భానోదయం: 2019

Home

6, డిసెంబర్ 2019, శుక్రవారం

సెల్యూట్ సజ్జనార్ సార్. పోలీస్ అంటే మీలా ఉండాలి.. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తుంది..


దిశ ఉదంతంలో నేరస్థులకు ఇంత త్వరగా శిక్ష పడుతుందని అస్సలు ఊహించలేదు. ఆ మృగాలను ఎన్కౌంటర్ చేయడం సరియైనదే. వారం రోజుల్లోనే న్యాయం జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేరం రుజువైతే నేరస్థులను కోర్టులు, ఆ పై కోర్టులు అని తిప్పకుండా ఇలా ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్.
ఇంత త్వరగా న్యాయం చేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
   
    పోలీస్ కమీషనర్ సజ్జనార్ సార్ మానవ మృగాల పట్ల మీరు సింహ స్వప్నం.
2008 లో వరంగల్లో ఇప్పుడు హైదరాబాద్ లో మృగాలకు త్వరగా శిక్ష విధించి (ఎన్కౌంటర్ చేసి) బాధితులకు న్యాయం చేసారు. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తుంది. వి సెల్యూట్ సజ్జనార్ సార్.. సరిలేరు నీకెవ్వరు... మీలాంటి పోలీసులే ఈ సమాజానికి కావాలి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నాను. 

5, డిసెంబర్ 2019, గురువారం

ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటారు. కానీ సామాన్యులపైనే మొత్తం భారం వేస్తున్నారు.

   


       రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉంటాయి. పప్పులు, కూరగాయలు, బియ్యం, డీజిల్, పెట్రోల్, రవాణా చార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి మనకు ప్రతీరోజు అవసరమే. వీటి ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. ఈ ధరల పెరుగుదల దల వల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలు. అంటే రోజు కూలీలు, చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, కిరాణా షాపుల్లో, బట్టల షాపుల్లో పనిచేసే  వారికి నెలకు పదివేల దాటి జీతం రాదు.
 ఇప్పుడున్న ధరలకు నెలకు పదివేల రూపాయల జీతం ఏ మూలకు సరిపోతుంది. ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి చిన్న చితక పనులు చేసే వారికి జీతాలు మాత్రం పెరగవు.

   ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఎక్కువగా భారం పడేది సామాన్యులకు మాత్రమే.
ఇక మిగితా వారిపై ఈ ధరల ప్రభావం అంత ఉండదు ఎందుకంటే వీరికి వచ్చే నెల జీతాలు భారిగానే ఉంటాయి కాబట్టి వారిపై ధరల పెరుగుదల ప్రభావం ఏమాత్రం ఉండదు.

ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుంటే ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగకైనా తక్కువలో తక్కువ నెల జీతం 30,000 రూపాయలు ఉంటుంది ఇది కనీసం గరిష్టంగా లక్ష రూపాయల జీతం కూడా వచ్చే ఉద్యోగులు ఉన్నారు. వీరికి జీతంతో పాటు అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి. PF, ESI, లాంటి సౌకర్యాలు ఉంటాయి.  మరియు ప్రతీ మూడూ నెలలకోసారి ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఇలా మూడు నెలలకోసారి జీతాలు పెరగడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు వీరికి ఏమాత్రం భారం పడదు.

 ఇక ప్రైవేటు ఉద్యోగాలకు కూడా జీతాలు భారీగానే ఉంటాయి. అలాగే అలవెన్సులు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ధరలు పెరుగుదల వల్ల ఎలాంటి భారం పడదు.

వ్యాపారస్తులకు కూడా  ధరలు పెరుగుదల ఎలాంటి భారం పడదు. పైగా వీరికి ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను కొని ఎక్కువ మొత్తంలో నిలువ చేసుకుంటారు. వాటి ధరలు పెరిగినప్పుడు అధిక మొత్తానికి  విక్రయించి కోట్లు సంపాదించుకుంటున్నారు‌.

      ఉత్పత్తి తగ్గినప్పుడు ధరలు పెరగడం సహజం.
కాని వ్యాపారస్తులు కృత్రిమంగా నిత్యవసర వస్తువల కొరత సృష్టించి ధరలు పెంచేసి కోట్లు సంపాదిస్తున్నారు.

 నిత్యవసర వస్తువల ధరలు ఏ విధంగా పెరిగిన చివరకు భారం పడేది సామాన్యులకు మాత్రమే.
వీళ్ళను పట్టించుకునే నాథుడే ఉండడు. వీళ్ళు ఎలాగోలా బతుకు బండిని ముందుకు లాగాల్సిందే..
అదే ప్రభుత్వ ఉద్యోగులయితే తమకు జీతం సరిపోవడం లేదని సమ్మెలు చేసి వారికి కావాల్సిన డిమాండ్లను సాదించుకుని ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తున్నారు.


     ఉదాహరణకు మొన్నటి వరకు సమ్మె చేసిన ఆర్టీసి వారినే తీసుకుందాం. 55 రోజులు సమ్మె చేసి ఇటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసారు. సమ్మె చేసినప్పుడు ఇబ్బందులకు పడింది సామాన్యులే. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసింది ఇప్పుడు కూడా  భారం పడేది సామాన్యులకే. ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. పని చేయకుండా 55 రోజులు సమ్మె చేసిన వారికి జీతాలు ఇస్తున్నారు. ఇంకా వీరికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించారు. ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కావాల్సిన డబ్బు ఎలా వస్తుందండి. సామాన్యుల ముక్కు పిండి వసూలు చేయాల్సిందే కదా??
ఆర్టీసీ ఉద్యోగులు తమకు జీతాలు సరిపోవడం లేదని సమ్మెలు చేసి వారి డిమాండ్లను సాధించుకున్నారు. మరీ చిన్న చితక ఉద్యోగులు, రోజు కూలీలు ఎవరిని అడిగి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ దేశంలో గూర్తింపు ఉన్న ఉద్యోగులు మాత్రమే బతకాలా?? సామాన్యుల బతుకులు ఏమైనా పరవాలేదా ? వీళ్ళ గోడు ఎవడు పట్డించుకుంటాడు? ఏ నాయకుడు వింటాడు?

ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఎవరు కూడా ధరల పెరుగుదల భారం వారిపై పడనీయరు. సామాన్యులపై వేసి వారి నడ్డి విరిచి పాతాళానికి తొక్కే స్తున్నారు. వాళ్ళు మాత్రం పైకెదుగుతున్నారు.
ఇలాంటప్పుడు సమాజంలో ఆర్థిక అసమానతలు ఎలా తొలగిపోతాయి.

      నా విన్నపం ఏమిటంటే చిన్న చితక పనులు, రోజు కూలీలు,కిరాణా షాపులు, బట్టల షాపులు, చిన్న పరిశ్రమలలో పనిచేసే వారందరూ ఒక యూనియన్ గా ఏర్పడి  మన సమస్యలను పరిష్కరించుకోవాలి. మనకు కూడా ఇంక్రిమెంట్లు, అలవెన్సులు, PF, ESI వంటి సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, పెద్ద పెద్ద పరిశ్రమల ఉద్యోగులు తమ సమస్యల కోసం సమ్మెలు చేసి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. అలాంటిది ఎలాంటి గుర్తింపు లేని ఈ ఉద్యోగాలు చేస్తూ ఎన్ని రోజులు ఇలా చాలి చాలని జీతాలతో బ్రతుకుతారు. మనం లేనిదే అక్కడ పని జరగదు. ఏ యాజమాని కూడా పని వాళ్ళు లేనిదే వ్యాపారం చేయలేడు. అందువల్ల మనం కూడా సమ్మెలు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలి...

3, డిసెంబర్ 2019, మంగళవారం

తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుండి సంస్కారవంతంగా పెంచితేనే సమాజంలో నేరాలు,ఘోరాలు జరగవు.


    
      ఇప్పుడు సమాజంలో 14 నుండి 25 ఏళ్ళ యువకులకు విలువలు అంటే ఏమిటో తెలియదు. పెద్దలంటే గౌరవం లేదు. మహిళల పట్ల గౌరవం లేదు. తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వడం లేదు.
పాఠశాల స్థాయి నుంచే వీరు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పేది వినరు వారికి ఎదురు తిరుగుతున్నారు. అలాంటప్పుడు ఉపాధ్యాయులు మాత్రం ఏం చేస్తారు. మొక్కుబడిగా తమ పాఠాలు తాము చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకు సార్ మాకు ఈ చదువులు అనే విద్యార్థులు ఉన్నారు. వీరికి తెలుగు కూడా సరిగా చదవడం రాదు. ఎలాగోలా పది వరకు చదివి బయటకు వచ్చి ఆటోలో, లారీలో నడుపుకుంటూ అన్ని అడ్డమైన అలవాట్లు నేర్చుకుని నేరాలు చేసే స్థాయికి ఎదుగుతున్నారు.
  
        ఇప్పుడున్న యువతకు పెద్దలు పట్ల, మహిళల పట్ల, సమాజం పట్ల గౌరవం లేకపోవడానికి మరో కారణం ఇప్పుడొస్తున్న చెత్త సినిమాలు. ఆ మధ్య ఓ సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని ఈ సినిమా పోస్టర్ అసభ్యకరంగా ఉందని పెద్దాయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు గారు ఇలాంటి సినిమాల వల్ల యువత చెడిపోతుందని ఇలాంటి సినిమాలను అడ్డుకోవాలని చెబితే ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ 'చిల్ తాతయ్య' అంటూ చీప్ గా తీసిపారేసాడు. ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ అంటూ మూసుకుని కూర్చో అనే విధంగా మాట్లడాడు. ఆ సినిమాలో ఏముందో నాకయితే అర్థం కాలేదు కానీ జనాలు మాత్రం అంత పెద్ద హిట్టు చేసారు.  ఈ సినిమాలో బూతులు,ముద్దులు, ఎప్పుడు మందు తాగుతూ,డ్రగ్స్  తీసుకుంటూ ,  కామంతో రగిలిపోతూ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మన హీరో విజయ్ దేవరకొండ.  ఇంత చెత్త మూవీ జనాలతో పాటు సెలబ్రిటీలకు  ఎలా నచ్చిందో   నాకిప్పటికీ అర్థం కాదు. ఈ మూవీ రిలీజ్ కి ముందు ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మనం ప్రేమించిన అమ్మాయి పై ఎవడైనా చెయ్యి వేస్తే ఊరుకుంటామా అంటూ బూతులు తిడతాం, కొడతాం అన్నాడు. అవును ఎవరమైనా ఇలాగే చేస్తాం. మరీ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఒక సీన్లో వేరే వాడి భార్యతో ఎంతో కామంతో హీనంగా ప్రవర్తిస్తాడో చూసాం. ఇంతలో ఆమె భర్త వచ్చే సరికి అతని ముందు నుంచే హీరో విజయ్ దేవరకొండ వెళ్ళిపోతాడు. మరీ అప్పుడు ఆమె భర్త ఏమి చేయాలి హీరోని??? అంటే నువ్వు వేరే ఆడవాళ్ళను ఏమైనా చేయవచ్చు మీ ఆడవాళ్ళను ఎవరు ఏమి అనవద్దు ఎందుకంటే నువ్వు హీరోవనా??? నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యోచ్చా??? నీలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసూకునే యువత పాడైపోతున్నారు. ఇలాంటి సినిమాలు చూసి ఎవడికి వాడు హీరోలా ఫీలయిపోతున్నారు. సమాజం పట్ల, స్త్రీల పట్ల గౌరవం లేకుండా తయారవుతున్నారు. 

     యువత చెడిపోవడానికి మరో కారణం స్మార్ట్ ఫోన్ లు పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. వారు ఫోన్లలో ఏమి చూస్తున్నారో తల్లిదండ్రులు పట్టించుకోరు. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి మంచిగా చదువుకోవచ్చు కానీ ఎంతమంది దానిని చదువుకోసం ఉపయోగిస్తున్నారు. వాటిలో ఎక్కువగా బూతు సైట్లే చూస్తున్నారు.
  
     ప్ర‌స్తుతం యువత ఎవరు చెప్పినా వినే స్థితిలో లేరు. ఎవరి మాటలు మేమెందుకు వినాలి అనే దోరణిలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్ చేయించుకుని తల్లిదండ్రులు కొనిచ్చిన బైకులపై అవసరం ఉన్నా లేకున్నా రోడ్లపై పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వేగంగా వెలుతుంటారు.  మహిళలు కనిపిస్తే చాలు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. పదిమంది ఒక చోట చేరి రోడ్డుపై వచ్చిపోయే ఆడవారిని ఎగాదిగా చూస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తుంటారు. ఇది రోజు మా ఊర్లో జరిగేదే..... కాని ఏం చేస్తాం చూసి చూడనట్లు వెళుతున్నాను... ఎందుకంటే ఒకరు చెబితే వినే స్థితిలో లేరు వీళ్ళు. మొక్కై వంగనిదీ మానై వంగునా అన్నట్టు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను సభ్యతగా పెంచితే ఇలా ఆవారాగాళ్ళలా తయారవకుండా ఉంటారు.

     సమాజంలో పెద్దల పట్ల, ఆడపిల్లలు, మహిళల పట్ల యువకులు గౌరవంగా ఉండాలంటే తల్లి దండ్రులు తమ పిల్లలను చిన్నప్పటినుండే సంస్కారవంతంగా పెంచాలి.

ఉపాధ్యాయులు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఒక లక్ష్యం ఏర్పరుచుకునేలా చేసి లక్ష్యం సాధించే విధంగా ప్రోత్సహించాలి.

సినిమాలు తీసేవారికి సామాజిక బాధ్యత ఉండాలి.
యువత చెడిపోయే విదంగా సినిమాలు తీయకూడదు.

డైరెక్టర్ సందీప్ వంగా లాంటి వారు బూతు సినిమాలు తీయకుండా ఉండాలి.

 మద్యపానం నిషేదించాలి.

అప్పుడే సమాజంలో నేరావు ఘోరాలు జరగకుండా ఉంటాయి.

2, డిసెంబర్ 2019, సోమవారం

మొన్నటిదాకా రాక్షసుడు అన్నారు నేడు దేవుడంటూ పొగుడుతున్నారు

 
        మొన్నటి వరకు రాక్షసుడు అంటూ బూతులు తిట్టారు. నేడు దేవుడంటూ పొగుడుతున్నారు.



ఆర్టీసీ కార్మికులు సారీ ఇప్పుడు వీళ్ళు కార్మికులు కాదు ఉద్యోగులుగా పరిగణించాలని సీఎం చెప్పారు. వీళ్ళు గత 55 రోజులు 26  డిమాండ్ల కోసం  సమ్మె చేసి  వాటిని సాదించకపోగా అలసిపోయి  చివరకు తమకు ఏ డిమాండ్లను వద్దు కనీసం మా ఉద్యోగం మాకు ఇవ్వండని వేడుకున్నారు. ఇక మమ్మల్ని ఉద్యోగం లోకి తీసుకుంటారో లేదోనని కన్నీరుమున్నీరయ్యారు.
సమ్మె చేస్తున్నప్పుడు కొందరు మహిళ ఉద్యోగులు లు సీఎం కెసీఆర్ ని బూతులు తిట్టారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. నిన్న కేసిఆర్ ఆర్టీసి ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి వరాలు కురిపించినప్పుడు ఆనందంతో దేవుడంటూ చప్పట్లు కొట్టారు.

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కెసీఆర్ అందించిన వరాలు:

:-  ఉద్యోగ భద్రత
:- పదవి విరమణ వయసు 58 నుండి 60 ఏళ్ళకు పెంపు
:- కార్మికులు కాదు ఉద్యోగులుగా
పరిగణించాలి
:- ఉద్యోగుల తల్లి దండ్రులకు వైద్య సదుపాయం
:- ఉద్యోగుల తల్లి దండ్రులకు ఉచిత బస్సు పాసులు
:- ఉద్యోగుల పిల్లలకు ఫిజు రీయింబర్స్మెంట్
:- ఉద్యోగుల పిఎఫ్ బకాయిల చెల్లింపు
:- తాత్కాలిక ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం
:- ప్రతీ ఏట బడ్జెట్లో  వెయ్యి కోట్ల రూపాయలు ఆర్టీసీ కి కెటాయింపు
:- మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటలు వరకే డ్యూటీ.
:- ఉద్యోగులకు గృహ నిర్మాణ పథకం
:- మహిళ ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు శిశు సంరక్షణ సెలవులు
:- ఇంక్రిమెంట్లు
:- ప్రతీ ఏటా ప్రతీ ఉద్యోగి లక్ష రూపాయల బోనస్ తీసుకునేలా చర్యలు
:- ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉండదు
:- మహిళ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ
:- చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడం
:- సమ్మె చేసిన 55 రోజుల వేతనం వెంటనే చెల్లించడం

ఇన్ని ప్రయోజనాలు ఆర్టీసి ఉద్యోగులకు సీఎం ప్రకటించినప్పుడు ఉద్యోగులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇలాంటివి ముందే ప్రకటించి ఉండొచ్చు కదా అని అందరూ అనొచ్చు. కాని ఆర్టీసీ ఉద్యోగులు చేసిన తప్పు ఏంటంటే తెలంగాణ లో పెద్ద పండుగా దసరా పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించి సమ్మె చేయడం సీఎం కెసీఆర్ గారికి ఆగ్రహం తెప్పించింది. యూనియన్ నాయకుల మాటలు విని సామాన్యులకు ఇబ్బందులకు గురిచేయడం అది పండగ పూట సమ్మె చేయడం మరింత ఆగ్రహం తెప్పించింది. అందుకే ఆర్టీసి ఉద్యోగుల పట్ల  సీఎం ఇన్నాళ్లు కఠినంగా వ్యవహరించారు. సీఎం కెసీఆర్ గారికి ఆర్టీసీ ఉద్యోగుల పట్ల  ఇన్ని రోజులు ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం యూనియన్ నాయకులు.  ముఖ్యంగా అశ్వత్థామ రెడ్డి లాంటి నాయకుల పైనే సీఎం ఆగ్రహం అంతేకాని ఉద్యోగులపై కాదు. ఇలాంటి నాయకుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందని ఇలాంటి యూనియన్ నాయకులు ఉండకూడదనే సీఎం కోరుకుంటున్నారు. అశ్వత్థామ రెడ్డి లాంటి యూనియన్ నాయకుల వల్లే కొందరు ఆర్టీసీ ఉద్యోగులు బలైపోయారు. యూనియన్ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికుల చేత సమ్మెలు చేయించి వారిని ఇబ్బందులకు గురి చేస్తారు. కొందరి కార్మికుల ప్రాణాలు తీసుకునెలా చేస్తున్నారు. ఇలాంటి యూనియన్ నాయకుల తీరు ఎలా ఉంటుందంటే వీరికి నిజంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉండదు. కేవలం యూనియన్ ఎన్నికల్లో గెలవాలనో లేదా ముడుపుల కోసమో సమ్మె లు చేయిస్తారే తప్ప కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాదు. కేవలం వారి స్వార్థ  ప్రయోజనాల కోసమే ఇలా సమ్మెలు చేయిస్తున్నారు. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు జీతాలు పెంచాలని ఇలాంటి యూనియన్ నాయకులే సమ్మెలు చేయించారు. నెల రోజుల పాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.ఆ నెల రోజులు జీతం రాక కుటుంబ పోషణ కోసం నానా అగచాట్లు పడ్డారు. నెల రోజుల తర్వాత యాజమాన్యం యూనియన్ నాయకులను చర్చలకు పిలిచింది ఆ చర్చల్లో ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు.  యూనియన్ నాయకులు వచ్చి సమ్మె విరమించండి కంపెనీ నష్టాల్లో ఉంది లాభాలు వచ్చినపుడు పెంచుతారని ఏవో మాటలు చెప్పి సమ్మె విరమింప చేసారు. ఈ నెల రోజులు యూనియన్ నాయకుల మాటలు విని  కార్మికులు నానా అవస్థలు పడ్డారు.
తర్వాత తెలిసింది ఏంటంటే కంపెనీ యాజమాన్యం యూనియన్ నాయకులకు డబ్బులు ముట్టజెప్పే సరికి సైలెంట్ అయిపోయారు. అప్పటి వరకు చిన్న ఇంట్లో నివసించే యూనియన్ లీడర్లు  ఆ తర్వాత కొన్ని నెలల్లోనే పెద్ద పెద్ద  భవంతులు నిర్మించుకున్నారు. ఇది యూనియన్ నాయకుల నిర్వాకం తాము బాగు పడడం కోసం కార్మికులను పావులుగా వాడుకుంటారు. అంతేకాని నిజంగా కార్మికుల పై ప్రేమతో కాదు...

 ఎక్కడైనా యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. డబ్బుల కోసం, రాజకీయంగా ఎదగడం కోసం మాత్రమే కార్మికుల సమస్యల పై పోరాటం చేస్తున్నట్టు నటిస్తారు. డబ్బు ఆశ చూపగానే సైలెంట్ అయిపోతారు. అందుకే కార్మికులు ఇలాంటి  యూనియన్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు.


29, నవంబర్ 2019, శుక్రవారం

మలబద్ధకం తగ్గిపోవాలంటే ఇలా చేయండి 100% తగ్గిపోతుంది.



              మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఈ ఒక్క మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఒంట్లో వచ్చే రోగాల్లో 70% మలబద్ధకం వల్లే వస్తాయి. అందులో పైల్స్, ఫిషర్, ఫిస్టులా, IBS, IBD, అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అజీర్తి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వ్యాధులు మలబద్ధకం వల్లే వస్తాయి కదా..

       ఈ సమస్యను చాలా మంది పట్టించుకోరు. దీనివలన ముందు ముందు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నివారించుకోవాలి. మలబద్దకం ఉందని డాక్టర్ వద్దకు వెళితే డాక్టర్లు ఏవో ట్యాబ్లెట్స్, టానిక్ లు ఇచ్చి పంపిస్తారు. అవి వాడినన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత మళ్ళీ ఈ సమస్య వస్తుంది. పైగా ఈ ట్యాబ్లెట్లు వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంకొందరు ప్రకృతి వైద్యులు చెబుతుంటారు నీళ్ళు ఎక్కువగా తాగితే మలబద్దకాన్ని జాడిచ్చి తన్నుతుంది అని చెబుతుంటారు. ఉదయం లేవగానే  1¼లీటరు గోరు వెచ్చని నీరు తాగి పది నిమిషాలు నడిస్తే మోషన్ ఫ్రీగా అవుతుంది అని చెబుతుంటారు. నేను ఇలాగే చేసాను కానీ మోషన్ రాలేదు కాని వికారం, తల నొప్పి మాత్రం వచ్చాయి. పది నిమిషాల తర్వాత మూత్రం వచ్చింది కాని మోషన్ రాలేదు. ఇలా ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని తాగడం వలన మోషన్ అందరికి రాకపోవచ్చు. మరి అలాంటి వారు ఏం చేయాలి?
        

  మలబద్ధకం పోవాలంటే పీచు పదార్థాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అంటారు. ఆ పీచు అంటే ఏమిటో , అంది ఎందులో ఉంటుందో చాలా మందికి తెలియదు. పీచు ఉండే పదార్థాలు, పండ్లు వెతికి  తెచ్చుకుని తినాలంటే అంత ఆర్థిక స్థోమత అందరికి లేకపోవచ్చు. మరి అలాంటి వారు ఏమి చేయాలి??

  నేను ఓ డాక్టరను కాను, ప్రకృతి వైద్యున్ని కాను, సైంటిస్ట్ ని కాను కాని నాకు కలిగిన అనుభవం ప్రకారం చెబుతున్నాను మలబద్ధకానికి చాలా చవకైన మందు ఉంది ఇది ప్రతీ ఊళ్ళో ఉంటుంది. దీన్ని రైతులు, కూలీలు ప్రతీరోజు తాగుతూనే ఉంటారు. ఇప్పటికే అది ఏంటో మీకు అర్థం అయి ఉండొచ్చు. అదేనండి "కల్లు". కల్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్యే కాదు అసలు ఎలాంటి రోగం కూడా రాదు. ఎందుకు చెబుతున్నానంటే ప్రతిరోజు కల్లు తాగే వారు ఆసుపత్రికి వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు. కల్లు తాగే వారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. నేను కల్లు తాగే వారిని చూస్తే కోప్పడేవాడిని. కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేవాడిని. కల్లు అంటే అసహ్యించుకునే వాడిని. ఇప్పుడు  మలబద్ధకం సమస్య వల్ల నేను బాధపడుతుంటే కల్లు తాగితే తగ్గుతుందని చెబితే అయిష్టంగానే తాగాను. ఆశ్చర్యంగా ఉదయం లేవగానే మోషన్ ఫ్రీగా అయ్యింది. ఎన్నో రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను కల్లు తాగగానే నాకు ఈ సమస్య తగ్గిపోయింది. నేను అందరికి చెప్పేది ఏంటంటే మీకు మలబద్ధకం సమస్య ఉంటే కల్లు తాగండి. ఈ కల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
      

తాటికల్లు



       ఈ కల్లులో  ఈతకల్లు, తాటికల్లు, మామూలు కల్లు వంటివి ఉంటాయి కదా. అందులో ఈతకల్లు, తాటికల్లు ఎంతో శ్రేష్టమైనవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి అందుబాటులో లేనివారు ఊళ్ళలో దొరికే మామూలు కల్లు తాగవచ్చు సమస్య తగ్గేవరకు. మా గ్రామాల్లో చాలా వరకు ఈతకల్లు కొంతవరకే లభిస్తుంది. మొత్తంగా మామూలు కల్లు మాత్రమే లభిస్తుంది. దీనిని మందుకల్లు అంటారు. ఈ కల్లు ప్రతిరోజు తాగేవారిని నేను చూస్తాను వీళ్ళకు ఎలాంటి అనారోగ్యాలు లేవు ఆరోగ్యంగా ఉన్నారు. 

     నేను అందరికి చెప్పేది ఏంటంటే ఒక్క మలబద్ధకం వల్లే 70% రోగాలు వస్తున్నాయి. కాబట్టి దీనిని తగ్గించుకుంటే ఏ రోగాలు రావు. ఇది రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ కల్లు తాగండి. రోజు తాగడం వీలుకాకుంటే సమస్య వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా తాటి కల్లు లేదా ఈతకల్లు తాగండి. 

  మలబద్ధకం తో బాధపడే వారు నేను చెప్పినట్టు ఈతకల్లు, తాటికల్లు తాగి చూడండి. తప్పకుండా మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. మీకు ఈ సమస్య ఉంటే కల్లు తాగి చూడండి మళ్ళీ నాకు మీ సమస్య తగ్గిందో లేదో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా  తెలియజేయండి..

 నేను చెప్పినట్టు ట్రై చెసి చూడండి మలబద్దకాన్ని వదిలించుకోండి. తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి..


       

28, నవంబర్ 2019, గురువారం

బొప్పాయి,మునగ, బీరతీగ లాంటి మొక్కలు ఇంట్లో పెంచుకోకూడదా??

     

       ఇంటి ముందు, ఇంటి ఆవరణలో కొన్ని చెట్లు ఉండకూడదు అంటారు.
వాటిలో బొప్పాయి, మునగ లాంటి చెట్లు పెంచుకోకుడదు అని అంటారు. అలాగే బీరతీగ లాంటి కూరగాయల మొక్కలు కూడా పెంచుకోకూడదు అంటారు. ఇలాంటి మొక్కలు పెంచుకోకూడదు అని చెప్పేవారు మరీ ఆ మొక్కల ఆకులు, పండ్లు ఎందుకు వాడుతున్నట్టు???
ఇలాంటి మొక్కలు పెంచుకోకూడదు కాని అవసరానికి వాటి యొక్క ఆకులు, పండ్లు మాత్రం కావాలి. ఇదెక్కడి న్యాయం.? బొప్పాయి, మునగ, బీరతీగ లాంటి మొక్కలు పెంచుకోకూడదు అని చెప్పేవారు వాటిని అవసరానికి ఎందుకు ఉపయోగించుకుంటున్నట్టు.???

    నేను కూడా మా ఇంటిముందు బీరతీగ పెంచుకున్నాను. ఇక అదిచూసి అందరూ ఇంటిముందు బీరమొక్క ఉండకూడదు అని అందరూ చెప్పేవారే. అలా చెప్పిన వారే వాటికి బీరకాయలు అయినప్పుడు తెంపుకున్నారు, వాటి ఆకులను కూడా అవసరానికి తీసుకెళ్ళారు. చూసారా! ఈ మొక్కలు పెంచకూడదంటారు కాని వాటి కాయలు, ఆకులు మాత్రం కావాలి. ఇదెక్కడి చోద్యం ఆండీ బాబు. ఈ మనుషులు అవసరానికో మాట మాట్లాడుతారు...

ఇక బొప్పాయి చెట్టు కూడా  ఇంటిముందు ఉండకూడదు, పొద్దున లేవగానే బొప్పాయి చెట్టు ను చూడకూడదు అంటారు. మరీ ఇప్పుడు అదే బొప్పాయి చెట్టు ఎక్కడ ఉందా అని అందరూ వెతుకుతున్నారు. బొప్పాయి చెట్టు కనిపిస్తే చాలు సంజీవని మొక్క కనిపించినంతా ఆనందంగా ఫీలవుతున్నారు.. ఎందుకంటే ఈ మధ్యలో తెలంగాణలో ఎక్కడా చూసినా డెంగీ జ్వరాలే దానికి మందులేదు కదా! అలాంటి డెంగీ జ్వరానికి  బొప్పాయి చెట్టు ఆకులు, పండ్లే మందు. ఒంట్లో రక్తకణాలు పెరగాలంటే బొప్పాయి ఆకుల రసం తాగాలి మరియు బొప్పాయి పండ్లు తినాలి. డాక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు. చూసారా! బొప్పాయి చెట్టు ఎంత మంది ప్రాణాలు కాపాడుతుందో. అలాంటి బొప్పాయి చెట్టు ఇంటి ముందు పెంచుకోకూడదు అనడం ఎంతవరకు సమంజసం చెప్పండి??

   ఇంకో చెట్టు మునగ చెట్టు కూడా ఇంటి ముందు పెంచుకోకూడదు అంటారు. మునగ చెట్టు యొక్క ఆకులు, కాయలు, బెరడు అన్ని కూడా పనికి వచ్చేవే. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఇలాంటి చెట్లు పెంచుకోకుడదు అనడం మూర్ఖత్వం. ఇలాంటి చెట్లు పెంచుకోకుడదు కాని వాటి ప్రయోజనాలు మాత్రం కావాలంటే ఎలా? ఎవరైనా ఇలాంటి చెట్లు పెంచుకోకూడదు అంటే పట్టించుకోకూడదు దర్జాగా     పెంచుకోండి...

25, నవంబర్ 2019, సోమవారం

జ్యూట్ బ్యాగులను వాడండి పర్యావరణాన్ని కాపాడండి.

   
జ్యూట్ బ్యాగ్
      
    నిత్యవసరసర వస్తువులకోసం  కిరాణస్టోర్, సూపర్ మార్కెట్ కి  వెళ్ళినప్పుడు అక్కడ మనకు వస్తువులను ప్లాస్టిక్ కవర్లో వేసి ఇస్తారు అదికూడా 5 రూపాయలు కవర్ కు ఛార్జ్ చేస్తారు. అలా మనం ఇంటికి తెచ్చిన ప్లాస్టిక్ కవర్ మళ్ళీ మార్కెట్ కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడదు. బయట పారేస్తాం ఇలా పారవేయడం వలన పర్యావరణానికి అది ఎంత నష్టమే మనకు తెలుసు .
  కాబట్టి  ఇలా ప్లాస్టిక్ కవర్లో వస్తువులు తీసుకురాకుండా ఇంటినుంచే జ్యూట్ బ్యాగులను మార్కెట్ కు తీసుకెళ్దాం. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ కవర్ వాడటం మానేసి పర్యావరణానికి మేలు చేసిన వారమవుదాం దాంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. మార్కెట్ కి వెళ్ళిన ప్రతిసారి కవర్ కొనాలి అదే ఈ జ్యూట్ బ్యాగ్ ఒక్కసారి కొంటే సంవత్సరాల తరబడి వాడుకోవచ్చు.
ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మేం ఒక్కరం ప్లాస్టిక్ వాడటం మానేస్తే పర్యావరణం బాగుపడుతుందా అని అనుకోవచ్చు. ఒక్కరమే కదా అని అందరూ అనుకుంటే మార్పు రాదు. మార్పు అనేది మన నుండే ప్రారంభం కావాలి. ఒక్కటే కవర్ కదా అని పారేస్తే అది ఎక్కడో చోట తగలబడి కాలుష్యాన్ని వెదల్లుతుంది. అది మీదాక రాకుండా ఉండదు. 

               మీరు ఎప్పుడైనా నగర శివార్లలో గాని, పట్టణ శివారులో చూస్తే ప్లాస్టిక్ కవర్లను  పెద్ద పెద్ద గుట్టలుగా పోసి తగలబెడుతుంటారు. అక్కడ మనం ఒక్క క్షణమైన ఉండగలమా ఆ పొగకి ఉక్కిరిబిక్కిరి అవుతాం. అలాంటిది ఆ కలుషితమైన గాలిని రోజు పీల్చే ఆ ప్రాంతంలో నివసించే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి ఈ భూమిపై నివసించడానికి దేవుడు మనకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించి ఇచ్చాడు. అభివృద్ధి పేరుతో మనం దానిని నాశనం చేసి పీల్చేగాలి త్రాగే నీరు కలుషితం చేసి రోగాలబారిన పడేలా చేస్తున్నారు. కాబట్టి  ప్లాస్టిక్ కవర్ల వాడకం మానేసి పర్యావరణాన్ని కాపాడండి..

జ్యూట్ బ్యాగులను వాడండి ...

ఏమంటారు ఒకసారి ఆలోచించండి...🤔🤔

 జ్యూట్ బ్యాగులను ఇక్కడ క్లిక్ చేసి కొనండి..


11, నవంబర్ 2019, సోమవారం

టీ,కాఫీలు తాగుతున్నారా.? మానేయండి.


          

     టీ, కాఫీలు  ఉదయం నుండి రాత్రి వరకు చాలామంది టీ,కాఫీలు తాగుతూనే ఉంటారు. టీ లేకుంటే ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. చాలామంది టీ తాగడంతోనే రోజు మొదలవుతుంది. అసలు టీ తాగడం అవసరమా!
టీ,కాఫీలు తాగడం వలన ఏం ప్రయోజనం చెప్పండి. టీ,కాఫీలు తయారు చేసే పాలు, టీ పొడి, కాఫీ పొడి ఇవన్ని నాణ్యమైనవేనా??  
ఉదయం లేవగానే ఇంటి ముందు పాలప్యాకెట్ దర్శనమిస్తుంది. లేదా షాప్ లో తెచ్చుకుంటారు. అసలు పాలు ఎందుకు తాగాలి?? సృష్టి ధర్మం ఏంటీ? పాలు అనేవి జీవులు  అవి ఏ జీవులైనా పిల్లలకు జన్మనిచ్చాక పసి పిల్లలకు ఆహారంగా మాత్రమే ఇవ్వడానికి ఉపయోగపడుతాయి. పుట్టినప్పుడు ఏ జీవులైనా ఏ ఇతర ఆహార పదార్థాలు తీసుకోలేవు ద్రవపదార్థాలు మాత్రమే ఆరగిస్తాయి. అందుకోసమే సృష్టి లో జీవులు ఉదాహరణకు గేదెలు, ఆవులు వంటి జంతువులు  వాటి పిల్లలకు పాలు ఇస్తాయి. అంతేకాని మనుషుల కోసం కాదు‌. ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో అంటే చిన్న పిల్లలకి పాలు సరిపోకపోతే ఆవు,గేదె పాలు పట్టాలే కాని ప్రతి ఒక్కరు పాలు తాగడం అవసరమా?? ఆవు,గేదెల పాలు వాటి పిల్లలకు పట్టకుండా ఆ పాలతో వ్యాపారం మొదలు పెట్టాడు మానవుడు. వ్యాపారంతో పాటు కల్తీ కూడా చాలా పెరిగింది. పాలు కల్తీ ఎంతలా ఉందంటే ఉదాహరణకు మనదగ్గర పాల ఉత్పత్తి 100 లీటర్లు ఉంటే 300 లీటర్ల పాలు అమ్ముడవుతున్నాయట. అంటే 200% కల్తీ జరుగుతుంది.


ఇక మనం ప్యాకెట్ పాలు గురించి మాట్లాడుకుందాం అవి మనకు ఎక్కడి నుండి వస్తాయి. పాలకేంద్రాల నుండి వస్తాయి కదా అక్కడి నుండి మన దగ్గరకు వచ్చే మార్గంలో ఏంత కల్తీ జరుగుతుందో ఎవరికి తెలుసు. ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో కలుషితమైన పాలు పోసి  మళ్ళీ ఎక్కడా డౌట్ రాకుండా ప్యాక్ చేస్తుంటారు. ఒక్కో చోట అయితే ఫేవికాల్, బట్టలు ఉతికే సర్ఫ్, యూరియా వంటి వాటితో పాలు తయారు చెసి అమ్ముతున్నారు. తెల్లగా ఉన్నాయి కదా అని పాలే అనుకుని తాగేస్తుంటారు. తెల్లగా ఉన్నవన్ని పాలు కావని గుర్తుంచుకోండి. ఇలాంటి కలుషిత పాల గురించి రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం.
పాలను ఎలా కల్తీ  చేస్తారో ఇక్కడ చూడండి.

https://youtu.be/HnjeoIJTcT8



కొందరు ఇలాంటి కలుషితమైన పాల గురించి తెలిసి  ప్యాకెట్ పాలు వాడకుండా నేరుగా గేదెల షెడ్ నుండి పాలు తెచ్చుకుంటారు. ఈ పాలు కూడా నాణ్యమైనవేనా!! ఇక్కడ కూడా పాలు నాణ్యమైనవి కావు. ఎందుకంటే గేదెలు పాలు ఎక్కువ ఇచ్చేలా వాటికి నిషేదిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ పాలు దీర్ఘకాలికంగా తాగడం వలన వ్యాధులు వస్తాయి.
చూసారా మనం తాగే పాలు ఎక్కడ కూడా నాణ్యమైనవి లభించడం లేదు. డబ్బులు ఇచ్చి మరీ రోగాలు కొని తెచ్చుకుంటున్నారు.

     మన ఇంట్లో చేసుకునే టీ, కాఫీలు 50% కలుషితం అయితే బయట తాగే టీ కాఫీలు 100% కలుషితమే. బయట తాగే టీ కప్పులో నుండి టీ పొడి వరకు అన్ని కలుషితమే. టీ కొట్టులో ఎందరో తాగిన గ్లాసుల్లో టీ తాగుతారు ఆ గ్లాసులను సరిగా కడగరు కంపు కొడుతుంటాయి. దీని గురించి ఎవరు ప్రశ్నించరు. అలాగే తాగివస్తారు కొందరు పేపర్ కప్పుల్లో  తాగుతుంటారు. పేపర్ కప్పుల్లో వ్యాక్స్ ఉంటుంది. అందువలన టీ అనేది కప్పుకు అంటకుండా ఉంటుంది. వీటిలో వేడి వేడి టీ పోయడం వలన వ్యాక్స్ అందులో కలుస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరమే.  ఇక కొందరు ప్లాస్టిక్ కవర్లో  టీ తెచ్చుకుని తాగుతుంటారు దీనివలన వేడి వేడి టీలో ప్లాస్టిక్ కరిగుతుంది. ఇలా తాగడం  ఆరోగ్యానికి హానికరం.  హైదరాబాద్లో ఫేమస్ టీ ఇరానీ టీ  ఇందులో ఎముకల పొడి కలుపుతారట.
టీతో పాటు ఉస్మానియా బిస్కెట్ ఫేమస్ ఇవి  తయారు చేసే బెకరీల్లో చూడండి ఎలా ఉంటుందో అక్కడ చూస్తే మళ్ళీ ఉస్మానియా బిస్కేట్ తినలేమంట. మొత్తంగా బొద్దింకలు మయంగా ఉంటుందట.
ఇక కొట్టులో వాడే పాలు నాణ్యమైనవేనా?? టీ పొడి నాణ్యమైనదేనా? అందులో వాడే నీరు పరిశుభ్రమైన దేనా? టీ కప్పులు పరిశుభ్రంగా ఉంటున్నాయా? ఇవన్ని తెలిసి కూడా టీ తాగుతున్నారంటే అది వారి మూర్ఖత్వం.  బయట వ్యాపారం చేసే ఇలాంటి వ్యాపారాలు చేసే వారెవరు జనాల ఆరోగ్యాల గురించి పట్టించుకోరు. పాలల్లో యూరియా, సర్ఫ్ కలిపి వ్యాపారం చేస్తున్నారంటే  లాభాలకోసం ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోడ్డు పక్కన  టీ తాగకూడదు. టిఫిన్ చెయకూడదు. ఇంట్లో చేసుకోండి.

బయట టీ కొట్టులో ఎలా ఉంటుందో ఈ వీడియో లో చూడండి.




అసలు టీ, కాఫీ లు తాగకుండా ఉండలేరా?
అంతగా టీ,కాఫీలు అలవాటుంటే ఇంట్లో చేసుకోవడం ఉత్తమం. అదికూడా పాలతో చేసింది కాదు కేవలం మంచినీళ్ళను మరిగించి అందులో పూదినా లేదా తులసి ఆకులు వేసి అందులో కొంచెం నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనే వేసుకుని తాగాలి. ఇలా చేయడం వలన టీ తాగిన అనుభూతి ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 

తులసీ టీ



7, నవంబర్ 2019, గురువారం

ఇలాంటి కల్తీలు 100% నిజమే కదా!!


          కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవ్వావో అర్థం కాదు. ప్రతినిత్యం సమాజంలో నిత్యావసర పదార్థాలను ఎలా కల్తీ చేస్తారో చూపించిన మంచి సినిమాలను జనాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. అలాంటి సినిమాల్లో ఒక సినిమా సిద్దార్థ్ నటించిన "వదలడు". ఈ సినిమాలో ఇప్పుడు మార్కెట్లో లభించే వంటనూనెలు, టీ పొడి, డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ వంటి వాటిని ఎలా కల్తీ చేస్తారో చూపించారు. ఇది 100% నిజం.
     
        ఇలాంటి కల్తీల గురించి మాకు తెలుసు అనుకోవచ్చు. కాని ఇది కొందరికే తెలుసు. నిరక్షరాస్యులు, పేదవారు ఈ కల్తీల గురించి పట్టించుకోరు. మంచి నూనె కల్తీ గురించి ఎవరు పట్టించుకోరు డబ్బాలో కల్తీ నూనె బయట మాత్రం బ్రాండెడ్ కంపెనీల పేర్లను కొద్దిగా అటు ఇటు మార్చి ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి కల్తీనూనెలను నేను చూసాను అందులో నుండి చెత్తా చెదారం, నూనెలో వేయించిన పిండిపదార్ధాలు కూడా వచ్చాయి. అలాగే టీ పొడిని, వాటర్ బాటిల్స్ కల్తీ కూడా నిజం...

ఆహార పదార్థాలు ఎలా కల్తీ చేస్తారో ఈ కింది వీడియోలో చూడండి...

https://youtu.be/DyJSBfWakAc


6, నవంబర్ 2019, బుధవారం

అందరికి కృతజ్ఞతలు🙏🙏

  ఐదు రోజుల క్రితం నాకు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరినప్పుడు సహాయం చేయమని అడిగినప్పుడు వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేసిన వారందరికీ మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు నాకు ఫొన్ చేసి మాట్లాడిన మాతృ మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆవిడ ఎవరో నాకు తెలియదు నాకు సహాయం చేయడమే కాకుండా ఫొన్ చేసి మాట్లాడిన సహృదయురాలు. అమ్మ మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.
     
         అలాగే మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులకు అందరికి మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను...

       ఇప్పటి వరకు మూడు ఆసుపత్రులు తిరిగాను.
ఎక్కడ కూడా నాకు సరెైన వైద్యం చేయలేదు. బిల్లులు మాత్రం బాగానే వేసారు. చివరకు సంగారెడ్డిలో సహస్ర హాస్పిటల్ లో ENT డాక్టర్. కె. రాజశేఖర్ సార్ నా సమస్య గురించి క్షుణ్ణంగా పరిశీలించి ట్రీట్మెంట్ చేసారు ధన్యవాదాలు సార్.

         అందరికి నేను ఒకటి చెప్పదలచుకున్నాను ఏంటంటే "ఆరోగ్యమే మహాభాగ్యం" ఆరోగ్యంగా ఉండండి. ముందు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. బయట ఎక్కడ పడితే అక్కడ తినకండి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.దోమలు లేకుండా చూసుకోండి. అనారోగ్యంతో బాధపడడం కంటే, ముందు జాగ్రత్తగా రోగాలు రాకుండా చూసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.

   "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి"
                                                              ఇట్లు
                                               ప్రకృతి ఆరాధ్యుడు
                                                         శేఖర్

30, అక్టోబర్ 2019, బుధవారం

సినిమా ఇండస్ట్రీలో వర్మ సినిమాలు.

   


          సినిమాల్లో రాజకీయాలను చూపించాలంటే రాజకీయ నాయకుల పేర్లను కాని రాష్ట్ర పరిస్థితులపై కాని సినిమాలు తీయడానికి ఏ దర్శకుడు సాహసం చేయలేడు. రాష్ట్ర రాజకీయలపై సినిమాలు కాదు కదా,  ఒక సన్నివేశం తీయడానికి కూడా సాహసించరు.
ఎందుకంటే రాజకీయ నాయకులు గురించి సినిమాలు తీస్తే తమ సినిమా కెరీర్ ఎక్కడ ముగుస్తుందో అనో, ఎవరైనా తమపై దాడి చేస్తారనో భయపడి ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటారు. పైగా ఇలాంటి సినిమాలు తీస్తే ఎవరు చూస్తారో చూడరో అని రాజకీయ సినిమాలకు దూరంగా ఉంటారు. అలాంటిది రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తను అనుకున్నది అనుకున్నట్లుగా సినిమాలు తీస్తారు. కొందరు నాయకులను విలన్లుగా చూపించడానికి వెనుకాడరు. ఆ నాయకుల నుంచి వచ్చే వార్నింగ్ లను కూడా పట్టించుకోరు. ఎవరైనా తన సినిమాల గురించి మాట్లాడుతూ వార్నింగ్ లు ఇస్తే చిన్న పిల్లలు వార్నింగ్ ఇచ్చినట్టు ఉందని నవ్వుతుంటాడు వర్మ. అసలు వర్మకు భయం అంటే ఏమిటో తెలియదనుకుంటా ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎక్కువగా దెయ్యాలె ఉంటాయి. అలా దెయ్యాల సినిమాలు తీసి తీసి అసలు వర్మకు భయం అనేదే తెలియకుండా పోయింది. దెయ్యాల కే భయపడని వాడు మనుషులకు మాత్రం భయపడుతాడ ఏంటీ??

    వర్మకు దెయ్యాలకు భయపడ్డాను,  మనుషులకు భయపడడు. అందుకే ఇలాంటి సినిమాలు తీసి మనుషులతో ఆడుకుంటూ ఉంటాడు. వర్మ  సినిమా వస్తుందంటే
 చాలు టైటిల్ తోనే కాంట్రవర్సీ మొదలవుతుంది. ఎంతమంది ఆయన సినిమాలను వ్యతిరేకించిన ఎక్కడా తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు.    తన సినిమాల గురించి గొడవలు, బెదిరింపులు చేసిన వాళ్ళను చూసి వర్మ నవ్వుతుంటాడంటే ఇలా కొందరు తనను బెదిరింపులు చేయడం చూస్తే వర్మకు కిక్కిచ్చేలా ఉంది. అందరూ దర్శకులు సినిమా హిట్టవుతే సంతోషిస్తారు. కాని   వర్మ మాత్రం తన  సినిమాల గురించి కొందరు  బెదిరింపులు చేస్తే సినిమా హిట్టవ్వడం కంటే ఎక్కువ సంతోషిస్తారు. అయినా వర్మ సినిమాలు  హిట్టవ్వడం కష్టం. వర్మ సినిమాలు
తీసేది హిట్టవ్వడం కోసం కాదు తనకు నచ్చిన విధంగా సినిమాలు తీస్తూ ఉంటాడు. అవి ఎవరు చూడకపోయినా పర్వాలేదు.

         ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా
ట్రైలర్ చూస్తే అసలు అది సినిమాలా లేదు ఏపీ రాజకీయాలు లైవ్ లో చూసినట్లు ఉంది. ఇందులో పాత్రలు  ప్రస్తుత ఏపీ రాజకీయ నాయకులను అచ్చు గుద్దినట్లు ఉన్నాయి. 

27, అక్టోబర్ 2019, ఆదివారం

🌸దీపావళి శుభాకాంక్షలు 🌸

         


                    🌼🌼బ్లాగు మిత్రులకు 🌼🌼


            🌻🌻దీపావళి శుభాకాంక్షలు🌻🌻








🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸 దీపావళి శుభాకాంక్షలు 🌸🌸

24, అక్టోబర్ 2019, గురువారం

దోమల నివారణకు ఏం చేయాలి


దోమల నివారణ



        దోమల నివారణకు ఆల్ అవుట్,గుడ్ నైట్ వంటి లిక్విడ్ వెపరైజర్లు, జెట్ కాయిల్స్, దోమల అగరబత్తీలు వాడుతుంటాం వీటి వల్ల దోమలు రాకుండా ఉంటాయి కాని వీటి వాడకం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అలాగే  ఈ లిక్విడ్ వెపరైజర్లు ఖాళీ అయిపోయిన తర్వాత పారేస్తున్నారు వీటి వలన పర్యావరణం కాలుష్యం అవుతుంది.

 సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దోమలను నివారించాలంటే
మస్కిటో కిల్లర్ ట్రాప్ అనే చిన్న పరికరం సహాయంతో దోమలను నివారించవచ్చు.    దీనివలన
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పైగా ఇవి ఇకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఇందులో పడ్డ దోమలు బయటికి వెళ్ళలేవు చనిపోతాయి.కాబట్టి వాటి సంఖ్య పెరగకుండా ఉంటుంది. లిక్విడ్ వెపరైజర్లు,కాయిల్స్,దోమల అగరబత్తీలు వాడటం వల్ల దోమలు రాకుండా ఉంటాయే తప్ప చనిపోవు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాయి. మస్కిటో కిల్లర్ ట్రాప్ ను వాడితే
అవి దోమలను ఆకర్షించి చంపేస్తాయి. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి.



దోమల నివారణ







18, అక్టోబర్ 2019, శుక్రవారం

ఎందుకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు.?






మనదేశంలో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు ఎందుకు..? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు..

ఎందుకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు.?

ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని కారాణాల వల్ల గ్రామీణ ప్రాంతాలవారు ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతుంటారు.

అందులో రెండు రకాల కారణాలున్నాయి.

అందులో మొదటి కారణాలు:-

:- ప్రజలకు సేవ చేయడానికి.

:- స్వప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజల సమస్యలు తీర్చడానికి.

:- ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేయడానికి‌.


రెండవ కారణాలు:-


:- ప్రభుత్వ ఉద్యోగం వస్తే సమాజంలో గౌరవం, పలుకుబడి పెరుగుతుంది.

:- జీతాలు, ఇంక్రిమెంట్ లు ఎక్కువగా ఉంటాయి.

:- రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది.

:- పెళ్ళికి ముందే ప్రభుత్వ ఉద్యోగం వస్తే కట్నం ఎక్కువగా వస్తుంది.

:- ప్రభుత్వ ఉద్యోగం వస్తే రిటైర్మెంట్ అయ్యేవరకు గ్యారంటీగా ఉద్యోగం ఊడకుండా ఉంటుంది.

:- పని తక్కువ,సెలవులు ఎక్కువగా ఉంటాయి.

:- రెండు చేతులా సంపాదించవచ్చు.


 అందరూ రెండవ కారణాల కోసమే ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటారు.

ఇన్ని సౌకర్యాలు ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలవారు ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు.






11, అక్టోబర్ 2019, శుక్రవారం

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కు ప్రజల మద్దతు లభిస్తుందా.?




ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ప్రజల మద్దతు లభిస్తుందా?? 

కొన్ని కారణాల వల్ల ప్రజల మద్దతు లభించకపోవచ్చు.

:- తెలంగాణలో పెద్ద పండుగ దసరా పండుగకు మూడు నాలుగు రోజుల ముందు తర్వాత మూడు నాలుగు రోజుల వరకు ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఆ సమయంలో సమ్మె చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసారు.

ఇలా పండుగ పూట జనాలను ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళకు ప్రజలు ఎలా మద్దతు ఇస్తారు. మద్దతు పక్కనపెడితే ప్రజలు  ఆర్టీసీ ఉద్యోగులపై కోపంగా ఉన్నారు..

:- ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా కండక్టర్లు ప్రయాణికులతో అమర్యదాపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటారు.

ప్రతీరోజూ ఆర్టీసీ లో ప్రయాణం చేసే ప్రయాణికులతో ఆర్టీసీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తుండటం వలన ప్రజలు వీరికి ఎలా మద్దతు ఇస్తారు..?

ప్రయాణికులే సంస్థకు నిధి అంటారు అలాంటి ప్రయాణికులు పట్ల మర్యాదపూర్వకంగా మెలగాల్సిన ఉద్యోగులు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇందుకా వీళ్ళకు ప్రజలు మద్దతివ్వాల్సింది.?

పండుగ పూట సమ్మె చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాక, ప్రతీరోజు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తుండటం వలన ప్రజలు వీరికి మద్దతు ఇవ్వరు..

వీళ్ళు ఎన్ని రోజులు సమ్మె చేసిన ప్రజలు ఇబ్బంది పడరు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతారు. ఆటోలు,క్యాబ్ లు, ట్రైన్ లలో ప్రయాణం చేస్తారేకాని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రజల మద్ధతు మాత్రం లభించదు..





10, అక్టోబర్ 2019, గురువారం

ప్రకృతి పండుగ దసరా




  దసరా పండుగకు ఊరెళితే  కనిపించిన అందమైన ప్రకృతి దృశ్యాలు..‌

చామంతి పూలు


చామంతి
చామంతి

చెక్ డ్యాం


1, అక్టోబర్ 2019, మంగళవారం

సామజవరగమన సిద్ శ్రీరామ్


 

             కొందరు గాయకులు పాడిన పాటలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. వారు ఏ పాట పాడిన వినసొంపుగా ఉంటుంది. అలాంటి వారిలో "సిద్ శ్రీరామ్" ఒకరు. ఇంతకు ముందు ఈయన పాడిన పాటలు పెద్ద హిట్టయ్యాయి. అందులో
నువ్వుంటే నా జతగా,
ఉండిపోరాదే గుండె నీదేలే,
ప్రేమ ఓ ప్రేమ,
వెళ్ళిపోమాకే,
మాటే వినదుగా,
ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే, లాంటి పాటలు ఎంత హిట్టయ్యాయో మనకు తెలుసు.
ఇప్పుడు "సామజవరగమన" అంటు మళ్ళీ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు.

      సామజవరగమన పాట చాలా బాగుంది. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం ఈ పాట పాడిన సిద్ శ్రీరామ్. ఈయన ఏపాట పాడిన మాధుర్యంగా ఉంటుంది. ఆయన గాత్రంలో పాట వింటుంటే ఎవరైనా మైమరచిపోవలసిందే. సామజవరగమన పాట కూడా చాలా బాగా పాడారు సిద్ శ్రీరామ్ గారు.
ఈ పాట బాగా రావడానికి కారణమైన ఇంకో వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.  ఒక్క పదం ఇతర భాషా పదాలను ఉపయోగించకుండా అచ్చతెలుగులో,అర్థవంతమైన తేలిక పదాలతో అద్భుతంగా ఈ పాట రాశారు.

ఇక తమన్ సంగీతం గురించి చెప్పనక్కర్లేదు. లౌడ్ స్పీకర్ మోత మోగినట్టు తమన్ సంగీతం ఎవరికి అర్థం కాకపోయినా... సిద్ శ్రీరామ్, సీతారామశాస్త్రి గారి వల్ల ఈ పాట చాలా బాగా వచ్చింది.



 సామజవరగమన

30, సెప్టెంబర్ 2019, సోమవారం

పల్లీలు నువ్వుల లడ్డు





పల్లీలు నువ్వుల లడ్డు

కేవలం మూడు పదార్థాలతోనె చాలా సులువుగా రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే లడ్డు తయారుచేసే విధానం..

కావలసిన పదార్థాలు:-

పల్లీలు       - 1 కప్పు
నువ్వులు  - 1 కప్పు
బెల్లం            - అరకప్పు


తయారి విధానం:-
పల్లీలు, నువ్వులను దోరగా వేయించుకోవాలి.వేయించిన పల్లీలు,నువ్వులను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసుకోని ఉండలు కట్టుకోవాలి.
అంతే రుచికరమైన లడ్డు తయారవుతుంది.


నువ్వుల లడ్డు



ఈ లడ్డు చూడటానికి అంత ఆకర్షనీయంగా లేకపోయినా తింటే మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది.
పల్లీలు,నువ్వుల లడ్డులో కాల్షియం అధికంగా ఉంటుంది ఈ లడ్డు తినడం వలన ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి.

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

గోధుమ గడ్డి



wheatgrass
గోధుమ గడ్డి

       



గోధుమ గడ్డి పెంచే విధానం:-

ఒక కప్పు గోధుమలు తీసుకుని కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి 12 గంటలు నానబెట్టాలి.

12 గంటలు నానిన తర్వాత నీళ్ళు ఒంపేసి ఒకసారి కడిగి ఒక కాటన్ గుడ్డలో మూటకట్టి ఒకరోజు ఉంచాలి.

తర్వాత ఒక ప్లాస్టిక్ ట్రే తీసుకుని దానికి అడుగు భాగంలో రంధ్రాలు చేయాలి. అందులో సగం వరకు  మట్టిని పోయాలి. ఈ మట్టిలో  వర్మీ కంపోస్టు ఎరువు కలుపుకుంటే గడ్డి బాగా వస్తుంది.

మట్టి పోసిన తర్వాత మొలకెత్తిన గోధుమలను ప్లాస్టిక్ ట్రే లో ఒత్తుగా వేయాలి. అలా వేసిన తర్వాత పైనుండి  గోధుమలు మునిగేలా మట్టిని పోసి నీళ్ళు పొయ్యాలి.

ఈ ట్రేను నీడలో ఉంచాలి.
ఉదయం సాయంత్రం వేళల్లో నీటిని చిలకరించాలి.


 గోధుమ గడ్డి  పది రోజులతర్వాత ఆరు అంగుళాలకు మించి పెరుగుతుంది.




wheatgrass

25, సెప్టెంబర్ 2019, బుధవారం

ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా...?

 


 ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా...




             సరదాగా యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు స్క్రోల్ చేసుకుంటు వెళ్తున్న ఒక వీడియో దగ్గర ఆగాను ఆ విడియో థంబ్నెల్ చూస్తే ఎవరికైనా చూడాలనిపిస్తుంది ఎందుకంటే అందులో "ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా?"!!! అని ఉంది. ఇదేదో బాగుందే అని ఓపెన్ చేసా "హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు" అంటూ ఓ వ్యక్తి తన నటచాతుర్యాన్నంత రంగరించి యూట్యూబ్ చూసే వాళ్ళంతా తన స్నేహితులు అన్నట్టు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాపేరు బికారి అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో లక్షలు  సంపాదించడం ఎలాగో తెలుసా!!! అంటూ కొశ్ఛన్ వేశాడు. అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే. ఆన్లైన్లో లక్షలు సంపాందించవచ్చు. మీ దగ్గర ఒక కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు డబ్బు సంపాదించవచ్చు అని, డబ్బు చెట్లకు కాస్తుంది కేవలం మనం వాటిని తెంపుకుని తెచ్చుకోవడమే అన్నంతగా ఈజీ అన్నట్టు చెబుతున్నాడు. ఆన్లైన్లో ఎలా డబ్బు  సంపాదించవచ్చు అని ఫేవరేట్ హీరో సినిమాని ఫస్ట్ డేట్ ఫస్ట్ షో చూస్తున్న ఫ్యాన్స్ లా ఆత్రుతతో చూస్తున్న ఆ వీడియోను నేను . ఏం లేదు ఫ్రెండ్స్ మీరు చేయవలసిందల్లా సింపుల్ గా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఎర్రిపప్ప అని టైప్ చేయండి. అందులో ఫస్ట్ వచ్చే ఎర్రిపప్ప  ఆప్ ఓపెన్ చేసి నా రిఫరల్ కోడ్ తో  సైన్ అప్ చేయండి. అలా సైన్అప్ అయిన తర్వాత మీరు మరి కొంతమందికి ఈ  ఆప్ ను రిఫర్ చేయండి అంతే సిపుల్ మీకు డబ్బులే డబ్బులు బావిలో బకెట్ వేసి నీళ్ళు తోడినట్టు ఈ ఆప్లో డబ్బులు తోడుకోవచ్చు అని చెప్పాడు. ఆహా! ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఇంత సులువా నేను సంపాదిస్తాను అని అతను చెప్పిన ఆప్ డౌన్లోడ్ చేసి అతని రిఫర్ కోడ్ ఎంటర్ చేసా అంతే 50రూపాయలు వచ్చాయి. మరో ఇద్దరి ద్వారా ఈ ఆప్ డౌన్లోడ్ చేయించా 2 రూపాయలు వచ్చాయి. అతికష్టం మీద ఓ పదిమంది చేత ఆప్ డౌన్లోడ్ చేయించా. 10 రూపాయలు వచ్చాయి. ఇంకా చాలా మంది చేత ఈ ఆప్ డౌన్లోడ్ చేయించాలని తెలిసిన వారికి రిఫర్ చేసా. ఒక్కరు కూడా డౌన్లోడ్ చేయలేదు కదా పైగా నాకే రిఫర్ చేస్తున్నారు. అప్పటికే వారు కూడా ఈ ఆప్ డౌన్లోడ్ చేసుకున్నారు. నాకు ఈ ఆప్లో 60రూపాయలు వచ్చాయి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుందామనుకుంటే 200 పూర్తయితే గాని ఈ ఆప్ లోనుండి డబ్బు తీసుకోలేరు అని మేసేజ్ వస్తుంది. నాకు 200రూపాయలు రావాలంటే ఇంకా 140 మంది చేత డౌన్లోడ్ చేయించాలి.  అంతమంది చేత డౌన్లోడ్ చేయించడం అసాధ్యం.
ఈ ఆప్ లో లక్షలు సంపాదించడం కూడా అసాధ్యం అని ఇదంతా ఫేక్ అనుకున్న.

కాని  ఈ ఆప్ లో ఎక్కువ డబ్బు సంపాదించిన వారి వివరాలు ఉన్నాయి అందులో  యూట్యూబ్ లో ఈ ఆప్ గురించి చెప్పి నాచేత ఈ ఆప్ డౌన్లోడ్ చేయించిన వ్యక్తి వివరాలు ఉన్నాయి అందులో అతని సంపాదన లక్షల్లో ఉంది. జనాలని ఎర్రిపప్పలని చేసి అతడు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇలాంటి వారు యూట్యూబ్ లో చాలానే ఉన్నారు   జనాలకు  పెద్ద సేవ చేస్తున్నట్టు, డబ్బు సంపాదించేందుకు దారి చూపిస్తున్నట్టు బిల్డప్ కొడుతుంటారు.

నిజమే ఈ ఆప్లో లక్షలు సంపాదించవచ్చు కాని వారు చెప్పిన విధంగా కాదు.  ఎలాగంటే మనం కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో  రిఫర్ చేస్తే డబ్బులు ఇచ్చే ఏదో ఒక ఆప్ గురించి అద్దిరిపోయే వీడియో చేసి డౌన్లోడ్ చేసుకునేలా మసాలా దట్టించి పెట్టండి. వీడియో థంబ్నెల్ మాత్రం "ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా" , "ఇంట్లో కూర్చుని  రోజుకి పదివేలు సంపాదించడం ఎలా" , "ఈ ఆప్ మిమ్మల్ని కోటీశ్వరులని చేస్తుంది" , "ఈ ఆప్ డౌన్లోడ్ చేసి వదిలేయండి మీరు వద్దన్నా డబ్బు వస్తుంది" అంటూ వీడియో థంబ్నెల్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అంతే మీరు వద్దన్నా డబ్బు వస్తూనే..... ఉంటుంది....

 మన వీడియోలు ఎవరు చూస్తారు అంటారా? ఇప్పుడు అందరు  గూగుల్ లో ఎక్కువగా
సెర్చ్ చేసేది ఏంటో తెలుసా.! how to earn money online అని.

ఆహా ఏమి ఐడియా గురూ ....!


21, సెప్టెంబర్ 2019, శనివారం

ఆరోగ్యానికి మొలకలు




          ఆరోగ్యానికి మొలకలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు, శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతాయి.

      లావుగా ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల సన్నపడతారు. ఇందుకు ఉదాహరణ మా స్నేహితుడు ఒకప్పుడు 100కేజీల కంటే ఎక్కువ బరువు ఉండేవాడు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఎలాగైనా బరువు తగ్గాలని కఠినంగా ఆహార నియమాలు పాటించడం మొదలు పెట్టాడు ఒక సంవత్సరం లో బరువు తగ్గి 60కేజీలకు వచ్చేసాడు. ఏ డాక్టర్ ను సంప్రదించలేదు ఏ మందులు వాడలేదు. కేవలం టీవీలో వచ్చే ప్రోగ్రముల్లో ఆరోగ్యకరంగా బరువు తగ్గే విధానాలను చూసి ఆహారంలో మార్పులు చేసుకున్నాడు. రోజుకు 5లీటర్ల నీరు రెండుపూటల ఆహారం మాత్రమే తినడం. అందులో ఒక పూట మొలకలు ఆహారంగా తీసుకునే వాడు. ముడిబియ్యం మాత్రమే తింటాడు. ఎందుకంటే పాలీష్ బియ్యం తింటే షుగర్ వస్తుంది అందులో పోషకాలు కూడా ఉండవు. ఉప్పు, కారం , నూనె, పంచదార తినడు. ఇలా కఠినంగా ఆహార నియమాలు పాటించడం వలన బరువు తగ్గి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. బరువు తగ్గాలనుకునే వారు ఒక మంచి డైటీషీయన్ ని కలిసి బరువు తగ్గడానికి కావలసిన డైట్ ను తెలుసుకుని ఆహారనియమాలని పాటించడి.



    పెసలు,శనగలు,బెబ్బర్లు వంటి గింజలను విడివిడిగా 12గంటలు నీటిలో నానబెట్టి ఒకరోజు కాటన్ గుడ్డలో మూటకట్టి ఉంచితే మొలకలు వస్తాయి అందులో దానిమ్మ పండు గింజలు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బరువు తగ్గాలనే వారే కాకుండా ఎవరైనా వీటిని తినొచ్చు. చిన్న పిల్లలకి బయట దొరికే  చిప్స్ , జంక్ ఫుడ్ తినిపించే బదులు మొలకలు తినడం అలవాటు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఇక మొలకలను ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనే తినాలి రాత్రి పూట తినకూడదు.గ్యాస్ ప్రాబ్లెం ఉన్నవారు తినకూడదు.




 
పెసలు,శనగలు,బెబ్బర్లు,అవిశ లు, వంటివి తొందరగా మొలకలు వస్తాయి.








Sprouts maker 

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

ఒక CFLబల్బుల కంపెనీలో ఉద్యోగం



ఒక  చిన్న   కంపెని అందులో CFL బల్బులు తయారు చేస్తారు. కంపెనీలో ఉద్యోగులు 200 వరకు ఉంటారు. అందులో పని చేయడానికి నేను వెళ్ళాను. కంపెనీలో 2 షిఫ్ట్ లు మాత్రమే అంటే ఒక షిఫ్ట్ 12 గంటలు. చాలా కంపెనీల్లో 3 షిఫ్ట్ లు ఒక్కో షిఫ్ట్ 8గంటలు ఉంటాయి. కాని ఈ కంపెనీలో 2 షిఫ్ట్ లు మాత్రమే. 12 గంటలు అయినా సరే ఉద్యోగం చేయాల్సిందే ఎందుకంటే ఉద్యోగం తప్పితే వేరే దారి లేదు. ఉండేది సిటీలో రూమ్ రెంటు కట్టాలి. అన్ని కొనాలి. ఈ పరిస్థితుల్లో ఏ ఉద్యోగం అయినా చేయాల్సిందే తప్పదు.

        కంపెనీలో కి వెళ్ళిన తరువాత అక్కడ పని ఏంటంటే ఒక కన్వేయర్ బెల్ట్ దాని చుట్టూ డజను కుర్చీలు అవి కుర్చీలు అంటే లగ్జరీ కుర్చీలు అనుకునేరు కేవలం కూర్చుని పనిచేసే విధంగా  చెక్క తో తయారు చేసిన బల్లులు. వాటిపై కూర్చుని కన్వేయర్ బెల్ట్ పై నుండి వచ్చే CFL బల్బులను చెక్ చేయడం వాటికి ఉన్న వైర్లు కత్తిరించడం, వాటికి PCB  లు పెట్టడం, క్యాప్ లు పెట్టడం, సోల్టరింగ్ చేయడం ఆ తర్వాత వాటిని డబ్బాలో జాగ్రత్త గా పెట్టాలి. ఇదే పని
అలా కన్వేయర్ బెల్ట్ పై వస్తున్న బల్బులను మిషన్ వేగంతో, తోటి కార్మికుల వేగంతో పని చేయాలి ఎవరు నెమ్మదించిన బెల్ట్ పై బల్బులు వెళ్ళపోతూనే ఉంటాయి మిషన్ మాత్రం ఆగదు. ఒకవేళ ఆపితే అంతే సంగతులు సూపర్వైజర్ తో నానా తిట్లు, రిమార్కులు, జీతంలో కోతలు. అన్నింటికంటే మించి అందరిముందు అవమానం తప్పదు.

      అలా ఉదయం 7 గంటలకి మొదలైన పని సాయంత్రం 7 గంటలవరకు చేయాలి. మధ్యలో ఓ అరగంట మాత్రమే భోజన విరామం ఉంటుంది. ఉదయం 7 గంటలకి కంపెనీకి వెళితే మధ్యాహ్నం 12 గంటలకి భోజనానికి వెళ్ళాలి అదికూడా కేవలం 30 నిమిషాల్లోనే భోజనం చేసి రావాలి. 30 నిమిషాల కంటే ఒక్కో నిమిషం ఆలస్యం అయినా సూపర్ వైజర్ తో తిట్లు తప్పవు వాళ్ళు మామూలుగా తిట్టరు అందుకని ఎవరు నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చేస్తారు.
 మధ్యాహ్నం తిని వచ్చిన తర్వాత మళ్ళీ కన్వేయర్ బెల్ట్ పై బల్బుల పని చేస్తూనే ఉండాలి సాయంత్రం 7 గంటల వరకు. 12 గంటలు ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

     అలా వారం రోజులు పగలు డ్యూటీ పూర్తి అయ్యింది. తర్వాత వారం నైట్ డ్యూటీ చేయాలి. సాయంత్రం 7 గంటలకి కంపెనీకి వెళితే ఉదయం 7 గంటలవరకు డ్యూటీ చేయాలి. నైట్ డ్యూటీ కూడా సేమ్ రాత్రి 12 గంటలకి భోజనానికి వెళ్ళాలి అదికూడా కేవలం 30 నిమిషాల్లోనే తినేసి రావాలి. ఒక్కో నిమిషం కూడా ఆలస్యం కాకూడదు. నైట్ డ్యూటీ కదా కాసేపు పడుకుంటాం అంటే కుదరదు.
ఉదయం అయినా రాత్రి అయిన 12 గంటలు పని చేయాల్సిందే. కేవలం 30 నిమిషాలు మినహాయించి.  నిద్ర వస్తుంది అంటే కుదరదు పని చేయాల్సిందే లేదా ఉద్యోగం మానేయాలి. నాముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు అక్కడి పని చేయలేక.  కంపెనీలో కి అడుగు పెడితే చాలు అక్కడ కార్మికులకు, యంత్రాలకు పెద్ద తేడా ఉండదు. కంపెనీల్లో కార్మికులను యంత్రాల్లాగే చూస్తారు. ఇలాంటి కంపెనీల్లో కార్మికులను అస్సాం, బీహార్ లాంటి రాష్ట్రాల నుండి తీసుకువస్తారు.


నాకు ఒకరితో మాట అనిపించుకోవడం ఇష్టం ఉండదు కరెక్ట్ టైమింగ్, కరెక్ట్ పని చేసి అందరి మన్ననలు పొందాను. కొందరు అసూయ కూడా పడ్డారు ఎందుకంటే నాతో పాటు పనిలో పోటీ పడలేక పోయేవారు సూపర్ వైజర్ లతో నానా తిట్లు తినేవారు. నేనేప్పుడు మాట పడలేదు కాని ఈ కంపెనీలో ఉద్యోగం అంటే అది 12 గంటలు, వారం రోజులు, పగలు, రాత్రి తేడా లేకుండా డ్యూటీ చేయాలి. ఫ్రీడమ్ అనేది లేదు, యంత్రాలకు, మనుషులకు తేడాలేదు.  12గంటలు పని 2 గంటలు ప్రయాణం,10 గంటలు నిద్ర ఇదేనా జీవితం ఇలాంటి బానిస జీవితం వేస్ట్ అనిపించింది కంపెనీకి దండం పెట్టి వచ్చేసా.



ఇక కంపెనీలో CFL బల్బు తయారు చేసే విధానం ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సన్నని గాజు గొట్టాన్ని వివిధరకాల ఆకృతుల్లో ఒక బల్బు గా తయారు చేసే టెక్నాలజీ అద్భుతం.

ఈ CFL కంపెనీలో నేను గమనించిన ఒక పెద్ద విషయం ఏంటంటే మనం మార్కెట్లో  కొనే బల్బుల పై వివిధ రకాల కంపెనీలో బ్రాండ్ లా పేర్లు ఉంటాయి కదా అంది చూసి మనం ప్రతీ బ్రాండ్ కి ఒక కంపెనీ ఉంటుంది అనుకుంటాం.కాని ఏ బ్రాండ్ కి కూడా కంపెనీ ఉండదు. ఒక కంపెనీ బల్బు తయారు చేస్తే వివిధ రకాల బ్రాండ్ల పేరుతో వాటిని ప్యాక్ చేసి మార్కెట్లో విడుదల చేస్తారు.
అంటే ఒకే బల్బు పేర్లు మాత్రం వేరు‌.


ఇప్పుడు LED బల్బులు వచ్చాయి ఇప్పుడు ఆ కంపెనీ మూతపడింది.

11, సెప్టెంబర్ 2019, బుధవారం

హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేస్తే ఎం జరుగుతుంది.




   
హైదరాబాద్ ను  ఈ దేశానికి రెండో రాజధానిగా చేస‌్తే ఏం జరుగుతుంది.

డిల్లీ తరహాలో మరో రాష్ట్రంగా ఏర్పడుతుందా?

అలాగే గవర్నర్,ముఖ్యమంత్రులతో కూడిన అసెంబ్లీ ఏర్పడనుందా?

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగిస్తారా? లేదా వేరే ఇతర నగరాన్ని రాజధానిగా చేస్తారా?



   




హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస‌్తే ఇక్కడ పార్లమెంటు ను ఏర్పాటు చేసి పరిపాలన చేస్తారా?
సంవత్సరం లో ఆరు నెలలు డిల్లీ నుండి ఆరునెలలు హైదరాబాద్ నుండి పరిపాలన చేస్తారా?

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేస‌్తే ప్రయోజనం ఏమిటి?

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఏమవుతుంది?

అసలు ఎందుకు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా లేదా కేంద్రపాలిత ప్రాంతం చేయాలనుకుంటున్నారు.







4, సెప్టెంబర్ 2019, బుధవారం

రిమోట్ లేకుండా టీవి ఆపరేట్ చేయడం ఎలా






                  


                                మొబైల్ ఫోన్ తో టీవీని కంట్రోల్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో రిమోట్ ఆప్స్ చాలానే ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుంటే సరి రిమోట్ తో పనిలేకుండా మొబైల్ తో చానెల్స్ మార్చుకోవచ్చు. అలాగే  టీవీ సెట్ అప్ బాక్స్ ను కూడా  రిమోట్ తో కంట్రోల్ చేయవచ్చు. ఏ కంపెని సెట్ అప్ బాక్స్ కి సంబందించిన రిమోట్స్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నాయి. డిష్ టీవి, సన్ డైరెక్ట్, బిగ్ టీవి, ఎయిర్ టెల్ ఇలా ఏ కంపెని సెట్ అప్ బాక్స్ అయిన గూగుల్ ప్లే స్టోర్ లో వీటికి సంబందించిన రిమోట్స్ ఆప్స్ ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఫోన్ తో ఆపరేట్ చేసుకోవచ్చు.


రిమోట్ ఎక్కడైనా మర్చిపోయిన లేదా రిమోట్ పాడైపోయిన సమయంలో ఈ ఆప్స్ ఉపయోగపడుతాయి.

7, ఆగస్టు 2019, బుధవారం

కాశ్మీర్ వెనక ఇంత కథ ఉందా..

 

     
          కాశ్మీర్ అంటే మంచుకొండలు, సెలయేళ్ళు, అందమైన లోయలు గుర్తొస్తాయి. కాశ్మీర్ అంటే భూతల స్వర్గం అని అంటారు.  అక్కడి ప్రజలు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే కాశ్మీర్ లాంటి అందమైన ప్రదేశంలో నివసిస్తున్నందుకు. కాశ్మీర్ గురించి నా చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్నాం. శ్రీ "నాయని కృష్ణకుమారి" గారు రచించిన  "కాశ్మీర దర్శనం" అనే పాఠం ఉండేది. అందులో కృష్ణకుమారి గారు కాశ్మీర్ గురించి వర్ణించిన వర్ణన గురించి చదువుతుంటే కాశ్మీర్ లో విహరించినట్టు ఉండేది. ఈ పాఠం వింటుంటే కాశ్మీర్ కళ్ళకు కట్టినట్టు అనిపించేది అంత అద్భుతంగా వర్ణించారు కృష్ణకుమారి గారు "కాశ్మీర దర్శనం"లో. కాశ్మీర్ అంటే ఇంత అందంగా ఉంటుందా ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఆ అందాలను చూడాలని ఉండేది. కాశ్మీరు ప్రజలు ఎంతో అదృష్టవంతులు అనుకునేవాన్ని కాని పాఠశాల స్థాయి దాటి  జాతీయ విషయాలు అవగాహనకు వస్తున్న రోజుల్లో కాశ్మీర్ అంటే ఏంటో తెలిసింది. కాశ్మీర్ అంటే భూతల స్వర్గమే కాని అది నాణేనికి ఒకవైపు మాత్రమే రెండోవైపు భూతల నరకం కూడా కాశ్మీరే అన్నట్టు ఉంది అక్కడి పరిస్థితి. ప్రపంచంలో నిత్యం వివాదాస్పద అంశం ఏదైనా ఉందంటే అది కాశ్మీరే.

          ప్రతీరోజు కాశ్మీర్ లో కాల్పులు, పాక్ కవ్వింపు చర్యలు అంటూ వార్తలు. ఇంత అందమైన కాశ్మీర్లో ఎందుకు ఈ కాల్పులు. నాకు అర్థమయ్యేది కాదు. అక్కడ నివసించే ప్రజలు నిత్యం ఏ వైపు నుంచి కాల్పులు జరుగుతాయో అని బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తుంటే కాశ్మీరీలు అదృష్టవంతులు అనే నా అభిప్రాయం మారిపోయింది. కాశ్మీర్ లో నిత్యం ఉగ్రవాదుల దాడులు సర్వసాధారణం అయిపోయాయి. దీనికి కారణం ఏంటా అని తెలుసుకుంటే కాశ్మీర్ అల్లర్ల వెనుక పాకిస్థాన్ అనే భూతం ఉందని అర్థం అయ్యింది. ప్రపంచంలో అతి నీచమైన దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్థానే అని చెప్పొచ్చు.
అసలు ఎందుకు పాకిస్థాన్ ఇలా కాశ్మీర్ లో ఉగ్రవాదులతో నిత్యం దాడులు చేస్తుంది అని నాకు అర్థమయ్యేదికాదు. తర్వాత తెలిసింది ఏంటంటే కాశ్మీర్ ను పాకిస్థాన్ లో కలపడం కోసమే ఇలా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని.

        కాశ్మీర్ లో ఉగ్రవాదం ఇంతలా చెలరేగిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ జనాభాలో అధిక శాతం ముస్లింలే ఉండటం. మతాన్ని ఆసరాగ చేసుకుని పాకిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్ సైన్యం  కాశ్మీరీ ముస్లిం యువకులను ఉగ్రవాదులుగా తీర్చిదిద్ది కాశ్మీర్ లో కల్లోలం సృష్టిస్తున్నారు. ఈ ధారుణాన్ని చూస్తుంటే తన వేళితో తనకంటినే పొడిచేలా చేసింది పాకిస్థాన్ కాశ్మీర్ యువతను. ఈ విషయం తెలియక అక్కడి యువత పాకిస్థాన్  కుటిల బుద్దికి బలైపోతుంది. కేవలం మతాన్ని సాకుగా చూపి  కాశ్మీర్ యువతను ఉగ్రవాదులుగా మార్చేసింది పాకిస్థాన్.

            భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు కాశ్మీర్ సమస్య అలాగే ఉండిపోయింది. ఈ దేశాన్ని ఇన్నాళ్ళు పాలించిన ఏ నాయకుడు కూడా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. కాశ్మీర్ సరిహద్దుల్లో భారత సైనికులను పాకిస్థాన్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకుంటున్నారు. ఈ మారణకాండ నిత్యం జరుగుతూనే ఉన్నా దీనికి పరిష్కారం మాత్రం ఏ నాయకుడు చూపలేదు. కాని ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం నరేంద్ర మోది చూపారు ఆర్టికల్ 370 ,35A రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విభజించి ఎన్నో ఏళ్ళుగా ఉగ్రవాదంతో రగిలిపోతున్న కాశ్మీర్ కు విముక్తి కలిగించారు. దీని ద్వారా అక్కడ శాంతి నెలకొంటుందని భావిస్తున్నాను. కాశ్మీర్ ను రెండుగా విభజిస్తే సమస్య తీరిపోతుందా అంటే తీరిపోదు అక్కడ అభివృద్ది జరిగితే సమస్య తీరిపోతుంది.  ఎందుకంటే పాకిస్థాన్  కాశ్మీర్ యువతకు డబ్బు, మతవాదాన్ని  ఎరగా వేసి ఉగ్రవాదులుగా తయారుచేసి దాడులు చేయిస్తుంది. అదే అక్కడ అభివృద్ది జరిగితే యువతకు  ఉపాది లభిస్తే ఉగ్రవాదులుగా మారాల్సిన అవసరం ఉండదు. ఇన్నాళ్ళు అభివృద్ది చేయలేదా అంటే కేంద్ర  నిధులైతే వెళ్తున్నాయి కాని అభివృద్ది మాత్రం శూన్యం దీనికి కారణం కాశ్మీర్ నాయకులు.

 ఇప్పటి వరకు కాశ్మీర్ భారత్ లో ఒక రాష్ట్రం గానే భావించాను. 370 ఆర్టికల గురించి తెలిసాక కాశ్మీర్ వెనక ఇంత కథ ఉందా అని అర్థమయ్యింది. కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక అధికారాలు ఉండటం, కాశ్మీర్ కు సపరేటు జెండా కూడా ఉండటం నాకు తెలియని కాశ్మీర్ చాలానే ఉందిమరి. కాశ్మీర్ లో పీవోకే,అక్సాయ్ చిన్ అనే ప్రాంతాలు కూడా ఉన్నాయని, పీవోకే పాకిస్థాన్  ఆధీనంలో, అక్సయ్ చిన్  చైనా ఆధీనంలో ఉందని ఇప్పుడే తెలిసింది.


          కాశ్మీర్ అభివృద్ది కాకపోవటానికి అక్కడి నాయకులు కూడా ఒక కారణం ఎందుకంటే వాళ్ళకున్న ప్రత్యేక అధికారాలను అడ్డం పెట్టుకుని కాశ్మీర్ సమస్యను ఇంకా జఠిలం చేసి కాశ్మీర్ ను స్వతంత్ర దేశంగా అవతరించాలని భావించి ఉండవచ్చు. 370 రద్దు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగానే కాశ్మీర్ ఎంపీలు చొక్కాలు చించుకుని, భారత రాజ్యాంగ ప్రతులను సైతం చించేందుకు ప్రయత్నించడం చూస్తుంటే భారత దేశ రాజ్యాంగం పట్ల కాశ్మీర్ నాయకులకు ఎలాంటి ఉద్దేషం ఉందో అర్థం అవుతుంది. కాశ్మీర్ సమస్యకు  కారణం అక్కడి నాయకులు కూడా కారణం అని అనుమానం కలుగక మానదు. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపుతుంటే అది స్వాగతించాల్సిందిపోయి వ్యతిరేకించడం చూస్తుంటే వీరు కాశ్మీర్ ను భారత్ నుండి వేరు చేసేందుకు పాకిస్థాన్ కు సహకరస్తున్నారని అనుమానం కలుగుతుంది. పాకిస్థాన్ కు అక్కడి నాయకులు సహకరించడానికి కారణం మతవాదామే.


 ఏది ఏమైనా   ప్రధాని మోది, అమిత్ షా  కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.

26, జులై 2019, శుక్రవారం

టైమ్ బ్యాంక్ అంటే ఏమిటి?

             
                 టైమ్ బ్యాంక్ గురించి ఒక చోట మెసేజ్ చదివాను కొత్తగా అనిపించింది. అసలు ఏంటి టైమ్ బ్యాంక్ అని చూస్తే బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టు స్విస్ ప్రజలు తమ ఇతరులకు సేవ చేసి ఆ సమయాన్ని టైమ్ బ్యాంకులో దాచుకుంటారట.
తిరిగి వారు దాచుకున్న సమయాన్ని వడ్డీతో సహా వాడుకోవచ్చట.

టైమ్ బ్యాంక్ అనేది స్విట్జర్ లాండ్ లో ఉంది.
టైమ్ బ్యాంక్ అనేది స్విట్జర్ లాండ్ ప్రభుత్వం వృద్దుల కోసం  ఏర్పాటు చేసిన  వృద్దాప్య పెన్షన్ కార్యక్రమం. తాము వయసులో ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నవారికి సేవచేస్తూ ఆ సమయాన్ని తమ టైమ్ బ్యాంక్ ఖాతాలో దాచుకుంటారట. అలా తమ ఖాతాలో దాచుకున్న టైమ్ ను వారు అనారోగ్యానికి గురి అయినప్పుడు వాడుకోవచ్చట.

ఈ టైమ్ బ్యాంక్ లో తమ సేవా సమయాన్ని దాచుకునాలనుకునే వారు అందులో ఖాతా పొందాలి. ఈ ఖాతా పొందాలనుకునే వారు ఆరోగ్యంగా ఉండి అందరితో స్నేహపూర్వక సంభాషణ నైపుణ్యం కలిగి ఉండాలి. వారి సేవలను పొందాలనుకునే వారికి సేవలను అందించగలగాలి. అలా ఒక సంవత్సరం తమ సేవలను  అందించిన తర్వాత వారు ఎంత సమయం సేవ చేసారో అన్ని గంటలను లెక్కించి టైమ్ బ్యాంక్ కార్డు ఇస్తారు. ఈ కార్డులో వారు ఎన్ని గంటలు సేవ చేసారో ఉంటుంది. వారు వృద్దాప్యంలో అనారోగ్యానికి గురి అయినప్పుడు  తిరిగి అన్ని గంటలు వడ్డీ తో కలిపి వారికి సేవలు చేయడానికి  టైమ్ బ్యాంకు వారు  వాలంటీర్లను పంపిస్తారట. ఈ వాలంటీర్లు అంటే తమ సమయాన్ని టైమ్ బ్యాంకులో దాచుకునేవారే.

స్విట్జర్లాండ్ లో  టైమ్ బ్యాంకు విధానం ద్వారా వృద్దులకు  సేవలు అందిస్తున్నారు. ఈ విధానం ద్వారా అనేక సామాజిక సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయట. టైమ్ బ్యాంకులు ఒంటరి వృద్దులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కదా...

24, జులై 2019, బుధవారం

తెలుగులో కొన్ని మంచి వెబ్ సైట్లు



తెలుగు వెబ్ సైట్లలో  నాకు నచ్చిన కొన్ని వెబ్ సైట్లు.

ఉదయం లేవగానే న్యూస్ పేపర్ చదువుతాం. అది ఇప్పుడు మొబైల్ ఫోన్ లోనే చదువుతున్నాం. వార్తల కోసం చాలా వెబ్ సైట్లే ఉన్నాయి. కాని అందులో రెండు వెబ్ సైట్లు మాత్రమే బాగున్నాయి.

ఈ సైట్లు రాజకీయంగా ఏ పార్టీకిలకు అనుకూలంగా ఉన్నా, డిజైన్ పరంగా యూసర్ ఫ్రెండ్లీ పరంగా చూసుకుంటే ఈ రెండు సైట్లు బాగున్నాయి.


https://www.eenadu.net/

https://www.andhrajyothy.com/



కథలు, సీరియల్లు, శీర్షికలు, చిత్ర సమీక్షలతో చాలా బాగుంటుంది గో తెలుగు వెబ్ సైట్. ఈ సైట్ డిజైన్ కూడా చాలా బాగుంది..

http://m.gotelugu.com/


మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల గురించి సమాచారం కోసం  ఈ సైట్..


https://telugu.gizbot.com/


కార్లు, బైకులు, వాహానాలకు సంబందించిన అప్డేట్స్, కార్లు, బైకుల రివ్యూల కోసం కింది సైటు.


https://telugu.drivespark.com/



20, జులై 2019, శనివారం

బిగ్ బాస్ షో

       
BIGBOSS show



              బిగ్ బాస్ షో అసలు ఈ షోలో ఏముందో అర్థం కాదు.  ఎంటర్టైన్మెంట్ కోసం ఈ షో అంటారు. ఓ పది మంది కాంట్రవర్సీటీ, ఇంకొంత మంది సెలెబ్రెటీలను ఒక హౌస్ లో ఉంచి షో చేస్తారట. ఇందులో వారు ఏం చేసిన  ఎంటర్టైన్మెంటేనట.
వారు నిల్చున్న, కూర్చున్న, నవ్విన, ఏడ్చిన ఏం చేసిన ఎంటర్టైన్మెంటే. ఇదో పనికి మాలిన షో. ఇలాంటి షోలను పనికి మాలిన వాళ్ళే చూస్తారు. ఇది పనికి మాలిన షో అని అందరికి తెలుసు పైగా అందులోని సెలెబ్రెటీలకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడాను.!!
అది కూడా మామూలు ఫాలోయింగ్ కాదు ఆర్మీ అంట అందులో ఒక సెలెబ్రెటీకి ఒక ఆర్మీ అంట. ఆయన ఆర్మీ  పెద్ద బ్యానర్లు వేయించడం, రోడ్లపై ర్యాలీలు తీయడం చూసాం. ఎంత పిచ్చి అండీ జనాలకి హైదరాబాద్ వంటి నగరంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియదా జనాలకి. వాటిపై ఎవ్వరు నోరు మెదపరు కాని పనికి రాని షో కోసం ర్యాలీలు తీయడం సిగ్గుచేటు. పైగా ఆర్మీ అని పేరు పెట్టడం. దేశం కోసం ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో కాపాలా కాసే జవాన్ల కోసం ర్యాలీలు తీయరు కాని బోడి పనికిమాలిన షోల కోసం ఏమైన చేస్తారు.

      ఇప్పుడు బిగ్ బాస్ 3 సీజన్ అంట మొదట
 జూ.ఎన్టీఆర్,  తర్వాత నాని ఇప్పుడు నాగార్జున ఈ షోలకి హోస్ట్ లు. అసలు ఇంత మంచి పేరున్న నటులు కూడా ఇలాంటి చెత్త షోలు చేయడం చూస్తుంటే ఆశ్ఛర్యం వేస్తుంది.
ఇలాంటి షో లు సమాజానికి అవసరమా చెప్పండి. దీని ద్వారా ఏం చెప్పిలనుకుంటున్నారు జనాలకి ఈ షో నిర్మాతలు. అయిన నిర్మాతల తప్పేం లేదు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు తీస్తారు చూసే జనాలకి ఉండాలి. పనికిమాలిన షోని కూడా జనాలు పాపులర్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నారంటే ఇంకేం కావాలి నిర్మాతకి కాసుల పంటే. జనాలు గొర్రెలు నిర్మాతల దృష్టిలో మామూలు గొర్రెలు కాదు కాసులు కురిపించే బంగారు గొర్రెలు. ఇలాంటి గొర్రెలు ఉన్నంత కాలం బిగ్ బాస్ లాంటి షోలు నడుస్తూనే ఉంటాయి....


28, జూన్ 2019, శుక్రవారం

చెన్నైలో నీళ్ళ కరువుకు కారణం ఎవరు.

చెన్నై లో నీటి కరువుకు కారణం ఎవరు.





చెన్నై మెట్రోపాలిటన్ సిటీ దేశంలో నాలుగో పెద్ద నగరం. అలాగే పరిశ్రమలు కూడా ఎక్కువగానే ఉన్న నగరం. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అభివృద్ది చెందిన నగరం.  చెన్నైలో 2015 డిసెంబర్ లో వరదలు వచ్చాయి. అదే నగరంలో 2019 ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేక విలవిలలాడుతున్నారు జనం.
ఇప్పుడు చెన్నైలో
నీళ్ళ కంటే పెట్రోలే చవక.
ఒకప్పుడు వరదలు ఇప్పుడు నీళ్ళ కరువు దీనికి కారణం ఎవరు. ప్రభుత్వాలా? పాలకులా ? వీళ్ళెవరూ కాదు దీనికి కారణం ప్రజలు.  మనిషి ఆశకు హద్దుండదు విచ్చల విడిగా పర్యావరాణాన్ని నాశనం చేస్తున్నారు. నగరాల్లోనే ఎందుకు వరదలు వస్తాయి? గ్రామాల్లో రావెందుకు ?
 ఎందుకంటే నగారాలు కాంక్రీటు జంగల్లు ఎక్కడా కూడా చుక్క నీరు నిలవకుండా ప్రతీ అడుగు కాంక్రీటుతో కప్పేస్తున్నారు. ఇలాంటప్పుడు వర్షం పడితే నీరు ఎక్కడికి పోతుంది? కొంచెం వర్షం పడిన నీరు రోడ్లపైకి వస్తుంది. నాలాలు ఉన్న అక్రమ కట్టడాలతో వాటిని కూడా వదలట్లేదు. భారీ వర్షం కురిస్తే ఏమవుతుంది అటు భూమిలోకి ఇంకలేక,ఇటు డ్రైనేజీ వ్యవస్త లేక ఇళ్ళల్లోకే వస్తాయి. అప్పుడు వరదలొచ్చాయని గగ్గోలు పెడుతుంటారు. ప్రభుత్వాల మీద పడుతుంటారు చేతకాని ప్రభుత్వాలంటూ పాలకుల మీద ఎనలేని కోపం ప్రదర్శింస్తుంటారు. పాపం పాలకులు ఏం చేస్తారు  తమ ప్రభుత్వాలను కాపాడుకోవడంలో బిజీగా ఉంటాయి. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక ప్రభుత్వాలకెక్కడిది.
ప్రకృతి వైపరిత్యాలకు కారణం ప్రజలు. వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రజలకు పర్యావరణం గురించి అవగాహన కల్పించాలి. ఇంకుడు గుంతలు ప్రతీ ఇంటిలో తప్పని సరి చేయాలి. నాలాలపై అక్రమణలను తొలగించాలి. డ్రైనేజీల్లో చెత్త వేయకుండ నివారించాలి. అప్పుడే నగారాల్లో వరదలు రాకుండా ఉంటాయి.

ఇప్పుడు కరువు గురించి చూద్దాం:

 నీళ్ళ కరువుకు కారణం ముఖ్య కారణం  కూడా ప్రజలే. నగరాల్లో ఏ ఇంటిలో చూసిన ఒక బోరు బావి తప్పని సరిగా ఉంటుంది. మన బోరు మన కరెంటు అని విచ్ఛలవిడిగా నీటిని తోడేస్తున్నారు.  భూగర్భ జలాలను అవసరం ఉన్నా లేకపోయిన బోరు బావుల నుండి నీటిని తోడి వృధా చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో ఒక బోరుబావి తప్పని సరిగా ఉంటుంది కాని ఏ ఒక్క ఇంటిలో కూడా ఇంకుడు గుంత ఉండదు. జనాలకు నీళ్ళు ఎలా వస్తాయో, ఎంత ఖర్చవుతుందో  కనీస అవగాహన లేదు. ఇక మున్సిపాలిటీ వారు అందించే కుళాయి నీళ్ళ గురించి చెప్పాలి. నేను హైదరాబాదులో ఒక కాలనీలో చూసాను అక్కడ రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. అన్ని డ్రమ్ములు, సంపులు, ట్యాంకులు నింపుకున్నాక ఇంకా నీరు వస్తుంది. అప్పుడు మనోళ్ళు ఊరుకుంటారా ఇంటి ముందు ఉన్న రోడ్డుమొత్తం కుళాయి నీటితో ఓ అరగంట కడిగేస్తారు. అలా ఒక్కరు కాదు కాలనీ మొత్తం ఇలాగే రోడ్లను కడిగేస్తారు నీళ్ళు వచ్చినప్పుడల్లా.. దీన్ని బట్టి అర్థమయ్యిందేమిటంటే జనాలకు  నీటి విలువ అస్సలు తెలియదని. అసలు నీళ్ళు మనకు ఎలా వస్తున్నాయి, ఎలా వాటిని వాడుకోవాలి, వృధా చేస్తే ఏమవుతుంది అని వారికి కనీస అవగాహన లేదు.

ప్రభుత్వాలకు కూడా ముందు చూపు ఉండాలి. ఇంత పెద్ద నగరానికి నీటి సరఫరా కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ముందు చూపు ఉండాలి. ఎండాకాలంలో నీటి అవసరాలను ఎలా తీర్చాలి అని ప్రణాలిక ఉండాలి. ఎండాకాలం వచ్చేసరికి అన్ని జలశయాలను ఊడ్చేస్తే ఏంటి ప్రయోజనం.
నీటిని వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పడే నీటి కరువు ఉండదు.

నీళ్ళ కరువు రాకుండా ఉండాలంటే :

* ప్రతీ ఇంటిలో తప్పని సరిగా ఇంకుడు గుంత ఉండాలి.
* ప్రతీ ఇంటిలో బోరుబావులు తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వకూడదు.
* నీటిని వృధా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
*  విరివిగా మొక్కలు నాటాలి.
* నీటి పొదుపు గురించి అవగాహన కల్పించాలి.
* నీటిని ఎక్కువగా వినియోగించే బీరు, కూల్ డ్రింక్ లాంటి పరిశ్రమలను మూసివేయాలి.
*  మనిషికి ప్రాణాధారం అయిన నీటికంటే బీర్లు, కూల్ డ్రింకులు అవసరమా చెప్పండి.

ప్రజలకు పర్యావరణం పట్ల కనీస అవగాహన ఉండాలి లేకుంటే ముందు ముందు చుక్క నీరు కూడా దొరకదు..


12, జూన్ 2019, బుధవారం

బోరున విలపిస్తున్న ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు

     


           అయ్యా చంద్రబాబు మీరు లేకపోతే ఎట్లాగయ్యా మా బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. అన్నదాత సుఖీభవ రద్దు చేశామంటున్నారు. రుణమాఫీ చేయమంటున్నారు ఇట్లగయితే మేం ఎలా వ్యవసాయం చేసేది అంటూ రైతులు  చంద్రబాబు వద్ద గొల్లున ఏడుస్తున్నారు. అయ్యా చంద్రబాబు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు భూములరేట్లు పడిపోయాయి ఇలాగయితే మేం బతికెదెట్ల అంటూ
రాజధాని చుట్టు పక్కల ప్రాంత ప్రజలు చంద్రబాబు వద్ద వాపోతున్నారు.

     సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని చూసే మేము బీటెక్ చదువుకున్నాం రెపోమాపో జాబ్ వస్తుంది అనుకున్నాం. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే  మాకు జాబు వచ్చేలా లేదు అంటూ నిరుద్యోగులు బోరున విలపిస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని ఆధర్శంగా తీసుకునే మా పిల్లల్ని చదివిస్తున్నాం ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంటీ? మీరు ఓడిపోయిన తర్వాత ఇక ఇక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు రావట, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతాయట ఇలాగయితే మా పిల్లల భవిష్యత్ ఏంటని చంద్రబాబు గారి వద్ద పిల్లల తల్లిదండ్రులు బోరున విలపించారట. రైతులు, రాజధాని ప్రాంత ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని తమ కష్టాలను చెప్పుకుని బోరున విలపించారు.

బాబుగారు...

మళ్ళీ మీరొస్తేనే భూముల రేట్లు పెరుగుతాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి,
 కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి,

 రైతులకు అన్నదాత సుఖీభవ వస్తుంది,
రైతులకు రుణమాఫీ అవుతుంది,

మా పిల్లల భవిష్యత్ బాగుంటుంది మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలని, తమ కష్టాలను తీర్చాలని ప్రజలు నిన్న  చంద్రబాబు వద్ద బోరున విలపించారట.

9, జూన్ 2019, ఆదివారం

పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి కారణం 150 కోట్లు.

 

     పవన్ ఓడిపోవడానికి ముఖ్య కారణం 150 కోట్ల డబ్బు అంట. ఇది ఎవరో  అన్నది కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే అన్నారు.   150 కోట్లు ఉంటే చాలు ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించవచ్చని మనం అనుకోవాలా? అంటే జనానికి ఎవరు డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తారా?  తమకు సరియైన నాయకుడు ఎవరన్నది ప్రజలకు తెలియదని పవన్ అభిప్రాయమా.? ఈ రోజుల్లో ఏ ఓటరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని డబ్బులు పంచిన తమకు సరియైన నాయకుడు ఎవరో వారికే ఓటు వేస్తారు కాని ఎవరు డబ్బులకు, మందుకు ఆశపడి ఓటు వేయరు. అది పవనాలు సార్ కి తెలుసుకోలేక పోతున్నారు. పవన్ అన్నట్టు భీమవరంలో 150 కోట్ల డబ్బులు పంచి తనను ఓడించారని అంటున్నాడు. మరీ గాజువాక లో ఎందుకు ఓడారు అక్కడ ఎన్ని డబ్బులు పంచారు. ఓడిపోయాడు ఏదో కారణం చెప్పాలి అందుకని 150 కోట్లు ఖర్చు చేసి భీమవరంలో తనను వైసీపి ఓడించిందని చెబుతున్నాడు. అంటే పవన్ దృష్టిలో డబ్బులు ఉంటే చాలు ఎన్నికల్లో గెలవచ్చని అర్థమా? . పవన్ దగ్గర డబ్బు ఉంటే ఈ ఎన్నికల్లో గెలిచే వాడేమో!
     
                      తెలుగు రాష్ట్రాలల్లో  పెద్ద సెలెబ్రెటీ, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సొంత పార్టీ స్థాపించి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటి చేస్తే 150  కోట్ల రూపాయలతో ఓడించేస్తే, సామాన్య  ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికి 10 కోట్లు చాలేమే. ఈ లెక్కన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ సీట్లు గెలవడానికి 2050 కోట్లు ఉంటే చాలు  పవన్ సార్ ఈజీగా గెలిచేవాడేమో. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్టు డబ్బులు పంచితేనే ఎన్నికల్లో గెలుస్తారనుకుంటే వచ్చే ఎన్నికల్లో మీరు రెండు వేలకోట్లతో పాటు అవతలి పార్టీ వాళ్ళు కూడా డబ్బులు పంచుతారు కాబట్టి దానికి ఇంకో వెయ్యికోట్లు ఎక్కువ మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది మరియు ఎన్నికలకు ఇంకా ఐదేళ్ళు సమయం ఉంది కాబట్టి ఖర్చులు పెరిగిపోతాయి అందుకని జనాలకు ఇప్పుడిచ్చే దానికి రెట్టింపు డబ్బులు పంచాలి. లేదంటే ఎవరు ఎక్కవ పంచితే వారికి ఓటేస్తారు. కాబట్టి మొత్తంగా రౌండ్ ఫీగర్ ఓ 5 వేలకోట్లు సిద్ధం చేసుకోండి. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మీరే గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది నేనన్న మాట కాదు మీరే అన్న మాట డబ్బులు పంచి నన్ను ఓడించారని అన్నారు. అందుకని నేను చెబుతున్నాను మీరు కూడా ఒక చోట కూర్చుని డబ్బులు పంచండి మీరే ముఖ్యమంత్రి అవుతారు.


       ఇప్పుడు ఓటర్లకు కావాలసింది సరైనా పాలన అందించే నాయకుడు కాదు ఎవరు ఎక్కువ డబ్బులు పంచితే వారినే ఎన్నికల్లో గెలిపిస్తున్నారు    అనే పవన్ అభిప్రాయం ప్రకారం  తెలంగాణలో కెసీఆర్ కేంద్రంలో మోడి ఇలా డబ్బులు పంచే అధికారంలోకి వచ్చారా??  అని అనుకోవాలా ఈ లెక్కన ఆంధ్రాలో చంద్రబాబు కూడా  ఎన్నికలకు కొన్ని నెలలముందు పథకాల పేరుతో అధికారికంగా డబ్బులు పంచారు. అయినా ఘోరంగా ఓడిపోయారు. మరీ ఇక్కడ డబ్బు ప్రభావం ఎందుకు పనిచేయలేదు? పవన్ సార్ సమాధానం చెప్పాలి..


               
                  కేవలం డబ్బులు పంపిణీ చేస్తే ఎన్నికల్లో గెలుస్తారనుకోవడం పవన్ ఆజ్ఞానానికి నిదర్శనం.
ఈ రోజుల్లో ఓటర్లు అమాయకులేం కారు  ఎవరు సమర్థవంతమైన నాయకులో వారికి తెలుసు గతంలో వారు ఏం చేసారు, వారి కుటుంబం ఎలాంటిది, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా, తమ సమస్యలను పరిష్కరించగలడా లేదా అని చూస్తారు. అంతేకాని ఎవడో  రెండు వేలు నోటు చేతిలో పెడితే ఓటు వేయరు. అలా అంటే డబ్బు ఉన్న ప్రతోడు ఎన్నికల్లో గెలుస్తాడు.
 పవన్ సార్.... డబ్బులు పంచి జగన్ ఎన్నికల్లో   గెలవలేదు. గతంలో ఆయన తండ్రిగారి పాలన చూసి గెలిపించారు. రాష్ట్రంలో సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి జనంతో మమేకమై గెలిచాడు. తన తండ్రిలాగా పాలన చేస్తానని చెప్పి గెలిచాడు. మీకోసం నెనున్నాను అని భరోస ఇచ్చి గెలిచాడు.అంతేకాని డబ్బులు పంచి అధికారంలోకి రాలేదు. జగన్ అవినీతి పరుడు లక్షలకోట్లు సంపాదించాడని అంటున్నారు అన్ని కోట్లు ఉన్న వ్యక్తి డబ్బులు పంచి ఈజీగా గెలవచ్చంటే  2014 ఎందుకు ఓడిపోయారు.?
పవన్ సార్ ఎన్నికల్లో గెలవాలంటే కావల్సింది డబ్బులు కాదు సార్ జనానికి నేనున్నానే భరోస ఇవ్వాలి. సమర్థవంతంగా పాలించగలడనే నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకాన్ని ఈ సారి జగన్ కలిగించాడు గెలిచాడు. జగనన్న జగనన్న జనమంతా నీవెంటే అన్నారు ముఖ్యమంత్రిని చేసారు. నీవు కూడా పవనన్న పవన్న ప్రజలంతా నీవెంటే అనేలా చేయి అప్పుడు నిన్ను గెలిపిస్తారు. అయనా కష్టమే ఎందుకంటే జగన్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకో నాయకుడు ఎందుకు అని ప్రజలు భావిస్తున్నారు. అయినా అన్న చిరంజీవి గారు కూడా పార్టీని స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసినప్పడే సినిమా వాళ్ళ మీద నమ్మకం పోయింది జనాలకి. ఇప్పుడు ఆయన స్వంత తమ్ముడైనా పవన్ ను నమ్మాలంటే కష్టమేమరీ. నమ్మి గెలిపిస్తే మళ్ళీ ఏ పార్టీలోనైనా విలీనం చేసేస్తడేమేనని జనాల భయం కాబట్టి పవన్ ని జనాలు ఇప్పట్లో నమ్మరు.... 

     
     ఇప్పుడు చెప్పండి పవన్ ఓడిపోవడానికి కారణం 150 కోట్ల లేదా  తనపై జనాలకు లేని విశ్వసనీయత వల్లన. ఆయనే తెలుసుకోవాలి.. కేవలం డబ్బు  పంచితేనే గెలుస్తారనుకుంటే ఎప్పటికి పవన్ గెలవలేరు. పైగా జనాలను నోటుకు ఓటు వేస్తారనడం వలన  పవన్ ను ప్రజలు హీనంగా చూసే పరిస్థితి వస్తుంది.

31, మే 2019, శుక్రవారం

ఒక్క మాటతో ఏడు ఎం.పీ సీట్లు పోగొట్టుకున్న కెసీఆర్.




ఒక్క మాటతో ఏడు ఎం.పీ సీట్లు  పోగొట్టుకున్న
కెసీఆర్.

