ మళ్ళీ మారుస్తూ ఉండాలి.
బైక్ పై ఏదైనా లగేజీ తీసుకెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది.
బైక్ లో గూడ్స్ స్పేస్ ఉండదు.
బైక్ ను ఇంట్లో అందరూ నడపలేరు.
స్కూటర్ గురించి చూద్దాం.
ప్లస్ పాయింట్స్:-
స్కూటర్ కి గేర్లు ఉండవు కాబట్టి మళ్ళీ మళ్ళీ గేర్లు మార్చే పని ఉండదు.
ఎలాంటి లగేజీ అయినా స్కూటర్ పై తీసుకుని రావచ్చు.
గ్యాస్ సిలిండర్ గాని, బియ్యం బస్తాలు గాని కిరాణా వస్తువులు కూరగాయలు సులభంగా తీసుకుని రావచ్చు.
ఇంట్లో ఎవరైనా సులభంగా నడపగలరు. ఆడవాళ్ళు కూడా నడపడానికి అనుకూలంగా ఉంటుంది.
మైనస్ పాయింట్స్:-
స్కూటర్ బైక్ అంత స్టైలిష్ గా ఉండదు.
మెయింటెనెన్స్ కాస్తా ఎక్కువ.
బైక్ కంటే మైలేజ్ తక్కువగా ఇస్తుంది.
దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండదు.
రెండింటి లో తేడాలు గమనించాక ఏది బెస్ట్ అంటే స్కూటర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు స్టెల్ ముఖ్యం కాదు కంఫర్ట్ ముఖ్యం.
మాటిమాటికీ గేర్లు మార్చే తలనొప్పి ఉండదు.ఎలాంటి లాగేజీ అయినా సులభంగా తీసుకుని రావచ్చు.
స్కూటర్ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే అనుకుంటారు కాని ఎవరైనా నడపొచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు సైతం సులభంగా నడపగలరు.
ముఖ్యంగా ట్రాఫిక్ లో నడపడానికి, లగేజీ తీసుకురావడానికి స్కూటర్ ది బెస్ట్ ఆప్షన్.
బైక్ కంటే స్కూటర్ అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బైక్ తీసుకుని ఎవరూ లాంగ్ డ్రైవ్ లకు వెళ్ళారు. నిత్యం ఈ ట్రాఫిక్ , ఈ గుంతలు రోడ్లపైనే తిరగాలి. కాబట్టి స్కూటర్ కొనడం బెటర్.
డిజైన్ పరంగా, లుక్ పరంగా ఇప్పుడు చాలా మంచి స్కూటర్స్ మార్కెట్లో ఉన్నాయి.
అందులో నాకు నచ్చింది అయితే activa 6g బాగుంటుంది అని అనుకుంటున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి