ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా...
సరదాగా యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు స్క్రోల్ చేసుకుంటు వెళ్తున్న ఒక వీడియో దగ్గర ఆగాను ఆ విడియో థంబ్నెల్ చూస్తే ఎవరికైనా చూడాలనిపిస్తుంది ఎందుకంటే అందులో "ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా?"!!! అని ఉంది. ఇదేదో బాగుందే అని ఓపెన్ చేసా "హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు" అంటూ ఓ వ్యక్తి తన నటచాతుర్యాన్నంత రంగరించి యూట్యూబ్ చూసే వాళ్ళంతా తన స్నేహితులు అన్నట్టు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాపేరు బికారి అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలాగో తెలుసా!!! అంటూ కొశ్ఛన్ వేశాడు. అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే. ఆన్లైన్లో లక్షలు సంపాందించవచ్చు. మీ దగ్గర ఒక కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు డబ్బు సంపాదించవచ్చు అని, డబ్బు చెట్లకు కాస్తుంది కేవలం మనం వాటిని తెంపుకుని తెచ్చుకోవడమే అన్నంతగా ఈజీ అన్నట్టు చెబుతున్నాడు. ఆన్లైన్లో ఎలా డబ్బు సంపాదించవచ్చు అని ఫేవరేట్ హీరో సినిమాని ఫస్ట్ డేట్ ఫస్ట్ షో చూస్తున్న ఫ్యాన్స్ లా ఆత్రుతతో చూస్తున్న ఆ వీడియోను నేను . ఏం లేదు ఫ్రెండ్స్ మీరు చేయవలసిందల్లా సింపుల్ గా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఎర్రిపప్ప అని టైప్ చేయండి. అందులో ఫస్ట్ వచ్చే ఎర్రిపప్ప ఆప్ ఓపెన్ చేసి నా రిఫరల్ కోడ్ తో సైన్ అప్ చేయండి. అలా సైన్అప్ అయిన తర్వాత మీరు మరి కొంతమందికి ఈ ఆప్ ను రిఫర్ చేయండి అంతే సిపుల్ మీకు డబ్బులే డబ్బులు బావిలో బకెట్ వేసి నీళ్ళు తోడినట్టు ఈ ఆప్‌లో డబ్బులు తోడుకోవచ్చు అని చెప్పాడు. ఆహా! ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఇంత సులువా నేను సంపాదిస్తాను అని అతను చెప్పిన ఆప్ డౌన్లోడ్ చేసి అతని రిఫర్ కోడ్ ఎంటర్ చేసా అంతే 50రూపాయలు వచ్చాయి. మరో ఇద్దరి ద్వారా ఈ ఆప్ డౌన్లోడ్ చేయించా 2 రూపాయలు వచ్చాయి. అతికష్టం మీద ఓ పదిమంది చేత ఆప్ డౌన్లోడ్ చేయించా. 10 రూపాయలు వచ్చాయి. ఇంకా చాలా మంది చేత ఈ ఆప్ డౌన్లోడ్ చేయించాలని తెలిసిన వారికి రిఫర్ చేసా. ఒక్కరు కూడా డౌన్లోడ్ చేయలేదు కదా పైగా నాకే రిఫర్ చేస్తున్నారు. అప్పటికే వారు కూడా ఈ ఆప్ డౌన్లోడ్ చేసుకున్నారు. నాకు ఈ ఆప్‌లో 60రూపాయలు వచ్చాయి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుందామనుకుంటే 200 పూర్తయితే గాని ఈ ఆప్ లోనుండి డబ్బు తీసుకోలేరు అని మేసేజ్ వస్తుంది. నాకు 200రూపాయలు రావాలంటే ఇంకా 140 మంది చేత డౌన్లోడ్ చేయించాలి. అంతమంది చేత డౌన్లోడ్ చేయించడం అసాధ్యం.
ఈ ఆప్ లో లక్షలు సంపాదించడం కూడా అసాధ్యం అని ఇదంతా ఫేక్ అనుకున్న.
కాని ఈ ఆప్ లో ఎక్కువ డబ్బు సంపాదించిన వారి వివరాలు ఉన్నాయి అందులో యూట్యూబ్ లో ఈ ఆప్ గురించి చెప్పి నాచేత ఈ ఆప్ డౌన్లోడ్ చేయించిన వ్యక్తి వివరాలు ఉన్నాయి అందులో అతని సంపాదన లక్షల్లో ఉంది. జనాలని ఎర్రిపప్పలని చేసి అతడు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇలాంటి వారు యూట్యూబ్ లో చాలానే ఉన్నారు జనాలకు పెద్ద సేవ చేస్తున్నట్టు, డబ్బు సంపాదించేందుకు దారి చూపిస్తున్నట్టు బిల్డప్ కొడుతుంటారు.
నిజమే ఈ ఆప్‌లో లక్షలు సంపాదించవచ్చు కాని వారు చెప్పిన విధంగా కాదు. ఎలాగంటే మనం కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో రిఫర్ చేస్తే డబ్బులు ఇచ్చే ఏదో ఒక ఆప్ గురించి అద్దిరిపోయే వీడియో చేసి డౌన్లోడ్ చేసుకునేలా మసాలా దట్టించి పెట్టండి. వీడియో థంబ్నెల్ మాత్రం "ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా" , "ఇంట్లో కూర్చుని రోజుకి పదివేలు సంపాదించడం ఎలా" , "ఈ ఆప్ మిమ్మల్ని కోటీశ్వరులని చేస్తుంది" , "ఈ ఆప్ డౌన్లోడ్ చేసి వదిలేయండి మీరు వద్దన్నా డబ్బు వస్తుంది" అంటూ వీడియో థంబ్నెల్ పెట్టి యూట్యూబ్‌లో అప్లోడ్ చేయండి అంతే మీరు వద్దన్నా డబ్బు వస్తూనే..... ఉంటుంది....
మన వీడియోలు ఎవరు చూస్తారు అంటారా? ఇప్పుడు అందరు గూగుల్ లో ఎక్కువగా
సెర్చ్ చేసేది ఏంటో తెలుసా.! how to earn money online అని.
ఆహా ఏమి ఐడియా గురూ ....!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి