భానోదయం: మే 2021

21, మే 2021, శుక్రవారం

సోనుసూద్ రియల్ హీరో నువ్వు దేవుడు సామీ. స్టార్ హీరోలు నీ కాలి గోటికి సరిపోరు.

 

  సోనుసూద్ అంటే మన తెలుగు వాళ్ళకి అరుంధతి సినిమాలో అఘోర గుర్తొస్తాడు. అంత క్రూరంగా ఉంటుంది ఆ సినిమాలో ఆయన నటన. ఆ సినిమాలో జేజమ్మ సోనూసూద్ పాత్రను చంపేస్తే  జేజమ్మ జేజమ్మ అంటు జేజేలు పలికారు. ఇప్పుడు ఎక్కడ జేజమ్మ  సినిమాల్లో ఏదో పీకి పారేశాం అంటు ఫోజు కొడుతారు మరీ ఇలాంటి కష్ట  సమయంలో ఎక్కడ జేజమ్మ. సోనుసూద్ ను సినిమాల్లో చూసి అందరు తిట్టుకుంటారు ఎందుకంటే అతను విలన్ కాబట్టి అందరు విలన్ లా భావించే సోనుసూద్ ఎంత జాలి హృదయం సామీ నీది. నువ్వయ్య అసలైన హీరోవి. కనిపించే దేవుడివి.

 ఆడవాళ్ళు ఏం సహాహం చేస్తారని మీరనొచ్చు. ఎందుకు చేయరు ఏ రంగంలో లేరు చెప్పండి ఆడవాళ్ళు. అన్ని రంగాల్లోను మగవారితో సమానంగా దూసుకుపోతున్నారు. మరీ ఇప్పుడు ఇలాంటి కష్ట సమయంలో ఎక్కడ ఈ జేజమ్మ ఈ జనాల వళ్ళే కదా మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. ప్రజలు అల్లాడిపోతున్న చూసి చూడనట్టు ఉన్నారు వీళ్ళు. మానవత్వం లేని వారు..


  సినిమాల్లో హీరోలు ప్రజలకు సహాయం చేసినట్టు నటిస్తేనే వాళ్ళను దేవుళ్ళలాగా చూస్తారు ప్రజలు ఇక ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు వాళ్ళకు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి పూల మాలాలు వేస్తారు. పాలాభిషేకాలు చేస్తారు. ఇంతలా హీరోలను దేవుళ్ళలా భావిస్తారు ప్రజలు. మరీ ఇలాంటి కష్టకాలంలో ఏ హీరో దేవుడు ప్రజలకు సహాయం చేయడం లేదే? మన దగ్గర A  to Z స్టార్ లు  ఉన్నారు ఏ ఒక్క స్టార్ కూడా ప్రజల కష్టాలను చూసి సహాయం చేయడం లేదు వీళ్ళు హీరోలా!

 వీళ్ళు స్టార్ లా తూ...  వీళ్ళంతా హీరోలు కాదు డమ్మీ గాళ్ళు మానవత్వం లేని నిజమైన విలన్లు  వీళ్ళు. కోట్ల డబ్బు ఉన్నాగాని సహాయం చేయలేని వీళ్ళు స్వార్థపరులు. మానవత్వంలేని వారు. 


జేజమ్మలే కాదు ఇంకా చాలా మంది పెద్ద స్టార్ లు సినిమాల్లోనే జనాలను ఆదుకుంటారు. అది నటన అని అదరికి తెలుసు అది చూసి పిచ్చి జనాలు మా హీరో గొప్పవాడు అంటు పొగిడెస్తారు. వీళ్ళు సినిమాల్లోనే హీరోలు బయట డమ్మీ గాళ్ళు.  ఈ కరోనా టైంలో పేదవారు అల్లాడిపోతున్నా చూసి చూడనట్టు ఉంటున్నారు మహా స్వార్థపరులు.


మన స్టార్ హీరోలు సినిమాల్లో ప్రజలకు సహాయం చేసే శ్రీమంతులు. బయట మాత్రం సమాజసేవలో బిచ్చగాళ్ళ కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళకంటే బిచ్చగాళ్ళే నయం తమ కళ్ళముందు ఎవరైన ఆపదలో ఉంటే ఆదుకుంటారు. 

 మానవతా దృక్పథంతో పేద ప్రజలకు సహాయం చేస్తూ యావత్ భారతదేశ ప్రజల గుండెల్లో దేవుడిలా ఉన్న ఆ ఒక్కడు, నిజమైన శ్రీమంతుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆపద్భాందవుడు  మనసు  ఉన్న మహారాజు అతడే సోనుసూద్. సోనూసూద్ సార్ సరిలేరు నీకెవ్వరు.


మన హీరోలు  సినిమాల్లో సింహాలు పులులు చిరుతలు టైగర్ లు బయట డమ్మీగాళ్ళు.

సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలూ సోనుసూద్ సార్ కాలి గోటికి సరపోరు. 

రియల్ హీరో సోనుసూద్ కనిపించే దేవుడు సామీ మీరు..

19, మే 2021, బుధవారం

మంతెన సత్యనారాయణ రాజు గారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందట.! 8 రోజుల్లోనే కోలుకున్నారట.

https://youtu.be/qub5q1qUxUA

 ప్రకృతి జీవన విధానం గురించి మనకు ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తున్నారు మన మంతెన గారు. ఆయన ఆరోగ్య సలహాలు పాటిస్తూ ఎంతోమంది ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారు. 

 నాకు తెలిసి ఆయన గత 20 సంవత్సరాలుగా ప్రకృతి జీవన విధానం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వ్యాధులు వస్తే మందులు వాడకుండా ఎలా తగ్గించుకోవాలో తెలియజేస్తున్నారు. ఆయన సలహాలు పాటిస్తూ ఆరోగ్యాభిలాషులందరు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నారు.

 మంతెన గారికి కూడా గత ఏప్రిల్ 30 న జ్వరం వస్తే కోవిడ్ టెస్ట్ చేయిస్తే  పాజిటివ్ వచ్చిందట. జ్వరం వచ్చినప్పటినుండే ఆయన లంఖనం చేసి 8 రోజుల్లోనే కోవిడ్ నుంచి కోలుకున్నారట. 8రోజుల తర్వాత మళ్ళి టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చిందట.

ఆయన ఇంత తొందరగా కోలుకోవడానికి కారణం ప్రకృతి జీవన విధానం పాటిస్తారు కాబట్టి.

లంఖనం చేసి వైరస్ ను  ఎదుర్కొన్నారు.

లంఖనం అంటే ఆహార పదార్థాలు తీనకుండా రోజంత తేనె నీళ్ళు తాగుతు ఉండటం. ఇలా చేయడం వల్ల శరీరం సహజ సిద్దంగానే వైరస్ ను ఎదుర్కొంటుందని మంతెన గారు చెబుతారు ఇప్పుడు చేసి చూపించారు.

 మంతెన గారిలాగా మందులు వాడకుండా లంఖనం చేసి అందరు కోవిడ్ నుండి కోలుకుంటారా అంటే కోలుకోలేరు. ఎందకంటే రాజు గరు ఎన్నో ఏళ్ళుగా ప్రకృతి జీవన విధానాన్ని పాటిస్తున్నారు. కాబట్టి తొందరగా కోలుకున్నారు.

 ప్రకృతి జీవన విధానంలో మంచి ఆహార నియమాలు పాటిస్తారు. కాబట్టి ఏ వ్యాదులు రావు వచ్చిన తొందరగా కోలుకుంటారు.

చాలామంది మంచి ఆహారపు అలవాట్లు పాటించక అనేక రోగాల పాలవుతున్నారు.

అందరు ఆరోగ్యకరమైన జీవనం గడపాలంటే మంతెన గారి ప్రకృతి జీవన విధానం పాటించి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను.

 ఒక ముఖ్య గమనిక:- మీరు మంతెన సత్యనారాయణ రాజు గారిలా లంఖనం చేసి వైరస్ ను ఎదుర్కొంటాను అంటే కుదరదు. ఎందుకంటే  మీ ఆహారపు ఆలవాట్లు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెసింగ్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు కాబట్టి మీరు మందులు వాడాల్సిందే. వైరస్ నుండి కోలుకున్నాక ప్రకృతి జీవన విధానం పాటించి ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడే రాజుగారు చెప్పినట్టు లంఖనం చేసి వైరస్ ను ఎదుర్కొంటానంటే కుదరదు మీ ఆహారపు అలవాట్ల వల్ల అది కుదరదు హాస్పిటల్ వెళ్ళి మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోండి.  ఆయన చాలా ఏళ్ళ నుండి ప్రకృతి జీవన విధానంలో ఉన్నారు కాబట్టి వైరస్ నుండి తొందరగా కోలుకున్నారు.

మంతెన గారి వీడియో ఇక్కడ చూడండి.

https://youtu.be/qub5q1qUxUA


16, మే 2021, ఆదివారం

భయపడకండి ధైర్యంగా ఉండండి అప్పుడే కరోనాను జయించగలరు.

 భయపడితే ఎంత బలవంతుడైన ఓడిపోతాడు. ధైర్యంగా ఉంటే సామాన్యుడు కూడా బలవంతుడౌతాడు.

  ఒక రాజ్యంలో రాజు భయపడితే ఎంతపెద్ద సైన్యం ఉన్న శత్రువు చేతిలో ఓడిపోతాడు. అదే రాజు ధైర్యంగా ఉండి ఎంత పెద్ద శత్రువైనా సరే   మన పరాక్రమం ముందు గడ్డిపోచతో  సమానం. ఈరాజ్యం మనది ఎవడో గొట్టం గాడు వచ్చి ఆక్రమిస్తానంటే ఊరుకుంటామా? తన్ని తరిమేద్దాం. అని సైన్యానికి ధైర్యం చెబితే సైనికులు వీరోచితంగా పోరాడి శత్రువును మట్టికరిపిస్తారు.  అలా కాకుండా శత్రువును చూసి భయపడి వారితో మనం గెలువలమా? అని సందిగ్ధం వ్యక్తం చేస్తే ఇక సైనికులు కూడా డీలా పడిపోయి దైర్యంగా యుద్దం చేయకుండా శత్రువు చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని  కోల్పోతారు. 

  ఇప్పుడు మనదేశంలో అందరు కనిపించని శత్రువు కరోనా తో యుద్దం చేస్తున్నారు. ఆ శత్రువును ఓడించాలంటే ముందుగా మనం దైర్యంగా ఉండాలి. అలాగే మాస్క్, సానిటైజర్ వంటి ఆయుధాలతో ఈ యుద్దంలో గెలవాలి. అలాగే పౌష్టికాహారం తింటూ బలంగా ఉండి శత్రువును తన్ని తరిమేయాలి. 

మీరు ధైర్యం కోల్పోయి నాకేమవుందోనని బయపడిపోతే మీలో ఉన్న  రక్షణవ్యవస్థ బలహీనపడి శత్రువును ఎదుర్కోలేక ఓడిపోతుంది. నాకేమి కాదు అని ధైర్యంగా  ఉండిపౌష్టికాహారం తీసుకుంటూ డాక్టర్ సూచించిన మందులు వాడుతుంటే మన రక్షణ వ్యవస్థ  వైరస్ తో పోరాడి వైరస్ ను అంతం చేస్తుంది.

 

  మన దేహం ఒక రాజ్యం అనుకుంటే మన  మనసు ఈ రాజ్యానికి రాజు. మనలో రక్షణ వ్యవస్థ ఈ రాజ్యానికి సైన్యం. మన మనసు ఏవిధంగా ఆలోచిస్తుందో శరీరం కూడా మనసుకు అనుగునంగానే పనిచేస్తుది. కాబట్టి మనం మనసులో ఏదనుకుంటే దాని ప్రభావం శరీరంపై పడుతుది. 

 నాకు ఏమవుతుందోనని మనసులో భయపడిపోయి ఆందోళన చెందారంటే దాని ప్రభావం శరీరంపై పడి లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ భయంలో బీపి పెరగడం , చెమటలు పట్టడం, గుండె దడ రావడం వంటివి జరిగి శరీరంలోని వ్యవస్థలన్ని అతలాకుతలం అయిపోతాయి తీవ్ర అనారోగ్యం పాలవుతారు. మన మనసు చెప్పినట్టే శరీరం వింటుంది. ఏ పని చేయాలన్న ముందు మనసులో అనుకుంటేనే చేస్తాం. మనసు రీమోట్ అయితే శరీరం టీవీ లాంటిది. అక్కడ  రిమోట్ నొక్కితేనె ఇక్కడ టీవీ పని చేసినట్టు మన మనసు ఎలా చెప్తే శరీరం అలా పని చేస్తుంది. కాబట్టి మనసులో నాకు ఏమికాదు అని ధైర్యంగా అనుకున్నారనుకోండి అప్పుడు మీకు ఏమికాదు. ఆరోగ్యంగా ఉంటారు.

 

  మనసు చెప్తే శరీరం ఎలా వింటుందో ఒక ఉదాహరణ - మీరు ఉదయం  5 గంటలకు నిద్ర లేవాలి అనుకుని అలారమ్ పెట్టుకున్నారు. ఏదో లేవాలి అంతే అనుకుని పడుకున్నారు. ఉదయం అలారమ్ మోగినా మీరు నిద్ర లేవలేరు. ఎందుకంటే మీరు గట్టిగా అనుకోలేరు కాబట్టి అలారమ్ మోగినా గాని ఆఫ్ చేసి మళ్ళి పడుకుంటారు. అదే మీకు చాలా ముఖ్యమైన జాబ్ ఇంటర్వూ ఉంది అక్కడకు వెళ్ళాలంటే ఉదయం 4 గంటలకే నిద్ర లేచి బయలు దేరాలి. అప్పుడు మీరు గట్టిగా మనసులో అనుకుంటారు ఉదయం 4 గంటలకే నిద్రలేవాలని మైండ్ లో  ఫీక్సయిపోతారు. ఆశ్ఛర్యంగా మీరు 4 గంటలకే నిద్ర లేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఆరోజు మీరు అలారమ్ పెట్టడం మర్చిపోతారు అయినా మీరు అనుకున్న సమాయానికే మేలుకుంటారు. ఇది ఎలా జరిగిందంటే మీరు మనసులో గట్టిగా అనుకున్నారు కాబట్టి. మీ ఊరినుండి ఇంటర్వూ కు వెళ్ళే పట్టణం చాలా దూరం మీ దగ్గర బైక్ లేదు అయినా అక్కడకు వెళ్ళాల్సిందే అని గట్టిగా మనసులో అనుకున్నారు. అంతే ఆటోలనో బస్సులోనో వెళ్ళి ఇంటర్యూకు అటెండ్ అవుతారు. నేను వెళ్తాను అనే గట్టి సంకంల్పం ఉంటే తప్పకుండా వెళ్తావు. నీ సంకల్పానికి ప్రకృతి కూడా తోడవుతుంది, దైవం కూడా తోడయ్యి నీవు ఒక్క అడుగు ముందుకేస్తే వెనక నుండి దైవం పది అడుగులు నడిపిస్తాడు. అందుకే ధైర్యంగా ఉంటే ఏదైనా సాదించగలం.

  అదే ఇంటర్వూకు వెళ్ళాలి మీ దగ్గర బైక్ ఉంది కాని మనసులో గట్టి సంకల్పం లేదు వెళ్తానో లేదో అంత దూరం వెళ్తే మద్యలో ఏమన్న అయితే అనుకుంటూ వెళ్తే నిజంగానే ఏదో ఒకటి అవతుంది. 

ఏమవుతుందోనని భయపడొద్దు భయపడితే ఏది సాదించలేము. 

ధైర్యంగా ఉండండి తప్పకుండా విజయం సాదిస్తారు.

ఇప్పుడు చాలా మంది కరోనాకు భయపడి ఏమవుతుందో ఆని ఆందోళన చెందతున్నారు.  అలా భయపడి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ముందు భయాన్ని వదిలేసి నాకేమి కాదు అని  ధైర్యంగా ఉంటే తొందరగా కోలుకుంటారు. 

 దైర్యంగా ఉన్న వాళ్ళకు దైవం కూడా తోడుంటాడు. 

యత్భావం తథ్భవతి అని శ్రీకష్ణ పరమాత్మ చెప్పినట్టు మనం ఏది తలచుకుంటే అదే జరుగతుతుంది. మంచి తలచుకుంటే మంచి జరుగుతుంది.  చెడుగా తలుచుకుంటే చెడే జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడు మంచినే కోరుకోండి అంతా మంచే జరుగతుంది. 

భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉండండి అప్పుడే దేన్నైనా జయించగలరు.

 

13, మే 2021, గురువారం

మన కూరగాయలు మనమే పండిద్దాం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం.

   

    మనకు ప్రతిరోజు అవసరమయ్యే నిత్యావసరాలలో కూరగాయలు, ఆకుకూరలు మొదటి స్థానంలో ఉంటాయి.

ప్రతీవారం మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుంటాం. అలా కాకుండా మనమే కురగాయలు పండించుకుని తింటే ఎలా ఉంటుంది చెప్పండి?

     ఓ వందో రెండొందలో పెడితే వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి దీనికోసం కూరగాయలు పండించడం అవసరమా? అని మీరు అనొచ్చు. 

నిజమే వంద రొండొందలకి వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి కాని కోట్లు ఖర్చుపెట్టిన కాని ఆరోగ్యం, ఆనందం రావు.

  నేడు కూరగాయలు, ఆకుకూరలు ఎలా పండిస్తున్నారో మనకు తెలుసు.కృత్రిమ ఎరువులు విపరీతంగా వాడుతున్నారు. అలాగే పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఇంతలా కృత్రిమ ఎరువులు, పురుగు మందులు వాడిన కూరగాయలను తినడం ఆరోగ్యానికి మంచిదా చెప్పండి? వీటిని తినడం అంటే డబ్బులిచ్చి అనారోగ్యం కొనుక్కున్నట్టే. 

  ఈరోజుల్లో రైతు విత్తన కంపెనీలు, ఎరువులు పురుగుమందుల కంపెనీల చేతిలో కీలుబొమ్మల మారిపోయాడు. వారు చెప్పినట్టు విచ్చలవిడిగా ఎరువులు పురుగుమందులు వాడి పంటలు పండిస్తున్నారు. అలా చేయ్యకపోతే దిగుబడి రాదు. అందువల్ల రైతులు పంటలకు విపరీతంగా ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. వీటిని ఇంతలా వాడటం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని చాలామంది రైతులకు తెలియదు.

  మా తాతల కాలంలో వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయమే. సహజసిద్దంగా పంటలు పండించేవారు. విత్తనాలను వచ్చిన పంటలనుండే సేకరించేవారు.ఎరువుల విషయానికివస్తే పశువుల పేడ, ఎండుగడ్డిని సంవత్సరమంతా పెంటల్లో వేసి పంటలు వేసేముందు పొలంలో వేసుకునేవారు ఈ ఎరువు వేయడం వలన దిగుబడి బాగా వచ్చేది. ఇక పురుగుమందులు అసలు వాడేవారు కాదు ఎందుకంటే పశువుల ఎరువులు వాడటం వలన ఇన్ని పురుగులు పంటలకు ఆశించేవికావు. ఇలా పండించిన ఆహారం తిని వారు ఆరోగ్యంగా ఉండేవారు. 

మరీ నేడు ఆధునిక వ్యవసాయంలో పశువుల ఎరువులు వాడటం మానేశారు. అసలు ఇప్పుడు రైతుల వద్ద పశువులు లేకుండా పోయాయి. కృత్రిమ ఎరువులకు రైతులు అలవాటు పడిపోయారు. 'ఒకప్పుడు వ్యవసాయం అంటే పాడి పంట అనేవారు ఇప్పుడు వ్యవసాయం అంటే రసాయన పంట'.


 ఇప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సుభాష్ పాలేకర్ గారి లాంటి వారు. అయిన రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళడంలేదు. ఎందుకంటే ఈ విధానంలో కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. ఎరువులు విత్తనాలు సహజసిద్దంగా మనమే తయారు చేసుకోవాలి అంత ఓపిక ఇప్పటి రెతులకు లేదు మార్కెట్ కి వెళ్ళామా , విత్తనాలు కొన్నమా, రసాయన ఎరువులు, పురుగుమందులు తెచ్చామా పంటలకు వేశామా అంతే తేలికగా అయిపోయే. ప్రకృతి వ్యవసాయం చేసే ఓపిక ఇప్పటి రైతులకు లేదు. మరి వాళ్ళు పండించిన రసాయన పంటలే తిని అనారోగ్యం పాలవడం కంటే మనమే సొంతంగా ప్రకృతి సిద్దంగా కూరగాయలను పండించుకుని ఆరోగ్యంగా ఉందాం.

  మనం కూరగాయలను పండించేందుకు ఇంటిముందు కాని ఇంటిమీద కాని కొంచెం స్థలం ఉంటే సరిపోతుంది. ఈ పెరటి తోట ప్రారంబించేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. మడులు తయారు చేసుకోవడం, కుండీలు తెచ్చుకోవడం విత్తనాలు, మట్టి, వర్మీకంపోస్ట్, కోకోపీట్ , వేపపిండి లాంటివి తెచ్చి పెరటి తోట తయారు చేసుకోవడం వరకు కొంచెం కష్టమెన పనే. ఇష్టంగా చేస్తే ఏపని కష్టం అనిపించదు. పైగా ఇది మన ఆరోగ్యం కోసం చేసేపని. ఒక్కసారి మీ పెరటి తోట సిద్దమయ్యి కూరగాయలు కాయడం, ఆకుకూరలు పెరగడం చూస్తుంటే మీ చేతుల్తో పెంచారు కాబట్టి ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. మన పెరటి తోటలో కూరగాయలే కాకుండా పూల మొక్కలు, పండ్లమొక్కలు కూడా పెంచుకోవాలి. ఉదయం లేవగానే ఆ మొక్కల మద్యన తిరుగుతుంటే ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 

  మన పెరటి తోటలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు బయట మార్కెట్లో కొన్న వాటికంటే రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా.

 

 మీరు పెరటి తోటలు పెంచాలనుకుంటే mad gardenar, noorjahan terrace garden అనే యూట్యూబ్ ఛానెల్ విడియోలు చూసి చక్కగా పెరటి తోటలు పెంచండి. మాధవి గారు, నూర్జహాన్ గారు పెరటి తోటల పెంపకం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు.

   వండుకోవడమే కష్టం అయ్యి స్విగ్గి, జోమాటో లో తెప్పించుకుని తినే ఈరోజుల్లో ఈ పెరటి తోటల్లో పండించి వండుకోవటం కష్టమంటారా.? ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం కష్టపడాల్సిందే. మరీ ఇంత బద్ధకం పనికిరాదు ఇంట్లో వండుకునే ఆహారాన్ని  బయట హోటళ్ళ నుండి కష్టపడకుండా ఇంటిదగ్గరకే తెప్పించుకుని తింటున్నారు. రేపు ఇంకో బొగ్గి సంస్థ వచ్చి ఆహారాన్ని తినిపిస్తాం అంటే ఆ సేవలను వినియోగించునేలా ఉన్నారు. మరీ ఇంత సోమరితనం అయితే ఎలా? డబ్బు డబ్బు అని పరిగెడుతూ ప్రకృతి జీవన విధానానికి దూరంగా జీవిస్తున్నారు. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారు. ఆరోగ్యం లేకుంటే ఎంత డబ్బుంటే ఏం ప్రయోజనం. అవసరానికి తగినంత డబ్బుంటే చాలు. డబ్పుకోసమే జీవితం అన్నట్టు ఉండకూడదు. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి.

 

పెరటి తోటల పెంపకం వలన కూరగాయలు, పండ్లతో పాటు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఇళ్ళు కూడా చల్లగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటిముందు వాతావరణం  ఆహ్లాదకరంగా ఉంటుంది.

అందరు పెరటి తోటలు పెంచి ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లు తింటు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే పర్యావరణానికి మేలు చేసిన వారవుతారు.  

       ధన్యవాదాలు...