భానోదయం: గాడిద పాల బిజినెస్ లక్షల్లో లాభాలు. మా ఫ్రాంచైజీ తీసుకోండి కోట్లు సంపాదించండి.

17, నవంబర్ 2024, ఆదివారం

గాడిద పాల బిజినెస్ లక్షల్లో లాభాలు. మా ఫ్రాంచైజీ తీసుకోండి కోట్లు సంపాదించండి.

 గాడిద పాల బిజినెస్ లక్షల్లో లాభాలు... 




గాడిద పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. మెడిసిన్, కాస్మోటిక్స్ లో వాడుతున్నారు.. ఇప్పుడు గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. లీటరు గాడిద పాలు 1600/- రూపాయలు. ముందు ముందు 2000/- ఇంకా 7000/- వేల వరకు వెళ్ళొచ్చు. కాబట్టి ఈ బిజినెస్ చేసి నెలకు లక్షల్లో సంపాదించండి. 


గాడిదలు మాదగ్గరే ఉంటాయి కొనండి ఒక గాడిద వచ్చేసి 150000/- మాత్రమే. ఎన్ని గాడిదలు కొంటె అంతలాభం. 50 కొంటె ఒక రోజుకి 50లీ ×1600=80,000/- నెలకి 24,00,000/- మీ పెట్టుబడి రెండు నెలల్లో తీరిపోయి మూడో నెల నుండి అంతా లాభమే.


మా ఫ్రాంచైజీ తీసుకునెందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి.

అదేంటంటే:-


*మా ఫ్రాంచైజీ ఫీజు 5లక్షలు

*మా దగ్గర ఒకేసరి 50గాడిదలు కొనాలి 

*గాడిదల కోసం ఆధునిక షెడ్డు లు నిర్మించుకోవాలి 

*పాలను నిల్వ చేయడానికి ఫ్రీజర్ లు ఉండాలి

*గాడిదలను మేపడానికి,పాలు పితకడానికి ట్రైనింగ్ ఇచ్చి పని వాళ్ళను మేమే  పంపిస్తాం 

*ఫాం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

*గాడిదల ఫాం మేమే నిర్మించి ఇస్తాం అందుకు డబ్బు కట్టండి...


ఇవి కండీషన్లు


ఇది విని ఒకాయన 50 గాడిదలు కొంటే,,,,

లాభం లెక్క వేసుకున్నాడు

రోజుకు 50గాడిదలు 50లీ పాలు×1600=80,000/-

నెలకి 80,000×30=24,00,000/-

సంవత్సరానికి 2 కోట్ల 88 లక్షలు..


వెంటనే క్లాస్ కు వెళ్ళాడు 50వేలు కట్టాడు.

ఫ్రాంచైజీ కీ 5,50,000/- కట్టాడు.

35,00,000/- కట్టి 50 గాడిదలు తీసుకున్నాడు.

గాడిదల ఫాం, ఫ్రీజర్ లు, కెమెరాలు,హంగులు అన్నింటికి కలిపి 70 లక్షలు వెచ్చించాడు,.


70+35+5.5+.5=1 కోటి 11 లక్షలు పెట్టుబడి పెట్టాడు.


పనివారు వాళ్ళు గుజరాత్ వాళ్ళంట వారికి వసతి భోజనం కల్పించి నలుగురికి నెలకి 50వేలు 


మొదటి రెండు నెలల్లో రెండుసార్లు మాత్రమే పాలు తీసుకెళ్ళారు. కాని డబ్బులు వేయలేదు. సరే ఇస్తారులే నమ్మకస్తులే ఇంత పెట్టుబడి పెట్టాం అని అలా 11 నెలలు చూసారు. పితికిన పాలు అలానే ఉన్నాయి. పని వాళ్ళకు మరో 5 లక్షలు ఫాం మెయింటెనెన్సికి కలిపి మొత్తంగా 1కోటి 30 లక్షలు అయ్యింది..


పాలు తీసుకెళ్ళడం లేదు ఫోన్లో సంప్రదిస్తే సమాధానం లేదు. ఇక లాభం లేదనుకుని తమిళనాడులోని అతని ఆఫీసుకి వెళ్ళి అడిగితే వారంలో ఇస్తాను అని అన్నాడు.  వారం తర్వాత అతని జాడలేదు 

అప్పుడు తెలిసింది ఏంటంటే పోయాం... మోసం..

కోట్ల రూపాయలు మోసపోయారు..


ఒక పది రూపాయలు  పేదవాడికి దానం చేయడానికి పదిసార్లు ఆలోచిస్తారు ఈరోజుల్లో. లక్షల, కోట్ల రూపాయలు ఇలా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించారా??


ఈ రోజుల్లో మనిషికి ఆశ కాదు అత్యాశ విపరీతంగా పెరిగిపోయింది.. డబ్బు,డబ్బు లాభాలు, లాభాలు కోట్లకు పడగెత్తాలి పెద్ద పెద్ద బంగళాలు కట్టాలి,పెద్ద కార్లలో తిరగాలి. అందరిలో కంటే మనమే గొప్పగా బ్రతకాలి ఇలా అత్యాశకు పోయి ఉన్నదంతా ఊడ్చేసుకుని ఇప్పుడు బాధపడుతున్నారు.


ఆశకు హద్దు ఉండాలి. మోసం చేసిన వాడిది తప్పే. కాని మీ అత్యాశే వాడి లాభం... లాభాల లెక్కలేసుకుని గాల్లో తెలిపోతారే తప్ప అది ఎంత వరకు సాద్యం ఆలోచించరు.

ఇలాంటి స్కాం లు ఎన్ని జరిగినా దురాశపరులు మోసపోతూనే ఉంటారు...


7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

గాడిద పాలు తాగటం అనేది తలుచుకుంటేనే వామిటింగ్ చేసుకోవాలి అనిపిస్తుంది.

గాడిద పాలతో సబ్బులు యాడ్ కూడా కనిపించింది.

వ్యాపారం చేయడానికి ఇంకేమీ దొరకలేదు.

కాదేదీ వ్యాపారానికి అనర్హం

గాడిద పాలు కన్నా
బూడిద మేలు.


Zilebi చెప్పారు...

మీరేమో ఇలా అంటారు గాని~‌‌ తాతగారేమో ఆహా ఒహా నా గాడిదలూ అంటూ ఆకాశానికెత్తేస్తూ వుంటారు :)


భానోదయం చెప్పారు...

ఏ తాత గారడీ...

భానోదయం చెప్పారు...

అత్యాశపరులను దోచుకోవడమే నేటి ఫ్రాంచైజీ వ్యాపారం..

Zilebi చెప్పారు...

ఏకవీరులు

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“భానోదయం” గారు,
// “ అత్యాశపరులను దోచుకోవడమే నేటి ఫ్రాంచైజీ వ్యాపారం..” //

అత్యాశాపరులను దోచుకోవడం అన్ని కాలాల్లోనూ జరుగుతుండేది, జరుగుతోంది.

ఇప్పుడు కార్పొ”రెట్ట”లు వచ్చిన తరువాత తేడా ఏమిటంటే మాధ్యమాల్లో తెలివైన ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా ముందు అత్యాశని కలిగించడం, తరువాత దోచుకోవడం తేలిక పని అవుతుంది.

భానోదయం చెప్పారు...

ఇప్పుడు 4G టెక్నాలజీతో దోచుకుంటున్నారు..