ఎన్నికల సర్వేల్లో లగడపాటి సర్వే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అన్ని సర్వేలు ఏమోకాని లగడపాటి సర్వేలు అంటే జనాలకు ఆసక్తి ఎక్కువ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి గారి సర్వే బొక్క బోర్ల పడింది. అంతటితో సర్వేల సన్యాసం తీసుకుంటాడనుకున్నారందరు. కాని మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ తో పాటు ఏపి అసెంబ్లీ ఎన్నికల తన సర్వేలు ప్రకటించారు. పార్లమెంటు ఫలితాలు ఎలా ఉన్నా ఏపి అసెంబ్లీ ఫలితాలపై లగడపాటి సర్వే మీదే అందరికి ఆసక్తికరంగా మారింది.
లగడపాటి సర్వే ప్రకారం ఏపి అసెంబ్లీ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన తన సర్వే ప్రకటించాడు.
ఇందులో తెదేపాకు 90 నుండి 110 సీట్లు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 65 నుండి 69 సీట్లు.
జనసేనకు 3 సీట్లు.
ఇతరులకు 1 నుండి 5 సీట్లు వస్తాయని తన ఫలితాలు ప్రకటించాడు.
మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి సర్వే ఏమైంది ఆయన ప్రకటించిన ఫలితాలన్ని తలకిందులైపోయాయి. ఆయన నిజంగా సర్వే చేయలేదు కేవలం తనకు ఇష్టమైన పార్టీలు నాయకులకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించి వారిని సంతోషపరిచాడే తప్ప అది నిజమైన సర్వే కాదు. ఇప్పుడు కూడా అలాగే ఉందనిపిస్తుంది ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి గారు చంద్రబాబు గారికి అనుకూలంగా ఫలితాలు ప్రకటించాడే తప్ప అది నిజమైన సర్వే మాత్రం కాదు. ఈ సారి కూడా లగడపాటి సర్వే బొక్క బోర్ల పడబోతుంది ఇది మాత్రం పక్క. ఇక ఇంతటితో లగడపాటి గారు సర్వేలకు సన్యాసం తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. అప్పుడు కూడా ఇంకా సర్వేలు చెస్తూ ఉంటే మాత్రం ఆయన ఒక జోకర్ ల జనాల్లో మిగిలిపోతారు.
చంద్రబాబు గారికి అనుకూలంగా ఫలితాలు వస్తాయని ప్రకటించిన లగడపాటిగారు. చంద్రబాబు గారికి ఓకింత సంతోషం కలిగించారు. కాని చంద్రబాబు గారికి మాత్రం మళ్ళీ సీఎం అవుతానో కాదో అని బయపడిపోతున్నారు. అధికారంలో ఉండికూడా ఈసీని నిందిస్తున్నారు. వ్యవసాయం దండగ అన్న హైటెక్ బాబు గారు హైటెక్ సిటీని ఆంద్రప్రదేశ్ కి పరిచయం చేసి ఐటీ స్పెల్లింగ్ కి అర్థం చెప్పిన బాబు గారు ఇప్పుడు మాత్రం అదె ఐటీ రంగానికి చెందిన EVM లను నమ్మడం లేదు. అధికారంలో ఉండికూడా తను గెలుస్తానో లేదో అని బయపడి పోతున్న బాబు గారు ఒకవేళ అపోజిషన్ లో ఉండి ఉంటే అధికార పార్టీ వాళ్ళు అధికార బలంతో తనను గెలవనీయలేదని దుమ్మెత్తిపోసేవారు. ఈసారి ఒకవేళ బాబుగారు ఓడిపోతే EVM ల వల్లే ఓడిపోయామని తెపుతారు. అంతేకాని తన అసమర్థ పాలన అని ఒప్పుకోడు. ఏది ఏమైన లగడపాటి గారి సర్వే వల్ల బాబు గారు ఫలితాలు వచ్చేవరకు ఫ్రస్ట్రేషన్ లేకుండా కొంచెం ఫన్ గా ఉంటాడు.
3 కామెంట్‌లు:
పచ్చ కుల మూకలు చేసే లుచ్చా లఫంగి లత్కోరు పనులు త్వరలోనే ముగిసిపోతాయి.
లగడపాటి రాజగోపాల్ చెప్పే బోగస్ సర్వేలు అతగాడి భార్యలు కూడా నమ్మరు.
లగడపాటి సర్వేలను తెలుగు ప్రజలు ఎవరూ నమ్మరు.
ఆయన గెలుస్తుంది అని చెప్పే పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి