27, ఆగస్టు 2020, గురువారం
ఇప్పుడు కూడా బయట టీ లు తాగడం, బిర్యాని తినడం అవసరమా.?
ఇప్పుడున్న పరిస్తితుల్లో ఇంటినుండి బయటకు రావడమే పేద్ద సాహసం అనుకుంటే బయట రోడ్ల పక్కన ఉండే హోటళ్ళలో టీలు తాగడం, ఆహారం తినడం చూస్తుంటే తెలిసి తెలిసి మురికి నీటిలో మొసలి పై కూర్చూని మురికి నీరు తాగినట్టు ఉంటుంది.
రోడ్ల పక్కన హోటళ్ళు ఎంత శుభ్రంగా ఉంటాయో, అక్కడ ఆహారం ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మనకు తెలుసు. అది తెలిసి కూడా అక్కడ టీ తాగారు, బిర్యానీలు తిన్నారు అది ఒకప్పుడు అప్పుడు ఎంత అపరిశుభ్రంగా ఉన్న అక్కడ తినే వారికే ఆరోగ్యం పాడయితే ఇప్పడు అక్కడ తిని మీ కుటుంబ సభ్యులతో పాటు మీతో ఉండేవారిని కూడా అనారోగ్యం బారిన పడేలా చేస్తున్నారు.
కొన్ని రోజులు బయట ఫుడ్ తినకుండా ఉండలేరా? అసలు ఇప్పడు ఇంట్లో నుండి బయటకు వస్తే జేబులో సానిటైజర్,
ముఖానికి మాస్క్ పెట్టుకుని ఎవరు దగ్గరకు రాకుండా భయం భ
యంగా పనులు చేసుకుని ఇంటికి చేరుకుని వేడినీటిలో బట్టలు వేసి స్నానం చేసి ఇంట్లోకెళ్తేకాని మనసొప్పదు. అలాంటిది ఏ విధమైనా జాగ్రత్తలు పాటించని రోడ్లపక్కన ఉండే హోటళ్ళలో ఎలా తినాలనిపిస్తుంది.
ఎందుకు ఇలాంటి హోటళ్ళలో టీ లు తాగాలి, ఆహారం తినాలి అనిపిస్తుందంటే. అక్కడ ఉండే టేస్టు ఆ వాతావరణం చూస్తే కొందరికి అక్కడే తినాలనిపిస్తుంది. అక్కడఎలాంటి వాతావరణం ఉంటుందో చూద్దాం. టీ విషయానికి వస్తే ఒకరోజు ఫ్రెండ్స టీ తాగుదాం పదా అంటు ఒక హోటల్ కి తీసుకెళ్ళారు.ఇక్కట టీ చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నువ్వు ఒకసారి తాగావంటే మళ్ళీ మళ్ళీి తాగుతావు
ఇది సిటీలో ఫేమస్ టీ అంటు ఆ టీ పేరు ఏదో చెప్పారు. అక్కడి వెళ్ళి ఆ వాతావరణం చుస్తే అక్కడ నిలపడాలంటేనే కష్టం అలాంటిది టీ తాగడం అంటే వాంతికొచ్చేలా ఉంది. మా ఫ్రెండు అక్కడ టీ చేసే అతనితో కాక తీన్ ఛాయ్ మలయ్ దాల్కే అని చెప్పిండు. వాడు ఏక్ మినట్ కాక అంటూ ఒక చేత్తో స్టౌ మీద గిన్నెలో పాలు కలుపుతు మరో చేతితో నోట్లో గూట్కా వేసుకుని మూడు ఛాయ్ లు కలిపి ఇచ్చాడు. మేం టీ తిసుకుని ేబుల్ దగ్గర నిలచుని టీ తాగుతున్నాం. ఇంతలో ఒకతను వచ్చి ఛార్ ఛాయ్ పార్సల్ కరో అన్నాడు. టీ చేసేవాడు ఫోన్లో మాట్లాడుతు టీ కలపుతుంటే వాడి నోటిలోని గుట్కా తుంపరలు అందులో పడుతున్నాయి అయినా ఆ టీ తీసుకువెళ్ళేవాడు ఏమీ అనట్లేదు ఎందుకంటే అది వాడు తాగడు కాబట్టి. ఇంకా నయం ఇంకొంచెం ఆలస్యంగా మేము వచ్చుంటే ఆ పవిత్రమైన, రుచికరమైన స్పెషల్ గుట్కా తుంపరల టీ మేం తాగేవాళ్ళం. ఇక్కడి ఛాయ్ గురించి గొప్ఫగా చెప్పిన మా ఫ్రెండ్ గాడి దురదృష్టం ఇంత రుచికరమైన ఛాయ్ మిస్సయ్యాడు అది కాని వీడు తాగుంటే ఇంకెంత గొప్పగా చెప్పేవాడో. ఇక మా పక్కన మరో ముగ్గురు టీ తాగుతున్నారు అందులో ఒకడు ఒక చేత్తో టీ తాగుతు మరో చేతితో సిగరెట్ కాలుస్తున్నాడు. ఇంకొకడు టీ తాగుతు సమోస తింటున్నాడు.మరొకడు గుట్కా నములుతు పక్కనే ఉమ్మి వేస్తున్నాడు. ఏమీ కాంబినేషన్ రా సామి టీ తాగుతు సిగరెట్ తాగడం, టీ తాగుతు సమోస తినడం ఇలాంటి వింతలు నేను చూడటం ఇదే మొదటిసారి.!ఇవేమి పట్టించుకోకుండా టీ తాగుతున్నారు నా ఇద్దరు మిత్రులు. వాళ్ళు నావైపు చూసి ఎలా ఉంది శేఖరం ఛాయ్ అన్నారు. ఒకవైపు సిగరెట్ పొగ మరోవైపు గుట్కా వాసనలు ఘుమఘుమలాడుతుంటే ఏం చెప్తం. బాగుందిరా అన్నాను. చూసావా ఇక్కడ టీ తాగితే మళ్ళి మళ్ళి వచ్చి టీ తాగుతావు అన్నాడు. ఇక్కడ టీ తాగితే మళ్ళీ మళ్ళీ కాదురా మళ్ళొకసారి తాగాలంటేనే విరక్తి పుడుతుంది అని మనసులో అనుకుంటు అక్కడ నుండి వచ్చేసా.అప్పటి నుండ అక్కడే కాదు ఎక్కడ టీ తాగలేదు.