   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏక పక్షంగా కేసీఆర్ కే మళ్ళీ పట్టం కట్టారు ప్రజలు. 89 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ లో చేరిపోయారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురులేని విధంగా తయారయింది పరీస్థితి. ఇక రానున్న ఎంపీ ఎలక్షన్లలో 17  సీట్లకు 16  సీట్లు మనమే గెలుస్తాం అనే ధీమాలో ఉన్నారు కేసీఆర్,ఆ పార్టీ నాయకులు. కారు+సారు+సర్కారు=పదహారు అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు ఆపార్టీ నాయకులు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి అలాగే ఓవైసీ సపోర్టు ఎలాగు ఉంటుంది మొత్తం 17 సీట్లు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ గెలిచే ఎంపీ సీట్ల సపోర్ట్ తో కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నారు కెసీఆర్ సార్. కేంద్రంలో ఏ పార్టీకి స్వంతంగా  ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అనుకున్నాడు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఏకంగా ప్రధానమంత్రి అవుదామని కలలు కన్నారు కెసీఆర్ సారు.

            ఇక  దేశంలో ఎంపీ ఎలక్షన్స్ తేది ఖరారయ్యింది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. టిఆర్ఎస్ పార్టీ గెలుపు ధీమాతో ప్రచారంలోకి దిగింది. అసెంబ్లీ ఫలితాలే పార్లమెంటులో కూడా వస్తాయని ధీమాతో ఉన్నారు. కారు సార్ సర్కారు పదహారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇక పార్టీ ముఖ్యమంత్రి కెసీఆర్ సభలలో  ఇతర పార్టీల నాయకులపై ముఖ్యంగా బిజేపి నేతలపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. ఎలాగు గెలుపు తమదే అని విజయగర్వంతో బిజేపి నేతలపై మీరేనా హిందువులు మేము కదా అంటు విరుచుకుపడ్డారు. మార్చి 17 న కరీంనగర్ సభలో బిజేపి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  "హిందూ గాళ్ళు బొందు గాళ్ళు" అంటూ వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క మాటతో  అప్పటి వరకు కెసీఆర్ కు ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడు. కేసిఆర్ హిందు వ్యతిరేకి అంటు జనంలో బలంగా నాటుకు పోయింది.  ఈ వ్యాఖ్యలపై కెసీఆర్ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎన్నికలు ముగిసాయి. అప్పటికి 16 సీట్లు మనవే అనుకున్నారు కెసీఆర్. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి తీరా ఫలితాలు చూస్తే ఏమయ్యింది సారుకు పదహారు కాదు అందులో సగమే వచ్చాయి. అందరూ షాక్ ఎందుకంటే టిఆర్ఎస్ కు సగం సీట్లు వచ్చినందుకు కాదు రాష్ట్రంలో బిజేపి ఉనికే లేకుండా పోయిందనుకున్నారు. కాని ఈ సారీ బిజేపికి 4 సీట్లు గెలుచుకుని అందరిని ఆశ్ఛర్యపరిచింది. స్వయాన ముఖ్యమంత్రి కుమార్తె సైతం బిజేపి అభ్యర్తి చేతిలో ఓడిపోయింది. మరో మూడు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. మల్కజ్ గిరిలో రేవంత్ రెడ్డి గెలవడం కూడా కెసీఆర్ పట్ల జనాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అర్థమవుతోంది.  జనాల్లో కెసీఆర్ పట్ల వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణం హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అంటూ వ్యాఖ్యానించడం. ఇంకా ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి ఎక్కడ ప్రస్తావించక పోవడం. ఇప్పటీకి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గురించి ఉలుకు లేదు పలుకు లేదు. కెసీఆర్ గారు ఇలాగే ఉంటే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి అధికారంలోకి వచ్చిన ఆశ్ఛర్యపోవలసిన పనిలేదు.

               కేంద్రంలో మోది మళ్ళీ అధికారంలోకి రాడని అందరు అనుకున్నారు అన్నిపార్టీలు ఏకమై మోది పై విరుచుకు పడ్డారు. ఎన్ని పార్టీలు ఏకమైన ప్రజలు అందరు ఏకమై మోదికి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ఈ దేశానికి మోది లాంటి నాయకుడే సరియైన వాడని ఈ దేశప్రజలు గట్టిగా నమ్మారు మోదినే ప్రధానిని చేసారు. బిజేపి అంతమైపోతుందని అనుకునే రాష్ట్రంలో ఊహించిన దానికంటే ఎక్కవ సీట్లు సాధించిందటే దానికి కారణం మోది. ఎవరు ఏమనుకున్నా బిజెపీ హిందూ పార్టీ అని చెప్పుకోవచ్చు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఈ దేశ ప్రజలు ఊరుకోరని ఈ పార్లమొంటు ఎన్నికల్లో తెలంగాణ ఫలితాల్లో నిరూపితమయ్యింది.
    ఈ దేశం లౌకిక దేశమే అలాగే హిందు ప్రధానదేశం. ఇతర మతాలను హిందు మతం గౌరవిస్తుంది.

30, మే 2019, గురువారం

ఖజానా ఖాళీ చేసిన బాబు గారు.

ఖజానా ఖాళీ చేసిన బాబు గారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్న డబ్బు 100 కోట్లు మాత్రమే. ఈ నెల కావలసింది 5000 కోట్లు.
కొత్త ముఖ్యమంత్రి లోటు బడ్జెట్ తో ఈ నెల ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లిస్తారు. సంక్షేమ పథకాలు ఎలా అందిస్తారని రాస్తున్నారు. సరే అదే మళ్ళీ బాబు గారే ముఖ్యమంత్రిగా గెలిస్తే ఇలా ఖజానా గురించి రాసేవారా. అంటే జగన్ ఇలాంటి ఆర్థిక పరిస్తితులలో రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించగలడని పరోక్షంగా బాబుగారి పత్రికలు రాస్తున్నాయి.

     కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి జగన్ ఎలా ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతారు. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందే ఖజానా మొత్తం ఖాళీ చేసారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాలుగున్నర ఏళ్ళలో గుర్తుకు రాని ఆడపడుచులు, రైతులు ఎన్నికలకు నాలుగు నెలల ముందు వారిపై ఎనలేని ప్రేమ ముంచుకొచ్చింది. ఖజానాలో ఉన్న కాస్త డబ్బును ఆడపడుచులకు, రైతులకు పంపిణీ చేసాడు . ఎలాగు గెలవనని బాబు గారికి తెలిసిపోయింది అందుకే ఖజానా మొత్తం ఖాళీ చేసాడు. కొత్త ముఖ్యమంత్రికి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేలా చేసాడు...
ఇలాంటి ఆర్థిక పరిస్థితులలో బాబుగారే రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడని అందరూ అనుకుంటారని బాబుగారి ఆలోచన.


27, మే 2019, సోమవారం

పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే టీచర్లకు పరీక్ష.!!

పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే టీచర్లకు పరీక్ష.!!


     ఎక్కడైనా పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాస్తుంటారు. కాని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వారికి చదువు చెప్పిన టీచర్లకే పరీక్ష పెట్టాలని నిర్ణయించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఆ రాష్ట్రంలో 700 పాఠశాలల్లో  30% మంది  విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో అక్కడి ఉపాద్యాయుల విషయపరిజ్ఞానాన్ని పరీక్షించాలని మధ్యప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పరీక్షలకు కూడా విద్యార్థులకు పెట్టే పరీక్షలవలే ప్రశ్నపత్రాలు రూపొందిస్తారట. పరీక్ష జూన్ 12   జరుగనుంది.
 
      ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిని స్వచ్ఛందంగా పదవి విరమణ చేయించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారట. పరీక్షల్లో ఫెయిల్ అయితే విద్యార్థులదే బాధ్యత అంటారు. కానీ మధ్యప్రదేశ్ లో ఉపాద్యాయుల బాధ్యత కూడా ఉంటుందని వారికి పరీక్ష పెట్టి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం.
     
             ఏదో మొక్కుబడిగా చదువులు చెప్పి నెల నెల జీతాలు తీసుకోవడం అలవాటయిపోయింది నేటి ప్రభుత్వ ఉపాధ్యాయులకి. విద్యార్థులు చదివిన చదవకపోయిన మాకేంటి మా జీతాలు మాకు వస్తాయి అనే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికి అనేక ప్రభుత్వ పాఠశాలల్లో   చదవడం రాయడం కూడా రాని విద్యార్థులు ఉన్నారు. వారు చదవకపోవడానికి కారణం ఎవరు?? ఇందులో  ఉపాధ్యాయుల బాధ్యత ఏమి లేదా..
పైగా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థినులపట్ల  అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచానికి దిగజారుతున్నారు.. ఇలాంటి వారి వలన మిగితా ఉపాధ్యాయులకు చెడ్డపేరు వస్తుంది.  ఇలాంటి నీచమైన ఉపాధ్యాయులను ఎవరు ప్రశ్నించకపోవడం వలన వారు ఆడిందే ఆట పాడిందే పాట. మమ్మల్ని ఎవరు ఏం పీకలేరని వారి ధీమా. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అప్పుడేె విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. అలాగే విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్థించే ఉపాధ్యాయులని ఉద్యోగాల నుండి తీసేసి కఠిన శిక్షలు వేయాలి. అలాగే వారి కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేకుండా చేయాలి.

                 
           ఒక ప్రభుత్వ ఉద్యోగానికి వేలల్లో పోటిపడుతున్నారు. ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటిది టీచర్  ఉద్యోగం చేసుకుంటు అర లక్ష జీతాలు తీసుకుంటు విద్యార్థినులను లైగికంగా వేదిస్తున్నారు.  ఇలా నీచంగా ప్రవర్తించడం చాలా ధారుణం. ఇలాంటి వారిని ఉద్యోగం నుండి తొలగించి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి.


పవిత్రమైన ఉపాధ్యాయవృత్తిలో కీచక టీచర్లు.

https://youtu.be/ZDFdUNojDIY

https://youtu.be/SSK11ezwnTc


https://youtu.be/vA2Pt_FaBno





     


26, మే 2019, ఆదివారం

మాల్దీవులు


         ప్రపంచంలో అందమైన దేశాలలో మాల్దీవులు కూడా ఒకటి.  భారతదేశానికి నైరుతిలో హిందుమహాసముద్రంలో ఉన్న అందమైన దేశం. మాల్దీవులు అనేక పగడపు దీవుల సముదాయం. రాజధాని నగరం మాలే. అధికారిక భాష  ధివేహి. సముద్రమట్టానికి చాలా తక్కువ  ఎత్తులోనే ఉంటుంది. పర్యాటక రంగం , మత్సపరిశ్రమ ముఖ్యమైన ఆదాయ వనరులు.
కరెన్సీ మాల్దీవియన్ రుఫియా మన కరెన్సీలో
1mvr=4.50 inr .
అమెరికా డాలర్స్ లో
1usd=15.46 mvr.
వేసవిలో ఒకసారి సరదాగ అందమైన పగడపు దీవులకు వెళ్ళి గడపాలనుకుంటే మాల్దీవులు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్.




24, మే 2019, శుక్రవారం

ఓడిన వారి పరిస్థితి ఏంటి..??


     
    ఎన్నికల్లో  గెలిచిన జగన్ సీఎం అవుతారు, నరేంద్ర మోడి పీఎం అవుతారు. మరీ ఓడిన వారి పరిస్థితి ఏంటి..


     ఆంద్రప్రదేశ్ లో జగన్ ప్రభంజనంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయారు
ఈవిఎమ్ మిషన్ ల వల్లే తాము ఓడిపోయామని  చంద్రబాబు అనుమానం. ఎందుకంటే ఎన్నికల కంటే ముందునుండే చంద్రబాబు ఈవిఎమ్ మిషన్ లను వ్యతిరేకిస్తూ వచ్చాడు. జనాల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఈవిఎమ్ లు పెట్టిన బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగిన ఎలా గెలుస్తారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్ని సగం సగం పనులే. ఐదేళ్ళు చేయలేని పనులు ఎన్నికలు దగ్గర పడగానే రైతులకు , ఆడపడుచులకు ఎవో కొన్ని తాయిలాలు ఇస్తే తనను మళ్ళీ గెలిపిస్తారని బాబు ఐడియా. జనాలు వెర్రి వాళ్ళ ఏంటి? ఇచ్చింది పుచ్చుకుని బాబుకు తగిన బుద్ది చెప్పారు.
ఐదేళ్ళు పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు ప్రేమ ఒలకబోస్తే ఎవరు నమ్ముతారు.? అందుకే బై బై బాబు అంటు ఇంటికి పంపారు.?
పైగా కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నాడు కాని రాష్ట్రంలోనే సైకిల్ ఫంక్చర్ అయ్యే ఇకా చేసేదేముంది  సైకిల్ చక్రాలు పీకి మనవడితో ఆడుకుంటాడు... అని జనాలు అనుకుంటున్నారు..
 
పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ ధారుణం ఛాయ్ పోయక ముందే గ్లాస్ పగిలిపాయే..  తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన పేరు చెప్పుకుని ఎమ్మెల్యేగా నిలడితే కళ్ళుముసుకుని గెలిచేంత పవర్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్వయంగా ఎన్నికల్లో  ఎమ్మెల్యేగా నిలబడితే ఘోరంగా ఓడిపోవడం శ్చర్యం వేస్తుంది. ఒకచోట కాదు  రెండు చోట్ల ఓడిపోవడం ఇంకా ఆశ్చర్యం...
   పవన్ సార్ కి తెలియదు ఈలలు గోలలు వేసినంత ఈజీగా ఓట్లు పడవని. ఇంకా నయం ఒక్క సీటు గెలుచుకుని ఇజ్జత్ కాపాడుకున్నాడు.
ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  తన పార్టీ గెలిచే సీట్లతో చక్రం తిప్పుదామనుకున్నాడు. కర్ణాటకలో కుమారస్వామిలాగా కింగ్ మేకర్ అవ్వాలనుకున్నాడు కాని జనాలు జోకర్ ని చేసారు. ఆవేశ ప్రసంగాలు, పంచ్ డైలాగులు, సాదారణ వ్యక్తిలాగా వ్యవహరించడాలు ఇవేమి ఆయనను గెలిపించలేవు. ఈ ఎన్నికల్లో గబ్బర్ సింగ్ లాగా పవర్ చూపిద్దామనుకున్నాడు కాని అజ్ఞాతవాసిలాగా అయిపోయాడు. ఇక పవన్ సార్ ఐదేళ్ళు ప్రశ్నిస్తాడో లేక అజ్ఞాతవాసి లాగా సినిమాలు తీసుకుంటాడో వేచిచూడాలి....



   కేంద్రంలో రాహుల్ గాంధీ పరిస్థితి చూస్తే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఈ సారి కేంద్రంలో కూడా గెలిచి ప్రధాని  అవుదామనుకున్నాడు. కాని పప్పు అయ్యాడు. రాఫెల్ ను  పట్టుకుని వేలాడితే జనాలు ఎలా ఓట్లేస్తారు.
అటు వైపు ఉన్నది మోది. రాహుల్ లాంటి వాళ్ళ పప్పులు ఉడకవక్కడ. ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీని ఒక జోకర్ లా చూస్తారే తప్ప ప్రధానమంత్రి పదవి పై కూర్చోబెట్టే సాహసం చేయరు. దేశం గురించి అవగాహన లేని వ్యక్తి దేశ ప్రధాని అవ్వలేడు. ప్రజలకు కావాలసింది సమర్థవంతంగా పాలించే పాలకులు రాహుల్ గాంధీ లాంటి పప్పూలు కాదు. ఇక రాహుల్ గాంధీ బంపర్ మెజారిటీతో కేరళలో గెలవడం ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ రాహుల్ గెలవడానికి ప్రధాన కారణం అక్కడ హిందూ వ్యతిరేకతే కారణం. హిందూ వ్యతిరేక ఓటర్లు  ఓటు వేయడం మూలాన  రాహుల్ గాంధీ అక్కడ గెలిచారు. యూపిలో ఓడిపోయాడు.
ఒక చోట గెలిచాడు ఎలాగు పార్లమెంటు లో అడుగు పెడుతాడు తర్వాత ఇంకెంటి ప్రియా ప్రకాశ్ వారియర్ లా కన్నుకొడుతూ ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తాడు.  బయట రాఫెల్ గురించి వాదిస్తూ మరో ఐదేళ్ళు అలా ముందుకు వెళ్తాడు...