భానోదయం

19, ఆగస్టు 2025, మంగళవారం

వర్షాకాలంలో కరెంట్ తో జాగ్రత్తగా ఉండాలి.

 వర్షాకాలంలో కరెంట్ తో జాగ్రత్తగా ఉండాలి.

ఫంక్షన్ లు అయినప్పుడు బయట ఫోకస్ లైట్లు లాంటివి పెట్టినప్పుడు వాటికి కనెక్ట్ చేసే వైర్లకు ఎక్కడైనా ఇన్సులేషన్ చెక్ చేసుకోవాలి.

మొన్న నేను ఒక ఫామ్ హౌస్ లో కొత్తగా కొన్ని లైట్లు పెట్టడానికి వెళ్ళాను.

అక్కడ ఒక రూమ్ కు రెండు ఫోకస్ లైట్లు పెట్టారు.

ఆ రూమ్ పైకప్పు ఇనుప పైపులు వేసి పైనా సిమెంట్ పెంకులు వేసారు.

ఆ రూమ్ పైకప్పు ఇనుప పైపులకు ఒక ఫోకస్ లైటు బెండింగ్ వైరు తో కట్టారు.

నేను ఆ ఫామ్ హౌస్ గేటు ముందు నేమ్ ప్లేట్ కోసం కనెక్షన్ ఇవ్వడానికి ప్రహారిగోడ మీదకు ఎక్కి వైరుకు క్లిప్పు లు కొడుతూ ఆ రూము పెంకులకు నా చేతులు తాకాయి షాక్ కొట్టింది.

అదేంటి సిమెంట్ పెంకులు కూడా షాక్ కొడుతుంది అని టెస్టర్ పెట్టి చూసా.

టెస్టర్ లో ఫుల్ పవర్ చూపిస్తుంది.

దీనికి కారణం ఆ గది పైకప్పు ఇనుప పైపులకు కట్టిన లైటు.

ఆ లైటు బాడికి కరెంటు వస్తుంది  అది బెండింగ్ వైరు తో గది పైకప్పు ఇనుప పైపులకు కట్టడం వలన పైకప్పు మొత్తం షాక్ కొడుతుంది. వర్షం పడటం వలన పైకప్పు సిమెంటు పెంకులకు కూడా షాక్ కొడుతుంది..

ఇది చిన్న విషయమే అయినా తడిగా ఉన్న ప్రదేశంలో కరెంట్ షాక్ కొడితే చాలా ప్రమాదం..

వర్షాకాలంలో బయట కరెంట్ వైర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి...




13, డిసెంబర్ 2024, శుక్రవారం

అరెస్ట్ చేస్తేనే ఆగమేఘలా మీద స్పందిస్తున్నా సెలెబ్రెటీలు సంధ్య థియేటర్ తొక్కిసలాట గురించి ఎందుకు స్పందించలేదు..

 ఒక హీరోని అరెస్ట్ చేస్తే చాలా మంది హీరోలు, సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అరెస్ట్ అక్రమం అంటు మాట్లాడుతున్నారు. ఒక సెలబ్రిటీని అరెస్టు చేస్తేనే పదిమంది సెలెబ్రెటీలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. మరీ పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది,ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు ఏ హీరో, సెలెబ్రెటీలు ఎందుకు స్పందించలేదు అప్పుడు సెలెబ్రెటీలు  ఎక్కడున్నారు.???


సెలెబ్రెటీల అరెస్టుకే ఇంతలా స్పందిస్తున్నారు ఒక ప్రాణం పోయింది. అప్పుడు ఎందుకు ఒక్కరు కూడా ఆ మహిళ గురించి మాట్లాడలేదు,సహాయం చేయలేదు.

సామాన్యుల ప్రాణాలకు విలువ లేదా..?


 సినిమా వాళ్ళు డబ్బు సంపాదన కోసం ప్రేక్షకులే దేవుళ్ళు మీ వల్లే ఇంత స్థాయికి ఎదిగాం అంటూ మటలు చెబుతారు కాని అదే ప్రేక్షకులకు కష్టం వస్తే ఏ హీరో ఆదుకోడు.. 


సినిమా అనేది వ్యాపారం వ్యాపారాన్ని వ్వాపారంగానే చూడాలి. అంతేకాని సినిమాల్లో చూసి హీరోలని దేవుళ్ళ లా భావించొద్దు.. వీళ్ళు ఎవ్వరిని ఉద్ధరించడానికి సినిమాలు తీయరు. వారి స్వలాభం కోసమే సినిమాలు తీస్తారు.. ప్రేక్షకులు వేల రూపాయల టికెట్  పెట్టి సినిమాలు చూసి వారికి కోట్లు సంపాదించి పెడుతున్నారు. 


సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం ఆ కుటుంబానికి న్యాయం చేస్తారు. 


ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాలి సినిమా హీరోలని దేవుళ్ళ లాగా ఆరాదించకండి.

వారు మనలాంటి సామాన్య మనుషులే. ఇంతకూడా మానవత్వంలేని మనుషులు.


అసలు ఏముంది సెలెబ్రెటీల మొహాల్లో..

 ఆ రంగు పూసుకున్న మొహాలను చూడ్డానికి అంతలా ఎగబడతారు ..

వారెమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా.

వాళ్ళకోసం పనులు మానుకొని ఎగబడి వెళతారు. వాళ్ళను చూడకపోతే జీవితంలో అన్ని కోల్పోతాం అని మీద మీద పడి చూస్తారు.. 


మొహానికి రంగు పూసుకుని సినిమాల్లో నీతులు చెప్ఫేవాడు కాదు హీరో. నిజ జీవితంలో పదిమందికి సహాయం చేసేవాడు హీరో..