భానోదయం: మొక్కల పెంపకం
మొక్కల పెంపకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మొక్కల పెంపకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జులై 2022, సోమవారం

కోనోకార్పస్ లాంటి పనికి రాని మొక్కలు పెంచే కంటే పళ్ళమొక్కలు పెంచవచ్చు కదా..


కోనోకార్పస్ మొక్క







కోనోకార్పస్ మొక్క ఇప్పుడు పల్లెలో, పట్టణాల్లో రోడ్ల వెంబడి విరివిగా కనిపించే మొక్క. అలా నాటించారు మీ పాలకులు...

 నెలల వ్యవధిలోనే ఏపుగా పెరిగుతుంది ఈ మొక్క..
 ఒక్కసారి నాటితే చాలు పెద్దగా దీని సంరక్షణ అంతగా చూసుకోవాల్సిన అవసరం లేకుండా పెరుగుతుంది.

ఇతర మొక్కలైతే ప్రతిరోజు నీరు అందించాలి, పశువులు తినకుండా కాపాడాలి. అందుకే ఈ మొండిజాతి మొక్కలు నాటారు అనిపిస్తుంది..

ఇప్పుడు కోనోకార్పస్ మొక్కలు ఏపుగా పెరిగి రోడ్ల వెంట పచ్చదనంతో నిండిపోయింది.. కాని ఇప్పుడు ఈ మొక్కల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా వీటివల్ల మనుషులకు ఎలర్జీలు వస్తాయని చెబుతున్నారు.
వీటి ఆకులను పశువులు కూడా తినవు, పక్షులు కూడా వీటిపై గూళ్ళు పెట్టవట.. 

ఇది నిజమేనా? అంటే నిజమే అనిపిస్తుంది.. నేను మా ఊరిలో గమనించాను వీటి ఆకులను పశువులు తినడం లేదు, పక్షులు కూడా వీటిపై గూళ్ళు పెట్టడం లేదు.. మనుషులకు ఎలర్జీలు అంటే ఇంకా ఏమి తెలీదు.. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో..

ఈ మొక్కల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, వీటివల్ల నష్టాలు ఉన్నాయని తెలిసే వీటిని నాటించారా, లేక తెలియక నాటించారా??

వీటి బదులు పనికి వచ్చే మొక్కలు చాలానే ఉన్నాయి కదా వాటిని పెంచవచ్చుగా..?

ఉదాహరణకు జామ, మామిడి, దానిమ్మ, నిమ్మ, నేరేడు, వేప, చింత, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు పనికి వచ్చే మొక్కలు చాలానే ఉన్నాయి అలాంటి మొక్కలను రోడ్లకు ఇరువైపులా పెంచవచ్చు కదా...
వీటివల్ల మనుషులకు చాలా ఉపయోగం ఉంటుంది కదా..

గ్రామాల్లో అభివృద్ధి పనులకు తాగిపడేసిన బీరు సీసాలు, లిక్కరు సీసాలు ఏరుకుని ఆ డబ్బులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని మన గౌరవ మంత్రి గారు సెలవిచ్చారు...

ఇలా తాగి పడేసిన లిక్కరు సీసాలకు బదులు, ఆ పండ్ల మొక్కలు పెంచి వాటి పండ్లను అమ్మి గ్రామంలో అభివృద్ధి పనులు చేయోచ్చు కదా...

ఎందుకు పనికిరాని మొక్కలు పెంచడం ఎందుకు.. పండ్లమొక్కలు, ఔషద మొక్కలు నాటితే ఎంతో ఉపయోగం కదా...

పాలకులు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేయాలి, ఎలా దోచుకోవాలి అని చూస్తారే తప్ప, ప్రజలకు మంచి చేయాలని చూడరు.. ఇక్కడ రాజకీయాలు ఇంతే...








10, ఏప్రిల్ 2019, బుధవారం

మామిడి మొక్కల నర్సరీలు కేరాఫ్ పెద్దాపూర్ గ్రామం


      ఎండాకాలం అంటే ఎండలు మండిపోతుంటాయి. చల్లని పానియాలు తాగుతు సేదతీరుతాం.
 ఎండాకాలంలో వచ్చే పండ్లు అంటే ముందుగా మనకు మామిడి పండ్లు గుర్తొస్తాయి. మండే ఎండల్లో మామిడి పండ్లతో సేదతీరుతాం.
మామిడిపండు పండ్లల్లో రారాజు. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. బంగినపల్లి మామిడి పండ్లు ఫేమస్.
     ఏ రకం మామిడి అయితే ఏంటి మామిడిపండ్ల రుచి అద్భుతం. మామిడి తోటలు మనకు అనేకం ఉన్నాయి. సంవత్సరంలో ఒకేసారి కాసే మామిడి పండ్లు ఎండాకాలం సీజన్ కాబట్టి ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంటాయి.


Mango nursey

Mango nursery






      మామిడి మొక్కల నర్సరీలకు కేరాఫ్ అడ్రస్ పెద్దాపుర్ గ్రామం. ఈ గ్రామం  సంగారెడ్డి పట్టణానికి దగ్గరలో NH9 కు అనుకుని ఉంది. ఇక్కడ అనేక నర్సరీలు ఉన్నాయి. ఎక్కువగా మామిడి మొక్కల నర్సరీలే ఉన్నాయి.
మామిడి తోటలు  పెంచాలనుకునే వారు ఇక్కడ నుండి మొక్కలను తీసుకెళ్తుంటారు.
మామిడి మొక్కలు కావలసిన వారు ఇక్కడ నుండి తీసుకెళ్ళవచ్చు. వానాకాలం మొదలయ్యే ముందు నాటుకుంటే మంచిది వర్షపు నీటికి మొక్కలు తొందరగా పెరుగుతాయి.

  ఇక నేను చాలా సార్లు చేప్తుంటాను మొక్కలు నాటండని. మాకు వీలు కాదు అనేవారు ఒక చిన్న పని చేయండి.   మీరు మామిడి పండ్లు తిన్న తర్వాత వాటి పీసులను చెత్త బుట్టల్లో పారవేయకండి. రోడ్డు వెంబడి వెలుతున్నప్పుడు అడవుల్లో కాని రోడ్డుకు ఇరువైపుల పారవేయండి.  వచ్చేది వానాకాలం కాబట్టి వాటంతట అవే మొలకెత్తుతాయి. మీకు తెలియకుండానే మొక్కలు పెంచిన వారు అవుతారు.