భానోదయం: మంతెన సత్యనారాయణ రాజు గారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందట.! 8 రోజుల్లోనే కోలుకున్నారట.

19, మే 2021, బుధవారం

మంతెన సత్యనారాయణ రాజు గారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందట.! 8 రోజుల్లోనే కోలుకున్నారట.

https://youtu.be/qub5q1qUxUA

 ప్రకృతి జీవన విధానం గురించి మనకు ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తున్నారు మన మంతెన గారు. ఆయన ఆరోగ్య సలహాలు పాటిస్తూ ఎంతోమంది ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారు. 

 నాకు తెలిసి ఆయన గత 20 సంవత్సరాలుగా ప్రకృతి జీవన విధానం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వ్యాధులు వస్తే మందులు వాడకుండా ఎలా తగ్గించుకోవాలో తెలియజేస్తున్నారు. ఆయన సలహాలు పాటిస్తూ ఆరోగ్యాభిలాషులందరు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నారు.

 మంతెన గారికి కూడా గత ఏప్రిల్ 30 న జ్వరం వస్తే కోవిడ్ టెస్ట్ చేయిస్తే  పాజిటివ్ వచ్చిందట. జ్వరం వచ్చినప్పటినుండే ఆయన లంఖనం చేసి 8 రోజుల్లోనే కోవిడ్ నుంచి కోలుకున్నారట. 8రోజుల తర్వాత మళ్ళి టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చిందట.

ఆయన ఇంత తొందరగా కోలుకోవడానికి కారణం ప్రకృతి జీవన విధానం పాటిస్తారు కాబట్టి.

లంఖనం చేసి వైరస్ ను  ఎదుర్కొన్నారు.

లంఖనం అంటే ఆహార పదార్థాలు తీనకుండా రోజంత తేనె నీళ్ళు తాగుతు ఉండటం. ఇలా చేయడం వల్ల శరీరం సహజ సిద్దంగానే వైరస్ ను ఎదుర్కొంటుందని మంతెన గారు చెబుతారు ఇప్పుడు చేసి చూపించారు.

 మంతెన గారిలాగా మందులు వాడకుండా లంఖనం చేసి అందరు కోవిడ్ నుండి కోలుకుంటారా అంటే కోలుకోలేరు. ఎందకంటే రాజు గరు ఎన్నో ఏళ్ళుగా ప్రకృతి జీవన విధానాన్ని పాటిస్తున్నారు. కాబట్టి తొందరగా కోలుకున్నారు.

 ప్రకృతి జీవన విధానంలో మంచి ఆహార నియమాలు పాటిస్తారు. కాబట్టి ఏ వ్యాదులు రావు వచ్చిన తొందరగా కోలుకుంటారు.

చాలామంది మంచి ఆహారపు అలవాట్లు పాటించక అనేక రోగాల పాలవుతున్నారు.

అందరు ఆరోగ్యకరమైన జీవనం గడపాలంటే మంతెన గారి ప్రకృతి జీవన విధానం పాటించి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను.

 ఒక ముఖ్య గమనిక:- మీరు మంతెన సత్యనారాయణ రాజు గారిలా లంఖనం చేసి వైరస్ ను ఎదుర్కొంటాను అంటే కుదరదు. ఎందుకంటే  మీ ఆహారపు ఆలవాట్లు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెసింగ్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు కాబట్టి మీరు మందులు వాడాల్సిందే. వైరస్ నుండి కోలుకున్నాక ప్రకృతి జీవన విధానం పాటించి ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడే రాజుగారు చెప్పినట్టు లంఖనం చేసి వైరస్ ను ఎదుర్కొంటానంటే కుదరదు మీ ఆహారపు అలవాట్ల వల్ల అది కుదరదు హాస్పిటల్ వెళ్ళి మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోండి.  ఆయన చాలా ఏళ్ళ నుండి ప్రకృతి జీవన విధానంలో ఉన్నారు కాబట్టి వైరస్ నుండి తొందరగా కోలుకున్నారు.

మంతెన గారి వీడియో ఇక్కడ చూడండి.

https://youtu.be/qub5q1qUxUA


4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అది "లంకనం"నా లేక "లంఖణం"నా లేక "లంకణం"నా అండీ? నా చిన్నప్పుడు "లంఖణం" అని విన్నాను. ఇప్పుడు నెట్లో మూడింటినీ వాడేస్తున్నారు. ఏది సరైనదో తెలీడంలేదు.

భానోదయం చెప్పారు...

"లంఖణం"
సరైనది.

శ్యామలీయం చెప్పారు...

పొరపాటు. సరియైన పదరూపం "లంఘనం"

అలాగే భానోదయం అనటం కూడా పొరపాటే, సరియైన పదరూపం "భానూదయం" ఎందుకంటే ఇక్కడ సవర్ణదైర్ఘ్యమే కాని గుణసంధి కార్యం లేనేలేదు.

భానోదయం చెప్పారు...

లంఘనం అని నాకు తెలియదు.
వాడుక భాషలో లంఖణం అని అంటున్నారు.