భానోదయం: సోనుసూద్ రియల్ హీరో నువ్వు దేవుడు సామీ. స్టార్ హీరోలు నీ కాలి గోటికి సరిపోరు.

21, మే 2021, శుక్రవారం

సోనుసూద్ రియల్ హీరో నువ్వు దేవుడు సామీ. స్టార్ హీరోలు నీ కాలి గోటికి సరిపోరు.

 

  సోనుసూద్ అంటే మన తెలుగు వాళ్ళకి అరుంధతి సినిమాలో అఘోర గుర్తొస్తాడు. అంత క్రూరంగా ఉంటుంది ఆ సినిమాలో ఆయన నటన. ఆ సినిమాలో జేజమ్మ సోనూసూద్ పాత్రను చంపేస్తే  జేజమ్మ జేజమ్మ అంటు జేజేలు పలికారు. ఇప్పుడు ఎక్కడ జేజమ్మ  సినిమాల్లో ఏదో పీకి పారేశాం అంటు ఫోజు కొడుతారు మరీ ఇలాంటి కష్ట  సమయంలో ఎక్కడ జేజమ్మ. సోనుసూద్ ను సినిమాల్లో చూసి అందరు తిట్టుకుంటారు ఎందుకంటే అతను విలన్ కాబట్టి అందరు విలన్ లా భావించే సోనుసూద్ ఎంత జాలి హృదయం సామీ నీది. నువ్వయ్య అసలైన హీరోవి. కనిపించే దేవుడివి.

 ఆడవాళ్ళు ఏం సహాహం చేస్తారని మీరనొచ్చు. ఎందుకు చేయరు ఏ రంగంలో లేరు చెప్పండి ఆడవాళ్ళు. అన్ని రంగాల్లోను మగవారితో సమానంగా దూసుకుపోతున్నారు. మరీ ఇప్పుడు ఇలాంటి కష్ట సమయంలో ఎక్కడ ఈ జేజమ్మ ఈ జనాల వళ్ళే కదా మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. ప్రజలు అల్లాడిపోతున్న చూసి చూడనట్టు ఉన్నారు వీళ్ళు. మానవత్వం లేని వారు..


  సినిమాల్లో హీరోలు ప్రజలకు సహాయం చేసినట్టు నటిస్తేనే వాళ్ళను దేవుళ్ళలాగా చూస్తారు ప్రజలు ఇక ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు వాళ్ళకు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి పూల మాలాలు వేస్తారు. పాలాభిషేకాలు చేస్తారు. ఇంతలా హీరోలను దేవుళ్ళలా భావిస్తారు ప్రజలు. మరీ ఇలాంటి కష్టకాలంలో ఏ హీరో దేవుడు ప్రజలకు సహాయం చేయడం లేదే? మన దగ్గర A  to Z స్టార్ లు  ఉన్నారు ఏ ఒక్క స్టార్ కూడా ప్రజల కష్టాలను చూసి సహాయం చేయడం లేదు వీళ్ళు హీరోలా!

 వీళ్ళు స్టార్ లా తూ...  వీళ్ళంతా హీరోలు కాదు డమ్మీ గాళ్ళు మానవత్వం లేని నిజమైన విలన్లు  వీళ్ళు. కోట్ల డబ్బు ఉన్నాగాని సహాయం చేయలేని వీళ్ళు స్వార్థపరులు. మానవత్వంలేని వారు. 


జేజమ్మలే కాదు ఇంకా చాలా మంది పెద్ద స్టార్ లు సినిమాల్లోనే జనాలను ఆదుకుంటారు. అది నటన అని అదరికి తెలుసు అది చూసి పిచ్చి జనాలు మా హీరో గొప్పవాడు అంటు పొగిడెస్తారు. వీళ్ళు సినిమాల్లోనే హీరోలు బయట డమ్మీ గాళ్ళు.  ఈ కరోనా టైంలో పేదవారు అల్లాడిపోతున్నా చూసి చూడనట్టు ఉంటున్నారు మహా స్వార్థపరులు.


మన స్టార్ హీరోలు సినిమాల్లో ప్రజలకు సహాయం చేసే శ్రీమంతులు. బయట మాత్రం సమాజసేవలో బిచ్చగాళ్ళ కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళకంటే బిచ్చగాళ్ళే నయం తమ కళ్ళముందు ఎవరైన ఆపదలో ఉంటే ఆదుకుంటారు. 

 మానవతా దృక్పథంతో పేద ప్రజలకు సహాయం చేస్తూ యావత్ భారతదేశ ప్రజల గుండెల్లో దేవుడిలా ఉన్న ఆ ఒక్కడు, నిజమైన శ్రీమంతుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆపద్భాందవుడు  మనసు  ఉన్న మహారాజు అతడే సోనుసూద్. సోనూసూద్ సార్ సరిలేరు నీకెవ్వరు.


మన హీరోలు  సినిమాల్లో సింహాలు పులులు చిరుతలు టైగర్ లు బయట డమ్మీగాళ్ళు.

సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలూ సోనుసూద్ సార్ కాలి గోటికి సరపోరు. 

రియల్ హీరో సోనుసూద్ కనిపించే దేవుడు సామీ మీరు..

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

స్వగృహమాత్ర వీరులు అంటాం ఇంట్లోనే కూర్చుని పొడిచేస్తా నరికేస్తా అని గొప్పలు చెప్పుకునేవాళ్ళని. అలాగే మన హీరోలను తెరమాత్ర వీరులు అందామా?
వీళ్ళూ వీళ్ళ సామాజిక బాధ్యతాన్నూ ! ఇంకొకటి గమనించే ఉంటారు - కొంత మంది హీరోయిన్లు నిధులు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారట. కొంత మంది క్రికెట్ ఆటగాళ్ళు కూడా. జనాలు చందాలిస్తే ఆ డబ్బుతో తమ సమాజసేవ చూపించుకుంటారేమో ? అంతే కానీ తమ జేబులో ఉన్న కోట్లల్లో నుండి ఓ రూపాయి బయటకు తీసి ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇవ్వరేమో?

వీళ్ళతో పోలిస్తే సోనూ సూద్ మీరన్నట్లు దేవుడే. అతని కాళ్ళకు నమస్కారం చెయ్యాలి సినిమా రంగం మొత్తం.

భానోదయం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.