పంటలకు కృత్రిమ ఎరువులు,పురుగు మందులు వాడటం వలన పంటల దిగుబడి ఎలా ఉన్నా నష్టాలు మాత్రం అనేకం భూసారం కోల్పోవడం, రైతులు అనారోగ్యాల పాలవడం, ఖర్చులు పెరగడం, పర్యావరణం దెబ్బతినడం జరుగుతుంది.
మరియు రసాయనాల అవశేషాలు కలిగిన ఆహారం తినడం వలన ప్రజలు కూడా అనారోగ్యం భారిన పడుతున్నారుమరి దీనికి పరిష్కారం సేంద్రీయ వ్యవసాయ చేయడం. కాని సేంద్రీయ వ్యవసాయం అందరికి సాద్యపడక పోవచ్చు. అలాంటి వారికోసం మరియు అందరు రైతులు
వాడుకునేలా తయారు చేసిందే ఈ వేస్ట్ డీకంపోసర్ దీని ధర కేవలం 20రూపాయలు మాత్రమే. వేస్ట్ డీకంపోసర్ పంటలకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. చీడపీడలనుండి పంటలను కాపాడుతుంది మరియు పంటలకు ఎరువుగాను ఉపయోగపడుతుంది. భూమిలో సారాన్ని పెంచి పంటలు అధిక దిగుబడులు వచ్చేలా తోడ్పడుతుంది. చీడపీడలు సోకినపుడు ఈ ద్రావణాన్ని పంటలపై పిచికారి చేయవచ్చు.
ఈ వేస్ట్ డీకంపోసర్ ను తయారు చేసింది కేంద్రప్రభుత్వ సంస్థ "నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్" ఇది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉంది.
వేస్ట్ డీకంపోసర్ ను వాడే విదానం :
20 రూపాయల వేస్ట్ డీకంపోసర్ డబ్బాలోని పదార్థాన్ని ఒక ప్లాస్టక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకుని అందులో వేసి అందులో 2కీలోల నల్ల బెల్లాన్ని వేసి రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం కర్రతో తిప్పాలి అలా వారం రోజుల పాటు తిప్పుతూ ఉంటె నుురగ వస్తుంది మరియు పులిసిన వాసన వస్తుంది అలా వచ్చినపుడు పంటలకు వాడుకోవడానికి సిద్దంగా ఉందని గమనించాలి. అలా తయారయిన ద్రావణాన్ని నీటితోపాటు పొలం అంత పారేలా చేయాలి దీనివలన భూసారం పెరుగుతుంది. పంటలకు చీడపీడలు ఆశించినప్పుడు నేరుగా పంటలపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం రెండు విదాలుగా ఉపయోగ పడుతుంది. ఒకసారి తయారు చేసుకున్న ద్రావణాన్ని కొద్ధిగా ఉంచుకుని మళ్ళీ అందులో బెల్లం నీరు కలిపి ఎన్నీ సార్లైనా వాడుకోవచ్చు. దీనిలో సూక్ష్మజీవులు పెరుగుతునే ఉంటాయి. అలా తయారు చేసుకున్న ద్రావణాన్ని కొద్దిగా ఉంచుకొని మళ్ళీ నీళ్ళు బెల్లం కలిపితే మళ్ళీ తయారవుతుంది. ఈ వేస్ట్ డీకంపోసర్ ఒకసారి కొంటే చాలు ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు. ఈ వేస్ట్ డీకంపోసర్ ని వాడి చాలా మంది రైతులు అధిక దిగుబడులు సాధించారు. రసాయనిక ఎరువులు ,మందులు వాడకపోవడం ఖర్చులు తగ్గడం అధిక దిగుబడులు రావడం వలన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు... ఈ వేస్ట్ డీకంపోసర్ ని అన్ని పంటలకు వాడవచ్చును .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి