తెలుగు సినిమా ఇండస్ట్రీ ముద్దుల్లో మునిగి తేలుతుంది సినిమాల్లో నే కాదు ఆడియో ఫంక్షన్లలో కూడా ఈ సీన్లు చూస్తున్నాం.
తెలుగు సినిమాల్లో ముద్దు అనేది ఇప్పుడు ట్రెండ్. తెలుగు సినిమా మూడు ముద్దులు ఆరు హగ్గులతో విజయవంతంగా సాగిపోతుంది.బాలీవుడ్ లో మాత్రమే కొందరు హీరోలకు మాత్రమే పరిమితమయ్యే ముద్దు సీన్లు ఇప్పుడు టాలీవుడ్ లో కొత్తగా వస్తున్న హీరోలకి, డైరెక్టర్లని స్టార్లని చేస్తున్నాయి.
అబ్బో ఈ ముద్దు సన్నివేశాలు మామూలుగా ఉండటం లేదు మితిమీరి పోతున్నాయి. అసలు సెన్సార్ బోర్డు పని చేస్తుందా లేదా అన్నట్టు ఉంది. కుటుంబంతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి పోయింది. దీనిపై ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రేక్షకులు ఏది చూస్తే అదే తీస్తాం! అంటు సమాధానమిస్తున్నారు కొత్తగా వస్తున్న డైరెక్టర్లు. మంచి సినిమాలు చూస్తే నువ్వు చూస్తావ ?? అంటు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
ముద్దులు, హగ్గులు లేకుండా సినిమాలు తీస్తే ఎవరు చూడటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు ఏది చూస్తే అదే తీస్తాం అనే ధోరణిలో కొత్తగా వస్తున్న దర్శకులు బాహాటంగానే చేబుతున్నారు. కాని మంచి కథ ఉంటే ఇలాంటి అశ్లీల దృశ్యాలు అవసరం లేదని వీరికి తెలియదు. కొత్తగా వస్తున్న దర్శకులు మూడు ముద్దులు ఆరు హగ్గులు ఉంటే చాలు సినిమా హిట్టు అయిపోతుందని భావిస్తున్నారు.
సినిమా అనేది ఒక బలమైన మీడియా సినిమాల ప్రభావం జనాలపై ఎంతో ఉంటుంది.
సినిమా అంటే వ్యాపారం డబ్బుకోసమే సినిమాలు తీస్తాం సమాజం గురుంచి మాకెందుకు అని అంటున్నారు నేటి దర్శకులు.
ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఏమో.??🤔🤔
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి