భానోదయం: గిజిగాడు గూడు

2, ఏప్రిల్ 2019, మంగళవారం

గిజిగాడు గూడు

       సాదారణంగా పక్షులు గుడ్లు పెట్టడానికి గూళ్ళు కట్టుకుంటాయి. అందులో ప్రత్యేకమైనది గిజిగాడు గూడు అసలు ఈ గిజిగాడు పక్షి గూడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేం.
అందంతో పాటు రక్షణ పరంగానే కాకుండా గిజిగాడు గూడు అన్ని విధాలుగా సౌకర్య వంతంగా నిర్మిస్తుంది.



                      అన్ని పక్షి గూళ్ళు మామూలుగా గంప మాదిరి పైన తెరుచుకొని ఉంటుంది వర్షం వచ్చిన గాలి వచ్చిన పక్షి పిల్లలకు రక్షణ ఉండదు అలాగే ఇతర ప్రాణుల నుండి కూడా రక్షణ ఉండదు.
కాని గిజిగాడు గూడు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. గిజిగాడు పక్షి గూడు నిర్మించే సమయంలో ముందుగా రక్షణ పరంగా ఉండేందుకు ముళ్ళ చెట్టును ఎంపిక చేసుకుంటుంది. తుమ్మ లేదా  ఈత చెట్ల కొమ్మల అంచున గూడును నిర్మింస్తుంది. చిన్న చిన్న పుల్లలతో ఎంతో ఓపికగా చాలా పటిష్టంగా గూడును అల్లుతుంది. ఈ గూడును బోర్లించిన కూజాలాగా నిర్మిస్తుంది. గూడులోకి వెళ్ళే మార్గం కిందినుండి ఉంటుంది. దాని లోపల ఇంకెంత అందంగా మలుస్తుందో, అందులో ఎన్ని గదులు ఉంటాయో! ఎంత మెత్తని పరుపులు నిర్మింస్తుందో కదా! మగపక్షి మాత్రమే గూడుని నిర్మిస్తుందట. తన పిల్లలని కంటికి రెప్పల కాపాడుకుంటాయి. ఆడపక్షి పిల్లల పోషణ చూస్తుందట.





ఈ గిజిగాడు పక్షులు అన్ని ఒకే చోట చాలా గుళ్ళు నిర్మించుకుంటాయి ఎందుకంటే ఇతర పక్షుల నుండి కాపాడుకోవడానికి అన్ని కలిసి కట్టుగా ఒక సమూహంలా ఒకే చోట గూళ్ళు నిర్మించుకుంటాయి.
ఏదైన ఆపద వస్తే అన్ని కలిసి వెళ్ళిపోతాయి.
ఎంత అద్భుతం కదా ఈ గిజిగాడు గూడు. అంత చిన్న పక్షి ఇంత అద్భుతంగా ఎంతో అందంగా మరియు చాలా పటిష్టంగా తన గూడును నిర్మింస్తుందంటె ఆశ్చర్యం వేస్తుంది.
 మనుషుల్లాగా అది డ్రాయింగులు వేయదు ఎలాంటి పనిముట్లు వాడదు ఏ కంపెనీల నుండి గూడుకు సరిపోయే పుల్లలను తీసుకురాదు. అయిన ప్రకృతిలో దొరికే సహజ సిద్దమైన వాటితోనే గూడును నిర్మించి ప్రకృతికి ఏలాంటి నష్టం కలుగజేయకుండా తన నైపుణ్యంతో గూడుని నిర్మించి ప్రకృతికి కొత్త అందాన్ని సంతరిస్తుంది.
గిజిగాడు గూడు నిర్మాణం ఇంజనీరింగ్ లకు సైతం అర్థం కానంతలా అద్భుతంగా  ఉంటుంది.



  గిజిగాడు గూడు ప్రకృతిలో ఓ అందమైన  అద్భుతమైన వింత.

ఓ గిజిగాడు గూడు కట్టడంలో నీవే మొనగాడు.

10 కామెంట్‌లు:

అన్యగామి చెప్పారు...

వీటిని చూసి మురిసి పోవటమే కానీ ఇంత ఆలోచన చేయలేదు. చక్కగా ఉంది మీ వివరణ.

భానోదయం చెప్పారు...

ధన్యవాదములు.

నీహారిక చెప్పారు...

👏👏👏👏👏

భానోదయం చెప్పారు...

🙏🙏🙏🙏🙏

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// "మగపక్షి మాత్రమే గూడుని నిర్మిస్తుందట." //

అంతే కదండి మరీ :)

భానోదయం చెప్పారు...

అవునండి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అన్ని గిజిగాడీ గూళ్ళూ ఒకేలా ఉంటాయా ... బయటా లోపలా (హౌసింగ్ బోర్డ్ వారి ఇళ్ళలాగా)? ఈ విషయం మీదేమైనా సమాచారం ఉందా?

ఏమైనప్పటికీ గిజిగాడి గూడు అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్ అన్నది తెలుస్తోంది.

భానోదయం చెప్పారు...

గిజిగాడి గూళ్ళన్ని ఒకేళా ఉంటాయి కాని కొద్దిగా గూటి గూటికి తేడా ఉంటుంది. ఎందుకంటే ఏ గూడు ఏ పక్షిదో తెలియాలిగా అందుకే కొద్దిగా తేడా ఉంటుంది అంతే తప్ప అన్ని చూడ్డానికి ఒకేలా ఉంటాయి.

గిజిగాడి గూడు అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్ అన్నది నిజమేనండి నరసింహారావు గారు.

Unknown చెప్పారు...

సూపర్

Unknown చెప్పారు...

సూపర్