అసలు ఇంత చెత్త ప్రదేశాలలో అంత చెత్త టీ ఎలా తాగుతారో నాకార్థం కాదు.పైగా గొప్పలు చేప్పుకుంటు ఇతరులను అక్కడ టీ తాగడానికి తీసుకెళ్తుంటారు. అక్కడ వాడు టీ తయారు చేసే వాడు పరిశుభ్రంగా ఉన్నాడా? టీ తయారు చేయడానికి ఏ పాలు వాడుతుతున్నాడు?, ఏ నీళ్ళు , ఏ టీ పొడి వాడుతున్నాడు?, అక్కడ ఎంత పరిశుభ్రంగా ఉంది? అని ఇవేవి పట్టించుకోకుండా టేస్ట్ బాగుంది కదా అని తాగితే అంతే అనారోగ్యం పాలవడం ఖాయం.ఇక్కడ టీ చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో టీ ఇంత రుచిగా ఉండదు అంటారు. నిజమే మరి ఇంటిలో తయారు చేసిన టీ రుచిగా ఉండదు ఎందకంటే హోటళ్ళలో వేలమంది తాగిన టీ గ్లాసులను ఒకసారి నీటిలో ముంచి కడగకుండా అలాగే అందులో టీ ఇస్తారు.మరియు చుట్టు పక్కల సిగరెట్ పొగలు, గుట్కా వాసనల ఇన్ని ఉంటాయి కాబట్టె బయట టీ బాగుంటుంద.
వారం కిందట మావాళ్ళు పని మీద హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ టీ తాగి బిర్యాని తిని వచ్చారు. అక్కడకు వెళ్ళడమే సాహసం అనుకుంటే ఇలాంటి చెత్త హోటళ్ళలో టీ తాగి, బిర్యాని తినడం అంటే చాలా పెద్ద తప్పు. చాలామంది ప్రజలు ఇలా హోటళ్ళు తెరిచారో లేదో అలా వెళ్ళిపోతున్నారు ఆ చెత్త తినడానికి. కొన్ని రోజులు ఇలాంటి చెత్త టీ లు బిర్యానిలు తినకుండా ఉండలేరా?
.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 కామెంట్లు:
నాకేం కాదులే అనే నిర్లక్ష్యధోరణి. దానివల్ల ఇతరులకు కూడా రిస్క్ అన్న ఇంగితం లేకపోవడం. మనం మారం. ఇక రోడ్డు ప్రక్క టీ కొట్లల్లో, టిఫిన్ సెంటర్లల్లో శుభ్రత ఏనాడూ లేదు, ఇవాళ ఎక్కడి నిండి వస్తుంది.
పరిశుభ్రంగా లేకపోయిన జనాలు ఎగబడి తింటుంటే హోటళ్ళ యజమానులకు ఇంకేం కావాలి. వాళ్ళకు కావలసింది డబ్బు. డబ్బు మీదున్న శ్రద్ద పరిశుభ్రత, నాణ్యత మీద ఉండదు.
మనకోసం కాకపోయిన మన కుటుంబం కోసమైనా ఇలాంటి చోట్ల తినడం మానేయాలి.
// "మనకోసం కాకపోయిన మన కుటుంబం కోసమైనా ఇలాంటి చోట్ల తినడం మానేయాలి." //
అంత సెన్సే ఉంటే ఇక అనుకునేదేముంది? మనది ఇప్పటప్పట్లో మారే సమాజం కాదు ... నాది నిరాశావాదం లాగా అనిపించినా కూడా.
నాకు తెలిసి రెస్టారెంట్లు తెరిచాక బెంగళూరు లో కేసులు విపరీతంగా పెరిగాయి. అంతకు ముందు చాలా తక్కువ ఉండేవి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి